/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz కేసీఆర్‌కు నోటీసులు.. హరీశ్‌రావు సహ మరో 8 మందికి సైతం.. Raghu ram reddy
కేసీఆర్‌కు నోటీసులు.. హరీశ్‌రావు సహ మరో 8 మందికి సైతం..

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కేసీఆర్, హరీశ్‌రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీచేసింది.

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కేసీఆర్, హరీశ్‌రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు... సెప్టెంబరు 5న విచారణ జరపనున్నట్లు పేర్కొన్నది.

ఆ విచారణకు రావాల్సిందిగా ఎనిమిది మందికీ నోటీసులను జారీచేసింది. గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగిన అనంతరం రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి విచారణ జరపనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై గతేడాది అక్టోబరు 25న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేశానని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లి రాజలింగమూర్తి ఆ రివిజన్ పిటషన్‌లో పేర్కొన్నారు.

తొలుత ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశానని, తన పిటిషన్‌ను కొట్టివేసిందని, దానికి కారణాలను కూడా తనకు తెలియజేయలేదని, విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానని, ఆ తర్వాత రివిజిన్ పిటిషన్‌ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా సూచించడంతో ఇప్పుడు దాఖలు చేయాల్సి వచ్చిందని రాజలింగమూర్తి పేర్కొన్నారు.

బ్యారేజీలోని ఏడవ బ్లాకులో పిల్లర్ భూమిలోకి కుంగిపోవడం, పెద్ద శబ్దంతో ఒక పిల్లర్‌కు పగుళ్ళు రావడంతో అసిస్టెంట్ ఇంజినీర్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమానాన్ని వ్యక్తం చేశారని, పోలీసులు కూడా ఐపీసీలోని సెక్షన్ 427 ప్రకారం ఎఫ్ఐఆర్ (నెం. 174/2023) నమోదు చేశారని, మరుసటి రోజే దాన్ని క్లోజ్ చేశారని పిటిషనర్ గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ)కు డిజైన్ మొదలు నిర్మాణంలో నాణ్యతాలోపం, నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు సహా ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇంజినీర్-ఇన్-చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ‘మెఘా’ నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొనడంతో ఈ ఎనిమిది మందికీ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జీ నోటీసులు జారీచేశారు. సెప్టెంబరు 5న విచారణ జరగనున్నందున ఈ ఎనిమిది మంది హాజరవుతారా?... లేక వారి తరఫున న్యాయవాదుల్ని పంపుతారా?... అనేది ఆసక్తికరంగా మారింది.

కేజ్రీవాల్‌కి దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్‌ని కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై(Bail Petition) విచారించిన ధర్మాసనం పిటిషన్‌ని కొట్టేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై(Bail Petition) విచారించిన ధర్మాసనం పిటిషన్‌ని కొట్టేసింది.

దీంతో బెయిల్‌పై ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్‌కి ఊరట దక్కలేదు. ఈ ఘటనను చట్టవిరుద్ధమైన అరెస్టు అని చెప్పలేమని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బెయిల్ దరఖాస్తు కోసం కేజ్రీవాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

లిక్కర్ కేసులో అవినీతి జరిగిందంటూ సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ఎన్ హరిహరన్, రమేష్ గుప్తా వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున ఎస్పీపీ సింగ్‌ హాజరయ్యారు. ఈ పాలసీపై కేజ్రీవాల్‌తోపాటు అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కూడా సంతకం చేశారని సింఘ్వి వాదించారు

మాజీ ఎల్జీ, బ్యూరోక్రాట్‌లను కూడా నిందితులుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మొత్తం కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రమేయం ఉందని, అందుకు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని సింగ్ తెలిపారు. అరెస్టు చట్టవిరుద్ధం కాదని ట్రయల్ కోర్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిందని ఆయన అన్నారు. కేజ్రీవాల్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిందని.. ముఖ్యమంత్రికి బెయిల్‌పై విడుదలయ్యే అర్హత లేదని సింగ్ పేర్కొన్నారు. సహ నిందితులు మనీష్ సిసోదియా, కె కవితపై ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇన్సూరెన్స్ అరెస్ట్' అనే పదాన్ని ఉపయోగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు సీబీఐ ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించకుండానే నేరుగా బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

లిక్కర్ స్కాం కేసుల్లోనే ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. మేలో, సాధారణ ఎన్నికల దృష్ట్యా జూన్ 01 వరకు సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న ఆయన తిరిగి లొంగిపోయారు.

వియార్ సారీ.. కండక్టర్ల లూటీ ఘటనపై స్పందించిన సజ్జనార్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ స్కీమ్ ఎంత ప్రశంసలు అందుకుంటున్నదో అంతే స్థాయిలో విమర్శలపాలవుతున్నది.

తాజాగా కొంత మంది కండక్టర్ల లూటీ నిర్వాకాన్ని ఓ నెటిజన్ బయటపెట్టగా దానిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు.

కొందరు కండక్టర్లు మహాలక్ష్మి స్కీమ్ ను తమ లూటీ కోసం ఉపయోగించుకుంటున్నారని పురుషుల వద్ద టికెట్ చార్జి వసూలు చేస్తూ వారికి మాత్రం ఫ్రీ టికెట్ ఇస్తున్నారని ఓ నెటిజన్ ఆరోపించారు.

ఇదేంటని ప్రశ్నిస్తే పొరపాటున అలా జరిగిందని ఆ టికెట్ ను చంచివేసి మరో టికెట్ ఇస్తున్నారని.. జూన్ 26 తేదీన, జులై 7వ తేదీన ఆగస్టు 4వ తేదీన తన వద్ద డబ్బులు తీసుకుని కండక్టర్లు మహాలక్ష్మి స్కీమ్ కు సంబంధించిన టికెట్లు ఇచ్చారని సదరు నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్)లో తన అనుభవాన్ని షేర్ చేశాడు.

ఇది మామూలు లూటీ కాదని.. ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్యాగ్ చేశాడు. స్పందించిన సజ్జనార్..

జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఈ ఘటనకు బాధ్యలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహాలక్ష్మి టికెట్లపై మరింత నిఘా పెట్టాలని ఈ తరహా జరుగుతున్న మోసాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.

అమెరికా-జపాన్ మార్కెట్ల పతనం.. భారత్‌ ఎకానమీపై ప్రభావం ఉంటుందా?

నేడు వారంలో మొదటి రోజైన సోమవారం (ఆగస్టు 5న) దేశీయ స్టాక్ మార్కెట్‌కు(stock market) బ్లాక్ సోమవారంగా నిలిచిపోయింది. అయితే అమెరికా-జపాన్ మార్కెట్ల క్షీణత సందర్భంగా భారత్‌ ఎకానమీపై ప్రభావం చూపుతుందా అని పలువురు ప్రశ్నిస్తు్న్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

నేడు వారంలో మొదటి రోజైన సోమవారం (ఆగస్టు 5న) దేశీయ స్టాక్ మార్కెట్‌కు(stock market) బ్లాక్ సోమవారంగా నిలిచిపోయింది. ఇదే రోజు జపనీస్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిక్కీ 225లో 13 శాతం లేదా 4750 పాయింట్లు పతనమైంది. మరోవైపు మాంద్యం భయంతో గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించింది. దీంతో భారత మార్కెట్లలో గందరగోళం ఏర్పడి ఈరోజు ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 2700 పాయింట్లు నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 825 పాయింట్లు పడిపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లు కూడా భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్‌లో ఈ పతనం కారణంగా ఒక్క రోజే ఇన్వెస్టర్లు రూ.17.50 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు

అయితే అమెరికా-జపాన్ మార్కెట్ల క్షీణత సందర్భంగా భారత్‌ ఎకానమీపై ప్రభావం చూపుతుందా అని పలువురు ప్రశ్నిస్తు్న్నారు. ప్రస్తుతం గందరగోళం ఉన్నప్పటికీ భారతీయ మార్కెట్లు ఇతరులకన్నా త్వరగా స్థిరపడవచ్చని అమెరికా సంస్థ Dezerv సహ వ్యవస్థాపకుడు వైభవ్ పోర్వాల్ అన్నారు. భారత్‌లోకి ఎఫ్‌ఐఐ ప్రవాహాలు అనేక కారణాల వల్ల పెరిగాయని గుర్తు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇతర ప్రపంచ దేశాల కంటే మెరుగ్గా ఉందని, ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందన్నారు. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భారతదేశంతో సహా ఇతర చోట్ల మెరుగైన రాబడిని కోరుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరి నాటికి వడ్డీరేట్లు 1.16 శాతం తగ్గవచ్చని జెఫరీస్ విశ్లేషకుడు క్రిస్టోఫర్ వుడ్ అంచనా వేశారు. జూన్ ఉపాధి డేటాకు ముందు ఈ అంచనా 0.86 శాతం మాత్రమేనని అన్నారు. అయితే ఈ కోత అమెరికా స్టాక్స్‌కు ప్రయోజనం చేకూర్చాల్సిన అవసరం లేదని, ఎక్కువ కోతలకు అవకాశం ఉన్న ఆసియా, అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లకు ఇది మంచి ప్రయోజనం చేకూరుస్తుందని క్రిస్టోఫర్ వుడ్ చెప్పారు.

క్రిస్టోఫర్ వుడ్ ప్రకారం భారత పెట్టుబడులకు మద్దతు ఇక్కడ చాలా బలంగా ఉందన్నారు. అయితే జపాన్‌లో అది లేదు. కాబట్టి భారతీయ స్టాక్ మార్కెట్ మరింత వృద్ధిని చూడవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో గోల్డ్‌మన్ సాచ్స్ సోమవారం US మాంద్యం సంభావ్యతను వచ్చే ఏడాది 15 శాతం నుంచి 25 శాతానికి పెంచింది. అయినప్పటికీ ఆశాజనకంగా ఉండటానికి అనేక కారణాలను పేర్కొంది. ఆగస్ట్‌లో ఉద్యోగ వృద్ధి పుంజుకుంటుందని, ద్రవ్యోల్భణం కూడా అదుపులోనే ఉందని తెలిపింది.

మరోవైపు ఉద్యోగావకాశాల డిమాండ్ పటిష్టంగా ఉందని, తిరోగమనానికి దారితీసే స్పష్టమైన షాక్ ఏమీ లేనందున అమెరికా మార్కెట్ వేగంగా పెరుగుతుందని మరికొంత మంది ఆర్థికవేత్తలు అంటున్నారు. పెద్ద ఆర్థిక అసమతుల్యత లేకుండా స్థిరంగా ఉందని, అవసరమైతే వడ్డీరేట్లను తగ్గించే వెసులుబాటు ఫెడరల్ రిజర్వ్‌కు ఉందని వారు ప్రస్తావించారు.

పారిపోయి భారత్‌లోకి వచ్చి తలదాచుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దేశం విడిచి విదేశాలకు పారిపోయారు. బంగ్లాదేశ్‌లో చెలరేగిన రిజర్వేషన్ల అల్లర్లు.. చివరికి ప్రధాని నివాసానికి తాకడంతో పారిపోవడం తప్ప ఆమెకు మరో గత్యంతరం లేకుండా పోయింది.

అయితే ఆమె ఎక్కడికి వెళ్లారు అనేది ప్రస్తుతానికి తెలియకపోయినా.. పొరుగున ఉన్న భారత్‌కే వెళ్లారని చాలా వార్తలు వస్తున్నాయి. తన సోదరితో కలిసి.. ఆర్మీ హెలికాప్టర్‌లో షేక్ హసీనా పారిపోయినట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్‌ను రణరంగంగా మార్చింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇక రైల్వేలు నిలిచిపోయాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది.

ప్రధానమంత్రి షేక్ హసీనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో.. ఆమె రాజధాని ఢాకాలో ఉన్న ప్రధానమంత్రి ప్యాలెస్ నుంచి హెలికాప్టర్‌లో పారిపోయారు. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేశారు. అయితే బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన షేక్ హసీనా.. పక్కనే ఉన్న మన దేశంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆందోళనకారుల నుంచి తప్పించుకుని వచ్చి.. భారత్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.

ఢాకాలోని ప్రధాని ప్యాలెస్‌ను నిరసనకారులు చుట్టుముట్టడం, ఆర్మీ హెచ్చరికలు చేయడంతో.. షేక్ హసీనా పారిపోయారు. అయితే ఆమె భారత్‌కు వచ్చారా లేక మ‌రే దేశానికైనా వెళ్లారా అనేది పూర్తిగా క్లారిటీ లేనప్పటికీ.. మీడియా మాత్రం రకరకాల స్టోరీలు విడుదల చేస్తోంది. షేక్ హసీనా పారిపోయి.. పశ్చిమ బెంగాల్‌ చేరుకుని అక్కడ తలదాచుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మరికొన్ని వార్తా సంస్థలు అయితే.. త్రిపుర రాజధాని అగర్తలాకు షేక్ హసీనా వెళ్లారని తెలిపాయి. ఇక ఆమె వెంట తన సోదరి షేక్ రెహానా కూడా ఉన్నారని.. స్పెషల్ మిలిటరీ హెలికాప్టర్‌లో వారిద్దరూ.. ఢాకాలోని ప్రధాని ప్యాలెస్ బంగ‌భ‌బ‌న్ నుంచి బయల్దేరినట్లు వార్తలు వస్తున్నాయి.

వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప‌శ్చిమ బెంగాల్ వైపు వెళ్లిన‌ట్లు ఢాకా ట్రిబ్యూన్ అనే స్థానిక మీడియా వెల్లడించింది. కానీ బంగ్లాదేశ్ బీబీసీ మాత్రం.. ఆమె త్రిపుర రాజధాని అగ‌ర్తలా వెళ్లినట్లు చెప్పింది. సోమవారం మ‌ధ్యాహ్నం 2.30 నిమిషాల‌కు బంగ‌భ‌బ‌న్ నుంచి హెలికాప్టర్ బ‌య‌లుదేరగా.. షేక్ హ‌సీనా, షేక్ రెహానా చాలా సుర‌క్షిత‌మైన ప్రాంతానికి చేరుకున్నట్లు మరో స్థానిక మీడియా తెలిపింది.

అయితే బంగభబన్ నుంచి విడిచి వెళ్లడానికి ముందు.. షేక్ హ‌సీనా వీడియో ప్రసంగం రికార్డ్ చేసి విడుదల చేయాల‌నుకున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే అప్పుడు అంత సమయం లేకపోవడంతో ఉన్నఫలంగా అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చిందని సదరు వర్గాలు వెల్లడించాయి

వయనాడ్ విషాదానికి కారణమదే.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్య

కేరళలోని వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడి జరిగిన భారీ ఉత్పాతం, ప్రాణనష్టంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారంనాడు సంచలన ఆరోపణ చేశారు. వయనాడ్‌లో అక్రమ గనుల తవ్వకాలు, జనవాసాల వల్లే అపార ప్రాణనష్టం జరిగిందని తెలిపారు.

వయనాడ్‌ (Wayanad)లో కొండచరియలు విరిగిపడి జరిగిన భారీ ఉత్పాతం, ప్రాణనష్టంపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ముందస్తు హెచ్చరికలను కేరళ సర్కార్ పట్టించుకోలేదని కేంద్ర అమిత్‌షా ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

ఈ క్రమంలోనే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) సోమవారంనాడు మరో సంచలన ఆరోపణ చేశారు. వయనాడ్‌లో అక్రమ గనుల తవ్వకాలు, జనవాసాల వల్లే అపార ప్రాణనష్టం జరిగిందని తెలిపారు.

అక్రమ జనావాసాలకు స్థానిక రాజకీయవేత్తల రక్షణ ఉందని, కనీసం టూరిజం పేరుతో సరైన జోన్లను కూడా వాళ్లు ఏర్పాటు చేయలేదని, ఈ ప్రాంతంలో భూకజ్జాలు జరిగాయని కేంద్ర మంత్రి ఆరోపించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం 'హైలీ సెన్సిటివ్ ఏరియా' అని తెలిపారు. అటవీ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సారథ్యంలో తాము ఇప్పటికే ఒక కమిటీ వేశామని, స్థానిక ప్రభుత్వ యంత్రాగం పరిరక్షణలో అక్కడి అక్రమ జనావాసాలున్నాయని, అక్రమ గనుల తవ్వకాలు జరుగుతున్నాయని భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.

కాగా, వయనాడ్‌లో గత వారం కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 222కు చేరింది. వీరిలో 99 మంది పురుషులు, 88 మంది మహిళలు, 37 మంది పిల్లలు ఉన్నారని సీఎంఓ తాజా గణాంకాలను వెల్లడించింది. వీరిలో 172 మృతదేహాలను బంధువులు గుర్తించారని, వివిధ ప్రాంతాల నుంచి 180 మృతదేహాల విడిభాగాలు లభ్యమయ్యాయని, 161 పోస్టుమార్టంలు పూర్తయ్యాయని తెలిపింది. వయనాడ్‌, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో 91 మంది చికిత్స పొందుతుండగా, 256 మందిని ఇప్పటికే ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు.

వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వ గైడ్స్‌లైన్ ప్రకారం జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశమే లేదని బీజేపీ తెలిపింది.

దీనిపై యూపీఏ ప్రభుత్వ హయాం నుంచి విధానపరమైన నిర్ణయంలో ఎలాంటి మార్పు జరగలేదని తెలిపింది. ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించే ప్రొవిజన్ ఏదీ లేదని 2013 ఆగస్టు 6న అప్పటి హోం మంత్రి ముల్లపల్లి రామచంద్రన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాన్ని బీజేపీ సీనియర్ నేత వి.మురళీధరన్ ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు.

కనిష్టానికి పడిపోయిన ఇండియన్ రూపాయి.. ఇంకా తగ్గనుందా

ఈ ఏడాది ప్రారంభంలో ఆసియాలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భారత కరెన్సీ రూపాయి(Indian rupees) నేడు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయింది.

ఈ క్షీణత ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా మాంద్యం భయాందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో(stock market) సూచీలు మొత్తం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో ఆసియాలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భారత కరెన్సీ రూపాయి(Indian rupees) నేడు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయింది. ఈ క్షీణత ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా మాంద్యం భయాందోళన కారణంగా స్టాక్ మార్కెట్లలో(stock market) సూచీలు మొత్తం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతోపాటు ఆసియా మార్కెట్లు కూడా తీవ్ర నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఈ క్రమంలో సోమవారం US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం 12.18 గంటలకు ఈ నివేదికను దాఖలు చేసే సమయానికి రూపాయి 83.85 వద్ద ట్రేడైంది. గ్లోబల్ మార్కెట్ బలహీనత, అమెరికా మాంద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు అనుగుణంగా రూపాయి పతనం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అంతేకాదు ఇది మున్ముందు 84కి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ఈక్విటీ పన్నులు పెరగడం, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్(dollar demand) కారణంగా కరెన్సీ ఇటీవలి రోజుల్లో వరుసగా కనిష్ట స్థాయిలను తాకింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 8న సెంట్రల్ బ్యాంక్ పాలసీలో అనుకూల వైఖరికి సంబంధించిన ఏదైనా సంకేతాలు రూపాయి పెరిగేందుకు దారితీయవచ్చన్నారు.

ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే 84కి చేరుకునే అవకాశం ఉందన్నారు. మోర్గాన్ స్టాన్లీ ఒక సంవత్సరంలో డాలర్-రూపాయి విలువ 85.2 కంటే తక్కువగా లక్ష్యాన్ని అంచనా వేసింది. రూపాయి శుక్రవారం నాడు 83.75 వద్ద ముగిసింది. మార్చిలో 2024 గరిష్ట స్థాయి నుంచి 1.3 శాతం తగ్గింది.

U.S. మాంద్యం ఆందోళనలు భారతదేశం(bharat) అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి విదేశీ ప్రవాహాల గురించి ఆందోళనలకు దారితీశాయని ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధి కెడియా అన్నారు. శుక్రవారం విడుదల చేసిన బలహీనమైన U.S. ఉద్యోగాల నివేదిక కూడా ప్రభావం చూపినట్లు తెలిపారు. జులైలో అగ్రరాజ్యంలో కేవలం 114,000 ఉద్యోగాలను మాత్రమే ఇచ్చినట్లు నివేదిక వచ్చింది. అయితే 175,000 మార్కెట్ అంచనాల కంటే గణనీయంగా తక్కువగా చూపించడం గందరగోళానికి దారి తీసుకుంది. దీంతో నిరుద్యోగిత రేటు ఊహించని విధంగా 4.3 శాతానికి పెరిగింది. మరోవైపు వేతన వృద్ధి కూడా ఊహించిన దాని కంటే మందగించింది. మరోవైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా రూపాయి పతనానికి కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు

ఐఐటీ మద్రాసుకు తెలుగు తేజం కృష్ణ చివుకుల భారీ విరాళం

అమెరికాలో స్థిర‌ప‌డ్డ తెలుగుతేజం కృష్ణ చివుకుల మ‌రోసారి తన ఉదారతను చాటుకున్నారు. తాను ఇంజినీరింగ్ చ‌దివిన ఐఐటీ మద్రాస్‌కు ఆయ‌న‌ ఏకంగా రూ. 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఇలా కృష్ణ ఈ ఐఐటీకి విరాళం ఇవ్వ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంత‌కుముందు కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప‌లు విధాలుగా ఈ విద్యా సంస్థ‌కు ఆయ‌న సాయం చేశారు. 

ఐఐటీ మ‌ద్రాస్‌కు చెందిన‌ 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. అలాగే 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని ప్ర‌క‌టించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

దీంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అడ్మిషన్‌ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలు అందిస్తున్నారు. బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లోని 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బెంగళూరులో బాప్టిస్ట్‌ ఆసుపత్రిలో పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు. 

అలాగే మైసూర్ ప‌రిధిలోని చామరాజనగర్ లో ఆయ‌న ఓ పాఠ‌శాల‌ను దత్తత తీసుకున్నారు. ఆ పాఠశాలలో 380 మంది పేద, అనాథ పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్‌ అవార్డు అందజేయ‌డం జ‌రిగింది. 

డాక్టర్‌ కృష్ణ చివుకుల ఏపీలోని బాపట్లకు చెందిన‌వారు. ఆయ‌న‌ది మధ్య తరగతి విద్యావంతుల కుటుంబం. ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేసిన ఆయ‌న‌ ఐఐటీ మద్రాస్‌లో 1970లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ ప‌ట్టా పొందారు. ప్ర‌ముఖ‌ హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చ‌దివారు. అలాగే తుముకూర్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

37 ఏళ్ల వ‌య‌సులోనే అమెరికాలోని ప్రముఖ హాఫ్‌మన్‌ ఇండస్ట్రీస్ కి తొలి భారతీయ గ్రూప్ అధ్య‌క్షుడిగా, సీఈఓగా ప‌ని చేశారు. కొంత‌కాలం ఈ సంస్థ‌లో ప‌ని చేసిన త‌ర్వాత బయటకొచ్చి న్యూయార్క్ లో ‘శివ టెక్నాలజీస్ అనే సంస్థ‌ను స్థాపించారు. మాస్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ సాంకేతికతను అందించడంలో ఈ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్ది శభాష్ అనిపించుకున్నారాయ‌న‌. ఇదే కంపెనీని క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులోనూ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. 

భారత్‌లో మొదటిసారి 1997లో మెటల్‌ ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌ (ఎంఐఎం) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే కావడం విశేషం. కొన్నాళ్లకు బెంగళూరు కేంద్రంగా ‘ఇండో ఎంఐఎం’ సంస్థను ప్రారంభించిన ఆయన... తర్వాత ‘ఇండో యూఎస్‌ ఎంఐఎం టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.1000 కోట్లకు పైనే. అంతేకాదు, 2009లో చిత్తూరు జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను కూడా స్థాపించారు.

కాగా, ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలు ఇచ్చే వ్యక్తులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణ చివుకుల అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు.

పవన్‌కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఏపీ సచివాయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు.

ఏపీ సచివాయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా వచ్చే వందరోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.." ఏపీలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలి.

దీనికి డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైదరాబాద్‌లో భారీఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమందరం వనభోజనానికి వెళ్దాం

ఫుడ్ హ్యాబిట్స్ మారుతుంటే ప్రోడెక్షన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. 20లక్షల హెక్టారుల్లో 20లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం దిశగా ముందుకు వెళ్తున్నాం. హై ప్రోటీన్ ప్యాడీకి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వ్యవహరించాలి.

ఎక్కడికక్కడ భూసార పరీక్షలు చేయాలి. ప్రతి రంగంలోనూ సాంకేతికతను ఉపయోగించుకోవాలి. గత ప్రభుత్వ విధానాల వల్ల ఫైబర్ నెట్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్లారిటీ లేదు" అని చెప్పారు.

కవిత బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.

నేడు విచార‌ణ ప్రారంభ‌మైన వెంట‌నే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు విచారణ వాయిదా వేయాలని కవిత తరఫు లాయర్ కోరారు.

దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. మరోవైపు తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను రేపు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు నేడు కలవనున్నారు.

SB news

SB news

SB news