/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వక్ఫ్ బోర్డ్ పై కుట్ర పడుతున్న మోడీ ప్రభుత్వం: మహమ్మద్ అతహర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు Vijay.S
వక్ఫ్ బోర్డ్ పై కుట్ర పడుతున్న మోడీ ప్రభుత్వం: మహమ్మద్ అతహర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు

కేంద్రం లోని మోడీ ప్రభుత్వం ఒక వర్గం పై కక్ష పూరితంగా వ్యవహారిస్తూ వారికి చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తుల పై కన్నేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అతహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు చట్టాలలో 40 సవరణలు చేయాలని కేంద్ర కాబినెట్ సమావేశం అయ్యి అంగీకరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వారం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టె అవకాశం ఉందని ఇండియా కూటమి తో పాటు ఎన్డిఏ కూటమి లో ఉన్న బీజేపేతర ప్రాంతీయ పార్టీ లు కూడా వ్యతిరేకించాలని కోరారు.ఇలా మోడీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వారి మత స్వేచ్ఛ హక్కును ఉల్లంగిస్తున్నారని మండిపడ్డారు.
ZPHS టేకుల సోమవారం 1989-90 ,SSC బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం. పాఠశాలకు 60 వేలు ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ టేకుల సోమారం 1989-90 ఎస్ఎస్సి బ్యాచ్ వారు 34 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది .ఈ కార్యక్రమానికి అందరూ టీచర్లు మరియు విద్యార్థిని విద్యార్థులు హాజరు కావడం జరిగింది. పనుమటి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే స్కూల్ విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మాణం గురించి 60,000 రూపాయలను పూర్వ విద్యార్థులు డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు MMS ఫంక్షన్ హాల్ టేకుల సోమారంలో చాలా ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పనుమటి నరేందర్ రెడ్డి MD జహంగీర్ రాయగిరి రవీందర్ గజ్జి గంగారాo యాదవ్ సోలిపురం సురేఖ పద్మ లు పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
అరూరు: తుమ్మల నర్సయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన బండారు భూపాల్ రెడ్డి ఆకస్మికంగా మరణించినందున వారి కుటుంబ సభ్యులకు కీర్తిశేషులు తుమ్మల నరసయ్య సేవాసమి తి ఆధ్వర్యంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది .పిల్లల పైచదువులకు కూడా సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల శ్రీనివాస్ ,సంతోష్, అధ్యక్షులు కసర బోయిన లింగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి పిట్టల సుధాకర్, ఓబీసీ మండల అధ్యక్షుడు కనకా చారి ,ఆరూరు మాజీ సర్పంచ్ లు జినుకల దానయ్య , పోలేపాక చెమ్మయ్య, ఆవుల స్వామి, బండారు చిన్న నరసింహారెడ్డి ,మహిపాల్ రెడ్డి, మత్స్య  సహకార సంఘం మండల అధ్యక్షుడు బండి  రవికుమార్, ఆవుల అంజయ్య, కసుర బోయిన నరసింహ ,ఎలిమినేటి సంతోష్ కుమార్, కోయిగూర మధు ,మీసాల మత్స్యగిరి ,గడ్డల నరసింహ ,ఆనందు ,ఎలిమినేటి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలతో సత్తా చాటిన వెలువర్తి యువకుడు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బోదాసు శ్రీను-సునీత దంపతుల ప్రథమ పుత్రుడు హరి ప్రకాశ్ బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల వెలువడిన ఏఈఈ ఫలితాల్లో మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ లో గెజిటెడ్ ఉద్యోగం సాధించాడు. దీనితోపాటు ఇంకా నాలుగు ఉద్యోగాలు ఏఈ, కానిస్టేబుల్, టీపీబీఓ(టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్ సిర్), గ్రూప్-4 వంటి ఉద్యోగాల్లోనూ ఎంపికయ్యాడు. ప్రస్తుతం హరి ప్రకాష్ భువనగిరి ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. హరి ప్రకాష్ పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.
వలిగొండ మూసి వంతెన పై కొత్త రోడ్డుకు నిధులు మంజూరు ,ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మండల ప్రజలు

భువనగిరి నుండి  చిట్యాల రోడ్డు మార్గంలో వలిగొండ మూసి వంతెన పైన ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతల మయం కావటంతో.గత కొన్ని రోజుల నుండి ప్రయాణికులు విద్యార్థులు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ప్రమాదాలు జరుగుతున్నవి ఇట్టి విషయాన్ని తెలుసుకొని మూసి వంతెన ను పరిశీలించిన మన ప్రియతమా నేత భువనగిరి శాసన సభ్యులు  కుంభం అనిల్ కుమార్ రెడ్డి  మరమత్తుల గురించి R&B అధికారతో మాట్లాడి వలిగొండ మూసి వంతెనపైన కొత్త రోడ్ కోసం 30,04,948 లక్షల రూ" మంజూరు చేయించడం జరిగింది. వారికి వలిగొండ పట్టణ మరియు మండల ప్రజలు ప్రత్యేక ధన్యవాలు తెలియజేయడం జరిగింది.
మేరు సంఘం వలిగొండ మండల నూతన అధ్యక్షులుగా ఆదిమూలం సోమేష్ మేరు ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం మేరు సంఘం నూతన మండల కమిటీ మేరు సంఘం నాయకులు ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా ఆదిమూలం సోమేశ్ మేరు,ప్రధాన కార్యదర్శిగా వెంపటి నరేష్ కోశాధికారిగా వెంపటి మత్స్యగిరి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మేరు సంఘం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని అంతేకాకుండా ప్రభుత్వం తరఫున వచ్చే నిధుల కోసం పోరాడుతానని తెలిపారు నన్ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్న మేరు సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు ఆదిమూలం గోపి, గౌరవ అధ్యక్షుడు కీర్తి రమేష్, దోమకొండ సత్యనారాయణ, వెంపటి రాజు, కీర్తి శ్రీనివాస్, రెగ్యులర్ టైలర్ కీర్తి రమేష్, వెంపటి లక్ష్మీనారాయణ, రామగిరి వెంకటేష్, కీర్తి సత్యనారాయణ, ఆదిమూలం రమేష్, వెంపటి అశోక్,కీర్తి వెంకటేశం, ఆదిమూలం శ్రీనివాస్, కీర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 13న భువనగిరిలో మాదిగల విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయండి : ఎమ్మార్పీఎస్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి మాదిగ ఆత్మీయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ కు సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన శుభ సందర్భంగా ఆగస్టు 13న భువనగిరిలో మాదిగల విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి , కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తామని ఇచ్చిన హామీకి ధన్యవాదాలు తెలిపారు. ఏబిసిడి వర్గీకరణ పై ఎనలేని పోరాటం చేసి జాతి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి హక్కులు సాధించుకున్న ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం అంజయ్య ,బట్టు రామచంద్రయ్య, ఇటికల దేవేందర్, కోళ్ల జహంగీర్, సందెల శ్రీనివాస్, శివ, హరిప్రసాద్ ,కృష్ణయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అన్నింటిని వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం రోజున భువనగిరిలో జరిగిన ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బెరర్స్ సమావేశానికి గోద శ్రీరాములు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఇస్తామన్న 12000 వెంటనే ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజన వంట కార్మికులకు నెలకు 10వేలు ఇవ్వాలని, కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి శ్రమదోపీడి అరికట్టాలని కోరారు. అంగన్వాడీలకు నెలకు 18000 వేతనం వెంటనే అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని , కనీస వేతన చట్టాలను సవరించి పెరుగుతున్న థరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని కోరారు. కనీస వేతనాలు బోర్డు ఏర్పాటు చేసి కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగ కార్మిక సంఘాలు ఈ ప్రభుత్వము మీద ఎన్నో ఆశలు పెట్టుకొని గత ఎన్నికల్లో బలపరచి గెలిపించారని ఆ నమ్మకం నిలబెట్టుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి వెంటనే చేపట్టాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికుల, 2వ ఏఎన్ఎం ల వేతనాలు తక్షణమే పెంచాలని కోరారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ను ప్రక్షాలన చేసి నిజమైన లబ్ధిదారులకు కార్డులు అందేలా చర్యలు చేపట్టాలని, సాఫ్ట్వేర్ విధానంలో ఆన్లైన్ విధానంలో మార్పులు తీసుకొని రావాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అండగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, సహాయ కార్యదర్శులు గానబోయిన వెంకటేష్, సోమన సబిత తదితరులు పాల్గొన్నారు.
కేరళ బాధితులకు సహాయాన్ని అందించి అండగా నిలవండి : సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి

ప్రకృతి వైపరీత్యంతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి మరణించిన 300 పైగా కుటుంబాలకు మరియు గాయాలపాలై వైద్యాన్ని అందుకుంటున్న క్షతగాత్రులకు,నిరాశ్రయులకు అండగా నిలిచి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి కోరారు సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం రోజున పులిగిల్ల గ్రామంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ దేశంలో పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి కేరళను ప్రకృతి వైపరీత్యాలతో కురుస్తున్న అకాల వర్షం కారణంగా వయనాడ్ ప్రాంతంలోని ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేసిందన్నారు సుమారు 300 పైగా ప్రజలు ఇప్పటికే మరణించారని అనేకమంది గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారని అనేకమంది తమ ఇండ్లను కుటుంబాలను కోల్పోయి నిరాశ్రయులై ఉన్నారని వారందరికీ అండగా నిలవాల్సిన అవసరం ప్రస్తుత సమయంలో ఉందని వారిని ఆదుకునేందుకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఈనెల 4,5 తేదీల్లో విరాళాల సేకరణ నిర్వహించాలని పిలుపునిచ్చిందన్నారు ప్రజలను ఆదుకునేందుకు కేరళ రాష్ట్ర వామపక్ష ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందన్నారు, కష్ట కాలంలో ఉన్న కేరళ రాష్ట్రాన్ని బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని ఆయన అన్నారు ఇప్పటికే అనేకమంది సినీ నటులతో పాటు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటించిందని ప్రజలందరూ మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని తమకు వీలైన మేరకు ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు సిపిఎం పార్టీ సేకరించిన విరాళాలను జిల్లా రాష్ట్ర కమిటీల ద్వారా కేరళ బాధితులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి,సిపిఎం నాయకులు దొడ్డి బిక్షపతి, వడ్డమాని వెంకటయ్య, కొమ్మిడి సత్తిరెడ్డి,ఈర్ల రమేష్,మారబోయిన ముత్యాలు,వడ్లకొండ శంకరయ్య,బొడ్డు రాములు,వడ్డేమాన్ మధు,వేముల నాగరాజు, వరికుప్పల శంకరయ్య, వేముల అనిల్, వేముల నర్సింహ,వరికుప్పల బాబు,వేముల టెండూల్కర్,వేముల జ్యోతి బాబు,దయ్యాల నరసింహ,వనం యాదయ్య,దశరథ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 10, 11న భువనగిరిలో జరిగే ఆవాజ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని కరపత్రాల ఆవిష్కరణ

ఈనెల 10, 11న భువనగిరి పట్టణంలో జరిగే ఆవాజ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆత్మకూరు మండల కేంద్రంలో కరపత్రాల విడుదల. శనివారం రోజున ఆత్మకూరు మండలంలో ఆవాజ్ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని అవాజ్ నాయకులు కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్ S.K లతీఫ్ మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్ (దివ్య) లో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు శిక్షణ తరగతులు లౌకిక వాద ప్రజాతంత్ర శక్తులు ఈ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని సమాజం ఐక్యంగా నిలపడం కొరకు దేశ ఐక్యతను చాటే విధంగా ఉంటాయని శిక్షణ తరగతుల మొదటి రోజున ముస్లిం స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను భువనగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో యువతి యువకులు ప్రజాతంత్ర వాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో MD అజీమోద్దీన్ MD మోలిసాహబ్ MD జమాల్ MD రంdజాన్ MD హారున్ వృత్తి సంఘం మండలం కన్వర్ వేముల బిక్షం తదితరులు పాల్గొన్నారు,