/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz బిజెపి ఓబీసీ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాలయాపనకు నిరసనగా తహసిల్దార్ కి వినతిపత్రం అందజేత Vijay.S
బిజెపి ఓబీసీ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాలయాపనకు నిరసనగా తహసిల్దార్ కి వినతిపత్రం అందజేత

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు స్థానిక తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది* *బీజేపీ రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు శ్రీ గంధ మల్ల ఆనంద్ గౌడ్ గారు ,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వలిగొండ మండలం ఓబీసీ మౌర్చా అద్యక్షులు వేలిమినేటి వెంకటేశం అధ్వర్యంలో ఈరోజు స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఓబీసీ మౌర్చ కార్యదర్శి కూరపాటి శ్రవణ్ కుమార్ హాజరైనారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాక ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించిన తర్వాత అబద్ధపు హామీలతో బిసి ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ , బీసీ లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ,రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అణిచివేతే విధంగా వ్యవహరిస్తుందని , సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేనియెడల బీసీలను ఐక్యం చేసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్థానిక MRO కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ , అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ , సీనియర్ నాయకులు కనతాల అశోక్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్,స్థానిక మాజీ ఉప సర్పంచ్ మైసోల్ల మచ్చగిరి, ఓబీసీ మోర్చా మండల నాయకులు పాతకోట నరేష్, నాగెళ్లి పాండు , ఎల్లంకి మురళి, మండల ఉపాధ్యక్షులు దయ్యాల వెంకటేష్, వట్టిపల్లీ సంతోష్, మండల కార్యదర్శి ఎదురుగట్ల వెంకటేష్ ,కిసాన్ మోర్చా నాయకులు మంద నరసింహా, BJYM జిల్లా,మండల నాయకులు బొంగమట్ల మహేష్ , దంతూరి అరుణ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొత్త రామ చంద్రు,రావుల పద్మా రెడ్డి, ఆవుల శ్రీనివాస్, ఎర్రబోలు జంగయ్య, బుంగమట్ల పెద్ద మహేష్ ,కట్ట భిక్షం, తదితరులు పాల్గొన్నారు.

రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి: పల్సం స్వామి గౌడ్

రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి హామీల అమలు కాంగ్రెస్ సాధ్యం రైతు బాంధవుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని హామీలు అమలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ యువనాయక యూత్ అధ్యక్షుడు పలుసం స్వామి గౌడ్ అన్నారు ఎన్నికల ముందు వరంగల్ డెకరేషన్ ప్రకారం రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చిన రైతు పండుగ చేసుకుంటున్నారని మూడు విడుదలగా లక్ష రూపాయలు నుండి 2 లక్షల రూపాయల వరకు ఆగస్టు చివరి వరకు అందరికీ అందజేస్తుందని అన్నారు గత ప్రభుత్వంలో రుణమాఫీ చేసినంత రైతులకు మెసేజ్లు పంపించి బ్యాంకుల వద్దకు వెళ్తే రుణమాఫీ జరగలేదన్నారు 31 వేల కోట్లతో2 లక్షల రైతు రుణమాఫీ చేసి వ్యవసాయ రంగానే బలోపేతం చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య గారు భువనగిరి నియోజకవర్గ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పౌర గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేయాలని వినతి

పౌర గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ తెలంగాణ గ్రంధాలయ నిరుద్యోగుల సంఘం కోరింది . రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ను స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కలిసి, వారు వినతి పత్రం అందజేశారు. నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ 35 ఏళ్లుగా పబ్లిక్ లైబ్రరీలో లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తున్న నేపథ్యంలో స్టేట్ సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, సిటీ సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ ,రీజినల్ పబ్లిక్ లైబ్రరీ, తాలూకా పబ్లిక్ లైబ్రరీ ,మండల పబ్లిక్ లైబ్రరీ ,విలేజ్ పబ్లిక్ లైబ్రరీ లో ఖాళీగా ఉన్న గ్రేడ్ - 1, గ్రేట్ - 2, గ్రేడ్ - 3 , గ్రేడ్ - 4 పోస్టులను ప్రకటించాలని కోరారు. ఖాళీగా ఉన్న 1000 నుంచి 1500 వరకు పోస్టులు తగ్గకుండా భర్తీ చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ... ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి జాబ్ క్యాలెండర్ లో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జానయ్య, శంకర్, కట్టయ్య, సాయిలు, వై మత్స్యగిరి ,మాధవి లత, శ్రీనివాస్ ,చంద్రశేఖర్ ,ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి లో క్రైమ్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించిన డిసిపి రాజేష్ చంద్ర

యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్  చంద్ర యాదాద్రి భువనగిరి జోన్ లోని పోలీస్ స్టేషన్ లలో అడిషనల్ డీసీపీ, ఏసీపీ, సీఐలు ఎస్ఐ లతో క్రైమ్ రివ్యూ సమావేశాన్ని శనివారం భువనగిరి హెడ్ క్వార్టర్ లో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పలు స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులు త్వరగా పూర్తి విచారణ చేయాలని, దానికై సూచనలు చేశారు . అలాగే దొంగతనాలు కు సంబంధించి కేసులలో వాటిని ఛేదించడం గురించి తెలిపారు.

రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 15% మించి నిధులు కేటాయించాలి: బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్ డిమాండ్

రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15% మించి నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్ డిమాండ్ చేశారు గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా దేశంలోనే అట్టడుగు స్థాయికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు నిధుల లేమి కారణంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందని పాఠశాలలో టీచర్ల కొరత ఆయాలు అటెండర్ల కొరత మూలంగా విద్యార్థులచే క్లీనింగ్ మరియు బడి గంట కొట్టే పరిస్థితులు ఉన్నాయని టీచర్ల కొరత వల్ల విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాలు తగ్గిపోయాయని కేంద్ర ప్రభుత్వం చేసిన అధ్యయనంలో వెళ్లడైందని గుర్తు చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలకు బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి చెందిన విద్యార్థులు వస్తారు కాబట్టి మధ్యాహ్న భోజనంలో పప్పుతో పాటు ఒక కర్రీ కూడా విధిగా సప్లై చేయాలని అదేవిధంగా ఉదయం అల్పాహారాన్ని ఇవ్వకపోవడం వల్ల ఆకలితో విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో 475 కేజీబీవీ పాఠశాలలలో సుమారుగా 1,20,000 మంది విద్యార్థులు విద్యనాభ్యసిస్తున్నారు అని దీని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాల కల్పనకు రాబోయే రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని సంక్షేమ శాఖ పరిధిలో 850 గురుకులాలు 1523 సంక్షేమ హాస్టల్లో ఉన్నాయని 850 గురుకులాలకు 415 అద్దె భవనాలలో నడిపిస్తున్నారని వీటికి కొత్త భవనాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేసి పేద విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీసీ సంఘం కార్యదర్శి దేశారపు సత్యం గౌడ్, రాఘవేందర్ గౌడ్, బొడ్డు కింది శ్రీనివాస్ గౌడ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.
రైతు ఆత్మగౌరవం కోసం రుణమాఫీ: కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గాదే శోభారాణి

రామన్నపేట: రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు రుణమాఫీ అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రామన్నపేట మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభారాణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో రుణమాఫీని ఏడాదికి 25 వేల చొప్పున నాలుగు విడతలుగా లక్ష రూపాయలు మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉన్నా రుణమాఫీ అమలు చేయలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెట్టినప్పటికీ రుణమాఫీని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఆగస్టు 15 లోగా మిగతా లక్ష రూపాయలు రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. 7 లక్షల కోట్లు అప్పులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేయడం ఆర్థిక భారం అయినప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టు కోవడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రంగాల్లో ఇచ్చిన మాట నిల బెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగినదని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆపకుండా అన్ని కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ అవుతుందని ఆమె చెప్పారు.
వలిగొండ - 7 వ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వలిగొండ - 7వ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ పబ్బు నాగమణి ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ నాగమణి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు నిండిన పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగిందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని కోరారు .ఈ సందర్భంగా ఈసీసీఈ డే నిర్వహించి తల్లిదండ్రులకు ప్రీస్కూల్ విద్య ,పూర్వ బాల్యదశ ప్రాముఖ్యత గురించి వివరించారు .అనంతరం మొక్కలు నాటారు .ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నాగమణి, ఆశ వర్కర్ తెరిసా, తల్లులు నికిత,ఉమా, రమ, ఎస్.కె హజ్రా ,వెంకట నరసమ్మ , రమ్య తదితరులు పాల్గొన్నారు.

ఆగస్టు 5 ,6 న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : పల్లగొర్ల మోదీ రాందేవ్

భువనగిరి : వచ్చే నెల ఆగస్టు 5,6న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరి లోని కాలేజీలు హాస్టల్స్ విజిట్ చేసి అనంతరం ఉమెన్స్ కాలేజ్ వద్ద విద్యార్థులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ చేసి అభివాదం చేశారు Bc విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి లక్షలాదిమందిగా తరలిరావాలని చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అలాగే SC, ST,BC బీసీ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రుత్వ శాఖ ఏర్పాటు చేయాలని జనాభా గణనలో బీసీ కుల గణన చేయాలని దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని గవర్నమెంట్ సంస్థలో ప్రైవేటీకరణ నిషేధించాలని బీసీ క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని ప్రమోషన్లలో రిజర్వేషన్లు వర్తింపజేయాలని బడ్జెట్లో బీసీలకు 5లక్షల కోట్లు కేటాయించాలని బీసీలంట్లే కేవలం ఓట్లు వేసే యంత్రాలుగనే చూస్తున్నాయి ఈ ప్రభుత్వాలు దేశ గవర్నమెంట్ ఉద్యోగాలలో బీసీలు 7 శాతం గిట్ల లేకపోవడం సిగ్గుచేటు రాజకీయంగా 12 శాతం దాటలేదు బీసీలు రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీలకు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ అని చెప్పి దాన్ని అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారు బీసీల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాం బీసీ బిల్లుకు మద్దతు అని చెప్పి ఇంతవరకు దాని ఊసే లేదు బీసీ బిల్లుకు మద్దతు తెలపకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతామని హెచ్చరించారు .ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు వట్టెం మధు, చిన్నం సాగర్,పబ్బాల ఎలీషా, మనీషా రెడ్డి, శాలిని నాయక్, మాధురి, సంగీత, మౌనిక గౌడ్, వసుందరి,ప్రత్యూష,మానస, సునీత తదితరులు పాల్గొన్నారు.
కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ కే మోహిన్ కి మొహర్రం కానుక రూ. 10వేలు అందజేసిన పారిశ్రామికవేత్త మిర్యాల శేషయ్య

రామన్నపేట: మొహరం పండుగ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా  మండలంలోని భోగారం గ్రామానికి చెందిన ఎస్కే.మోహిన్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కూనూరు సాయి కుమార్ గౌడ్ అధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మిర్యాల శేషయ్య పండుగ కానుకగా రూ.10000/- నగదు ను శుక్రవారం నాడు భోగారం గ్రామానికి వచ్చి అందజేశారు. అనంతరం శేషయ్య మాట్లాడుతూ కులం, మతం విభేదాలు లేకుండా పండుగ నిర్వహించే కార్యక్రమానికి అండగా ఉంటామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ ముందుండి సహకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూనూరు రాజు, గోగు సతీష్, జెల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి ,ప్రైవేట్ పాఠశాలల్లో ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి: AISF

అఖిల భారత విద్యార్థి సమైక్య (AISF) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో మోత్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. మహిళల విద్యార్థులకు బాత్ రూమ్ శుభ్రంగా లేకపోవడం మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. .లైబ్రరీ సౌకర్యాలు లేకపోవడం మూలంగా విద్యార్థుల అధ్యయనంతో పాటు వారి భవిష్యత్ పైన కూడా ప్రభావం పడుతుందని అన్నారు. పాఠశాలలో పారిశుద్ధ కార్మికులు లేకపోవడం మూలంగా పాఠశాల ఆవరణమంతా శుభ్రంగా లేకపోవడం మరియు మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో వైరల్ ఫీవర్ తో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.. చాలా పాఠశాలలో పురాతన భవనాలు కుంగి పోవడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాఠశాలలు మార్చడం జరుగుతుంది దీని మూలంగా అనేకమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు కావున తక్షణమే సొంత భవనాలను నిర్మించాలి అదే విధంగా అనేక పాఠశాలలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కొరత ఉంది. కావున తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ గా ఈ సమస్యలన్నీ తీరేవరకు విద్యార్థులకు సరైన విద్య నాణ్యతతో కూడిన సదుపాయాలు కల్పించేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు అన్నారు. అనంతరం ప్రమాదానికి గురైన సెయింట్ ఆన్స్ పాఠశాలను సందర్శించి పాఠశాల కరస్పాండెంట్ తో మాట్లాడడం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ మోత్కూరు మండల నాయకులు చందు వినయ్ అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది.