/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz Rythu Runa Mafi | రుణమాఫీకి నిధులెట్ల?.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 04 2024, 19:05

Rythu Runa Mafi | రుణమాఫీకి నిధులెట్ల?.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు

రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీకి గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిక్కతోచని స్థితిలో పడింది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను ఈ నెలాఖరులోగా ప్రవేశపెట్టాల్సి ఉండటంతో సంబంధిత అంచనాలను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తున్నది.

దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వ్యవసాయం, జౌళి, రెవెన్యూ తదితర శాఖలతో బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగుల జీతాలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త నిర్ణయాలను తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.

రూ.28 వేల కోట్లకు చేరిన అప్పు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి ఇప్పటివరకు రూ.28 వేల కోట్ల అప్పులు తెచ్చింది. ఈ నెలాఖరు నాటికి మొత్తం అప్పు రూ.31 వేల కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాల మాఫీ, రైతు భరోసా, 6 గ్యారంటీలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైనన్ని నిధులను బడ్జెట్‌లో కేటాయించడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 21:05

రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన అవినీతి చేప..

ఓ రైతు నుండి 8000 రూపాయలు లంచం తీసుకొని వనపర్తి జిల్లా గోపాల్ పేట తహశీల్దార్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు బుధవారం పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి మహబూబ్ నగర్ ఏసీబీ డి.ఎస్.పీ కృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మండల పరిధిలోని పలకపాటు గ్రామం జింకల మిట్ట తండాకు చెందిన ముడావత్ పాండు నాయక్ అనేవ్యక్తి తనకున్న వ్యవసాయ పొలంలో కోళ్ల ఫారం షెడ్ నిర్మాణం చేశాడు. ఆ స్థలాన్ని నాన్ అగ్రికల్చర్ గా మార్చేందుకు ఈనెల 21వ తేదీన చాలన్ చెల్లించాడు. ఈనెల 22వ తేదీన పాండు నాయక్, అతని భార్య సౌందర్య కలిసి తహశీల్దారు వద్దకు వెళ్లి నిర్మించిన పౌల్ట్రీ ఫామ్ కు నాలా పర్మిషన్ ఇవ్వాలని అడగగా.. తహశీల్దార్ 15వేల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. పాండు నాయక్ తాము అంతా ఇచ్చుకోలేమని తగ్గించాలని కోరగా పదివేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈనెల 23వ తేదీన మరోసారి వచ్చి సార్ అన్ని డబ్బులు కూడా ఇవ్వలేము అనగా చివరగా ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నాలా పర్మిషన్ ఇస్తామని చెప్పడంతో పాండు నాయక్ ఇంటికి వెళ్లి అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంబంధించిన వీడియోలను చూసి.. మహబూబ్ నగర్ డీఎస్పీ కృష్ణ గౌడ్ కు సమాచారం ఇచ్చి అతనిని స్వయంగా కలిశారు.

ఇందులో భాగంగా కృష్ణ గౌడ్ తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు సీఐలు, పదిమంది ఇతర సిబ్బందితో కలిసి రైతు పాండు నాయక్ కు ఎనిమిది వేల రూపాయలను ఇచ్చే విధంగా పథకం రూపొందించి అమలు చేశారు. డబ్బులు ఇచ్చి బయటకు వచ్చిన రైతు విషయాన్ని అధికారులకు తెలపడంతో వారు లోపలికి వెళ్లి తహశీల్దార్ ను అదుపులోకి తీసుకొని, 8000 రూపాయలు స్వాధీనపరచుకొని కేసునమోదు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 21:01

సారు కారు 16 నుంచి జీరోకి బీఆర్ఎస్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దూరం అయినా ఆ పార్టీ నేతల వ్యవహార శైలి మారలేదని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో జీవిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సారు కారు 16 అన్నారు.. అలా అని జీరోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఊహాల్లోంచి బయటకు రావాలని కోరారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తోందని సూచించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దూరం అయినా ఆ పార్టీ నేతల వ్యవహార శైలి మారలేదని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో జీవిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సారు కారు 16 అన్నారు.. అలా అని జీరోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఊహాల్లోంచి బయటకు రావాలని కోరారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తోందని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. ఆ కుట్ర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు అని వివరించారు. ఆ కుట్రను సహించలేక వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరారని, మరింత మంది వస్తారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేల పార్టీ మార్పు గురించి బీఆర్ఎస్ నేతలు సుద్దులు చెబుతున్నారు.. గతంలో ఏం జరిగిందని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను.. సీఎల్పీని విలీనం చేయలేదా అని నిలదీశారు.

ఆదిత్యనాథ్ దాస్‌ను నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమించడంపై భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన నీటి పారుదల రంగంలో నిపుణులు, అందుకే అడ్వైజర్‌గా నియమించుకున్నాం. ఒకవేళ ఆదిత్యనాథ్ మా అంచనాలు అందుకోకుంటే పక్కన పెడతాం అని తెగేసి చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:59

4న విద్యా సంస్థల బంద్‌ : ఎస్‌ఎఫ్‌ఐ

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 4వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 4వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

మంగళవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి డాక్టర్లను అందించే నీట్‌ పరీక్షపత్రాన్ని లీక్‌చేయడంతో 20లక్షల మంది విద్యార్థుల జీవితం అగమ్యగోచరంగా మారిందన్నారు.

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యా సంస్థల బంద్‌ కార్యక్రమంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుంగమట్ల శివ, పిల్లి కార్తీక్‌, దాసరి కార్తీక్‌, ముఖేష్‌ పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:17

కుళ్లిన రొయ్యలు.. గడువు ముగిసిన పన్నీర్.. ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ నిజాలు

నగరంలోని టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్, పుట్టగొడుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నగరంలోని టాస్క్‌ఫోర్స్ అధికారుల (Taskforce officers) దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు.

ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్, పుట్టగొడుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాన్ వెజ్ వంటకాల్లో మోతాదుకు మించి కలర్స్ వేస్తున్నట్లు ధ్రువీకరించారు.

హకూన మటాటా చైనీస్ రెస్టారెంట్‌లో నాణ్యత లేని ఆహార పదార్థాలతో వంటలు తయారు చేస్తున్నట్లు సోదాల్లో బయటపడింది. అలాగే కిచెన్‌లో అపరిశుభ్రతమైన వాతావరణాన్ని గుర్తించారు. అయితే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్లు లేకుండానే రెస్టారెంట్ల నిర్వహణ జరుగుతోంది అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ను ల్యాబ్ పంపించారు. అలాగే పలు రెస్టారెంట్లకు టాస్క్ ఫోర్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:13

విష సర్పాలకు నిలయం.. ఆ ప్రాంతానికి ఎవరైనా వెళ్లారో ఇక..

సాధారణంగా పాములంటేనే ప్రజలు భయపడుతుంటారు. కాటువేస్తే ప్రాణాలు పోతాయని భావిస్తారు. అందుకని అవి తిరుగాడే చోటుకు వెళ్లడానికి సాహసించరు. కానీ ఒక ద్వీపకల్పంలో మాత్రం ఈ విష సర్పాలే అధికంగా ఉంటాయని ట్రావెలింగ్ నిపుణులు చెప్తున్నారు.

ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఇంతకీ ఆ అరుదైన ప్రాంతమేది? అనుకుంటున్నారా? దానిపేరు ‘ఇల్హాడా క్యూయిమాడ’ గ్రాండే.

అట్లాంటిక్ సముద్ర తీరంలో గల ‘ఇల్హాడా క్యూయిమాడ గ్రాండే’లో వందలూ వేలు కాదు.. లక్షల సంఖ్యలో విషపూరిత పాములు నివసిస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు.

పైగా వీటిలో ‘గోల్డెన్ లాన్స్ హెడ్’ అనే పాము జాతి మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది కాటు వేస్తే విషం శరీరానికి చాలా వేగంగా పాకడంతోపాటు చర్మం పాలిపోతుందట. ఇలాంటి రకరకాల పాములకు నిలయంగా ఉన్నందున ఈ దీవిని ‘కింగ్ డమ్ ఆఫ్ స్నేక్స్’ అని, ‘స్నేక్ ఐలాండ్’ అని కూడా పిలుస్తుంటారు.

ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ నిపుణుల ప్రకారం.. బ్రెజిల్‌లోని సావో పాలో సముద్ర తీరం నుంచి క్యూయిమాడ గ్రాండే దీవి సుమారు 146 కి.మీ ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ‘వైపర్ స్నేక్స్’ కూడా ఈ ప్రాంతంలో సుమారు 3 నుంచి 4 వేల వరకుక ఉంటాయి. ఇలా రకరకాల విష సర్పాలకు నిలయంగా ఉన్నందున బ్రెజిల్ ప్రభుత్వం ‘క్యూయిమాడ గ్రాండే’ ఐలాండ్‌లో పరిశోధకులను తప్ప సాధారణ ప్రజలను, టూరిస్టులను అనుమతించడం లేదట.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:10

Bhole Baba: ఎవరీ భోలే బాబా.. అతని చరిత్ర ఏంటి.. అసలు పాదధూళీ కథేంటి?

భోలే బాబా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతోంది. హత్రాస్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనతో ఆ బాబా హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన పాదధూళీ కోసం భక్తులు..

ఆయన అసలు పేరు సూరజ్‌ పాల్‌. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటా జిల్లా, పటియాలి తహసీన్‌లోని బహదూర్ గ్రామంలో పుట్టాడు. తన చిన్నతనంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేశాడు. ఓవైపు పొలం పనులు చేస్తూనే.. మరోవైపు విద్యాభ్యాసం కొనసాగించాడు. తన చదువు పూర్తి చేసుకున్నాక.. రాష్ట్ర పోలీసు శాఖలో చేరాడు. 18 సంవత్సరాల పాటు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్) తీసుకుని, ఆధ్యాత్మిక బాట పట్టాడు. పోలీసు శాఖలో పని చేసే సమయంలోనే ఆయనపై లైంగిక వేధింపుల కేసులో నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఆ కేసుల్లో 1997లో అరెస్టై.. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాడు.

జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తన పేరుని నారాయణ్ సాకార్ విశ్వహరి బాబాగా మార్చుకున్నాడు. తన పూర్వీకుల గ్రామంలో ఓ ఆశ్రమాన్ని తెరించి..

క్రమంగా జనాలను ఆకర్షించడం మొదలుపెట్టాడు. అనతికాలంలోనే బాబాగా పాపులారిటీ వచ్చేయడంతో.. సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. అలీగఢ్‌తో పాటు హత్రాస్‌లోనూ.. ప్రతి మంగళవారం సత్సంగ్ నిర్వహించేవాడు. ఇందుకు వేల సంఖ్యలో, కొన్ని లక్షల్లోనూ భక్తులు హాజరవుతుంటారు. కొవిడ్ సమయంలో ఆయన పేరు దేశమంతా వినిపించింది. ఆ సమయంలో ఓ సత్సంగ్ కార్యక్రమంగా నిర్వహించగా.. ఏకంగా 50 వేల మంది వచ్చారు. దీంతో అది వివాదాస్పదమైంది.

మంగళవారం భోలే బాబా హత్రాస్ జిల్లాలోని పుల్‌రయీ గ్రామంలో ఓ సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు 80వేల మందికే అనుమతి ఇచ్చారు కానీ.. 2.5 లక్షల మంది వరకు తరలివచ్చారు. తన ప్రవచనాలు ముగించుకొని భోలే బాబా కారులో వెళ్లిపోయాడు. అయితే.. ఆయన వాహనం ఏ మార్గంలో వెళ్లిందో, ఆ మట్టిని తీసుకుంటే బాబా ఆశీర్దవం లభిస్తుందని భక్తులు నమ్మారు. ఆ నమ్మకంతో అందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి.. పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:06

చంద్రబాబు, రేవంత్‌ బంధంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వాక్యాలు

Telangana: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

స్పందించారు.

చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురుశిష్యులు కాదని.. సహచరులని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రేవంత్ చాలా సార్లు చెప్పారన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్ తెలంగాణ సీఎం అని తేల్చిచెప్పారు. చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులు అనే వారివి అవగాహనలేని మాటలని కొట్టిపారేశారు. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే అని వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాల కోసం బీఆర్‌ఎస్ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్సుతో ఏడు మండలాలను ఏపీలో కలిపారని చెప్పుకొచ్చారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేబినెట్ విస్తరణపై పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుందన్నారు.

త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు. పదిహేనేండ్లు తామే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్ వి కల్లిబొల్లి కబుర్లే అంటూ విమర్శించారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని.. పుట్టింది బతకడానికి... చావడానికి కాదని అన్నారు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పిదాలు ఆయన్ని వెంటాడుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:02

రైతుభరోసా సీలింగ్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

రైతులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలనే అంకిత భావంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని, త్వరలోనే రైతులు శుభవార్త వింటారని డిప్యూటీ సీఎం, రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ‌భవన్‌లో భట్టి మాట్లాడుతూ.. రైతు భరోసా మొత్తం నిజమైన రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. రైతు భరోసాపై విధివిధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని నాలుగు గోడల మధ్య కూర్చుని విధివిధానాలు తాము రూపొందించబోమన్నారు.

రైతు భరోసా విధివిధానాలపై పాత ఉమ్మడి జిల్లాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. రైతులు, ట్యాక్స్ పేయర్స్, మీడియా, మేధావులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. బడ్జెట్ సమావేశాల్లోపే రిపోర్టును సిద్ధం చేసి ఆ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెడుతామన్నారు. త్వరలోనే రైతు రుణమాఫీ చేసి తీరుతామని పేర్కొన్నారు.

ఐదు ఎకరాలలోపు వారికే రైతు భరోసా ఇస్తారనే ప్రచారం జరుగుతోందన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. రైతు భరోసా విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని జూలై 15 నాటికి నివేదిక సమర్పిస్తామని విధివిధానాల రూపకల్పన ప్రక్రియ అంతా బడ్జెట్ సమావేశాలలోపే పూర్తవుతుందని చెప్పారు. తన నియోజకవర్గంలో రైతు ప్రభాకర్‌ ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ ఇది దురదృష్టకరమని ఈ విషయంలో అన్ని కోణాల్లో విచారణ చేయించాలని తాను అధికారులను ఆదేశించానని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈనెల 6వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని విభజన చట్టంలోని అంశాలు ఎజెండాగా ఉండబోతున్నాయని భట్టి విక్రమార్క చెప్పారు. ఏపీలో విలీనం అయిన ఏడు మండలాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తున్న హరీశ్‌రావు చరిత్ర మరిచిపోతే ఎలా అని సెటైర్ వేశారు. విభజన చట్టంలో ఏడు మండలాల విలీనం లేదని రాష్ట్ర విభజన జరిగాక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడు మండలాలను ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఏపీకి అప్పగించిందన్నారు.

ఈ విషయంలో ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత గాలికి వదిలేశారన్నారు. తీరా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఈ విషయంలో దీక్ష చేయాలని సూచించారు. బీఆర్ఎస్,బీజేపీ కలిసి చేసిన పాపంతోనే ఈ ఏడు మండలాలు ఏపీకి పోయాయని విమర్శించారు. చంద్రబాబుకు తాను శిష్యుడిని కాదని సహచరుడినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే స్పష్టంగా చెప్పారని అయినా బురదజల్లేందుకే గురుశిష్యులు అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 15:11

Annuity Scheme: ఎస్‌బీఐ యాన్యూటీ స్కీమ్.. 10 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.11 వేలు వస్తాయ్!

Annuity Scheme: మీరు నెల నెల స్థిరమైన రాబడి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ అందిస్తున్న యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో చేరడం వల్ల 10 ఏళ్ల పాటు నెల నెలా రూ.11 వేల వరకు పెన్షన్ రూపంలో పొందవచ్చు. మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.

Annuity Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం వివిధ రకాల పొదుపు, డిపాజిట్ పథకాలు అందిస్తోంది. ఆయా స్కీమ్స్‌లో చేరిన వారికి మంచి బెనిఫిట్స్ కల్పిస్తోంది. మీరు కూడా మీ వద్ద ఉన్న డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసి స్థిరమైన రాబడి ఉండాలనుకుంటున్నారా? అలాంటి పథకాల కోసం చూస్తున్నారా? అయితే ఎస్‌బీఐ (SBI) అందిస్తున్న యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో మీరు డబ్బులు డిపాజిట్ చేయడం ద్వారా గరిష్ఠంగా 10 ఏళ్ల పాటు పెన్షన్ మాదిరిగా స్థిరమైన రాబడి అందుకోవచ్చు.

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme) ద్వారా మంచి వడ్డీ రేట్లు సైతం కల్పిస్తోంది. ఇందులో చేరడం ద్వారా ప్రతీ నెల మన అవసరాలకు తగిన విధంగా డబ్బులు వెనక్కి అందుకోవచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ యాన్యూటీ స్కీమ్‌లో ఎవరైనా చేరవచ్చు. 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు, ఎంచుకునే టెన్యూర్‌పై ఆధారపడే నెల నెలా డబ్బులు వస్తాయి. మీరు 36, 60,84,120 నెలల మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీ అవవసరాల తగినంతగా, అనువైన విధంగా మెచ్యురిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీకు కావాల్సినంత నగదు ప్రతీ నెలా పెన్షన్ మాదిరిగా అందుకోవచ్చు.

Annuity Scheme: ఎస్‌బీఐ యాన్యూటీ స్కీమ్.. 10 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.11 వేలు వస్తాయ్!

Annuity Scheme: మీరు నెల నెల స్థిరమైన రాబడి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ అందిస్తున్న యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో చేరడం వల్ల 10 ఏళ్ల పాటు నెల నెలా రూ.11 వేల వరకు పెన్షన్ రూపంలో పొందవచ్చు. మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.

Annuity Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం వివిధ రకాల పొదుపు, డిపాజిట్ పథకాలు అందిస్తోంది. ఆయా స్కీమ్స్‌లో చేరిన వారికి మంచి బెనిఫిట్స్ కల్పిస్తోంది. మీరు కూడా మీ వద్ద ఉన్న డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసి స్థిరమైన రాబడి ఉండాలనుకుంటున్నారా? అలాంటి పథకాల కోసం చూస్తున్నారా? అయితే ఎస్‌బీఐ (SBI) అందిస్తున్న యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో మీరు డబ్బులు డిపాజిట్ చేయడం ద్వారా గరిష్ఠంగా 10 ఏళ్ల పాటు పెన్షన్ మాదిరిగా స్థిరమైన రాబడి అందుకోవ

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme) ద్వారా మంచి వడ్డీ రేట్లు సైతం కల్పిస్తోంది. ఇందులో చేరడం ద్వారా ప్రతీ నెల మన అవసరాలకు తగిన విధంగా డబ్బులు వెనక్కి అందుకోవచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ యాన్యూటీ స్కీమ్‌లో ఎవరైనా చేరవచ్చు. 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు, ఎంచుకునే టెన్యూర్‌పై ఆధారపడే నెల నెలా డబ్బులు వస్తాయి. మీరు 36, 60,84,120 నెలల మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీ అవవసరాల తగినంతగా, అనువైన విధంగా మెచ్యురిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీకు కావాల్సినంత నగదు ప్రతీ నెలా పెన్షన్ మాదిరిగా అందుకోవచ్చు.

ఎస్బీఐ అందిస్తున్న యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో నెలకు కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తమైనా పొందేందుకు వీలుంది. అయితే అది మీరు డిపాజిట్ చేసే సొమ్ముపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు యాన్యూటీ పథకంలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యమూ ఉంటుంది. మీ డిపాజిట్ నగదులో 75 శాతం వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందవచ్చు. అలాగే మీరు ఎంచుకునే మెచ్యూరిటీ పీరియడ్, ఆధారంగా అసలులో కొంత, వడ్డీ కలిపి చెల్లిస్తుంది బ్యాంక్. మీరు ఈ యాన్యుటీ స్కీమ్‌లో రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుందాం. 10 ఏళ్ల టెన్యూర్ ఎంచుకున్నట్లయితే మీకు నెలకు రూ.11,870 వరకు లభిస్తాయి. మొదటి నెల పేమెంట్‌లో మీకు వడ్డీ రూ. 6250, అసలులో నుంచి రూ.5,620 కలిగి మొత్తంగా రూ.11,870 చెల్లిస్తుంది బ్యాంక్. టెన్యూర్ పూర్తయ్యే సరికి మీ పెట్టుబడి మొత్తం జీరోకు వస్తుంది. మరోవైపు.. ఈ యాన్యుటీ స్కీమ్‌లో డిపాజిట్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీబీ ద్వారా పన్ను మినహాయింపులూ క్లెయిమ్ చేసుకోవచ్చు.