/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz విష సర్పాలకు నిలయం.. ఆ ప్రాంతానికి ఎవరైనా వెళ్లారో ఇక.. Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:13

విష సర్పాలకు నిలయం.. ఆ ప్రాంతానికి ఎవరైనా వెళ్లారో ఇక..

సాధారణంగా పాములంటేనే ప్రజలు భయపడుతుంటారు. కాటువేస్తే ప్రాణాలు పోతాయని భావిస్తారు. అందుకని అవి తిరుగాడే చోటుకు వెళ్లడానికి సాహసించరు. కానీ ఒక ద్వీపకల్పంలో మాత్రం ఈ విష సర్పాలే అధికంగా ఉంటాయని ట్రావెలింగ్ నిపుణులు చెప్తున్నారు.

ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఇంతకీ ఆ అరుదైన ప్రాంతమేది? అనుకుంటున్నారా? దానిపేరు ‘ఇల్హాడా క్యూయిమాడ’ గ్రాండే.

అట్లాంటిక్ సముద్ర తీరంలో గల ‘ఇల్హాడా క్యూయిమాడ గ్రాండే’లో వందలూ వేలు కాదు.. లక్షల సంఖ్యలో విషపూరిత పాములు నివసిస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు.

పైగా వీటిలో ‘గోల్డెన్ లాన్స్ హెడ్’ అనే పాము జాతి మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది కాటు వేస్తే విషం శరీరానికి చాలా వేగంగా పాకడంతోపాటు చర్మం పాలిపోతుందట. ఇలాంటి రకరకాల పాములకు నిలయంగా ఉన్నందున ఈ దీవిని ‘కింగ్ డమ్ ఆఫ్ స్నేక్స్’ అని, ‘స్నేక్ ఐలాండ్’ అని కూడా పిలుస్తుంటారు.

ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ నిపుణుల ప్రకారం.. బ్రెజిల్‌లోని సావో పాలో సముద్ర తీరం నుంచి క్యూయిమాడ గ్రాండే దీవి సుమారు 146 కి.మీ ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ‘వైపర్ స్నేక్స్’ కూడా ఈ ప్రాంతంలో సుమారు 3 నుంచి 4 వేల వరకుక ఉంటాయి. ఇలా రకరకాల విష సర్పాలకు నిలయంగా ఉన్నందున బ్రెజిల్ ప్రభుత్వం ‘క్యూయిమాడ గ్రాండే’ ఐలాండ్‌లో పరిశోధకులను తప్ప సాధారణ ప్రజలను, టూరిస్టులను అనుమతించడం లేదట.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:10

Bhole Baba: ఎవరీ భోలే బాబా.. అతని చరిత్ర ఏంటి.. అసలు పాదధూళీ కథేంటి?

భోలే బాబా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతోంది. హత్రాస్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనతో ఆ బాబా హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన పాదధూళీ కోసం భక్తులు..

ఆయన అసలు పేరు సూరజ్‌ పాల్‌. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటా జిల్లా, పటియాలి తహసీన్‌లోని బహదూర్ గ్రామంలో పుట్టాడు. తన చిన్నతనంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేశాడు. ఓవైపు పొలం పనులు చేస్తూనే.. మరోవైపు విద్యాభ్యాసం కొనసాగించాడు. తన చదువు పూర్తి చేసుకున్నాక.. రాష్ట్ర పోలీసు శాఖలో చేరాడు. 18 సంవత్సరాల పాటు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్) తీసుకుని, ఆధ్యాత్మిక బాట పట్టాడు. పోలీసు శాఖలో పని చేసే సమయంలోనే ఆయనపై లైంగిక వేధింపుల కేసులో నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఆ కేసుల్లో 1997లో అరెస్టై.. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాడు.

జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తన పేరుని నారాయణ్ సాకార్ విశ్వహరి బాబాగా మార్చుకున్నాడు. తన పూర్వీకుల గ్రామంలో ఓ ఆశ్రమాన్ని తెరించి..

క్రమంగా జనాలను ఆకర్షించడం మొదలుపెట్టాడు. అనతికాలంలోనే బాబాగా పాపులారిటీ వచ్చేయడంతో.. సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. అలీగఢ్‌తో పాటు హత్రాస్‌లోనూ.. ప్రతి మంగళవారం సత్సంగ్ నిర్వహించేవాడు. ఇందుకు వేల సంఖ్యలో, కొన్ని లక్షల్లోనూ భక్తులు హాజరవుతుంటారు. కొవిడ్ సమయంలో ఆయన పేరు దేశమంతా వినిపించింది. ఆ సమయంలో ఓ సత్సంగ్ కార్యక్రమంగా నిర్వహించగా.. ఏకంగా 50 వేల మంది వచ్చారు. దీంతో అది వివాదాస్పదమైంది.

మంగళవారం భోలే బాబా హత్రాస్ జిల్లాలోని పుల్‌రయీ గ్రామంలో ఓ సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు 80వేల మందికే అనుమతి ఇచ్చారు కానీ.. 2.5 లక్షల మంది వరకు తరలివచ్చారు. తన ప్రవచనాలు ముగించుకొని భోలే బాబా కారులో వెళ్లిపోయాడు. అయితే.. ఆయన వాహనం ఏ మార్గంలో వెళ్లిందో, ఆ మట్టిని తీసుకుంటే బాబా ఆశీర్దవం లభిస్తుందని భక్తులు నమ్మారు. ఆ నమ్మకంతో అందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి.. పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:06

చంద్రబాబు, రేవంత్‌ బంధంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వాక్యాలు

Telangana: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సమావేశం కానున్నారు. అయితే గురుశిష్యులు భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

స్పందించారు.

చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురుశిష్యులు కాదని.. సహచరులని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రేవంత్ చాలా సార్లు చెప్పారన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్ తెలంగాణ సీఎం అని తేల్చిచెప్పారు. చంద్రబాబు, రేవంత్ గురుశిష్యులు అనే వారివి అవగాహనలేని మాటలని కొట్టిపారేశారు. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే అని వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాల కోసం బీఆర్‌ఎస్ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్సుతో ఏడు మండలాలను ఏపీలో కలిపారని చెప్పుకొచ్చారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేబినెట్ విస్తరణపై పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుందన్నారు.

త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు. పదిహేనేండ్లు తామే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్ వి కల్లిబొల్లి కబుర్లే అంటూ విమర్శించారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని.. పుట్టింది బతకడానికి... చావడానికి కాదని అన్నారు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పిదాలు ఆయన్ని వెంటాడుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 20:02

రైతుభరోసా సీలింగ్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

రైతులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలనే అంకిత భావంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని, త్వరలోనే రైతులు శుభవార్త వింటారని డిప్యూటీ సీఎం, రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ‌భవన్‌లో భట్టి మాట్లాడుతూ.. రైతు భరోసా మొత్తం నిజమైన రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. రైతు భరోసాపై విధివిధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని నాలుగు గోడల మధ్య కూర్చుని విధివిధానాలు తాము రూపొందించబోమన్నారు.

రైతు భరోసా విధివిధానాలపై పాత ఉమ్మడి జిల్లాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. రైతులు, ట్యాక్స్ పేయర్స్, మీడియా, మేధావులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. బడ్జెట్ సమావేశాల్లోపే రిపోర్టును సిద్ధం చేసి ఆ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెడుతామన్నారు. త్వరలోనే రైతు రుణమాఫీ చేసి తీరుతామని పేర్కొన్నారు.

ఐదు ఎకరాలలోపు వారికే రైతు భరోసా ఇస్తారనే ప్రచారం జరుగుతోందన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. రైతు భరోసా విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని జూలై 15 నాటికి నివేదిక సమర్పిస్తామని విధివిధానాల రూపకల్పన ప్రక్రియ అంతా బడ్జెట్ సమావేశాలలోపే పూర్తవుతుందని చెప్పారు. తన నియోజకవర్గంలో రైతు ప్రభాకర్‌ ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ ఇది దురదృష్టకరమని ఈ విషయంలో అన్ని కోణాల్లో విచారణ చేయించాలని తాను అధికారులను ఆదేశించానని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈనెల 6వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని విభజన చట్టంలోని అంశాలు ఎజెండాగా ఉండబోతున్నాయని భట్టి విక్రమార్క చెప్పారు. ఏపీలో విలీనం అయిన ఏడు మండలాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తున్న హరీశ్‌రావు చరిత్ర మరిచిపోతే ఎలా అని సెటైర్ వేశారు. విభజన చట్టంలో ఏడు మండలాల విలీనం లేదని రాష్ట్ర విభజన జరిగాక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడు మండలాలను ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఏపీకి అప్పగించిందన్నారు.

ఈ విషయంలో ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత గాలికి వదిలేశారన్నారు. తీరా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఈ విషయంలో దీక్ష చేయాలని సూచించారు. బీఆర్ఎస్,బీజేపీ కలిసి చేసిన పాపంతోనే ఈ ఏడు మండలాలు ఏపీకి పోయాయని విమర్శించారు. చంద్రబాబుకు తాను శిష్యుడిని కాదని సహచరుడినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే స్పష్టంగా చెప్పారని అయినా బురదజల్లేందుకే గురుశిష్యులు అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 15:11

Annuity Scheme: ఎస్‌బీఐ యాన్యూటీ స్కీమ్.. 10 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.11 వేలు వస్తాయ్!

Annuity Scheme: మీరు నెల నెల స్థిరమైన రాబడి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ అందిస్తున్న యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో చేరడం వల్ల 10 ఏళ్ల పాటు నెల నెలా రూ.11 వేల వరకు పెన్షన్ రూపంలో పొందవచ్చు. మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.

Annuity Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం వివిధ రకాల పొదుపు, డిపాజిట్ పథకాలు అందిస్తోంది. ఆయా స్కీమ్స్‌లో చేరిన వారికి మంచి బెనిఫిట్స్ కల్పిస్తోంది. మీరు కూడా మీ వద్ద ఉన్న డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసి స్థిరమైన రాబడి ఉండాలనుకుంటున్నారా? అలాంటి పథకాల కోసం చూస్తున్నారా? అయితే ఎస్‌బీఐ (SBI) అందిస్తున్న యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో మీరు డబ్బులు డిపాజిట్ చేయడం ద్వారా గరిష్ఠంగా 10 ఏళ్ల పాటు పెన్షన్ మాదిరిగా స్థిరమైన రాబడి అందుకోవచ్చు.

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme) ద్వారా మంచి వడ్డీ రేట్లు సైతం కల్పిస్తోంది. ఇందులో చేరడం ద్వారా ప్రతీ నెల మన అవసరాలకు తగిన విధంగా డబ్బులు వెనక్కి అందుకోవచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ యాన్యూటీ స్కీమ్‌లో ఎవరైనా చేరవచ్చు. 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు, ఎంచుకునే టెన్యూర్‌పై ఆధారపడే నెల నెలా డబ్బులు వస్తాయి. మీరు 36, 60,84,120 నెలల మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీ అవవసరాల తగినంతగా, అనువైన విధంగా మెచ్యురిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీకు కావాల్సినంత నగదు ప్రతీ నెలా పెన్షన్ మాదిరిగా అందుకోవచ్చు.

Annuity Scheme: ఎస్‌బీఐ యాన్యూటీ స్కీమ్.. 10 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.11 వేలు వస్తాయ్!

Annuity Scheme: మీరు నెల నెల స్థిరమైన రాబడి ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ అందిస్తున్న యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో చేరడం వల్ల 10 ఏళ్ల పాటు నెల నెలా రూ.11 వేల వరకు పెన్షన్ రూపంలో పొందవచ్చు. మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.

Annuity Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం వివిధ రకాల పొదుపు, డిపాజిట్ పథకాలు అందిస్తోంది. ఆయా స్కీమ్స్‌లో చేరిన వారికి మంచి బెనిఫిట్స్ కల్పిస్తోంది. మీరు కూడా మీ వద్ద ఉన్న డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసి స్థిరమైన రాబడి ఉండాలనుకుంటున్నారా? అలాంటి పథకాల కోసం చూస్తున్నారా? అయితే ఎస్‌బీఐ (SBI) అందిస్తున్న యాన్యూటీ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో మీరు డబ్బులు డిపాజిట్ చేయడం ద్వారా గరిష్ఠంగా 10 ఏళ్ల పాటు పెన్షన్ మాదిరిగా స్థిరమైన రాబడి అందుకోవ

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme) ద్వారా మంచి వడ్డీ రేట్లు సైతం కల్పిస్తోంది. ఇందులో చేరడం ద్వారా ప్రతీ నెల మన అవసరాలకు తగిన విధంగా డబ్బులు వెనక్కి అందుకోవచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ యాన్యూటీ స్కీమ్‌లో ఎవరైనా చేరవచ్చు. 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు, ఎంచుకునే టెన్యూర్‌పై ఆధారపడే నెల నెలా డబ్బులు వస్తాయి. మీరు 36, 60,84,120 నెలల మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీ అవవసరాల తగినంతగా, అనువైన విధంగా మెచ్యురిటీ టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీకు కావాల్సినంత నగదు ప్రతీ నెలా పెన్షన్ మాదిరిగా అందుకోవచ్చు.

ఎస్బీఐ అందిస్తున్న యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో నెలకు కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తమైనా పొందేందుకు వీలుంది. అయితే అది మీరు డిపాజిట్ చేసే సొమ్ముపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు యాన్యూటీ పథకంలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యమూ ఉంటుంది. మీ డిపాజిట్ నగదులో 75 శాతం వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందవచ్చు. అలాగే మీరు ఎంచుకునే మెచ్యూరిటీ పీరియడ్, ఆధారంగా అసలులో కొంత, వడ్డీ కలిపి చెల్లిస్తుంది బ్యాంక్. మీరు ఈ యాన్యుటీ స్కీమ్‌లో రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుందాం. 10 ఏళ్ల టెన్యూర్ ఎంచుకున్నట్లయితే మీకు నెలకు రూ.11,870 వరకు లభిస్తాయి. మొదటి నెల పేమెంట్‌లో మీకు వడ్డీ రూ. 6250, అసలులో నుంచి రూ.5,620 కలిగి మొత్తంగా రూ.11,870 చెల్లిస్తుంది బ్యాంక్. టెన్యూర్ పూర్తయ్యే సరికి మీ పెట్టుబడి మొత్తం జీరోకు వస్తుంది. మరోవైపు.. ఈ యాన్యుటీ స్కీమ్‌లో డిపాజిట్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీబీ ద్వారా పన్ను మినహాయింపులూ క్లెయిమ్ చేసుకోవచ్చు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 03 2024, 15:07

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడి పొడగింపు.. ఎప్పటి వరకంటే..

ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. ఇవాళ్టితో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను జైలు అధికారులు హాజరుపరిచారు.

తదుపరి కేసు విచారణ జూలై 25 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరుకుతుందన్న ఆశలు అడియాసలుగానే మారుతున్నాయి.

ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. ఇవాళ్టితో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను జైలు అధికారులు హాజరుపరిచారు. తదుపరి కేసు విచారణ జూలై 25 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరుకుతుందన్న ఆశలు అడియాసలుగానే మారుతున్నాయి. అయితే కవిత.. ఈడీ, సీబీఐ కేసులకు సంబంధించి ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ఈ నెల 1న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది. ఒక విద్యావంతురాలిగా పలుకుబడి కలిగిన మహిళగా ఆమె చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ కేసులో కవిత పాత్రతో పాటు ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ఆధారంగా ఆమెకు బెయిల్ ఇవ్వాలా.. వద్దా? అనే నిర్ణయముంటుందని వెల్లడించింది.

ఈడీ సేకరించిన సాక్ష్యాలను బట్టి ఢిల్లీలో కొత్త మద్యం విధానం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో కవిత కూడా ఒకరని..ఈ కేసులో మరికొందరు నిందితులు కూడా ఆమె తరఫునే పనిచేశారని తేలిందని హైకోర్టు పేర్కొంది. ఫలితంగా ఆమెను ఓ నిస్సహాయ మహిళగా భావించలేమని కోర్టు స్పష్టం చేస్తూ ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 02 2024, 14:07

పాముతో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు..

తుకారాంగేట్‌ పరిధి బోయబస్తీలో (గంగపుత్ర సంఘం ప్రాంతం) నిత్యం పాములు సంచరిస్తున్నాయని, నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు ఎమ్మెల్యే పద్మారావు(MLA Padmarao)ను కోరారు.

నిత్యం పాములు సంచరిస్తున్నాయని, నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు ఎమ్మెల్యే పద్మారావు(MLA Padmarao)ను కోరారు. బస్తీలో సంచరిస్తున్న ఓ నాగుపాము పిల్లను పట్టుకుని ప్లాస్టిక్‌ బాటిల్‌లో ఉంచి సోమవారం సీతాఫల్‌మండిలోని సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు.

బాటిల్‌లో ఉన్న పాము బుస కొట్టడం చూసి ఎమ్మెల్యే పద్మారావుతో పాటు అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. తమ బస్తీలో పాముల బెడద ఎక్కువగా ఉన్నదని, గతంలో ఒక పాప పాముకాటుతో మృతి చెందిందని బస్తీవాసులు ఎమ్మెల్యేకు వివరించారు.

తమ సమస్య గురించి అధికారులకు చెబితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సంబంధిత అధికారికి వీడియో కాల్‌ చేసి బాటిల్‌లో ఉన్న నాగుపామును చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్తీలో రాళ్ల కుప్పలను, చెత్త, చెట్లను తొలగించాలని, పాములు రాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాముపిల్లను దూరంగా తీసుకెళ్లి వదిలేయాలని బస్తీవాసులకు సూచించారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 02 2024, 14:04

గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

నిరుద్యోగ యువత నేతల అరెస్టులతో గాంధీ ఆసుపత్రి ఉద్రిక్తంగా మారింది. గత 8 రోజులగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జెఎసి నాయకుడు మోతీలాల్ నాయక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి అరెస్టు చేస్తారన్న సమాచారంతో సోమవారం ఉదయం నుంచి విద్యార్థ్దులు, నిరుద్యోగ యువత, పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆసుపత్రికి తరలి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ స్థాయిలో ఆసుపత్రి ప్రాంగణంలో మోహరించారు.

దీంతో అటు పోలీసులు ఇటు నిరుద్యోగ యువతతో ఆసుపత్రి ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. నిత్యం గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగులు భయాందోళనకు గురయ్యారు. తూర్పు మండల డిసిపి గిరిధర్ ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు గాంధీ ఆసుపత్రికి చేరుకొని నిరుద్యోగ యువత, బిఆర్‌ఎస్ నాయకులను అడ్డుకొని వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు వ్యాన్‌లలో బలవంతంగా తరలించారు.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను గాంధీ ఆసుపత్రి నుంచి వేరే ఆసుపత్రికి తరలిస్తారని తెలుసుకున్న విద్యార్థులు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారిని ఆసుపత్రి లోపలికి రానియ్యకుండా పంపివేశారు.. మీడియాను సైతం లోపలికి పంపకుండా పోలీసులు అడ్డుకున్నారు. మోతీలాల్ నాయక్‌ను పరామర్శించడానికి వచ్చిన జనగామ ఎంఎల్‌ఏ పల్ల్లా రాజేశ్వర్ రెడ్డి, నిరుద్యోగ సమాఖ్య నేత రాజారాం యాదవ్‌లు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. తాము శాంతియుతంగా మోతీలాల్‌ను పరామర్శించడానికి వస్తే పోలీసులు దౌర్జన్యంగా తమను అడ్డుకుని , ఈడ్చుకుంటూ బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపెట్టిన కాంగ్రెస్ నాయకులు గద్దెనెక్కిన తరువాత నిరుద్యోగుల సమస్యలను పక్కన పెట్టి తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతను జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. తమ డిమాండ్ల కోసం 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయిన లేదన్నారు.

వెంటనే ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ యువత డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోతీలాల్ నాయక్‌కు ఏమైనా జరిగితే రెవంత్ రెడ్డి సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. నిరుద్యోగులకు అండగా బిసి సమాఖ్య పోరాటం చేస్తుందని వారు తెలిపారు.

రెండు లక్షల ఉద్యోగాలిస్తామి ఊదరగొట్టిన రాహుల్ గాంధీ ఎక్కడ అని ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 02 2024, 14:00

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. మోదీపై అఖిలేష్ సెటైర్లు..

లోక్‌సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.

2024 ఫలితాల ద్వారా భారతదేశ ప్రజలు బాధ్యతతో కూడిన సందేశాన్ని ఇచ్చారన్నారు. ఓటర్లకు అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలు ఓడిపోయాయన్నారు.

భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకునేందుకు దేశ ప్రజలు ఓటు వేశారన్నారు. ప్రభుత్వ అహంకారాన్ని ప్రజలు ఓడించారన్నారు. ఈ ఎన్నికల్లో విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అన్ని అవాస్తవాలు చెబుతోందన్నారు.

ఇండియా కూటమి అధికారం చేపడితే తక్షణమే అగ్నివీర్ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. ఇండియా కూటమి అగ్నివీర్‌ను వ్యతిరేకిస్తోందన్నారు. ఎంతోమంది యువత ఆకాంక్షలను అగ్నివీర్ నెరవేర్చడం లేదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 02 2024, 13:57

డయాఫ్రం వాల్‌పై ఆందోళన వద్దు

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతినడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ నిపుణులు భరోసా ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతినడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ నిపుణులు భరోసా ఇచ్చారు. ఇలా దెబ్బతిన్న డయాఫ్రం వాల్స్‌కు తాము గతంలో మరమ్మతులు, ప్రత్యామ్నాయాలు సూచించామన్నారు. వాటికి అనుగుణంగా నిర్మించిన కట్టడాలు భద్రతాపరంగా బలీయంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. దీనికీ ప్రత్యామ్నాయాలు సూచిస్తామని హామీ ఇచ్చారు. అమెరికాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులు జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్‌ బి పాల్‌.. కెనడా నిపుణులు సీన్‌ హించ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీ సోమవారం వరుసగా రెండో రోజు కూడా ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు అతిథి గృహానికి చేరుకుని.. ప్రాజెక్టు కార్యాలయంలో గంటన్నర సేపు ఫిజియో మీటర్ల ద్వారా సీపేజీ తీవ్రత తెలుసుకున్నారు. దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. కేసింగ్‌ పైపులను ఎగువ కాఫర్‌ డ్యాం నడుమ పలు ప్రాంతాల్లో భూమిలో దింపి నీటిని పంపి పరీక్షలు నిర్వహించడం ద్వారా కాఫర్‌ డ్యాం లోపల భూగర్భంలో ఎన్ని మీటర్ల లోతు నుంచి ఎత్తు వరకూ సీపేజీ వస్తోందో చర్చించారు. ఇతర పద్ధతుల ద్వారా సీపేజీ తెలుసుకోవడానికి ఆస్కారం ఉందో లేదో పరిశీలించారు.

కేంద్ర జలసంఘం డిప్యూటీ డైరెక్టర్‌ అశ్విన్‌కుమార్‌, ప్రాజెక్టు సీఈ నరసింహమూర్తి, జలసంఘం శాస్త్రవేత్త మనీశ్‌ గుప్తా, జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆన్‌ ఆఫ్‌స్ర్టీమ్‌ కాఫర్‌ డ్యాం నిపుణుడు, ఆఫ్రి కన్సల్టెన్సీ సభ్యుడు సంపత్‌ పూర్తి వివరాలను తెలియజేశారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన చర్చల్లో కాఫర్‌ డ్యాం గ్యాప్‌ల పూడ్చివేత, సీపేజీ నివారణ అంశాలపై నిపుణులు మాట్లాడారు. అనంతరం కాఫర్‌ డ్యాంల మధ్య జరుగుతున్న వైబ్రో కాంపాక్షన్‌ పనులను స్వయంగా పరిశీలించి సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత భోజన విరామానంతరం అధికారులతో భేటీ అయ్యారు. ఇప్పటిదాకా నిర్మాణ సంస్థలు చేపట్టిన కట్టడాలకు సంబంధించి డిజైన్లు, వాటికి కేంద్ర జలసంఘం ఇచ్చిన అనుమతులు వంటివాటిపై సమీక్ష జరిపారు.

డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న తర్వాత.. పోలవరం ప్రాజెక్టు డిజైన్లకు ఆమోదం తెలిపేందుకు జల సంఘం జంకుతోంది. అయితే.. అలాంటి భయాలేమీ అక్కర్లేదని నిపుణులు సూచించారు. డయాఫ్రం వాల్‌ పునరుద్ధరణ సాధ్యమేనని.. అది కట్టాక దానిపై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం వేసేయవచ్చని తెలిపారు. మంగళవారం నిర్మాణ సంస్థలతో సమావేశమయ్యాక.. డయాఫ్రం వాల్‌, కాఫర్‌ డ్యాంల్లో సీపేజీపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టులో ఇప్పటిదాకా నిర్మించిన కట్టడాల డిజైన్లు, వాటి సామర్థ్యాలను కూలంకషంగా వివరించాలని నిపుణులు వాటికి సూచించారు. తర్వాత రాజమహేంద్రవరం బయల్దేరి వెళ్లారు.

ఇటీవల కుంగిన స్పిల్‌వే గైడ్‌ బండ్‌ను మంగళవారం వారు పరిశీలిస్తారని సీఈ నరసింహమూర్తి తెలిపారు. కాగా.. ప్రాజెక్టుల కీలక నిర్మాణాలపై అనుభవం కలిగిన అంతర్జాతీయ నిపుణులు.. దెబ్బతిన్న పోలవరం నిర్మాణాలపై భయపడాల్సిందేమీ లేదని భరోసా ఇవ్వడం జల వనరుల శాఖ అధికారులకు ఊరటనిచ్చింది. ఇక నిర్మాణాలపై ముందడుగు వేయడంపై దృష్టిసారించాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చీఫ్‌ ఇంజనీర్‌ రాజేశ్‌కుమార్‌, వ్యాప్కోస్‌ మేనేజర్‌ ఎస్‌కే పట్నాయక్‌, ఈఈలు మల్లికార్జునరావు, బాలకృష్ణ, పాండురంగయ్య, ప్రేమ్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు