/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz పేరుకే పెద్ద ఆసుపత్రి... వసతులు లేవు ...సిబ్బంది లేరు... అరకొర సేవలు: కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త Vijay.S
VijayaKumar

Jul 01 2024, 16:20

పేరుకే పెద్ద ఆసుపత్రి... వసతులు లేవు ...సిబ్బంది లేరు... అరకొర సేవలు: కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కొరతతో, సౌకర్యల లేమితో, అరకొర సేవలతో పేరుకే పెద్దాసుపత్రి గా ఉందని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా ఆసుపత్రిలోని సౌకర్యాలు, సిబ్బంది, సేవలను పరిశిలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిలో ముఖ్యంగా ఎక్స్ రే డిపార్ట్మెంట్ లో మిషన్ చెడిపోయి సుమారు ఒక సంవత్సరం కావస్తున్నా , దానిని బాగు చేయకుండా, డైరెక్టుగా ఎక్స్ రే తీస్తున్నారని, దీంతో రేడియాజిస్ట్ లకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ప్రతి రోజూ కేవలం 10 నుంచి 15 మంది వరకే ఎక్స్ రే సేవలు అందిస్తున్నారని, కానీ జిల్లా ఆస్పత్రికి రోజుకు సుమారు 40 నుంచి 50 మంది ఎక్స్ రే తీయించుకోవడానికి వస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో మరియు టీ హబ్ లో మరియు ఎమర్జెన్సీ లో మొత్తం కనీసం ఆరుగురు రేడియోలాజికల్ టెక్నీషియన్స్ ఉండాలి. కానీ ప్రస్తుతం ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఈ సీ జీ టెక్నీషియన్స్ కనీసం ఇద్దరు ఉండాలి, కానీ ఒక్కరూ కూడా లేరని , రేడియాలజిస్ఠ్ లతోనే ఈ సీ జీ తీయడానికి ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సీ జీ హాల్లో, ఎక్స్ రే హాల్లో తప్పనిసరిగా ఏసీ ఉండాలి కానీ ఏసీ ఉన్నా , అది పని చేయడం లేదని, ప్రస్తుతం పని చేస్తున్న టెక్నీషియన్స్ కి తప్పనిసరిగా టీ ఎల్డీ భ్యాడ్జెస్( రేడియేషన్ నమోదు తెలిపే పరికరం ) ఉండాలి , కానీ ఆసుపత్రిలో వాటి ఊసే లేదు. రోజుకు 24 గంటలు పనిచేసే టెక్నీషియన్స్ ఉపయోగించుకోవడానికి మరుగుదొడ్లు సైతం లేవంటే ఆసుపత్రి పరిస్థితి మనకు అర్థం అవుతుందని ఆయన అన్నారు. అటు ఎమర్జెన్సీ లోనూ, ఇటు టీ హబ్ లోనూ మరియు జిల్లా ఆసుపత్రిలోనూ ఉన్న టెక్నీషియన్స్ తోనే పని చేయించడం జరుగుతుందని ఆయన అన్నారు. వేలాది రూపాయలు ఆసుపత్రి నిర్వహణకు మంజూరైనా, కనీస వసతులు కల్పించకపోవడంలోనూ సిబ్బందిని నియమించడంలోనూ, రోగులకు మెరుగైన వైద్యం అందించడం లోనూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. భువనగిరి ఎమ్మెల్యే కుటుంబ అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి లు తక్షణమే స్పందించి, తగిన సిబ్బందిని నియమించాలని, సౌకర్యాలు మెరుగు పరచాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.

పనిచేయని పరికరాలు

VijayaKumar

Jul 01 2024, 15:25

ప్రొద్దుటూరు - లింగరాజుపల్లి గ్రామాల మధ్య బిటి రోడ్డు వేయాలి : సిపిఎం పోరుబాటలో నాయకులు డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని  ప్రొద్దుటూరు లింగరాజు పల్లి గ్రామాల మధ్యన ప్రజలకు రైతాంగానికి ఇబ్బందులకు గురి చేస్తున్న మట్టి రోడ్డును వెంటనే బీటి రోడ్డుగా మార్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు డిమాండ్ చేశారు సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుండి 30వ తేదీ వరకు చేపట్టిన పల్లె పల్లెకు సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా పొద్దుటూరు గ్రామంలో సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు గ్రామంలోని రైతాంగం తమ పొలాల వద్దకు వెళ్లే పొద్దుటూరు-లింగరాజు పల్లి గ్రామాల మధ్యన 3 కిలోమీటర్ల మేర ఉన్న మట్టి రోడ్డు గుంతల మాయమై తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తుందన్నారు నిత్యం ఈ రోడ్డువెంట వందలాది మంది ప్రజలు,రైతులు ప్రయాణం చేస్తుంటారని వెంటనే మట్టిరోడును బీటీ రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రొద్దుటూరు నుండి వర్కట్ పెళ్లికి వెళ్లే మూసి వంతెనపై గల తాత్కాలిక బ్రిడ్జిపై నూతన బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రొద్దుటూరు నుండి వర్కట్ పల్లి వరకు బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రామంలో అనేకమంది పేదలకు నేటికీ రేషన్ కార్డులు లేవని గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వక పోవడంతో తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదని వెంటనే రేషన్ కార్డులు లేని కుటుంబాల అందరికీ నూతన రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రొద్దుటూరు నుండి భీమ లింగం వరకు భీమ లింగం కాల్వ కట్టపై గల మట్టి రోడ్డు అధ్వానంగా మారిందని పొద్దుటూరు నుండి భీమలింగం వరకు రోడ్డు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని కోరారు ప్రొద్దుటూరు గ్రామంలో గల ఏనె గుట్టను ప్రభుత్వం తొలగించి రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఈర్లపళ్లి ముత్యాలు,మండల కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ ఏలే కృష్ణ, సిపిఎం శాఖ కార్యదర్శి పలుసం లింగం, సిపిఎం శాఖ సహాయ కార్యదర్శి పెద్ద బోయిన నరసింహ, నాయకులు గడ్డం సుదర్శన్,బత్తుల పురుషోత్తం,నర్సింహ,ముత్యాలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 01 2024, 15:18

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి: AISF

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామంలో సోమవారం  తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ను కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ , ఫీజు రీయింబర్సుమెంట్ నిధులు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7 వేల పైచిలుకు కోట్లు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలనీ, నిధులు ఇవ్వకపోవడం ద్వారా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కోర్సు పూర్తి చేసిన కూడా వారి సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు ఇవ్వడం లేదు. ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి ఇబ్బందికరంగా మారింది. కావున ఇట్టి విషయంలో మీరు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కృషి చేయగలరని కోరుతున్నాము అని అన్నారు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం అసెంబ్లీలో మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదల అయ్యేవిధంగా చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సిహెచ్ వంశీ, కళ్యాణ్, వినయ్ లక్ష్మి నివాస్ ,ఎస్ ఎస్ యు నాయకులు శివరాజ్, రాకేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

VijayaKumar

Jul 01 2024, 15:07

వలిగొండ: బిజెపి కార్యకర్తకు ఆర్థిక సహాయం అందజేసిన బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శివాజీ యువజన సంఘం సభ్యులు,బీజేపీ కార్యకర్త జోర్క వెంకటేశం గత కొంతకాలంగా అనారోగ్యపాలై ఒక కాలు తీసివేయడం జరిగింది ఇట్టి విషయం తెలుసుకున్న బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ గారు వారిని పరామర్శించి వారికి 10,000/- పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బోల్ల సుదర్శన్ ,బిజెపి జిల్లా నాయకులు దంతూరి సత్తయ్య , బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ , బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్ , బిజెపి మండల ఉపాధ్యక్షులు డోగుపర్తి సంతోష్ , దయ్యాల వెంకటేష్, కార్యదర్శి మందుల నాగరాజు, బీజేవైఎం భువనగిరి అసెంబ్లీ కోకన్వీనర్ బుంగమట్ల మహేష్.బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు రేగూరి అమరేందర్, మైసోల్ల మచ్చ గిరి ,బీజేవైఎం మండలాధ్యక్షులు రంజిత్ రెడ్డి కీర్తి వెంకటేశం. మాటూరి శివకుమార్ . బర్ల మల్లేష్. గుండా సందీప్ కుమార్, రేగు శ్రీధర్ , ఆవనగంటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 30 2024, 14:12

సుంకిశాల పాల సంఘం అధ్యక్షుని గా తుమ్మల సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకి శాల గ్రామంలో ఆదివారం  పాల సంఘం కార్యాలయంలో నూతనంగా పాలకవర్గం అధ్యక్షునిగా తుమ్మల సత్యనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇద్దరు డైరెక్టర్లను పోలేపల్లి బిక్షపతి ,ఇంజమూరి రమేష్ ఎన్నికల అధికారి పోలపల్లి శ్రీనివాస్ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైల్ల రాజ వర్ధన్ రెడ్డి, చెరుకు శివయ్య గౌడ్ ,ఈతాప రాములు ,మొగిలిపాక నరసింహ, మెట్టు కొండల్ రెడ్డి,రాజేందర్ రెడ్డి ,జగన్మోహన్ రెడ్డి ,స్వామి బాలకృష్ణ ,పరమేశ ,వీరస్వామి, అశోక్ ,బాల నరసింహ, జంగయ్య,ఎల్లస్వామి, మల్లేష్ గౌడ్ గ్రామ పెద్దలు ,పాల సంఘం సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.

VijayaKumar

Jun 30 2024, 12:30

వలిగొండ: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ మండల శాఖ అద్యక్షులు బోల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి సమాజానికి ప్రేరణ కలిగించే అంశాలతో తొలి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్, అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్ , బీజేపీ మండల నాయకులు డోగుపర్తి సంతోష్, దయ్యాల వెంకటేష్, మందుల నాగరాజు BJYM జిల్లా నాయకులు , మైసోల్ల మత్యగిరి ,రేగురి అమరేందర్ ,BJYM మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి ,కీర్తి వెంకటేశం, ఆనకంటి శివకుమార్,బర్ల మల్లేశం, గుండ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 29 2024, 17:49

రామానంద తీర్థ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : డాక్టర్. ఎన్ విహారి కృష్ణ ట్రైనింగ్ అధికారి

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ సంస్థ అందిస్తున్న సాంకేతిక శిక్షణా పరిజ్ఞానాన్ని, నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రామానంద తీర్థ ట్రేనింగ్ అధికారి డాక్టర్ ఎన్ విహారి కృష్ణ కోరారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లా లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహకారంతో స్వామి రామానంద తీర్థ సంస్థలో 15 రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లు నడుస్తున్నాయని ఆయన అన్నారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన యువతీ యువకులు జులై 08 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. సుమారు 6 మాసాల పాటు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ మరియు భోజన వసతి కల్పిస్తామని ఆయన తెలిపారు. శిక్షణ ముగిసిన వెంటనే ప్లేస్మేంట్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. శిక్షణ పొందిన నిరుద్యోగ యువతీ యువకులు రూపాయలు 12 వేల నుండి 18 వేల వరకు వేతనం పొందవచ్చని ఆయన అన్నారు . కేంద్ర ప్రభుత్వ ధీన్ దయాల్ ఉద్యోగ్ కౌన్సిల్ యోజన మరియు మేథా చారిటబుల్ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణలు పొందిన యువతీ యువకులు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచు కోవాలని ఆయన సూచించారు. సాయి యాదాద్రి సేవాశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు దెబ్బడి అశోక్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులను చైతన్యం చేసి, రామానంద తీర్థ ఆద్వర్యంలో ఇస్తున్న ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ పరిజ్ఞానాన్ని విస్తృత పరుస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా డైరెక్టర్ కొడారి వెంకటేష్, రామానంద తీర్థ మీడియా ఇంచార్జీ వై.ఎస్ చక్రవర్తి, ప్లేస్మేంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, యాదాద్రి సేవాశ్రమం డైరెక్టర్లు లింగం, రాజశేఖర్ పాల్గొన్నారు.

VijayaKumar

Jun 29 2024, 17:44

జూలై 15న నేతన్న గర్జన జయప్రదం చేయండి; తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్ పిలుపు

*మగ్గం నడవాలి నేతన్న బతకాలి* అనే నినాదంతో చేనేత వృత్తి రక్షణ కోసం , జూలై 7 నుండి 15 వరకు, నేతన్న పోరుయాత్రను జయప్రదం చేయాలని *తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీదర్* పిలుపు నిచ్చారు. శని వారం రోజున వృత్తి సంఘాల కార్యయం భువనగిరి లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా అధ్యక్షతన జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి *గంజి మురళీదర్* మాట్లాడుతూ, చేనేతకార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమకు గాని, కార్మికులకు గాని ఉపాధి ,అభివృద్ధి, సంక్షేమం కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గతంలో ఉన్న, నూలు సబ్సిడీ, నేతన్న బీమా,చేనేత కు చేయుత, పథకాలను నిలిపి వేసిందని అన్నారు. పనులు లేకఆర్ధిక ఇబ్బందుల్లో, ఇప్పటివరకు 8 మంది నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదు. సహకార సంఘాల లో కొనుగోలు చేసిన వస్త్రాలకు బకాయిలు చెల్లించలేదు. దీనితో వడ్డీల భారంతో అప్పుల్లో కూరుకు పోతున్నాయని అన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాల్సి ఉన్న 11 సంవత్సరాలు అయినా నేటికీ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం వెంటనే చేనేత కార్మికుల సంక్షేమానికి 2వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి అమలు చేయాలని, ప్రతి నేతన్న కుటుంబానికి 5 లక్షల పెట్టుబడి సహాయం ఇవ్వాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చే యాలని కోరారు.

పేరుకుపోయిన వస్త్రాల నిలువలను ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని 90 శాతం సబ్సిడీపై పట్టు నూలు పరికరాలు ఇవ్వాలని, వస్త్ర ఉత్పత్తి కేంద్రాలలో నూలు డిపోలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాలను రాష్ట్రంలో ఉత్పత్తి చేయించాలని కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో చేనేత మరియు కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ "మగ్గం నడవాలి నేతన్న బ్రతకాలి" నేతన్న పోరుయాత్ర జులై 7 న సిరిసిల్లలో ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 ముఖ్యమైన కేంద్రాలు చేనేత మరియు పవర్లూమ్ కేంద్రాల్లో బస్సు యాత్ర జరుగుతుందని జూలై 15న ఇందిరాపార్క్ దగ్గర నేతన్న గర్జన చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. *ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు, గౌరవ అధ్యక్షలు గోసిక స్వామి, ఉపాధ్యాక్షలు కూరపాటి రాములు, సీనియర్ నాయకులు కోడి బాలనర్సయ్య, రాజేష్, తదితరులు పాల్గొన్నారు* గుండు వెంకటనర్సు చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, 9912198591

VijayaKumar

Jun 28 2024, 18:32

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రణ చేయాలి: ఎర్ర నరేష్

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎస్ ఎస్ యూ మండల నాయకులు స్వేరో సర్కిల్ వాలంటరీ ఎర్ర నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రయివేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ చేయాలని, దాని కోసం చట్టం తేవాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయిననందున విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉండాలని, మధ్యాహ్నం బోజన పథకం సరిగ్గా అమలు చేయాలని, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, తాగు నీరు, మూత్ర శాలలు, ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో ఎర్ర బిక్షపతి, ఎర్ర శివ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

Jun 28 2024, 17:59

భువనగిరి : సూరేపల్లి కి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి: చిరంజీవి ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్

భువనగిరి జిల్లా కేంద్రం నుంచి సూరేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి బస్ స్టేషన్ కంట్రోలర్ లింగయ్య కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రం నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు , ప్రయాణికులు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. గత రెండు నెలల నుంచి సూరేపల్లి గ్రామానికి బస్సు రావడం లేదని, ఈనెల నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ ఆటోలలో ఇతర వాహనాల ద్వారా విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంబం అనిల్ కుమార్ రెడ్డి, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్ లకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. వారు స్పందించి సూరేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు చిరంజీవి తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామానికి చెందిన వెంకట నరసింహారెడ్డి , మురళి, ప్రభాకర్, నవీన్ ,మహేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.