/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండ : SFI పోరాట ఫలితంగా పర్మిషన్ లేకుండా ప్రారంభించిన శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల విద్యాధికారి Vijay.S
వలిగొండ : SFI పోరాట ఫలితంగా పర్మిషన్ లేకుండా ప్రారంభించిన శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల విద్యాధికారి

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ పట్టణంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తు పాఠశాల ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యాసంస్థలను మూసివేయలని ధర్నా చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు లు మాట్లాడుతూ శ్రీ చైతన్య పేరు చెప్పి అమాయక తల్లిదండ్రులను మోసం చేసి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారని,అడ్మిషన్ల కోసం బస్సులను అదేవిధంగా వాల్ రైటింగ్స్ రాస్తున్నారన్నారు, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గత 20 రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖ అధికారీ* *(DEO)గారికి , ,అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి( MEO)గారి దృష్టికి తీసుకువెళ్లి, వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు, విద్య అనేది అంగట్లో సరుకుగా మార్చి విద్యాశాఖ అధికారుల నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టానుసారంగా విద్యాసంస్థలను ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద లక్షల ఫీజులు తీసుకోవాలని చూస్తున్నారన్నారు,దీనిపై వెంటనే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా చేయగా మండల విద్యాధికారి ఎంఈఓ గారు స్పందించి శ్రీచైతన్య స్కూలుకు వచ్చి పాఠశాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు ఇది ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితమని పర్మిషన్ లేని పాఠశాలలు నడిపితే ఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలని, అదేవిధంగా పర్మిషన్ లేని పాఠశాలలకు అడ్మిషన్లు తీసుకోకుండా తల్లిదండ్రులు పిల్లలు ముందుగా జాగ్రత్తలు తీసుకొని, ఇలాంటి విద్యాసంస్థలను పర్మిషన్ ఇవ్వకుండా చూడాల్సిందిగా, అదేవిధంగా ఇలాంటి విద్యాసంస్థలకు పర్మిషన్ ఇస్తే సామాన్య ప్రజల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారన్నారు,విద్యను వ్యాపారంగా చేసుకోవాలని చూస్తున్న ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థలకు పర్మిషన్ ఇవ్వద్దని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మండల అధ్యక్షులు ఎండి,ఫర్దిన్ పట్టణ అధ్యక్షులు మైసొల్ల,నరేందర్ దుబ్బ,శివ,సాయి,యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: గీత కార్మికులకు సేఫ్టీ మోకులు వెంటనే అందించాలి: చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్ మాటూరి బాలరాజు గౌడ్

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం భువనగిరి మండల కమిటీ సమావేశం పాండాల మైసయ్య అధ్యక్షతన వృత్తిదారులభవన్ బుదవారం రోజున భువనగిరిలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్ ,మాటూరి బాలరాజు గౌడ్ మాట్లాడుతూ గీతా కార్మికులకు అనేక ఏళ్లుగా వృత్తి చేస్తూ ,ప్రమాదాలకు లోనై ఏటా వందలాది మంది చనిపోతున్నారని ,వాటిని నివారించడానికి ప్రభుత్వం సేఫ్టీ మోకులు అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని ,వెంటనే గీతా కార్మికులకు సేఫ్టీ మోకులు అందించి గీత కార్మికులను రక్షించాలని డిమాండ్ చేశారు . గత రెండు సంవత్సరాలుగా తాటి చెట్ల పైనుండి పడి మరణించిన, శాశ్వత వికలాంగులైన, గీత కార్మికులకు. రావలసిన ఎక్స్ గ్రేషియా , మరియు గీతా కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన తాత్కాలిక పరిహారము ,వెంటనే అందించాలని భువనగిరి మండలంలో మంది చనిపోయిన. 12మంది మరియు ఎనిమిది మంది శాశ్వత వికలాంగులైన వారు ,తాత్కాలిక పరిహారము అందించకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారని, తక్షణమే ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులకు ,ప్రభుత్వము వృత్తి పింఛన్లను ఇవ్వడంలో గత రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుందని. 50 సంవత్సరాలు నిండిన వృత్తి పింఛన్లకు అర్హులైన గీతా కార్మికులు రెండు సంవత్సరాలు పైబడి ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకొని కనులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని వెంటనే గీతా కార్మికులకు పెన్షన్లను ప్రభుత్వం ప్రకటించిన విధంగా ,పెంచి తక్షణమే రెగ్యులర్ గా పెన్షన్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నూతనంగా గ్రామాలలో గీత వృత్తిలో పనిచేస్తున్న వారికి ,కొత్త సభ్యత్వము గుర్తింపు కార్డులు, ఇవ్వాలని ఎన్నికల కోడ్ పేరుతో ఆపివేసిన ,గీతా కార్మికులకు నూతన సభ్యత్వాలనే తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు . గత ప్రభుత్వము గీతా కార్మికులకు ఇస్తానన్న ఉచిత బైక్ లను ప్రతి గీత కార్మిక కుటుంబానికి అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జూలై,ఆగస్టు . మాసాలలో అమరుల యాది లో కల్లుగీత కార్మిక ఉద్యమంలో, వృత్తి రక్షణ సంక్షేమం కొరకు హక్కుల కొరకు పోరాడిన, మహనీయులు.. బొమ్మగానిధర్మభిక్షం, తొట్లమల్సూరు,, బైరుమల్లయ్య, సూదగాని యెట్టయ్య, లాంటి అనేకమంది అమరవీరులని ,సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ గ్రామ గ్రామాన కల్లుగీత కార్మిక ఉద్యమంలో అమరులైన మహనీయులని, జ్ఞాపకం చేసుకుంటూ సభలు నిర్వహించనున్నామని వీటిని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పాండాల మైసయ్య, మట్ట బాలరాజు, రంగా కొండల్, గడ్డమీది సోములు, కొండ అశోక్, మచ్చ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ జిల్లా కమిటీ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ జిల్లా కమిటీ భువనగిరి ఆలేరు, చౌటుప్పల్ మూడు డివిజన్ల సభ్యుల ఏకాభిప్రాయంతో మంగళవారం ఎన్నుకున్నారు జిల్లా కమిటీ కన్వీనర్ గా మేకల యాదగిరి

కో కన్వీనర్ అల్లి మహేష్ ను ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షులుగా కోమల్ల స్వామి ,వలిగొండ

ఉపాధ్యక్షులుగా  పర్ష బంగారయ్య ,ఆలేరు

కార్యదర్శి కూరపాక కరుణాకర్

సహాయ కార్యదర్శి బల్లం అశోక్

ప్రధాన కార్యదర్శి ఆడేపు బిక్షపతి

కోశాధికారి యూసుఫ్

నెంబర్లు : కనుక స్వామి, భీమిని నరసింహ, బండారి నర్సింగరావు, నూనె హనుమంతు, వల్లాల బాలమని ,బంగారు ఎల్లమ్మ, మరాఠీ లక్ష్మీనరసింహ, శీను ,పత్తి ఆదిలక్ష్మి, మూల వెంకటయ్య, పిట్టల సత్యనారాయణ, కానుల బాలమ్మ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

.

భువనగిరి : అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తున్న గదిని ఎన్ ఎస్ యు ఐ నాయకులకు ఫిర్యాదుతో సీజ్ చేసిన ఎంఈఓ

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ హైస్కూల్లో అక్రమంగా పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందున తల్లిదండ్రులు NSUI నాయకులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు NSUI నాయకులు గౌతమ్ మోడల్ స్కూల్ ఆవరణలో తనిఖీ చేయగా పుస్తకాలు అమ్ముచున్న గదిని సందర్శించి కలెక్టర్, డీఈవో గార్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి ఎంఈఓ గారిని స్కూల్ వద్దకు పంపించి పుస్తకాలు విక్రయిస్తున్న గదిని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా NSUI జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో అక్రమంగా పుస్తకాలను విక్రయిస్తున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అలాంటి స్కూళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎన్ ఎస్ యు ఐ అండగా ఉంటుందని ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి మహేందర్, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు, జిల్లా కార్యదర్శి పాండాల శరత్, పట్టణ ఉపాధ్యక్షులు కార్తీక్, ఎండి. అసద్, అబ్దుల్, కౌశిక్, సద్దామ్, జలీల్,ఫిరోజ్, ప్రసాద్, తేజ తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి : హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ గా కంచి హరీష్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా  హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ యాదాద్రి భువనగిరి జిల్లా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా కంచి హరీశ్ నియామక మయ్యారు. ఆ కమిషన్ రాష్ట్ర అధ్యక్షులు పోకల సాయికుమార్ ఆయనకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం  నియామక పత్రం అందజేశారు. జాతీయ అధ్యక్షులు ఎండీ ముజాహిద్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల కోసం నిరంతరం పోరాడాలని సూచించారు.

యాదాద్రిలో గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యాదగిరిగుట్టలో *ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు* స్వాతి నక్షత్రం సందర్భంగా సుమారు 10 వేల మందితో సామూహిక గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ గిరిప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జై బోలో లక్ష్మీనరసింహస్వామి అంటూ,భజనలు చేస్తూ,యధా ఋషి వద్ద నమస్కరించి గిరి ప్రదక్షిణ ముందుకు సాగింది విగ్రహం వద్ద నమస్కరించి ఈ గిరిప్రదక్షిణ కొనసాగించారు. గిరి ప్రదక్షిణ అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని సర్వదర్శనం క్యూలైన్లో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించారు.

జూలై 7న వరంగల్ లో జరిగే 30 ఏళ్ల మాదిగల ఆత్మ గౌరవ కవాతును జయప్రదం చేయండి: దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ ప్రెస్ మీట్ సమావేశంలో దుబ్బ రామకృష్ణ మాదిగ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ...రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు ఎస్సీ లోని అన్ని ఉప కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా పంపిణీ జరగాలని అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటాలకు పురుడు బోసిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించి జులై 7 నాటికి గౌరవ *శ్రీ మంద కృష్ణ మాదిగ**గారి నాయకత్వంలో ఏర్పడి నేటికీ 30 సంవత్సరాలు కావస్తుందని తెలిపారు. ఎమ్మార్పీ ఉద్యమం ఆవిర్భవించిన నాటి నుండి కేవలం మాదిగల కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల ప్రజా సమస్యల మీద వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్ల పెంపు కోసం మరియు గుండె జబ్బు చిన్నారుల ఉచిత వైద్యం కోసం చేసిన పోరాటమే ఆరోగ్యశ్రీ కార్డు రూపకల్పనకు దారి దీసిందని తెలిపారు ఎమ్మార్పీఎస్ చేసిన పోరాటమే సమాజంలో అన్ని వర్గాలకు మేలు కలిగిందని తెలిపారు తమ లక్ష్య సాధనైనా ఎస్సీ వర్గీకరణకు అతి త్వరలోనే నూతనంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

జులై 7 నాటికి ఎమ్మార్పీ శ్రేణులు గ్రామ మండల పూర్తిస్థాయి కమిటీలను పూర్తిచేసుకుని నల్ల షర్టు బ్లాక్ పాయింట్తో డ్రెస్ కోడ్ తో జూలై 7న వరంగల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతుకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా మాదిగ పల్లెలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ వరంగల్ కేంద్రానికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సందెలు శ్రీనివాస్ మాదిగ యాకర్ నరసింహారావు మాదిగ ఇటుకల దేవేందర్ మాదిగ బాల నరసింహ మాదిగ జాంగిర్ మాదిగ పాముకుంట్ల బసవయ్య మాదిగ మాజీ సర్పంచ్ బిక్షపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల సంఘాల సమాఖ్య దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి : కొడారి వెంకటేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు

తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాట్కొ) దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య సమావేశం ఆదివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీ యూత్ హాస్టల్లో జరిగింది. ఈ సమావేశంలో క్యాట్కో రాష్ట్ర కమిటీ నాయకులు వేముల గౌరీ శంకర్ రావు, శంకర్ లాల్ చౌరాసియా, ఏలే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతనంగా రాష్ట్రంలో రైతు వినియోగదారుల సంఘాలు, మహిళా వినియోగదారుల సంఘాలు, పిల్లల, వృద్ధుల, మరియు వికలాంగుల వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి వాళ్లలో చైతన్యం తీసుకువచ్చి గ్రామస్థాయిలో వినియోగదారుల సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సంస్థ ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా ఆగష్టు 10,11-2024 రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు "ఆహ్వాన కమిటీ సభ్యులను" ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దశాబ్ది ఉత్సవాల ముఖ్య భాద్యతలు రాష్ట్ర ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు అప్పగించారు. ప్రతి ఒక్క వినియోగదారుల సంఘం బాధ్యులు నూతన వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయడానికి కృషిచేయాలని సూచించారు. ఆగస్టు 10,11 న నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను విజయవంతం కావడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు . ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంపత్ కుమార్(రంగారెడ్డి ), ఎస్ రమేష్ బాబు(మేడ్చల్), సిహెచ్ గురవయ్య (నల్లగొండ), పి సోమయ్య(యాదాద్రి భువనగిరి), షేక్ సైదా, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు( సూర్యాపేట), ఏ మట్టయ్య ,ఎండి ముస్తాఫా, ఎండి నజీర్ పాష, కట్ట మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ చామలను కలిసిన ఔరవాణి గ్రామ కాంగ్రెస్ నాయకులు

నకిరేకల్ :   భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఔరవాణి గ్రామ కాంగ్రెస్ నాయకులు నడిగోటి శేఖర్, ముప్పిడి రవి, ముక్కముల నాగరాజు, సింగం నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: హనుమపురం నుండి అనంతారం, తాజ్పూర్ గ్రామాలకు బిటి రోడ్డు మరమ్మతులు తక్షణమే చేపట్టాలి : సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ డిమాండ్

హన్మాపురం నుండి అనంతరం, తాజ్ పూర్ గ్రామాల వరకు ధ్వంసమైన బీటీ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం సిపిఎం హన్మాపురం గ్రామశాఖ ఆధ్వర్యంలో గుంతలు పడి ప్రజలకు ఇబ్బంది అవుతున్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని నూతన రోడ్డును వేయాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ హన్మాపూర్ మీదుగా అనంతరం నుండి బీబీనగర్, తాజ్ పూర్ నుండి బొమ్మలరామారం వివిధ గ్రామాలకు సంబంధించిన అనేకమంది ప్రయాణికులు కార్మికులు విద్యార్థులు వృత్తిదారులు రైతులు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉన్నదని రోడ్డు మొత్తం ధ్వంసమై వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ అధికారులు పలుమార్లు రోడ్డు విషయంలో వారి దృష్టికి తీసుకుపోయిన గత నాలుగైదు సంవత్సరాలుగా పట్టించుకోవడంలేదని గత ఎమ్మెల్యే గారు కూడా రోడ్డు విషయంలో పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్డు ప్రజలందరికీ వివిధ గ్రామాల ప్రజలకు ప్రధాన రోడ్డుగా మారిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ మధ్యకాలంలో గెలిచిన స్థానిక శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ తక్షణము స్పందించి రోడ్డును పరిశీలన చేసి గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి మరోమారు బీటీ రోడ్డును వేయాలని నర్సింహ డిమాండ్ చేసినారు. 15 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే మూడు గ్రామాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, సహాయ కార్యదర్శి బండి శ్రీను, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి దయ్యాల మల్లేష్, సిపిఎం నాయకులు గ్రామ ప్రజలు తోటకూరి నాగరాజు, తోటకూరి గణేష్, కుసుమ మధు, పైళ్ల సత్తిరెడ్డి, ముద్దం చంద్రయ్య, కమ్మ బాలయ్య, శీను, అరిగే సంజీవ, సోమ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.