/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz మూసి పరివాహక ప్రాంతంలో ఏ గ్రేడ్ కిందనే ధాన్యం కొనుగోలు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ Vijay.S
మూసి పరివాహక ప్రాంతంలో ఏ గ్రేడ్ కిందనే ధాన్యం కొనుగోలు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్


రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు గోస పడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టదా!! ప్రజల ఓట్లు వేయించుకోవడమే కాదు!! రైతుల గోస కూడా పట్టించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రోజున వలిగొండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం బృందం పరిశీలించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా మార్కెట్లలో రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు రైతుల గోస ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టదా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో రైతులను ప్రభుత్వం తీవ్రమైన మోసం చేస్తుందన్నారు రైతులు పండించిన పంటకు 'ఏ గ్రేడ్' ఇవ్వకుండా 'బి గ్రేడ్' కింద కొనుగోలు చేయడం రైతాంగానికి తీవ్రమైన అన్యాయమన్నారు వెంటనే బి గ్రేడ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఒకవైపు ప్రభుత్వం, వాతావరణ శాఖ వర్షాలు రాబోతున్నాయని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఇంకా అనేక గ్రామాల్లో దాన్యం కుప్పలు, కుప్పలుగా కొనుగోలు జరపకుండా మిగిలిపోయిందన్నారు అకాల వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కొనుగోళ్లు వేగవంతం చేయాలని లారీల కొరతను,గన్ని బ్యాగుల కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల మధ్య సరైన సయోధ్య లేకపోవడంతో ఇద్దరి మద్య రైతులు నష్టపోతున్నారన్నారు తరుగు పేరుతో క్వింటాల్ కు 5 కిలోల చొప్పున మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ప్రభుత్వానికి తెలియదా?? అని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వెంటనే ఏలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతు సమస్యలపై పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కల్కూరి రామచంద్రర్, మెరుగు వెంకటేశం, వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ మండల కమిటీ సభ్యులు ఏలే కృష్ణ, కలుకూరి ముత్యాలు, కందడి సత్తిరెడ్డి,SFI జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు,సిపిఎం మండల నాయకులు వేముల నాగరాజు,కొమ్ము స్వామి,దయ్యాల సత్యరాములు, కందగట్ల సాయిరెడ్డి,వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెం వద్ద 2015లో శంకుస్థాపన చేసి నిర్మించిన 565 డబల్ బెడ్ రూమ్ లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ డిమాండ్ చేశారు. బుధవారం సింగన్నగూడెం లోని డబల్ బెడ్ రూమ్ లను పరిశీలించి పనుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసిందన్నారు. ఓట్ల రాజకీయాలతో వారికి పట్టాలు ఇచ్చిన ఇండ్లు కేటాయించలేదన్నారు. కోట్ల రూపాయల సంపదతో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ వినియోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తపరిచారు. త్రాగునీరు డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలన్నారు. డబల్ బెడ్ రూమ్ ల వద్ద రక్షణ లేకపోవడంతో ఆ ఇంటి కిటికీలను డోర్లను దొంగలు ఎత్తుకు పతున్నారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు నామమాత్రంగా పరిశీలించారని తప్ప పరిష్కరించలేదన్నారు. డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ఐక్యం చేసి నిరసన తెలుపడంతో పాటు ఆ గదులను వాటికి పట్టాల ప్రకారం కేటాయించి గృహప్రవేశం చేయిస్తామని హెచ్చరించారు. దీంతో సంపద నష్టపోకుండా ఉండడమే కాకుండా వినియోగంలోకి వస్తుందని జహంగీర్ తెలిపారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధలు మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ కాలనీకి ప్రభుత్వం నుండి వెంటనే నిధులు కేటాయించి డ్రైనేజీ తాగునీరు ఏర్పాటు చేయించాలన్నారు. చేసిన వెంటనే లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలన్నారు. లబ్ధిదారుల కేటాయించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో వారికి కేటాయించి గృహప్రవేశం చేయిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఎమ్మెల్యేలు ఈ విషయంపై స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, నాయకులు బందెల ఎల్లయ్య, అన్నంపట్ల కృష్ణ, చింతల శివ పాల్గొన్నారు.

యాదాద్రి జిల్లా గూడూరు జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల నిరసన
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని గూడూరు వద్ద జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు నిరసన చేపట్టారు.
భువనగిరి బస్ స్టేషన్ లో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలి: కొడారి వెంకటేష్ వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు


దొంగలు బాబోయ్ దొంగలు*.... *సెల్ ఫోన్లు, పర్సులు, బైకులు మాయం* *పట్టించుకోని అధికారులు* *సీ సీ కెమెరాలు, పోలీసు ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్ నిత్యం ముప్పై నుంచి నలబై వేల మంది ప్రయాణికులతో నిండి ఉండే భువనగిరి బస్ స్టేషన్లో దొంగల బెడద రోజు రోజుకు పెరిగి పోతుంది. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం తో మహిళల రద్దీ ఎక్కువ అవడంతో దొంగలు, తమ పనిని సులువుగా చేసుకుంటూ పోతున్నారు. గత మూడు నెలల కాలంలోనే ముప్పై కి పైగా దొంగ తనాలు కేవలం భువనగిరి బస్ స్టేషన్ లోనే జరిగాయని తెలుస్తోంది. చాలా మంది బాధితులు పోలీసులకు పిర్యాదు చేయకుండానే వెళుతున్నారు. ప్రధానంగా పోలీసు స్టేషన్ అందుబాటులో లేకపోవడం, పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకుంటారనే నమ్మకం లేకపోవడం, బస్ స్టేషన్ లో పోలీస్ ఔట్ పోస్ట్ లేకపోవడం వల్ల బాదితుల పిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. అద్దెల రూపంలో ప్రతి నెల పది లక్షల రూపాయిల ఆదాయం ఉన్నా, ఆర్టీసీ అధికారులు కనీసం ఇద్దరు హోం గార్డులను నియమించుకునే స్థితిలో లేరంటే, ప్రయాణికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం అవుతుంది. జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్ స్టేషన్ లో కేవలం ఒకే ఒక్క సీ సీ కెమెరా ఉండడం, అది కూడా పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం గమనార్హం. *ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరచాలి* కొడారి వెంకటేష్ *వినియోగదారులు సంఘం జిల్లా అధ్యక్షుడు* భువనగిరి బస్ స్టేషన్ లో తగినన్ని సీసీ కెమెరాలు, పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసి దొంగల బారినుండి ప్రయాణికులను రక్షించాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. భువనగిరి బస్ స్టేషన్ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రైవేటు వాహనాలు, ముఖ్యంగా ఆటోలు లోనికి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన


యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు. సురేపల్లి తండా సర్పంచ్ (కుమారుడు) కేతావత్ సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో తరలిన గిరిజన రైతులు. రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలనీ కోరారు.

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి

స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి lచామల కిరణ్ కుమార్ రెడ్డి , పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవిఎం బాక్స్ లను భువనగిరి లోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మంగళవారం భద్రత మద్యన ఉన్న స్ర్టాంగ్ రూములను పరిశీలించారు . ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోత్నక్ ప్రమోద్ కుమార్, స్పోక్స్ పర్సన్ వచన కుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు.

గోపరాజుపల్లి లో 79 శాతం పోలింగ్ నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 79 శాతం పోలింగ్ నమోదయింది. గ్రామంలో ఉన్న 788 ఓట్లకు 626 ఓట్లు పోలయ్యాయని గ్రామపంచాయతీ సెక్రటరీ ఎం లక్ష్మీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ వనం జనార్దన్, ఆశా వర్కర్ నీలం నీరజ, షేక్ జహంగీర్  జూనియర్ లైన్మెన్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి: పోలింగ్ బూత్ 65 ,91 లలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు, ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ పంగరెక్క స్వామి ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ

దేశ వ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ భువనగిరి నియోజకవర్గం పట్టణ పరిధిలోని 65 , 91 బూత్ నెంబర్లలో పట్టణ 8 వ వార్డు కౌన్సిలర్ పంగరెక్క స్వామి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు మరియు మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పోలింగ్ కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూత్ ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు భారీగా భద్రతను మోహరించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్థానిక 8వ వార్డు జంఖాన్నగూడెం , రామ్ నగర్ , సీతానగర్ లలో ఓటర్లు కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉచిత మందులను ఓఆర్ఎస్ ప్యాకెట్లను , మంచినీటి సదుపాయాన్ని పోలింగ్ బూత్ ల వద్ద ఏర్పాటు చేశారు. ఓటర్లు క్యూ పద్ధతిలో నిలబడి నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఓటర్లకు , పోలింగ్ సిబ్బందికి , పోలీసులకు , మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంగరెక్క స్వామి , కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయన సబిత గోపాల్ , డాక్టర్లు సాయి పవన్ , ఎ యన్ యం టి. ప్రేమలత , ఇంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.

వలిగొండ మండల పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రాచకొండ సిపి తరుణ్ జోషి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి సందర్శించారు .వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 250, 252 ,255,256 పోలింగ్ బూత్ లను మరియు టేకుల సోమవారం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 213 ,214 పోలింగ్ బూత్ లను సందర్శించారు . పోలింగ్ సరళిని పరిశీలించి, పోలీసులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, వలిగొండ ఎస్సై డి మహేందర్, పోలీసులు ,తదితరులు పాల్గొన్నారు.


వేములకొండ లో ఓటు హక్కు వినియోగించుకున్న జై స్వరాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నరేంద్ర వేముల

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న జై స్వరాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నరేంద్ర వేముల. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అప్రాజ్యసమితంగా జరుగుతున్నాయని అన్నారు. పది రోజుల నుండి ఓటర్లకు మద్యం ,డబ్బులు పంపిణీ చేసినారని అన్నారు. సి విజిల్ యాప్ సరిగా పనిచేయలేదని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతామని తెలియజేశారు.