/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz రైతులు ఎవరు అధర్యపడవద్దు: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య Vijay.S
రైతులు ఎవరు అధర్యపడవద్దు: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


రైతులు ఎవరు అధైర్య పడవద్దని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు . రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య . అలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆకాల వర్షం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోవడం చాలా బాధాకరమన్నారు. ఉదయం యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ కు *ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య*  ఫోన్ చేసి మాట్లాడారు.మిల్లర్లు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని,లారీలను కేంద్రాలకు పంపించి వడ్లు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ధైర్యం నింపి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించారు.
అకాల వర్షం వల్ల నష్టపోయిన వరి ,మామిడి రైతులను ఆదుకోవాలి, మామిడి , వరి రైతులకు నష్టపరిహారం అందించాలి: దయ్యాల నరసింహ సిపిఎం మండల కార్యదర్శి


యాదాద్రి భువనగిరి జిల్లాలో  కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు తీవ్రంగా నష్టపోయిన రైతులను, మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఐకెపి కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే కదలాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహ డిమాండ్ చేశారు.* *బుధవారం రోజున సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గారి గెలుపును కోరుతూ హన్మాపురం, వడపర్తి, పెంచికల్పహాడ్ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఐకెపి కేంద్రాల్లో ,ఉపాధి హామీ కేంద్రాల్లో సందర్శించి ప్రచారం నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఆరుగాలం కష్టం చేసి పండించిన వరి ధాన్యాన్ని ఐకేప్ కేంద్రాల్లో పోసి ఉన్న దాన్యం పూర్తిగా తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని అదేవిధంగా రాలిపోయిన మామిడి కాయలను, పడిపోయిన మామిడి చెట్లను పరిశీలించి మామిడి రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి మామిడికాయలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల మామిడి చెట్లు మామిడికాయలు నేలరాలిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 10 లక్షల పైన పెట్టుబడి పెట్టి నష్టపోయారని అన్నారు. బలమైన ఈదుర గాలుల వల్ల అనేక చెట్లు నేలమట్టం అయ్యాయని చెప్పారు . తక్షణమే మావిడి తోట రైతులను ఆదుకోవడం కోసం ఎకరాకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వ యంత్రాంగం జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి పంట నష్టపరిహారాన్ని అందించడానికి పర్యటన చేయాలని డిమాండ్ చేశారు.* *గ్రామాలలో ఇండ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోవడం ,పాత ఇండ్లు పోవడం వలన ఆస్తి నష్టం ఇంట్లో దాచుకున్న బియ్యం తడిసి నష్టం జరిగిందని అన్నారు అనేక చోట్ల చెట్లు కూలి కరెంటు లైన్ స్తంభాలు పడిపోయాయని , ఇండ్ల పైకప్పులు లేచిపోయి ఇంటిలో ఉన్న వంట సామాగ్రి బియ్యం బట్టలు పూర్తిగా తడిసి ముద్ద అయ్యయని అన్నారు. ఈదురుగాలుల వల్ల కరెంటు స్తంభాలు కూలి రాత్రంతా కరెంటు లేక బిక్కుబిక్కుమంటూ మేల్కొని ఉన్నారన్నారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల్లో పోసి ఉన్న ధాన్యం పూర్తిగా తడిచాయని తడిచిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించిధన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ వ్యవసాయ అధికారులు కలిసి కలిసి నష్టపోయిన వరి ధాన్యం రాలిపోయిన మామిడి పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.* *ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, మాజీ ఎంపిటిసి దయ్యాల లక్ష్మి, పాండల మైసయ్య, మోటే ఎల్లయ్య, వడ్డెబోయిన వెంకటేష్ ,కొండాపురం యాదగిరి ,బండి శ్రీను, కళ్లెం లక్ష్మీ నరసయ్య ,దయ్యాల మల్లేశం, పాండాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని  అరూరు గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కాశపాక యాదయ్య వడదెబ్బ కారణంగా మరణించడం జరిగింది వారి కుటుంబానికి మండల నాయకులు మాజీ ఎంపీపీ చిట్టెడి జనార్దన్ రెడ్డి గారు 3000 రూపాయలు మరియు తుమ్మల నర్సయ్య సేవా సమితి 5000 రూపాయలు తుమ్మల శ్రీనివాస్ అధ్వర్యం లో ఆర్థిక సహాయాన్ని అందజేసినారు .ఈ కార్యక్రమంలో నరసయ్య గూడెం తాజా మాజీ సర్పంచి తుమ్మల దామోదర్ , కిసాన్ సెల్ జిల్లా నాయకులు బండారు నరసింహరెడ్డి , సింగిల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి, మండల ఓబీసీ అధ్యక్షులు చిలుకమర్రి కనుక చారి మాజీ సర్పంచ్ జునుకల దానయ్య మరియు పోలే పాక చేమ్మయ్య మాజీ ఎంపిటిసి పోలేపాక చంద్రయ్య తుమ్మల మధు గారు గౌడ సంఘం అధ్యక్షులు కళ్లెం బాల శంకర్ యూత్ మండల నాయకులు బండి రవి స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య వార్డు తాజా మాజీ సభ్యులు ఆవుల చంద్రకళ సత్యనారాయణ వేముల శాంతమ్మ ఎట్టయ్య కృష్ణ సంజీవ తదితరులు పాల్గొన్నారు
గోపరాజుపల్లి లో జోరుగా కాంగ్రెస్ ఇంటింట ప్రచారం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ - సిపిఐ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపరాజు పల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ఉపాధి హామీ కూలీలకు వివరించారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి మాట్లాడుతూ... బిజెపి మతాల మధ్యన చిచ్చు పెడుతూ రాముని పేరిట ఓట్లు అడుగుతున్నారని అన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను పాటిస్తూ పాలన కొనసాగిస్తున్నారని ఈ ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపరాజు పల్లి మాజీ ఉపసర్పంచ్ ఎనుగుల ఐలయ్య, మాజీ అధ్యక్షులు పులగూర్ల లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలకూర మల్లేశం, మండల నాయకులు కీసర్ల మహేందర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్, యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి, మాజీ వార్డ్ మెంబర్ సలిగంజి నరసింహ, వల్లమాల బిక్షపతి, రుద్రపల్లి గోరయ్య, కట్ట మల్లేశం, ఎర్ర బిక్షపతి ,ఎర్ర భూపాల్, కైరం కొండ ముత్తిలింగం, పొలబోయిన రాములు, కోమటిరెడ్డి పద్మా రెడ్డి, వల్ల మల్ల రాజు ,కేతం సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి : నారీ ఐలయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వెంటనే వీడి అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు లు డిమాండ్ చేశారు బుధవారం రోజున సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కురిసిన అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు ఒకవైపు దాన్యం మార్కెట్లలోకి రైతులు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా వాటిని కొనుగోలు చేసి మార్కెట్ ల నుండి తరలించడంలో ప్రభుత్వం నుండి తీవ్రమైన జాప్యం జరగడం వల్లనే రైతులకు ఈ పరిస్థితులు వచ్చాయన్నారు మండలంలో అనేక గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం ఇంకా నిలువ ఉందని దీనివల్ల నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం తో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు ప్రభుత్వం మిల్లర్ల మధ్య రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం మిల్లర్లకు గోదాములను కేటాయించడం లేదని పేరుతో మిల్లర్లు ధాన్యాన్ని ప్రభుత్వం నుండి కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం వెంటనే మిల్లర్లతో చర్చించి ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని లారీల కొరతను నివారించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కమిటీ సభ్యులు కల్కూరి ముత్యాలు,సిపిఎం శాఖ కార్యదర్శి కల్కూరి వాసు, సిపిఎం నాయకులు వేముల జ్యోతిబసు,లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.


ప్రజలందరికీ ఉచిత విద్యా - వైద్యం కోసం పోరాడుతా: జై స్వరాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నరేంద్ర వేముల

పేద ధనిక తేడా లేకుండా అందరికీ విద్యా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వాలదే అని భువనగిరి పార్లమెంట్ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థి నరేంద్ర వేముల అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం కోసం  సరిపడు నిధులు కేటాయించడానికి పార్లమెంటులో పోరాడుతామని చౌటుప్పల్ పరిధిలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి మునుగోడు నియోజకవర్గ మొత్తం గ్రౌండ్ వాటర్ పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ రికార్డ్స్ లలో మైంటైన్ చేయించుటకు పోరాడతామని అన్నారు. రైతులు వడ్ల అమ్ముటలలో తూకంలో జరుగుతు మోసాలను అరికడతానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు 70 సంవత్సరాలుగా ప్రజలని మోసం చేస్తూ వారి గుర్తులు ఈవీఎంల మీద మొదట సీరియల్ నెంబర్ కేటాయించడం ఆర్టికల్ 14 ఉల్లంఘన అని, హైకోర్టులో కేసు వేసామని , ప్రధాన పార్టీలు తారతమ్యం లేకుండా సీరియల్ నెంబర్ కేటాయించాలని తెలిపారు. కలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈనెల 9న భువనగిరి కి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాక


యాదాద్రి భువనగిరి జిల్లా ఈనెల 9తేదిన భువనగిరి కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానుండడంతో  సభా ప్రాంగణాన్ని  డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పరిశీలించారు .భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తేది:09/05/2024 నాడు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు *అమిత్ షా భారీ బహిరంగ సభకు హాజరైతున్న సందర్భంగా భువనగిరి పట్టణ పరిధిలోని రాయిగిరి గ్రామ సమీపంలో సభా ఏర్పాట్లను స్థానిక నేతలు బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి,పాశం భాస్కర్, పడాల శ్రీనివాస్,గార్లతో కలిసి పర్యవేక్షిస్తున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బిజెపి ఎంపీ అభ్యర్థి *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బహిరంగ సభ, సభా స్థలాన్ని ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ కు కంచుకోట : డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు

బిజెపి వ్యాపారుల పార్టీ, రైతుబంధు పథకం పై కొంతమంది ఫిర్యాదు చేశారు .భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ కు కంచుకోట సేవా భావం కలిగిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి బిజెపి వ్యాపారస్తుల పార్టీ బిజెపికి ఓటు వేస్తే వృధా అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమాలు అన్నారు. మంగళవారం ఆయన చౌటుప్పల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతాంగ సోదరులందరికీ అమల్లో ఉన్న రైతు బీమా, రైతు బంధం పథకం కింద 7624 కోట్లు మంజూరు చేసాం. కొంతమంది సీఎం పైన ఫిర్యాదులతో అవి నిలిచిపోయాయి. భువనగిరి లోక్సభ స్థానం ఎప్పుడూ కాంగ్రెస్కు కంచుకోట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం రావడానికి ఈ ప్రాంత ఓటర్లు అత్యధికమంది ఎమ్మెల్యేలను గెలిపించి పంపించారు. ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలను మహారాణులుగా చూస్తుంది. డ్వాక్రా మహిళల కు అయిదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం కింద వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి డ్వాక్రా మహిళ లకు వడ్డీలేని రుణాల కింద చెక్కులు పంపిణీ చేశాము అన్నారు. మూడు నెలల్లోనే 30వేల మంది నిరుద్యగులకు ఉద్యోగాలు కల్పించాం అన్నారు. మూసి కాలువలు మరమ్మతు చేయాలని నిర్ణయించి తెలిపారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు బాగుండాలంటే భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓవైపు, మోడీ అదానీ అంబానీ మరోవైపు నిలుచున్నారని తెలిపారు. ఈ దేశ సంపద ఇక్కడి ప్రజలకు ప్రజలకే పంచాలని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు రిజర్వేషన్లు రద్దు చేసేందుకు 400 సీట్లు ఇవ్వాలని బిజెపి కోరుతుందని తెలిపారు. సేవా భావం కలిగిన వ్యక్తి యువజన సంఘంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకుడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మే 13న ,జూన్ 4న వేతనంతో కూడిన సెలవు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. ఎన్నికల ఫలితాల తేదీ అయిన జూన్ 4న వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేసింది.* కాగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎన్నికల అధికారులు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న ఒకే దశలో జరుగుతాయి. మొత్తం ఏడు దశల్లోని ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. రాష్ట్రంలో వేడిగాలుల కారణంగా 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గంట వరకు పొడిగించబడింది. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో భాగమైన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లకు మే 13న రెండుసార్లు పోలింగ్ జరగనుంది. ఇందులో ఒకటి ఎంపీ, రెండోది ఎమ్మెల్యే ఓటు వేయాల్సి ఉంటుంది.. కాగా.. ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఎన్నికల కోసం 3,986 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 23,500 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఓటు ఉన్న వారు వచ్చి ఓటు వేయాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం హెచ్చరించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని సూచించారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తూ ప్రకటన విడుదల చేశారు.
భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు


నిరంతరం ప్రజల తరఫున, కూలీల, రైతుల తరుపున నిలబడుతూ సమస్యల పరిష్కారానికై , వారి హక్కుల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ ని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామంలో పనిచెస్తున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని దగ్గరికి వెల్లి కూలీల దగ్గర ప్రచారం నిర్వహించడం ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె చట్టం వచ్చిందని అన్నారు. నేడు బిజెపి 10 సంవత్సరాల పాలనలో ఉపాధి హామీ పథకంకు ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు బిజెపి ప్రభుత్వం చేస్తున్నది వారు విమర్శించారు. కొన్ని జిల్లాలకి పని చూపాలని, కూలీల సంఖ్యను తగ్గించాలని, పని దినాలు వేతనాలు తగ్గించాలని ప్రయత్నం చేస్తుందని అన్నారు. చట్టంలో ఉన్న మౌలిక సమస్యలు కూడా అమలు చేయడం లేదని ఆవేదన వెలుబుచ్చారు. కొత్త కొత్త జీవోలు తెచ్చి కూలీలను అయోమయంలో నెడుతున్నారని సరిగా బిల్లులు విడుదల చేయకపోవడం, రెండుసార్ల ఫోటో తీసే విధానం, బ్యాంకుకు ఆధార్ లింకు ఇలాంటివి కూలీల పోట్టగొట్టే విధంగా బిజెపి తీసుకొస్తున్న విధానాలు ఉన్నాయని అన్నారు. కూలీలంతా బిజెపిని ఓడించకపోతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉండదని అందుకే పోరాడే సిపిఎంను గెలిపించాలని నరసింహ కూలీలను కోరినారు. మరో పక్క బీజేపీ అధికారంలో వచ్చినాకనే ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతున్నారని ఇలాంటి బీజేపీని మళ్లీ అధికారంలో రాకుండా ప్రజలందరూ చూడాలని కోరినారు. నిరంతరం కూలీల కోసం రైతుల కోసం పేదల కోసం ఈ ప్రాంతం తాగు తాగునీరు విద్యా వైద్యం అభివృద్ధి కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని నర్సింహ ప్రజలను కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, గ్రామ కమిటీ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, నాయకులు ఎండి. జహంగీర్, బొల్లెపల్లి కిషన్, పాండు, నర్సింహ, బొల్లెపల్లి పరమేష్, కళ్లెం లక్ష్మీ, నరసయ్య, మైలారం శివ, తోటకూరి మల్లేష్ ,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు గంటెపాక శివ తదితరులు పాల్గొన్నారు.