/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
చంచల్‌గూడ జైలుకు బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్
చంచల్‌గూడ జైలుకు బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్, 14 రోజులు రిమాండ్ విధించిన జడ్జి. ఓయూ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ కేసులో నిన్న క్రిశాంక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. BRS సోషల్ మీడియా కన్వీనర్‌గా ఉన్న క్రిశాంక్.. ఆరు సెక్షన్ల కింద క్రిశాంక్‌పై కేసు నమోదు.
పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా పిలుపు:సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి సతీష్
పార్లమెంట్ ఎన్నికలలో ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలని మేడే సందర్భంగా పిలుపు
సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్
138వ మేడే సందర్భంగా దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మతోన్మాద బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 138 వ మే డే 1 సందర్భంగా కలివేరు మాజీ వార్డ్ మెంబెర్ బొర్ర సమ్మక్క అధ్యక్షతన జరిగిన కలివేరు గ్రామం లో సతీష్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడు లుగా నిర్మించి కార్మికులకు తీరం ద్రోహం చేసిందని అన్నారు. బిజెపి పది సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలు ఎల్ఐసి,ఎయిర్ పోర్ట్, ఓడరేవులు, రోడ్డు మార్గాలను పెట్టుబడిదారులైన అదాని,అంబానిలకు అప్పనంగా కట్టబెట్టిందన్నారు. నేడు దేశం లోమైనార్టీలు, క్రిస్టియన్లు, ఆదివాసీలు, గిరిజనులు, ఇతర వెనకబడ్డ వర్గాల పైన బీజేపీ-ఆర్ఎస్ఎస్ మతం పేరుతో దాడులు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో మరొక్కసారి మోడీ అధికారంలోకొస్తే ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ ఉండదని, రైతాంగం పైన ఆర్థిక దాడి జరుగుతుందని, కార్పొరేట్ కంపెనీలకు దేశంలోని అడవులు, ఖనిజ సంపదనంత అప్పచెబుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చికాగో అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సప్కా నగేష్ లక్ష్మి అశోక్, రవి సమ్మక్క వీరన్న బాబు సంతోష్ పండు అభినస్ తదితరులు పాల్గొన్నారు.
చెరువు సొసైటీలలో ముదిరాజులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు హర్షనీయం- టీ ఆర్ ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్
చెరువు సొసైటీలలో ముదిరాజులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు హర్షనీయం- టీ ఆర్ ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్, హైకోర్టు లాయర్ డీ ఎల్ పాండు ముదిరాజ్
ఎంతో కాలంగా రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో బెస్త వారున్న సొసైటీ లలో ముదిరాజ్ లకు నూతన సభ్యత్వాల నమోదుల్లో కొత్తగా చెరువు సొసైటీ ల ఏర్పట్లలో ఏర్పడుతున్న ఇబ్బందులపై ఈ రోజు రాష్ట్ర హైకోర్టు ముదిరాజులకు అనుకూలంగా తీర్పునివ్వడం హర్షనీయమని టీ ఆర్ ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ముదిరాజ్, హైకోర్టు లాయర్ డీ ఎల్ పాండు ముదిరాజ్ లు హర్షం వ్యక్తం చేశారు... చెరువు సొసైటీలు నూతన సభ్యత్వాల విషయంలో ముదిరాజ్, బెస్త కులాల మధ్య నెలకొన్న ప్రతిష్టంబనపై రాష్ట్ర హైకోర్టు సమగ్రంగా విచారించి ముదిరాజులకు న్యాయం జరిగేలా చేసిందని వారు పేర్కొన్నారు.. దీనివల్ల రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో నూతన సొసైటీలు సభ్యత్వాలు విషయంలో ప్రతిస్థంభన తొలగిపోనుందని వారు తెలిపారు.. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు వచ్చే నాలుగు నెలల్లో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి మరియూ ప్రభుత్వ మత్స్యశాఖ కార్యదర్షి లు సమగ్ర నివేదికను అందించేలా తీర్పు నిస్తూ... ముదిరాజులకు న్యాయం జరిగేలా హైకోర్టు చొరవ చూపిందని ... ఈ తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న పేద బలహీన ముదిరాజులకు న్యాయం జరుగుతుందని వారన్నారు... ఈ సందర్భంగా టీ ఆర్ ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ నాగయ్య ముదిరాజ్ లు మాట్లాడుతూ ముదిరాజుల న్యాయమైన హక్కుల పై ఎన్నో ఏళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా డీ ఎల్ పాండు ముదిరాజ్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన సేవలను అభినందించారు.. గత కొన్నెండ్లుగా తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాము మరియూ ఇతర కుల సంఘాలు చేసిన పోరాటాలు,కృషి ఫలితంగానే రాష్ట్ర హైకోర్టు ముదిరాజులకు న్యాయం చేసేలా తీర్పునిచ్చిందని వారు అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం
చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు
రేపు నామినేషన్ల పరిశీలన
ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
వచ్చే నెల 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్
ఏపీలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు
అసెంబ్లీ స్థానాలకు 3,300కు పైగా నామినేషన్లు దాఖలు
తెలంగాణలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు
TS:మానవత్వం చాటుకున్న అడ్డగూడూర్ పోలీసులు.....
మానవత్వం చాటుకున్న అడ్డగూడూర్ పోలీసులు.....
అంబులెన్స్ రాక లేటు అవడంతో డయల్ 100 వాహానంలోనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు....
నేడు అడ్డగూడూర్ మండల పరిధిలోని ఆజీంపేట గ్రామానికి చెందిన పండుగ సాయిలు ,కన్నేబోయిన యాదగిరి వారు ద్విచక్ర వాహనం పై నకిరేకల్ నుండి వ్వవసాయ పనులు ముగించుకుని ఆజీంపేట గ్రామానికి వస్తుండగా అదే మండల పరిధిలోని చౌళ్ళ రామారం గ్రామానికి చెందిన తురికపాటి మత్య్సగిరి నకిరేకల్ పట్టణానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరగా మార్గమధ్యంలో అయిన మానాయికుంట గ్రామంలోని నూతన ఫ్లై ఓవర్ (బ్రిడ్జి ) పై ఇరు ద్విచక్ర వాహనాలు డీ కొట్టుకోవడంతో ఆజీంపేట గ్రామానికి చెందిన పండుగ సాయిలుకు తలకు బలంగా గాయాల అయ్యాయి,యాదగిరి కి పాదాల దగ్గర బలంగా గాయాలు అయ్యాయి.అలాగే మత్యగిరికి చిన్నపాటి గాయాలు అయినట్టు సమాచారం...గాయాలు అయి అంబులెన్స్ కు సమాచారం చేరవేయడంతో అంబులెన్స్ రావడానికి సమయం పడుతుందని తెలిసిన అనంతరం వెంటనే డయల్ 100 కి పోన్ చేయడంతో వెంటనే అడ్డగూడూర్ యస్ఐ నాగరాజు ఆదేశాల మేరకు ప్రమాదం జరిగిన సంఘటన స్థాలానికి చేరుకున్న పెట్రోల్ పోలీసులు అడ్డగూడూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించడం జరిగింది.సమయానుకులంగా స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల బృందానికి మండల ప్రజలు అలాగే డ్యూటిలో ఉన్న పోలీసులకు కంభం పరుశరాములు,పల్ల విజయ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.గతంలోకూడ వలిగొండ తొర్రూరు రహదారిపై కూడా ఇలాగే ప్రమాదం జరిగితే నాడు కూడా అంబులెన్స్ రావడానికి సమయం పడుతుందని తెలియడంతో నాడు పోలీసులు 100 వాహనంలోనే ప్రమాద జరిగిన బాధితులను తరలించిన విషయం తెలిసిందే.
విజయవాడ: వైయస్ జగన్ పై రాళ్లదాడి కేసులో నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు
విజయవాడ: సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. సింగ్ నగర్ పీఎస్‌కు తరలింపు.. ఈరోజు నుంచి మూడు రోజులపాటు సతీష్ ను విచారించినన్న పోలీసులు.
సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్
సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్
| కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెరిగాయి. బస్‌యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు
తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం..
‘ఆ నాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. ఈ జిల్లాల్లో మంత్రులున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా ఇక్కడ ఉన్నడు. వీళ్లు దద్దమ్మల్లా పోయి నాగార్జునసాగర్ కట్టపై కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి అప్పగించారు. మీరంతా కళ్లారా చూశారు. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా. 1956 నుంచి ఈ నాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. 56వ సంవత్సరంలో ఏపీలో కలిపి 58 సంవత్సరాలు అనేక రకాలుగా గోసపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మొన్న ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చింది. నోటికి మొక్కాలి అన్ని హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి మనకు అవస్థలు తెచ్చిపెడుతున్నారు. రైతుబంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడుతా అని ఒక మంత్రి మాట్లాడుతున్నడు. చెప్పులు మీకే లేవు రైతులకు కూడా ఉంటయ్, వాళ్ల చెప్పులు చాలా బందబస్తుగా ఉంటయ్ అని నేను చెప్పిన’ అంటూ గుర్తు చేశారు కేసీఆర్.
దద్దమ్మలు సాగర్‌ను కేంద్రం చేతుల్లో పెట్టారు..
‘బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో 18 పంటలకు ఏమాత్రం వెనుకాముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టంతా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించాం. ఇవాళ ఈ రోజు ఏమైంది? సాగర్‌లో నీళ్లు ఉండే.. ఇవ్వగలిగే అవకాశం ఉండే. ఈ దద్దమ్మలకు దమ్ములేక.. ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్‌ఎంబీ చేతులో పెట్టి పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినయంటే ఇదే మొదటిసారి. రైతుబంధులో ధగా.. రైతుబీమా ఉంటదో ఊడుతదో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు పోని కరెంటు కటుక బంద్‌చేసినట్లే మాయమైంది. ఎక్కడికి పోయింది కరెంటు ? ఏమైంది కరెంటుకు ? వీళ్లు కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వి పని చేయాల్సిన అవసరం లేకున్నా కేసీఆర్ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు రాజ్యమేలుతున్నరు. కరెంటు ఎందుకు ఆగమవుతుంది’ అంటూ రేవంత్ సర్కారును కేసీఆర్ ప్రశ్నించారు.
ప్రజలను ఎందుకు బాధపెడుతున్నరు ?
‘ప్రజలను ఎందుకు బాధలుపెడుతున్నరు? మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేం చేశాం. ఆ మాత్రం మీకు చేయచేతనైతలేదా? సరఫరా జరిగిన కరెంటును అలాగే ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? మిషన్ భగీరథతో మంచినీళ్లు తెచ్చి అర్బన్ ఏరియాలో.. మున్సిపల్ ఏరియాలో అన్నివర్గాల పేదలకు దొరకాలని ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చాం. ప్రతి ఇంట్లో నల్లా బిగించి ప్రతి ఇంటికీ నళ్లా నీరందించాం. ఇవాళ మిషన్ భగీరథ ఎందుకు నడుపలేకపోతున్నరు. మీ తెలివితక్కువ తనం ఏందీ? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఆ నాడు నీళ్లకోసమే గోస. నాలుగైదు నెలలకే.. కేసీఆర్ పక్కకు జరుగంగనే ఎందుకు మాయమై పోయినయ్ ? ఎందుకు బాధపడుతున్నరు ? సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌ను తిట్టాలి పబ్బం గడుపుకోవాలి..
‘ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కేసీఆర్‌ను తిట్టడం ఒకటే పని. కేసీఆర్‌ను తిట్టాలి పబ్బం గడుపుకోవాలి తప్పా.. పంటలు ఎండబెట్టారు.. రైతుబంధు ఎగొట్టారు.. రైతుబంధు ఐదెకరాలు అని మాట్లాడుతున్నారు. ఏం పోయింది మీ అబ్బసొత్తా ? ఇచ్చేందుకు మీకు ఏం బాధైంది. ప్రభుత్వం సహాయం లేకుండా ప్రపంచంలో ఎక్కడా రైతులు వ్యవసాయం చేయడం లేదు. దాన్ని గమనించే భారతదేశంలో తొలిసారిగా రైతులకు అండగా ఉండాలని, అప్పులు తీరాలని బడ్జెట్ నుంచి రూ.15వేలు-రూ.16వేలకోట్లు పెట్టి రైతుబంధు ఇచ్చాం. నేను వస్తుంటే ఆర్జాలబావి దగ్గర బస్సును రైతులు ఆపారు. సార్ 20 రోజులైంది ధాన్యం తెచ్చి ధాన్యం కొనడం లేదని చెప్పారు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి ? బీఆర్‌ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోదీ వడ్లు కొన అని మొండి కేస్తే.. ముఖ్యమంత్రితో సహా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా చేసి.. నరేంద్ర మోదీ మెడలు వంచి.. మా తెలంగాణ పండిస్తున్నది. న్యాయంగా కొనాలి అని చెప్పి కొనుగోలు చేసేలా చేశాం. మద్దతు ధర రూపాయి తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో వేశాం’ అన్నారు.
TS: కెసిఆర్ కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నా.. నువ్వు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే చర్చకు రా..? నీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రా..? హరీష్ రావు.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండు.. రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తా.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాం-సీఎం రేవంత్‌రెడ్డి
May 02 2024, 13:26