నరేంద్ర మోడీ పాలన దేశానికి చాలా అవసరం : బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి
నరేంద్ర మోడీ పాలన దేశానికి చాలా అవసరం
- కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ఎంపీ అభ్యర్థి నీ గెలిపించాలి
- బూర నర్సయ్య గౌడ్ నీతి నిజాయితీపరుడు
-బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి*
దేశానికి నరేంద్ర మోడీ పరిపాలన ప్రస్తుత పరిస్థితిలో చాలా అవసరమని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భువనగిరి పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి అయిన బూర నర్సయ్య గౌడ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. బూర నర్సయ్య గౌడ్ నీతి నిజాయితీపరుడని,అవినీతి మచ్చలేని నాయకుడని కొనియాడారు. ప్రపంచంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపిన అలుపెరుగని నాయకుడు నరేంద్ర మోడీ అని, ఆయన పరిపాలన దేశానికి చాలా అవసరమని అన్నారు.హిందువుల చిరకాల కోరిక అయిన రామ మందిరం నిర్మాణం నరేంద్ర మోడీ తోనే సాధ్యమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పడమే కాకుండా వ్యాక్సిన్ తయారు చేసి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునే విధంగా మోడీ చూశాడని అన్నారు. ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా ఐదవ స్థానంలో ఉందని,త్వరలో మోడీ ఆధ్వర్యంలో మూడవ స్థానానికి చేరుకుంటుందని అన్నారు.

నరేంద్ర మోడీ పాలన దేశానికి చాలా అవసరం




యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ఆదివారం ముదిరాజుల ఆరాధ్య దైవం అయిన శ్రీ శ్రీ శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి వార్షిక బ్రహ్మ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కళ్యాణo నిర్వహించి అనంతరం డప్పు చప్పుళ్లతో, భాజా భాజంత్రీలతో శివశత్త్తులతో. మహిళలు ఘనంగా బోనాలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోళ్ల శ్రీనివాస్, సోమనబోయిన సతీష్ కుల నరసింహ, కుందారపు కొమురయ్య, చెరకు శివయ్య, బోళ్ల రాం చెంద్రమ్, సతీష్, కాసుల వెంకన్న, మాటూరు రాజు, బోళ్ల భాస్కర్ , కూర రవీందర్,కూర వెంకటేష్, తాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




అవకాశవాద బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ను ఓడించండి


Apr 29 2024, 20:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
74.9k