NLG: కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన యువకులు
నల్లగొండ: పట్టణంలోని 30, 41 వ వార్డులకు చెందిన 80 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు ఈరోజు నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి ముందు కౌన్సిలర్ కేసానీ వేణుగోపాల్ రెడ్డి వార్డు నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరీ రమేష్, యువజన కాంగ్రెస్ నల్గొండ అసెంబ్లీ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బాబా పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నాగార్జున గౌడ్, మహేష్ అలియాస్ కోటి, వెంకటేష్, శరత్, గురువేందర్, హనీఫ్, సంకీర్తన్ రెడ్డి, అరుణ్, అఖిల్, వినీత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
SB NEWS NALGONDA DIST
Apr 08 2024, 20:59