నాంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నాంపల్లి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షులు దాచేపల్లి నర్సింహా ఆధ్వర్యంలో శనివారం, పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా దాచేపల్లి నర్సింహా మాట్లాడుతూ.. ఏప్రిల్ 6,1980 లో ఏర్పడిన పార్టీ ఎందరో కార్యకర్తల, నాయకుల బలిదానాల పునాదులపై నిర్మితమై, ఏకాత్మ మానవతావాదం , అంత్యోదయ ఆలంబనగా క్రమశిక్షణ, అంకుటిత దీక్ష, అంకితభావానికి ప్రతిరూపమై దేశాభివృద్ధి యజ్ఞంలో నిరంతరాయంగా నిమగ్నమై, దేశానికి పూర్వవైభవం తెచ్చి, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడమే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు.
మొదటి సారిగా కేవలం 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన పార్టీ నేడు 300 పైగా ఎంపీ స్థానాల్లో గెలిచి దేశంలో దాదాపు 19 రాష్ట్రంలో అధికారం సాదించుకొని దేశ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నదని అన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పోగుల వెంకటరెడ్డి, చిరుమామిళ్ల గిరి, దుదిమెట్ల సత్యం, సింగారం గిరి, బీజేవైఎం అధ్యక్షులు నాంపల్లి సతీష్, వేలాద్రి,సాంభశివ, లక్ష్మయ్య,కోట మల్లేష్, లింగస్వామి, శ్రీధర్ రెడ్డి, శంకర్, శ్రీకాంత్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
SB NEWS TELANGANA
Apr 06 2024, 23:34