/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz పులిగిల్ల ప్రాథమిక పాఠశాలలో మద్యం సేవించిన ఆకతాయిలు... పైపులైన్ కనెక్షన్లు ధ్వంసం Vijay.S
పులిగిల్ల ప్రాథమిక పాఠశాలలో మద్యం సేవించిన ఆకతాయిలు... పైపులైన్ కనెక్షన్లు ధ్వంసం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 28.03.2024 గుడ్ ఫ్రైడే కారణంగా ప్రాథమిక పాఠశాల సెలవు కావడంతో గ్రామంలో కొంతమంది అల్లరి మూకలు కల్లు (మద్యం ) సేవించి,నీళ్ల మోర్టారు పైపు కనెక్షన్లు విరగట్టడం జరిగింది.ఈ మన పాఠశాల ఎందరికో ఉన్నత విద్యను,ఉన్నత స్థాయి కల్పించి బంగారు భవిష్యత్తు ఇచ్చిన,ఆధునిక దేవాలయం,రెండవ అమ్మఒడి లాంటి మన ప్రాథమిక పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటు, వారిని గుర్తించి హెచ్చరించగలరని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పాఠశాల సెలవు రోజులలో ఎవరైనా గ్రౌండ్లో కనిపించినట్లయితే వెంటనే వారిని హెచ్చరించి తిరగనివ్వకుండా చూడగలరని గ్రామ పెద్దలను,గ్రామపంచాయతీవారినీ,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయు బృందం వారు కోరుతున్నారు

పులిగిల్ల లో బొడ్డు నరసింహ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్


వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సిపిఎం నాయకులు బొడ్డు నరసింహ గారు అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండీ జహంగీర్ గారు వారితో పాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, మాటూరు బాలరాజు, పులిగిల్ల మాజీ సర్పంచ్ కొమ్మిడి లక్ష్మారెడ్డి, దొడ్డి బిక్షపతి, వేముల చంద్రయ్య ,ఆనంద్, ముత్తయ్య అమరేందర్ ,యేసయ్య ,మారబోయిన ముత్యాలు, వేముల నాగరాజు, జ్యోతిబాసు తదితరులు పాల్గొన్నారు.

దుప్పల్లి గ్రామంలో కీసర స్వామి మృతి ,నివాళులర్పించిన సిపిఐ నాయకులు


వలిగొండ మండలంలోని దుప్పల్లి గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు కీసర్ స్వామి నిన్న సాయంత్రం మరణించినారు వలిగొండ సిపిఐ మండల సమితి వారి పార్థ దేహంపై జెండా కప్పి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఎలగందుల అంజయ్య మాట్లాడుతూ స్వామి చిన్ననాటి నుండి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ చివరి వరకు ఎర్రజెండా పార్టీని వదిలిపెట్టకుండా నిస్వార్ధమైన జీవితాన్ని గడిపి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ దుప్పల్లి గ్రామంలో ఎంతోమంది కమ్యూనిస్టు పార్టీ పోరాటకు పట్టిన కలిగిన వ్యక్తులు ఈ గ్రామంలో ఉన్నారు నేటి యువతరం కూడా వారి ఆదర్శాలను తీసుకుని యువత చైతన్య మార్గంలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, సలిగంజి వీరస్వామి, ఎల్లంకి మహేష్,నరిగే యాదయ్య,కట్ల యాదగిరి,యాస జనార్దన్ రెడ్డి,సుద్దాల సాయికుమార్, కవేటి సుధాకర్,సలిగంజి కృష్ణ కుమార్,పలుసం సోమల్లు,నోముల నర్శయ్య,కన్నబోయిన పృథ్వీరాజ్, ఎర్ర కిరణ్,మామిడికాయల నరేష్, మునుగోటి చంద్రం, ఎర్ర నిఖిల్, అంతటి రాము,తదితరులు పాల్గొన్నారు.

సాయి యాదాద్రి సేవాశ్రమం నాలుగవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయండి: దెబ్బడి అశోక్ ప్రెసిడెంట్, జే వై శెట్టి సెక్రటరీ


 యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలోని వృద్ధాశ్రమం లో శనివారం జరిగే సాయి యాదాద్రి సేవాశ్రమం నాల్గవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని సేవాశ్రమం అధ్యక్షులు దెబ్బడి అశోక్, ప్రధాన కార్యదర్శి జే వై శెట్టి లు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి యాదాద్రి సేవాశ్రమం నాలుగు వసంతాలు పూర్తి చేసుకోని ఐదవ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా వారు దాతలకు , శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించి, నిరుపేదలైన విద్యార్థులకు చేయూత నందించి సేవలందిస్తున్నామన్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు భగవద్గీత పారాయణం, పదకొండు గంటలకు వికలాంగులకు నిత్యావసర వస్తువులు, ఔషదాలు, మరియు దుప్పట్ల పంపిణీ, మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎలక్ట్రానిక్, మరియు ప్రింట్ మీడియా మిత్రులకు ప్రమాద భీమా పత్రాలను పంపిణీ చేస్తామన్నారు. గ్రామ ప్రజలు, అభిమానులు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

రామన్నపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కన్నెబోయిన జ్యోతి


రామన్నపేట మండల ప్రజాపరిషత్ అద్యక్షురాలు కన్నెబోయిన జ్యోతి మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా . ఇట్టి రాజినామా పత్రమును జిల్లా పరిషత్ సి.ఇ.ఒ కి అందజేయడం జరిగింది. అట్టి రాజీనామాను ఆమె సానుకూలంగా స్పందించి ఆమోదించడం జరిగింది. ఇట్టి రాజీనామా కి కారణం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా నాలుగున్నర సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి.లింగయ్య సహకారంతో తన వంతు కృషిగా మండలంలో చాలా అభివృద్ధి పనులు చేయగా. మొన్న జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో అధికార పార్టీ ఎంపీటీసీలు తనపై దుష్ప్రచారం చెసి ఒక బీసీ మహిళ అని చూడకుండా తనను ఎగతాళి చేశారు. కొన్ని పార్టీల నాయకులకు మింగుడు పడక అధికార దాహంతో బిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను అధికార పార్టీ వాళ్ళు . అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ మూడు నెలల్లో ఒక పదవి కక్షతో తనను ఎన్నో విధాలుగా మహిళా అని చూడకుండా సర్వసభ్య సమావేశంలో అవహేళన చేశారు.

దానికి గాను ఆమె మానసిక ఆందోళన ఎన్నో ఇబ్బందులకు గురై రాజీనామా చేశారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన మండల ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి వెంట పాల్గొన్నవారు జనంపల్లి ఎంపిటిసి వేమవరపు సుధీర్ బాబు. సూరారం ఎంపీటీసీ దోమల సతీష్ యాదవ్. మునిపంపుల ఎంపిటిసి గాదె పారిజాత. రామన్నపేట ఎంపీటీసీ-1 గోరిగే నర్సింహ. తదితరులు పాల్గొన్నారు.

నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి: బుర్రు అనిల్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు


భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ 19వ మహాసభలు మండల కేంద్రంలోని ప్రగతి కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశం వేముల జ్యోతిబాసు అధ్యక్షత వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత బిజెపి సర్కార్ నూతన జాతీయ విద్యా విధానం 2022 ని తీసుకొచ్చి దేశ మేదస్సును కార్పోరేట్లకు తాకట్టు పెట్టే ప్రయత్నం సరైన కాదన్నారు ఈ విద్యా విధానం వల్ల విద్యార్థులలో మతతత్వ భావజాలాన్ని నింపటానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు విద్యాసంస్థలలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తరగతి గది నుండి కలుషితం చేయటానికి విద్యా విధానం ధోపడుతుందన్నారు పేద విద్యార్థులను దేశ అభివృద్ధిలో వారి మేధస్సును భాగస్వామ్యం చేయాల్సిన ప్రభుత్వాలే విద్యార్థుల ఐక్యతను దెబ్బతీసే విధంగా రెచ్చగొడుతూ ఈ విద్యా విధానం రాజ్యాంగ లక్షణాలను విద్యావిధానాన్ని ఏర్పాటు చేయకుండా వారి ఇష్టానుసారంగా విద్యా విధానాన్ని అమలు చేయడం సరైన కాదు అన్నారు

ఈ మహాసభల్లో మండల అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు ఎస్ కే ఫర్దిన్ ఎన్నికయ్యారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మండల సహాయ కార్యదర్శి బుగ్గ ఉదయ్ కిరణ్ వేములకొండ వంశీ మైసోళ్ళ నరేందర్ పట్టణ కార్యదర్శి సాయి,జశ్వంత్ నేహా తదితరులు పాల్గొన్నారు.

మొగిలి పాక గ్రామంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో.

 శ్రీ భ్రమరాంబిక కేతమ్మ సహిత మల్లికార్జున స్వామి మరియు.ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినారు. గుడి చైర్మన్ గంట హరికృష్ణయాదవ్ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల నూతన గుడి నిర్మాణానికి స్థలదాత ముద్దసాని నరసింహారెడ్డి మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి మాజీ సర్పంచ్ ముద్దసాని శశికళ కుటుంబ సభ్యులకు శాలువాతో సన్మానం చేసిన్నారు. మరియు ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ దాత మెరుగు గోపాల్ యాదవ్ భార్య చైతన్య లత కుటుంబ సభ్యులకు మైసమ్మ అమ్మవారి విగ్రహ దాత మామిడి సత్తిరెడ్డి కుటుంబ సభ్యులకు గుడి నిర్మాణానికి విరాళాధాత పులిపలుపుల రాములు గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.

 వారికి శాలువతో సన్మానం కార్యక్రమం నిర్వహించి భగవంతుని తీర్థప్రసాదాలు వేద పండితుల ద్వారా అందజేసినారు.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లు ఐలయ్య. గొర్ల కాపరి సంఘం చైర్మన్ దూదిమెట్ల బాలరాజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మర్ల మల్లయ్య మాజీ సర్పంచి జక్కుల శంకరయ్య. భీమనబోయిన బిక్షపతి. మర్ల మల్లేశం యాదవ్ సంగం అధ్యక్షులు. అధిక సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

బిజెపి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బోళ్ళ సుదర్శన్


భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోళ్ళ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని CN రెడ్డి కాంప్లెక్స్ లో మండల పదాధికారుల సమావేశంను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ గెలుపు కొరకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, కేంద్ర పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని వారు అన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు,కావున తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో లేని BRS కు ఓటు వేసిన ,రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు నెరవేర్చు తానని తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటు వేసిన ఓటు వృధా అవుతుంది కావున  భువనగిరి పార్లమెంట్ ప్రజలు బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ కు ఓటు వేసి గెలిపించాలని అని అన్నారు,

పార్లమెంట్ అభివృద్ది బీజేపీ కే సాధ్యం అని ఈ సందర్భంగా వారు అన్నారు అదేవిధంగా ఇటీవల నూతనంగా నియమితులైన మండల పధాది కారులకు ,మోర్చా అధ్యక్షులకు పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను, మోర్చా కమిటీలను ఏర్పాటు చేసి బూర నరసయ్య గౌడ్ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడే లింగస్వామి, ఉపాధ్యక్షులు డోగుపర్తి సంతోష్, గంగాదారి దయాకర్, వట్టిపల్లి సంతోష్, కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, మండల కార్యదర్శి మందుల నాగరాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంతం రామచంద్రం, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వేలిమినేటి వెంకటేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిన్నం అంజమ్మ ,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొలుగుల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

మోత్కూరు ఎంపీడీవో కార్యాలయం పై ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన పంచాయతీ కార్యదర్శి


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామ పంచాయతీ సెక్రెటరీ కిరణ్. ఓ వ్యక్తి ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేశారు రూపాయలు 3000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సెక్రెటరీ కిరణ్. ఇదివరకే రూపాయలు 5000 ఇచ్చిన బాధితుడు.

పాము కాటుతో పదవ తరగతి విద్యార్థి మృతి


పాము కాటుతో ఓ పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల మమత, కుమార్ ల కుమారుడైన ముక్కర్ల ఉమేష్ ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 4.30 గం.లకు కట్లపాము కాటు వేయడంతో భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బుధవారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు దత్తప్ప గూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడన్నారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యార్థి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.