NLG: తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, చండూరు:
రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వరి ధాన్యం కింటాకు రూ.500 బోనస్ ప్రకటించాలని, రైతులకుతక్షణమే రుణమాఫీని అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గం లోని వివిధ మండలాలలో రైతులు ఆరుగాలం శ్రమించి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన పంట పొలాలు తమ కళ్ళముందే చేతికొచ్చే సమయంలో, ఎండిపోయిన పొలాలను చూసి రైతులు ఆందోళనకు గురవుతున్నారని, తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
భూగర్భ జలాల నీటిమట్టాలు రోజురోజుకు పడిపోతుండడంతో వాటి ఆధారంగా సాగు చేసిన పంట పొలాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని, ఈ పరిస్థితులలో ఏఎమ్మార్పీ వరద కాలువల ద్వారా వీలైనన్ని చెరువులను నీటితో నింపితే భూగర్భ జలాలు అందుబాటులోకి వస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోసిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య,కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, కంచర్ల రవి తదితరులు పాల్గొన్నారు.
Mar 10 2024, 19:17