/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz బస్వాపురం ప్రాజెక్టు నుండి నీళ్లు వదిలి ముత్తిరెడ్డిగూడెం చెరువు నింపి రైతాంగానికి సాగునీరు అందించాలి: కొండమడుగు నరసింహ CPM రాష్ట్ర కమిటీ సభ్యలు Vijay.S
బస్వాపురం ప్రాజెక్టు నుండి నీళ్లు వదిలి ముత్తిరెడ్డిగూడెం చెరువు నింపి రైతాంగానికి సాగునీరు అందించాలి: కొండమడుగు నరసింహ CPM రాష్ట్ర కమిటీ సభ్యలు


      బస్వాపురం ప్రాజెక్టు నుండి తూము ద్వారా నీటిని విడుదల చేసి ముత్తిరెడ్డిగూడెం చెరువును నింపి రైతాంగానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి మండల పరిధిలో ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటి సిపిఎం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా సరైన వర్షాలు లేక బోరుబావులు వెండిపోతున్న పరిస్థితులు ఉన్నదని అన్నారు. అనేకమంది బోరు బావుల ఆధారంగా దాదాపు 7,8 వందల ఎకరాల భూమిలో వరి, గడ్డి,సోప్ప సాగు చేసినారని తీరా నాటు బెట్టి నెల ,రెండు నెలలు గడవకముందే బోరు బావుల్లో నీళ్లు తగ్గి బోర్లు పోయలేని పరిస్థితి ఏర్పడిందని దీనితో రైతులు ఆవేదన చెందుతున్నారని గత నాలుగైదు సంవత్సరాల నుండి బస్వాపురం ప్రాజెక్టు నుండి ముత్తిరెడ్డిగూడెం చెరువులోకి తూము ద్వారా నీళ్లు రావడం వల్ల రైతాంగానికి సాగునీరు లభించిందని గత ఐదారు నెలల నుండి నీళ్లు రాకపోవడంతో ముత్తిరెడ్డిగూడెం చెరువులో రోజురోజుకు నీళ్లు తగ్గి బోరు బావులు ఎండుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వము జిల్లా యంత్రాంగం బస్వాపురం ప్రాజెక్టు నుండి తూము ద్వారా నీటిని విడుదల చేసి ముత్తిరెడ్డిగూడెం చెరువు నింపి సాగు, తాగునీరు అందించి రైతులను, ప్రజలను ఆదుకోవాలని నర్సింహ్మ కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవాణి మూడవ వర్ధంతి సందర్భంగా అనాధాశ్రమంలో వస్తువుల బహూకరణ


 

జట్ఠా సాగర్,జీవిత భాగస్వామి జట్టా శ్రీవాణి మూడవ వర్థంతి సందర్భంగా రాయగిరి లోని సహృదయ అనాదాశ్రమంలో కుర్చీలు, నిత్యావసర వస్తువులు దానం చేసిన జట్టా సాగర్ అభినందనీయుడని చిన్న కందుకూరు మాజీ ఉపసర్పంచ్ కల్లేపెల్లి మహేందర్ అన్నారు. శనివారం రాయగిరి శివారులోని సహృదయ అనాదాశ్రమం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జట్టా సాగర్, తన జీవిత భాగస్వామి శ్రీవాణి జ్ఞాపకార్థం అనాదాశ్రమం లో సుమారు 16 ( ప్లాస్టిక్ ) కుర్చీలు, నిత్యావసర వస్తువులు దానం చేసి, మానవత్వాన్ని చాటుకున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న కందుకూరు మాజీ వార్డు సభ్యులు సుబ్బురు శ్రీనివాస్, దాత జెట్టా సాగర్, నాయకులు సంజీవ,బండ బిక్షపతి, సుధాకర్ , స్వామి, సంతోష్, శ్రీను, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి :రెడ్ల రేపాకలో సైబర్ నెరాలపై అవగాహన కల్పించిన వలిగొండ ఎస్సై డి మహేందర్


సైబర్ నేరలపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వలిగొండ ఎస్సై డి మహేందర్ అన్నారు. వలిగొండ మండలంలోని రెడ్ల రేపాక గ్రామంలో శుక్రవారం నేరాలు, చైన్ స్నాచింగ్ , సైబర్ నేరాలపై ప్రజలకి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయని ఆన్లైన్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు బ్యాంకు అధికారులుగా మాట్లాడే వారిని, రుణాలు ఇప్పిస్తామని చెప్పే వారిని నమ్మొద్దు అన్నారు. ఎవరైనా గ్రామాలలో అనుమనాస్పదంగా కనిపించినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని అన్నారు. మోసపూరిత ఫోన్ కాల్స్ లకు, మెసేజ్ లకు స్పందించవద్దని అన్నారు.

భువనగిరి పార్లమెంటులో బిజెపి గెలిపే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి:నాగేల్లి సుధాకర్ గౌడ్


 బారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అద్యక్షులు నాగెళ్ళీ సుధాకర్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోనీ పార్టీ కార్యాలయంలో ఈనెల 20 వ తారీకు నాడు భువనగిరి లో ప్రారంభమయ్యే విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా కేంద్ర మంత్రి వర్యులు ,బీజేపీ రాష్ట్ర అద్యక్షులు శ్రీ G. కిషన్ రెడ్డి గారు విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈనెల 20 వ తేదీ నుండి ,భువనగిరి పార్లమెంట్ పరిధిలో భువనగిరి నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రను అన్ని నియోజక వర్గాలను కలుపుకుంటూ యాత్ర ప్రారంభమవుతుంది కావున ఈ యాత్రలో మండలం నుండి నాయకులు ,కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ సన్నాహక సమావేశం ను ఏర్పాటు చేయడం జరిగింది అని ఈ వారు అన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా బూత్ లను పటిష్టం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్,వెలిమినేటి వెంకటేశం,జిల్లా నాయకులు బందారపు రాములు,భచ్చు శ్రీనివాస్,పాక పుల్లయ్య,దయ్యాల వెంకటేశం, అవుల శ్రీనివాస్,ఏర్రబోలు జంగయ్య,మందుల నాగరాజు తదతరులు పాల్గోన్నారు.

అనాజిపురం గ్రామంలో గ్రామీణ భారత్ బంద్ సమ్మె విజయవంతం : సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం


బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు జరిగిన గ్రామీణ భారత్ బంద్, సమ్మె భువనగిరి మండలము అనాజిపురం గ్రామంలో ప్రజలందరూ పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేశారు...

ఈ సందర్భంగా CPM పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు ఎదునురి మల్లేశం మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర గ్యారెంటీ చేసే చట్టం చేయాలని అన్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు, పెన్షన్ 10000 రూపాయలు అందరికీ ఇవ్వాలని అన్నారు ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నష్టం చేసే విధానాలు తీసుకొస్తుందని, ఉపాధి హామీ చట్టాన్ని విస్తరింపచేసి 200 రోజులకు పెంచాలని రోజుకు 800 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి అబ్దుల్లపురం వెంకటేశం, నాయకులు ఎదునూరి వెంకటేశం, కడారి క్రిష్ణ, బోల్లేపల్లి స్వామి, MD ముస్తఫా, గంగణబోయిన బాలనరసింహా, బొల్లేపల్లి క్రాంతి, మావురం కృష్ణా, మకోలు గోపాల్ తదితరులు పాల్గొన్

నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్


భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని కేఆర్ భవన్ లో ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులూ ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం చౌటుప్పల్ డివిజన్ కేంద్రం మరియు మోత్కూర్ మండల కేంద్రాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీని చేస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని అన్నారు

వెంటనే డి ఐ ఈ ఓ డిఈఓ గారు స్పందించి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలు పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సూరారం కళ్యాణ్ మోత్కూర్ మండల నాయకులు మచ్చ వినయ్ వంశీ దినేష్ తదితరులు పాల్గొన్నారు

మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్


కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పోరేట్ , మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు 16 న జరిగే దేశ వ్యాప్త కార్మిక సమ్మేను, గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ పిలుపునీచ్చారు.

    గురువారం రోజున వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సం..కావస్తున్నా రైతాంగ కార్మిక,ప్రజల సమస్యలు పరిష్కరించలేదన్నారు, భారత్ వెలిగి పోతూంది, అచ్చేదిన్ ఆయేగా,విశ్వ గూరూ,మేకిన్ ఇండియా అంటూ మోసపూరిత ఆకర్షణ నినాధాలు ఇచ్చింది తప్ప చేసింది ఏమి లేదన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా తెచ్చిందని ఈ లేబర్ కోడలు కార్పొరేట్లకే ఉపయోగపడతాయని తెలియజేశారు.కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని సైతం మోడీ ప్రభుత్వం కాలరాస్తూ 12 గంటలు శ్రమదోపిడి చేసుకునేలా యజమాన్యాలకు అవకాశం కల్పిస్తూ లేబర్ కోడ్ లలో తీసుకువచ్చారని విమర్శించారు.

కార్మికుల నిజవేతనాలు 20 శాతం తగ్గి పోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో బిజేపి ప్రభుత్వం అవలంబించే కార్మిక,రైతాంగ,ప్రజా వ్యతిరేక విధానాలు మతతత్వ ధోరణులకు నిరసనగా దేశాన్ని రైతులను,కార్మికులను,ప్రజలను రక్షించడం కోసం రేపు 16న జరుగుతున్న దేశ వ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ లో జిల్లా లోని రైతులు, కార్మికులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలనీ పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, పట్టణ కార్యదర్శి మచ్చ లక్ష్మీనారాయణ, నాయకులు బోడిగే సుదర్శన్, చొప్పరి వెంకటేశం, పారుపల్లి నరసింహ, మచ్చ గిరి, రాములు తదితరులు పాల్గొన్నారు.

జన్వాడ లో మైనారిటీ, దళితులపై దాడిని ఖండిస్తున్నాం: బీఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల పాండు


జన్వాడ క్రైస్తవులపై దాడి ఘటనను ఖండిస్తున్నాం: జిల్లాఅధ్యక్షులు కనకుంట్ల పాండు*

రంగారెడ్డి జిల్లా చేవళ్ల నియోజకవర్గంలోని జన్వడ గ్రామంలో మైనారిటీ,దళిత వర్గాలపై స్త్రీలు,పురుషులపై విచక్షణ రహితంగా దాడి చేసిన రాష్ట్రీయ స్వయం స్వేవక్ సంఘ్ (RSS)కార్యకర్తలు,కాంగ్రెస్ చేసిన దాడిని,బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రిభువనగిరి జిల్లాఅధ్యక్షులు కనకుంట్ల పాండు విలేకరుల సమావేశంలో ఖండిచారు,ఈ సందర్బంగా మాట్లాడుతూ దాడి ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రఅధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అక్రమంగా అరెస్టులు చేశారన్నారు,గత ప్రభుత్వంలో ఇలాగే ప్రశ్నించే గొంతులను నోక్కిన విధంగా అదే ఆనవాయితిని,నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని, ప్రజాస్వామయానికి గొడ్డలిపెట్టు వంటిదని,ఇలాగే కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్తారని, రాష్ట్రంలో హోంమంత్రి,విద్యాశాఖకు మంత్రిని కూడా నియమిచలేని అసమర్థ ప్రభుత్వం అని, అరెస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షలు బాసాని మహేందర్,జిల్లారైతువిభాగం అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య,కార్మిక విభాగం అధ్యక్షులు బోల్లేపల్లి అనిల్ కుమార్,ఆలేరు నియోజకవర్గం ఇంచార్జి గందమల్ల లింగస్వామి,భువనగిరి నియోజకవర్గం అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్,ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు గడ్డం శ్రీకాంత్, భువనగిరి నియోజకవర్గం మహిళా నాయకురాలు బాకారం లావణ్య,భువనగిరి మండల అధ్యక్షులు కేతావత్ రవి నాయక్,సోషల్ మీడియా కన్వీనర్ చుక్క సుమన్,తదితరులు పాల్గొన్నారు.

సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి వేడుకలు బొమ్మలరామారం మండలం చీకటి మామిడి తిరుమలనాధ స్వామి ఆలయ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ముందుగా చీకటి మామిడి చౌరస్థలో బంజారాలతో కలసి బైక్ ర్యాలీని జెండా ఉపి ప్రారంభించారు.అనంతరం తిరుమలనాధ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ తర్వాత సేవాలాల్ మహరాజ్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహరాజ్ గారు బంజారాల ఆరాధ్య దైవం అన్నారు.బంజారాలకు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేశారని,గత ప్రభుత్వం బంజారాలు కోరిన సెలవును ప్రకటించలేదని,కానీ ఈ మన ప్రజల ప్రభుత్వం ఫిబ్రవరి 15 ను సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని అప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషమన్నారు.మన జిల్లాలో కూడా బంజారా భవనం తో పాటు సేవాలాల్ మందిరాన్ని నిర్మాణమ్ చేయడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బంజారాలు,ప్రజాప్రతినిధులునాయకులు,తదితరులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ 16న జరిగే కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి : ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్


 కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈనెల 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. 

    బుధవారం రోజున చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డ్ లో ఈ నెల 16వ తేదీన ఏఐటీయూసీ తో పాటు 10 జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరగబోయే "దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్" కు సంబంధించిన గోడ పత్రికలను కార్మికులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కుల రక్షణలో ఘోరంగా విఫలమైందని అన్నారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కనీస ప్రయోజన కార్మిక చట్టాలను కూడా అమలు చేయడం లేదని , 44 రకాల శ్రామిక చట్టాలను నాలుగు కోడ్ లుగా కుదించి వేసిందని , ఫలితంగా కార్మిక వర్గ ప్రయోజనాలకు బదులుగా యాజమాన్యాల కు ప్రయోజన కారిగా మారిందని ఆయన అన్నారు. 2014వ సంవత్సరంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని... ప్రతి భారతీయుని అకౌంట్లో 15 లక్షల రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని , కార్మిక వర్గ ప్రయోజనాలు కనీసం కూడా పట్టించుకోలేదని ఆయనన్నారు. దేశంలో 40 కోట్ల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు కనీస హక్కులు , సౌకర్యాలు లేక యాజమాన్యాల దోపిడీకి ప్రైవేటు/ ప్రభుత్వా ల శ్రమదోపిడికి గురవుతున్నారని ఆయన అన్నారు. 

దేశంలో సుమారు 75 కోట్ల మంది ప్రజలు రోజుకు మూడు పూటల తిండి కూడా తినలేని దీనస్థితిలో ఉన్నారని , ఒకపక్క దేశానికి వెన్నెముక అయిన రైతులూ, పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులూ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని , మరొకపక్క అదానీ , అంబానీ లాంటి ధనికులు మాత్రం కుబేరులుగా మారుతూ... ప్రపంచ ధనికుల స్థానానికి పోటీ పడుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. 

దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికి కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పేరుతో బీద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్మికులచే శ్రమదోపిడి చేసుకుంటూ 5  నుండి 10 వేల రూపాయల అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని , గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్మిక కనీస వేతనం 26 వేల రూపాయలు చేయాలన్న స్పృహ లేకపోవడం విచారకరమైన విషయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులైన హమాలీ, ఆటో రంగా కార్మికుల కోసం సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని, కనీస వేతనం ప్రతి కార్మికునికి 26000 ఇవ్వాలని, ఈ ఎస్ ఐ,పిఎఫ్ సౌకర్యం తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

 16న జరిగే సమ్మె లో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పాల్గోని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

    ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, సిపిఐ పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి, సివిల్ సప్లై హమాలి యూనియన్ అధ్యక్షులు పాపగళ్ల శంకరయ్య, నాయకులు రామలింగయ్య, రెహ్మాన్, శ్రీకాంత్, బాబు, లింగస్వామి, మల్లేష్, నర్సింహా, ఈశ్వర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.