NLG: ధర్మబిక్షం గౌడ్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి: జనార్దన్ గౌడ్
నల్లగొండ: మాజీ పార్లమెంటు సభ్యుడు, కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. ఈ రోజు ధర్మ బిక్షం గౌడ్ 102 వ జయంతి సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో ధర్మ భిక్షం చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ హైవే కి బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ పేరును నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం గీత కార్మికుల కోసం అనేక విధాలుగా పోరాటం చేసి వారి యొక్క హక్కులను కాపాడినటువంటి గొప్ప నాయకుడు ధర్మబిక్షం గౌడ్ అన్నారు.
ఉమ్మడి జిల్లా ప్రజలు ధర్మబిక్షం గౌడ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని పోరాట పటిమను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేఖల భద్రాద్రి, యువజన నాయకుడు చంద్రశేఖర్ గౌడ్, కారింగు నరేష్ గౌడ్ , చింతల యాదగిరి గౌడ్, కొంపెల్లి రామన్న గౌడ్, పుల్లెంల యాదగిరి గౌడ్, మాద శ్రీనివాస్ గౌడ్, గజ్జి నరేష్ యాదవ్, చింతల విజయ్ కుమార్ గౌడ్, కారింగ్ శంకర్ గౌడ్, జేరిపోతుల లింగయ్య గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.
Feb 15 2024, 20:22