ఆర్థిక సహాయం అందజేసిన భువనగిరి పార్లమెంట్ బిజెపి పూర్వ అభ్యర్థి పివి శ్యాంసుందర్ రావు
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన నాళ్ళ రంగయ్య తల్లి ,నాళ్ళ అండమ్మ నిన్న సాయంత్రం అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ బిజెపి పూర్వ అభ్యర్థి శ్రీ పి.వి శ్యామ్ సుందర్ రావు .... వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 10,000 రూపాయలు ఆర్థిక సాయం బీజేపీ గ్రామ శాఖ అద్యక్షులు మంగ జగన్ చేతుల మీదుగా అందజేశారు . ఈ కార్యక్రమంలో వలిగొండ పట్టణ ఉప సర్పంచ్ మైసోల్ల మచ్చగిరి , డోగిపర్థీ సంతోష్, మారోజు అనిల్ కుమార్, గుమ్మి సాయి రెడ్డి, మురళి, మోహన్ రెడ్డి, మంగ బాలయ్య, మహేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()
![]()


గిగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రమాద బీమా కార్యక్రమాన్ని ప్రారంభించిన నాగినేనిపల్లి ఎంపీటీసీ ఫకీరు రాజేందర్ రెడ్డి, బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో... గిగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రమాద బీమా కార్యక్రమాన్ని నాగినేనిపల్లి ఎంపీటీసీ పకీరు రాజేందర్ రెడ్డి , అర్హులకు బీమా పత్రాలని అందజేశారు. ఈ సందర్భంగా ...వారు మాట్లాడుతూ చిన్నచిన్న వస్తువులకు బీమా చేయించుకునే మనం 150 రూపాయలతో, బీమా చేయించుకుంటే మన ప్రాణానికి ఆపదలో ఉన్నప్పుడు.. ఈ ప్రమాద బీమా ఉపయోగపడుతుందని, అలాగే ప్రతి వ్యక్తికి అవసరమని ,అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నాయకులు బూర నర్సయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.









పౌష్టికాహారం తీసుకుని క్యాన్సర్ బారి నుండి రక్షించుకోవాలి

Feb 05 2024, 22:34
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.6k