నల్లగొండ:A P అంగన్వాడి ల పై ఎస్మా అన్యాయం,ప్లే కార్డులతో నిరసన..
A P అంగన్వాడి ల పై ఎస్మా అన్యాయం
ప్లే కార్డులతో నిరసన
పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని అడిగితే ఎస్మా లు ఉపయోగిస్తారా అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU )అనుబంధం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి లు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మంగళవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ సిడిపిఓ ఆఫీస్ ముందు నల్ల జెండాలు, ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వేతనాల కోసం సమ్మె చేస్తున్న ఏపీ అంగన్వాడీలపై ఏస్మా పేరుతో జీవో నెంబర్ రెండు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.అధికారంలోకి వచ్చిన నాడు ఏపీ జగన్మోహన్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువజీతాలు పెంచుతానని చెప్పిన మీ మాటలు ఎటు పోయాయి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రులకు లక్షల్లో జీతాలు పెంచుకునే మీకు నిరంతరం పేద ప్రజల కోసం దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లలను తీర్చిదిద్దే వారికి మెరుగైనటువంటి పౌష్టికాహారం అందించేటువంటి అంగన్వాడీ టీచర్స్ కు ఎందుకు జీతాలు పెంచడంలేదని ప్రశ్నించారు.పదివేల జీతం టీచర్స్ కు, హెల్పర్స్ ,మినీ టీచర్స్ కు 7000 రూపాయల జీతంతో ఎలా అంగన్వాడీలు బతుకుతారని, వాళ్ళ కుటుంబ పోషణ ఎలా సాగుతుందని ప్రశ్నించారు.కడుపు కాలీ సమ్మె చేస్తుంటే జీతాలు పెంచకుండా ఎస్మా ఉపయోగించడం ప్రభుత్వ చేతగానితనం అన్నారు కార్మికులకు సమ్మెకు జన్మ హక్కు అని దాన్ని కాలరాసే ఏ ప్రభుత్వానికైనా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు గతంలో అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులతో చర్చలు జరిపి వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గం ఎక్కడ పోరాటాలు చేసిన వారికి అండగా సంఘీభావంగా సిఐటియు ఉంటుందని వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో సునంద, సముద్రమ్మ, సరిత ,రేణుక , అనిత, శ్రీలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు
.





భారత సుప్రీంకోర్టు బిల్ కిస్ బానో కేసుపై తీర్పునిస్తూ ఆ కేసులో ముద్దాయిలైన 11 మంది విడుదల అవటానికి కారణమైన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రెండు వారాలలోగా 11 మంది ముద్దాయిలను విడుదల అయిన జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలిచ్చిందని ఈ తీర్పును అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి హర్షం వ్యక్తం చేశారు.
శ్రీ వాసవి దేవాలయం లో మహిళల గాజులు పండుగ
సంక్రాంతికి ముందు గాజులు వేసుకోవాలని లేనిచో కీడు జరుగుద్ది అనే ప్రచారం ఉండడంతో ఒకరికొకరు గాజులు వేసుకొని అలంకరించుకున్నారు. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్టను పురస్కరించుకొని అయోధ్య అక్షితలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రీదేవి, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి, వాసవి జిల్లా మొదటి మహిళా రాచర్ల లక్ష్మి, తోట కమల, గుండా సుధా మాధురి, రాచర్ల ప్రేమలత, గజ్జి నీలిమ, గుండా సువర్ణ, ఈగ శారద, భాగ్యలక్ష్మి, నల్లపాటి రమాదేవి, వెంపటి విజయ, కక్కిరెని పద్మ, పోతుగంటి సునిత తో పాటు 50 మంది మహిళలు పాల్గొన్నారు.
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ
అమరావతి: ఇవాళ, రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాల పరిశీలన..
నిన్న రాత్రే విజయవాడ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని టీమ్.. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం.. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష
తిరుమల: ఒక కంపార్ట్‌మెంట్‌లో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,511 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,777 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు
కొడుకుంటే కీడట...

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు
A

విద్యార్థులని మీకు పరీక్షలు పూర్తి అయినాయి ప్రభుత్వ నియమ నిబంధనకు వ్యతిరేకంగా విద్యార్థులను హాస్టల్లో నుంచి వెళ్లగొట్టడం జరుగుతుంది. దీనివలన బహుజన విద్యార్థులు చదువుకు దూరం కావడంతో పాటు ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతుంది.
వారం రోజుల ముందే విద్యార్థులను ఎల్లగొడుతున్న వార్డెన్స్ ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థులకు న్యాయం జరిగిన చూడాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు.
Jan 10 2024, 13:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.4k