/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz కొండమల్లేపల్లి: ఘనంగా ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం Mane Praveen
కొండమల్లేపల్లి: ఘనంగా ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవం

నల్లగొండ జిల్లా:

ఎస్ఎఫ్ఐ, దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, నేడు కొండమల్లేపల్లి లో SFI 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా SFI పతాకాన్ని డివిజన్ అధ్యక్షులు రామావత్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థి పోరాటాలకు దిక్సూచి అయిన SFI , 1970 డిసెంబర్ 30,31 తేదీలలో కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం పట్టణంలో ఆవిర్భవించి, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. 

స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో గత 54 సంవత్సరాలుగా విద్యార్థులను, ప్రజలను చైతన్య పరుస్తూ భగత్ సింగ్, సావిత్రి బాయి, అంబేద్కర్ లాంటి మహనీయుల స్పూర్తితో సమసమాజన స్థాపనకై కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే విద్య వ్యతిరేక విధానాలపై నిరంతరం మిలిటెంట్ పోరాటాల నిర్వహిస్తూ, ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడని ఏకైక విద్యార్థి సంఘం SFI అని అన్నారు. అలాగే దేశంలో అత్యధిక మెంబర్షిప్ కలిగిన సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు. 

అదేవిదంగా కొఠారి కమిషన్ ప్రకారం విద్యపై కేంద్ర ప్రభుత్వం 10% నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 30% కేటాయించాలని పేర్కొన్నా, పాలక ప్రభుత్వాలు విద్యను విస్మరించడం దారుణమని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికి విద్యను కొనుక్కునే పరిస్థితిలొనే ఉండటం దారుణం అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేరుతో కార్పొరేట్ వారికి లాభం చేకూరేలా చేస్తూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర చేస్తుదన్నారు. ఈ నూతన జాతీయ విద్యావిధాన రద్దుకై మేధావులు, విద్యార్థులను కలుపుకొని SFI పోరాటాలు కొనసాగిస్తుందని తెలియచేసారు.

అలాగే మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరుబాట చేయాలని, అమ్మాయిలను పుట్టనిద్దాం - చదవనిద్దాం -ఎదగానిద్దాం కాపాడుకుందాం అనే నినాదాలను ముందుకు తీసుకపోవాలని సూచించారు. అందరికి విద్య - అందరికి ఉపాధి కల్పనకై కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్, సాయి,రాహుల్, రాజేశ్వరి, అనిత, ఆంజనేయులు, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

TS: విద్యా రంగంపై సమీక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు విద్యా రంగంపై సమీక్షించనున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రశ్నపత్రం లీకేజీ లు మరియు ఫలితాల ప్రకటనలో తప్పులకు ఆస్కారం లేకుండా SSC, IPE పబ్లిక్ పరీక్షలు, EAMCET, CET లను సజావుగా నిర్వహించే చర్యలపై చర్చించనున్నారు.

TS: ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారుల కు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులకు ఆదేశాలు. రైతు బంధు, పింఛన్ల పై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికి యథావిధిగా ఈ పథకాలు అందుతాయి. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.



TS: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ముందుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి, అనంతరం నామినేటెడ్ పదవుల పంపకం చేపట్టాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాలతో ముందుగానే ఈ పదవులు భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ముందే ఈ నామినేటెడ్ పదవులు భర్తీ చేపట్టే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది.

HYD: రైలు పట్టాలపై గొడవ, రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్: వారిద్దరూ ఫ్రెండ్స్ మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ, తరచూ గొడవలు పడుతుంటారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం వారి మధ్య మళ్లీ వివాదం మొదలైంది. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు. అక్కడ ఘర్షణ పడ్డారు. ఇదే క్రమంలో రైలు దూసుకొచ్చింది. దీంతో ట్రైన్ ఢికొని.. వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు.

ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీ నగర్‌లో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయం లో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

నేడు అయోధ్యకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ

న్యూ ఢిల్లీ: అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య లో వేల కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు.ప్రధాని మోదీ, ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు.15 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. జనవరి 22న జరిగే విగ్రహా ప్రతిష్ఠాపన కు సర్వం సిద్దమవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా, ఇవాళ అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11గంటల 15 నిమిషాలకు అయోధ్య ధామ్‌ రైల్వేస్టేషన్‌, మధ్యాహ్నం 12గంటల15 నిమిషాలకు ఎయిర్‌పోర్ట్‌ ను ప్రారంభించనున్నారు.

ఒంటి గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచే సుమారు 15వేల 700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్‌ కాంతుల్లో మెరిసిపోయింది.

TS: సీఎం రేవంత్ విదేశీ పర్యటన

జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్ లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెళ్లనున్నారు.

TS: లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దం

జనవరి మూడో తేదీ నుంచి బిఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు

లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దం

వచ్చే నెల నుంచి సన్నాహక సమావేశాలు

• 3న ఆదిలాబాద్

• 4న కరీంనగర్

• 5న చేవెళ్ల

• 6న పెద్దపల్లి

• 7న నిజామాబాద్

• 8న జహీరాబాద్

• 9న ఖమ్మం

*10న వరంగల్

• 11న మహబూబాబాద్

• 12న భువనగిరి 

• 16న నల్గొండ

• 17న నాగర్ కర్నూలు

• 18న మహబూబ్ నగర్

• 19న మెదక్

• 20న మల్కాజ్ గిరి

• 21 సికింద్రాబాద్ మరియు హైదరాబాద్

ఢిల్లీ: ఖైదీలకు పిల్లల్ని కనే హక్కు కల్పించిన హైకోర్టు

వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న వ్యక్తికి.. నాలుగు వారాల పాటు పెరోల్‌ మంజూరు చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న అతని భార్య, అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

భార్య వయసు 38 ఏళ్లు, భర్త వయసు 41 ఏళ్లను ప్రస్తావిస్తూ, శిక్షా కాలం పూర్తయ్యాక ఆ దంపతులకు సంతానాన్ని పొందే వయసు మీరి పోతుందని వయో భారం వారి ఉమ్మడి ఆకాంక్షకు అవరోధంగా మారుతుందని జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ అభిప్రాయ పడ్డారు.

తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ప్రభుత్వం అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత కేసులోని పూర్వాపరాలను పరిశీ లించిన తర్వాత ఖైదీకి తన వంశాన్ని నిలుపుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తీర్పులో వివరించారు.

అయితే దాంపత్య జీవనం కోసం అనుమతివ్వడం లేదని.. కేవలం వంశాన్ని నిలబెట్టుకోవాలన్న భార్య ఆకాంక్షను, హక్కును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఖైదీ ఇప్పటికే 14 ఏళ్లుగా జైలులో ఉన్న విషయాన్నీ న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పెరోల్‌ కోసం రూ.20 వేలకు వ్యక్తిగత బాండును సమర్పించడంతో పాటు ఒకరి పూచీకత్తు ఇవ్వాలని షరతు విధించారు. కోర్టు ష‌ర‌తులు పూర్తి చేయడంతో జైలు నుంచి ఆ ఖైదీని పెరోల్ పై విడుద‌ల చేశారు.

NLG: జనవరి 3న జరిగే సిపిఎం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలి: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

జనవరి 3న నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగే సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం చండూరు లో సిపిఎం మండల కమిటీ సమావేశం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికలలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని కోరారు.