మీ చాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాలను ఆదుకోవాలని న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ డిమాండ్
మీ చాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాలను ఆదుకోవాలని న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ డిమాండ్
గత రెండు రోజులుగా కురుస్తున్న మీసాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన పంటలను రైతులను ఆదుకోవాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.
రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకొని సాగు చేసుకుంటున్న పంటలు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ తుఫాను వల్ల నేలమట్టం అయిపోయి పనికిరాకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను తాకిడికి దెబ్బతిన్న పంటలు చూసి రైతన్నలు బోరున విలవిల ఏడుస్తున్నారని ఆరుకాలం కష్టపడ్డ శ్రమంత వృధా అయిపోయిందని దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉందని వారు అన్నారు. మిరప వరి పత్తి మొత్తం నేలమట్టం అయిపోయాయని దేనికి పనికిరాకుండా అయిపోయాయని ఎకరానికి మిరప పత్తికి 50,000 వరికి 25000 చెల్లించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పంటకు తగునష్టపరిహారం చెల్లించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల్ నాయకులు కనితి భాను ప్రకాష్
పి వై ఎల్ మండల నాయకులు చిరిగిడి నరేష్ రమేష్ రాజు ప్రతాప్ విజయ్ తదితరులు పాల్గొన్నారు



హైదరాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో సచివాలయం దగ్గర ఉద్యోగుల సంబరాలు.. సెలబ్రేషన్స్ లో పాల్గొన్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్.. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు.. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది.. ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉంటాను.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం- కోదండరామ్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా.. నంబర్ వన్ బౌలర్‌గా ఇండియన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, రీసెంట్‌గా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో 9 వికెట్లు తీసిన రవి బిష్ణోయ్.. టీ20 నెంబర్ వన్ బ్యాట్సమెన్ గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్
ఢిల్లీ: మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో మల్లగుల్లాలు.. వరుసగా ఏఐసీసీ నేతలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. రేవంత్ తో పాటు ప్రమాణస్వీకారం చేసేంది ఆరుగురు మంత్రులే.. ఒక డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. స్పీకర్ ఎవరనేది తేలిన తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ..
ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పరామర్శించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి
రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి కి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి - పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది..ఇప్పటికే రెండు రోజులుగా నెల్లూరు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలుపడుతున్నాయి..అనంతపురం, కడప ప్రకాశం, జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది..నిజాంపట్నం హార్బర్‌లో ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు..తుఫాన్ దృష్ట్యా అధికారులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా సాయంత్రానికి తుఫానుగా బలపడి.. దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తోంది.రేపు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, పడే అవకాశం ఉంది. రానున్న రెండు, మూడు రోజులపాటు, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. మిచౌంగ్ తుఫాన్ ముప్పు భయం వెంటాడు తోంది.
గాంధీభవన్ టూ ఢిల్లీ వయా గచ్చిబౌలి... మీటింగ్‌ల మీద మీటింగ్‌లు.. మంతనాలే మంతనాలు సాగుతూనే వున్నాయి. సీఎల్పీపై సింగిల్ లైన్ స్టేట్‌మెంట్ వచ్చేసింది.. రేవంత్ రెడ్డికే సీఎం కుర్సీ అని హైకమాండ్ లైన్ క్లియర్ చేసిందనే టాక్ రానే వచ్చింది. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో రంగం సిద్ధమైంది. ఇక రేవంత్ అనే నేను....అంటూ ఆవాజ్ రావడమే తరువాయి అనుకునేంతలోపు సీన్ ఛేంజ్.. సీఎం ఎవరినే మ్యాటర్ ఓవర్ టు ఢిల్లీ..
Dec 06 2023, 16:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
37.2k