/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz ఆశా వర్కర్లకు 18వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు Mane Praveen
ఆశా వర్కర్లకు 18వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు
మునుగోడు: తెలంగాణ రాష్ట్రంలో గత 18 సంవత్సరాలు నుండి గ్రామ ఆరోగ్య కార్యకర్తలుగా అనేక వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు 18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఆశ వర్కర్లు ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగులు పూర్తిచేసి గ్రామాలలో రిజిస్టర్స్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పనిచేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర జబ్బులు గుర్తించి, ప్రభుత్వం ఇస్తున్న మందులను సప్లై చేస్తూ ప్రజలకు తగిన ఆరోగ్య సూచనలు ఇస్తున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు చిన్న పిల్లలకు, ప్రజలకు అనేక రకాల వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.

ఇంత పని చేస్తున్న ఆశ వర్కర్లకు వేతనం ఇవ్వకుండా పారితోషికాల పేరుతో పని భారం పెంచి, వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశ వర్కర్స్ కు 18 వేల ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్ ఈఎస్ఐ, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఏ ఎన్ఎం జిఎన్ఎం పోస్టులో ఆశలకు ప్రమోషన్, ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
          
ఆశ వర్కర్స్ కు టీబి లెప్రసీ కంటి వెలుగు కరోనాకాలంలో ఇవ్వవలసిన రిస్క్ అలవెన్స్, పెండింగ్ బిల్లులను ఇవ్వాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
        
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య , చండూరు మండల కన్వీనర్ జేరిపోతుల ధనంజయ, సిఐటియు మండల నాయకులు యాసరాని వీరయ్య,ఆశ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు రమావత్ కవిత, జిల్లా నాయకురాలు జంపాల వసంత, ఏర్పుల పద్మ, ఎం సునీత, ఎదుళ్ళ కవిత, కోరే లలిత, అరుణ యాదమ్మ, మమత, సైదా బేగం విజయమ్మ దుర్గమ్మ అరుణ ,కలమ్మ తదితరులు పాల్గొన్నారు.
NLG: రేపే రాఖీ పౌర్ణమి పండగ

నల్లగొండ: సోదరీ సోదరుడు మధ్య అనుబంధానికి ప్రతీకైనా రాఖీ పండుగను ఈనెల 31న గురువారం జరుపుకోవాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బొల్ల వేణుగోపాలరావు, మరియు పురోహితులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, లక్ష్మీ నరసయ్య శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 

వేణుగోపాల రావు నల్గొండలో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18 వినాయక చవితి జరుపుకోవాలని, ఈనెల 31వ తేదీ గురువారం రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని తెలిపారు.
NLG: 2వ ఏఎన్ఎం ల పట్ల  ప్రభుత్వ కటిన వైఖరి మంచిది కాదు: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: గత 14 రోజులుగా  2వ ఏఎన్ఎం లు  చేస్తున్న సమ్మె పట్ల  ప్రభుత్వం కటిన వైఖరి మంచిది కాదని, సమస్యను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా  ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు  జరుగుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న 2వ ఏఎన్ఎంల నిరవధిక సమ్మెలో మంగళవారం మాట్లాడారు. గత 16 నుండి 20.ఏళ్లుగా  రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా  విధులు నిర్వహిస్తున్నారు. వారిని పర్మినెంట్ చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి డి వెంకన్న, డివిజన్ కార్యదర్శి వి. లెనిన్, 2వ ఏఎన్ఎం ల యూనియన్  జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, నాగమణి, హరిత, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.
NLG: 'ఎస్సి, ఎస్టీ యువత గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి'
నల్గొండ జిల్లా: దళిత బంధు లబ్దిదారులు గొప్ప పారిశ్రామిక వేత్తలుగా  ఎదగాలని షెడ్యూల్డ్ కులాల అధికారి  శ్రీనివాసు అన్నారు. పరిశ్రమల శాఖ జనరల్ మనేజర్ కోటేశ్వర్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి  కల్పించే విధంగా వ్యాపారాలు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయాలని, సంస్థ నుంచి తప్పకుండా సహాయం అందిస్తామని తెలిపారు.

నల్లగొండ పట్టణంలోని  టీఎన్జీవో  భవన్ లో మంగళవారం దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ DICCI  జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ గోళ్ళబోయిన అంబేద్కర్  ఆధ్వర్యంలో టీ ఇగ్నైట్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్సి,ఎస్టీ యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో డిఆర్ డీవో ప్రాజెక్ట్  డైరెక్టర్ కాలిందిని, ఐడిఎం శ్రామిక, నాబార్డ్ మేనేజర్ వినయ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 521 మందికి పైగా దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందిన వారున్నారన్నారు. డైరీ, సెంట్రిన్గ్, పోటో స్టూడియో, కిరాణం, లైటింగ్ తదితర యూనిట్ల లబ్దిదారులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా డిక్కీ  మార్గదర్శనం చేయాలని అన్నారు. డిక్కీ రాష్ట్ర అధ్యక్షురాలు దాసరి అరుణ మాట్లాడుతూ.. ఎంపిక చేయబదిన ఎస్సి,ఎస్టీ యువతకు సెప్టెంబర్ రెండవ వారంలో హైదరాబాద్ లో 21  రోజుల పాటు మరో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ  కార్యక్రమములో ఎన్జీఓ నాయకులు శ్రవణ్, డిక్కీ ప్రతినిధులు దాసరి నారాయణ, రాజేష్, అరుణ్, మరియు కేవిపిఎస్ జిల్లా నాయకులు పాలడుగు నాగార్జున, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే ఔత్సాహిక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఘనంగా మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం
నల్లగొండ: జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా నేడు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) యందు కళాశాల కు చెందిన క్రీడాకారులకు సన్మానం నిర్వహించారు. గత సంవత్సరం వివిధ క్రీడా అంశాలలో ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక కాబడ్డారు. అలాంటి విద్యార్థులను ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్  సుంకరి రాజా రామ్ మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థినులకు అన్ని రకాలైన క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, విద్యార్థినిల్లో తమకు సంబంధించిన క్రీడా రంగాలలో నైపుణ్యం వెలికి తీసి తద్వారా మహాత్మా గాంధీ యూనివర్సిటీ తరఫున ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో ఎంపిక కాబడేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకున్నామని, అలాగే విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలు కళాశాలలో ఉన్నాయని ప్రత్యేకంగా జిమ్ మరియు కబడ్డీ, క్యారమ్స్, చెస్, కోకో, వాలీబాల్, బాస్కెట్బాల్ లాంటి అంశాలలో మరియు స్పోర్ట్స్ కు సంబంధించిన అన్ని అంశాలలో తగిన సదుపాయాలు ఉన్నాయని వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి. భాస్కర్ రెడ్డి మరియు కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ . ఆర్ నరేష్ మరియు అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్. కె. వెంకటకృష్ణ, ఫిజిక్స్ అధ్యాపకులు సుదర్శన్ రెడ్డి, పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు సునీత, ఉర్దూ అధ్యాపకురాలు సాకేర, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట భూ నిర్వాసితుల ధర్నా                  
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలంలోని చర్లగూడెం  ప్రాజెక్టులో భూములు కోల్పోయిన చర్లగూడ రైతులు, స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. ఏండ్లు గడుస్తున్నా పూర్తిస్థాయి పరిహారం అందలేదని,  ప్రాజెక్ట్ కు తాము వ్యతిరేకులం కాదని, స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు దయచేసి ప్రభుత్వం పూర్తిస్థాయి నష్టపరిహారాన్ని  చెల్లించాలని కోరారు.

ఈ ధర్నా కార్యక్రమంలో వల్లప్ప కేశవ గౌడ్, ఎరుకల రాములు, సంక బుడ్డి  శ్రీను, ఎరుకల యాదయ్య, సంక బుడ్డి మల్లేష్,  ముంత రామస్వామి, ఎరుకల జంగయ్య, డేరంగుల యాదయ్య, శంకరయ్య, మంగ దొడ్డి జంగమ్మ, తదితరులు పాల్గొన్నారు
NLG: పారిశ్రామికంగా ఎదగాలనుకునే ఎస్సీ, ఎస్టీ యువతకు అవగాహన సదస్సు

నల్గొండ: దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ DICCI ఆధ్వర్యంలో, ఈరోజు పట్టణంలోని ప్రకాశం బజార్ లో గల టీఎన్జీవోస్ భవనం యందు మధ్యాహ్నం 12 గంటలకు, పారిశ్రామికంగా ఎదగాలనుకునే ఎస్సీ, ఎస్టీ యువతకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ అంబేద్కర్ జీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి తోడ్పడుతుందని, లోన్ ప్రాసెస్ గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల పట్ల ఆసక్తిగా ఉండాలి: ప్రిన్సిపల్ అరుణ
నల్లగొండ: నిడమనూరు ఎస్సీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల పట్ల ఆసక్తిగా ఉండాలని, పాఠశాలలో విద్యతో పాటు ఆటల పాటలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని  అన్నారు. రాష్ట్ర మరియు దేశస్థాయిలో విద్యార్థులు ఉన్నత ప్రతిభ కనపరుస్తున్నారని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
BT రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మరియు జిల్లా పరిషత్ చైర్మన్
చౌటుప్పల్ మండలంలో సుమారు 72 లక్షల విలువగల పెద్దకొండూర్ నుండి పర్రెబాగు వరకు గల BT రోడ్డు పనులకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
NLG: మెడికల్ కాలేజీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు AITUC ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కర్ణన్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల అవుతున్నా, నేటికీ వేతనాలు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని అన్నారు. జీతాలు రాక ఇంటి కిరాయి, ఆటో కిరాయిలు భరించలేకపోతున్నారని అన్నారు.

వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి మరియు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని దేవేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు జామీర్, అండాలు, చెంద్రమ్మ, స్వర్ణ, జానయ్య, విజయ, రేణుక, కవిత, చంద్రమ్మ, లింగయ్య, కోటేశ్వరి, సీత, లక్ష్మి, శిల్ప, స్వర్ణలత, కనకమహాలక్ష్మి, కరుణ శ్రీ, కోటేశ్వరి, శిల్ప, కృష్ణవేణి, కరుణ, ఇద్దమ్మ, మంగమ్మ, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.