/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz గాయకుడు సాయిచంద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు Yadagiri Goud
గాయకుడు సాయిచంద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు

హైదరాబాద్‌:జూలై 09

ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం జరుగుతున్న సాయిచంద్‌ దశ దిన కర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు.

సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు.

సాయిచంద్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.......

యాదాద్రి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట:జూలై 09

శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

దీంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతున్నది. అతి శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇంబ్బంది కలుగకుండా చూస్తున్నారు......

ఆక్ర‌మ‌ణ‌లు తొలగించి ప‌ట్ట‌ణాభివృద్దికి స‌హ‌క‌రించండి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

గతంలో ఇరుకైన రహదారులతో, గుంతలతో,వర్షపు నీటితో పట్టణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా ట్రాఫిక్ తో అనునిత్యం సమస్యలు ఎదుర్కొన్నారని, అలాంటిది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాలమైన రహదారులు, జంక్షన్ల అభివృద్ధితో పట్టణానికి ఒక రూపును తీసుకువచ్చినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం అయన పట్టణంలోని అబ్దుల్ ఖాదర్ దర్గ వద్ద ఉన్న రహమానియా బ్రిడ్జిని ప్రారంభించారు...

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి 12 సంవత్సరాలు పట్టిందని,రైల్వే గేట్ పడినప్పుడు అంబులెన్స్ లు ఆగి ప్రాణాలమీడికి వచ్చిన పరిస్థితి ఉండేదని, అలాంటిది ఇప్పుడు భూతపూర్ నుండి మహబూబ్ నగర్,జడ్చర్ల నుండి మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చేందుకు విశాలమైన రహదారులు నిర్మించామని, పట్టణంలోని రహదారులన్నింటిని విస్తరించడమే కాకుండా, జంక్షన్లు సైతం అభివృద్ధి చేశామని, అస్తవ్యస్త రహదారులతో అవస్థలు పడకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇంకా పట్టణంలో రహదారులపై కొన్ని ఆక్రమణలు ఉన్నాయని వాటిని తీసే విషయంలో అందరు సహకరిస్తే ఇంకా విస్తారమైన రోడ్లను తీర్చిదిద్దుతామని తెలిపారు.

రహమానియా బ్రిడ్జి పక్కన ఉన్న పెద్ద మురికి కాలువలో డ్రైవ్ వాటర్ వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ఏర్పాటు చేసి మంచినీళ్లు ప్రవహించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఒక ఫౌంటెన్ ఏర్పాటు చేస్తామని, వేపురిగెరి , చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ప్రశాంతంగా ఉండే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి అభివృద్ధికి సహకరించాలని ఆయన పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పట్టణానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలతో పాటు, ఇంకా ఎంతో అభివృద్ధి రానుందని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రోడ్లను విస్తరించామని, ఇక్కడ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ఐటి పార్కు ఏర్పాటుతో చర్యలు తీసుకోవడమే కాకుండా, పిల్లలు చదువుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాలను తీసుకువచ్చామని, పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు...

మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించిన : మంత్రి తలసాని

హైదరాబాద్:జూలై 09

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించానన్నారు. మన సంస్కృతికి ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, 2014 నుంచి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తోందన్నారు. బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తోందన్నారు. ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి తలసాని వెల్లడించారు.

బోనాలు సమర్పిస్తున్న మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ జాతరకు 1500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తుతోపాటు సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెల్లవారు జాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు. మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కాంక్షలు విధించామని, ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు మంత్రి తలసాని సూచించారు...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్:జూలై 09

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆదివారం తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతమంతా పొగలు దట్టంగా అలుముకున్నాయి. చుట్టుప్రక్కల నివసించే వారు ప్రాణ భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పాలికా బజార్‌లో ధమాకా సేల్ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

షాట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకుని.. దట్టమైన పొగలు అలుముకొన్నాయి. ఆ చుట్టుపక్కల పలు షాపులతోపాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది......

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల:జూలై 09

తిరుపతి దేవస్థానం ఆదివారం రోజు భక్తులతో కిటకిటలాడుతోంది

కాగా నిన్న శనివారం శ్రీవారిని 86,781 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

శ్రీవారికి 44,920 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.......

సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మ‌హారాష్ట్ర నేత‌లు

భార‌త్ రాష్ట్ర స‌మితికి మ‌హారాష్ట్ర వ్యాప్తంగా ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ది. ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల కీల‌క నేత‌లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మక్షంలో మ‌హారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన కార్పొరేట‌ర్ న‌గేశ్‌తో పాటు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, ఇత‌ర నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ వారంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, జీవ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు........

సిటీలో ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ :జూలై 08

సికింద్రాబాద్‌లో మహంకాళి అమ్మవారి బోనాల పండగ సందర్భంగా నేటి నుంచి ఈ నెల 10 తారీకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.

దీంతో కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ పీఎస్, ప్యారడైస్, ఎస్‌బీఐ క్రాస్ రోడ్, సీటీఓ, ప్లాజా, వైఎంసీఎ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, పార్క్ లైన్, బాటా, పాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లైన్, ఘస్మండి క్రాస్ రోడ్, రసూర్ రోడ్లు, జంక్షన్ల వైపు వాహన దారులు రావొద్దని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేవారు ముందుగా బయలుదేరాలని సూచించారు.

కాగా టబాకో బజార్, హిట్ స్ట్రీట్ నుంచి మహంకాళి దేవాలయం వైపు వెళ్లే రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరుగుతుంది. బాట క్రాస్ రోడ్ నుంచి పాత రాంగోపాల్ పేట పీఎస్, సికింద్రాబాద్, సుభాష్ రోడ్ వరకు వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. అలాగే.. కర్బలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను మినిస్టర్ రోడ్ - రసూల్‌పురా క్రాస్ రోడ్డు-పీఎన్టీ-సీటీఓ-ఎస్‌బీఐ క్రాస్ రోడ్ -వైఎంసీఎ క్రాస్ రోడ్ సెయింట్ జాన్స్ రోటరీ-సంగీత్-గోపాలపురం లైన్‌లో రాణిగంజ్ క్రాస్ వద్దకు మళ్లించనున్నారని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దీంతో మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని సూచించారు....

4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే : మంత్రి హరీష్ రావు

మెదక్ జిల్లా :జూలై 08

రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘటన సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం నర్సాపూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మహిళల కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ హర్ష, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో మొత్తం 517 ఎకరాలకు గాను 610 మంది గిరిజనులకి పోడు పట్టాల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4.4 లక్షల ఎకరాల పోడు భూములను పట్టాలను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచలేదు, కనీసం వారికి త్రీ ఫేజ్ కరెంట్ కనెక్షన్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్లు పది శాతానికి పెంచారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి త్రీ ఫేజ్ కరెంట్ గిరిజన తండాలను అందించారని గుర్తు చేశారు.

ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం 3,146 తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. గిరిజనుల కష్టాలు చూసిన కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 3146 తండాలను ఆదివాసీ గూడేలను పంచాయతీలు గా మార్చారని అన్నారు. రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఏ నాయకుడు వచ్చినా మోదీతో సహా కేవలం సీఎం కేసీఆర్ టార్గెట్ చేసి తిట్టుడే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిట్టడం ఏంటని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రమేష్, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ ఆంజనేయులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, మేఘమాల, కవిత, ఎంపీపీలు మంజుల, హరికృష్ణ, వినోద, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు మనసూర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శేఖర్ పట్టణాధ్యక్షుడు భిక్షపతితో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు......

కెసిఆర్ అవినీతి ఢిల్లీ వ‌ర‌కు పాకింది.. : బిఆర్ఎస్ పై మోడీ విమ‌ర్శ‌ల దాడి

హన్మకొండ జిల్లా:జూలై 08

కేసీఆర్ ప్రభుత్వం అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం అని.. ఇప్పుడు వారి అవినీతి ఢిల్లీకి కూడా పాకిందని ప్ర‌ధాని మోడీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ పని , వారికి పొద్దున లేస్తే అదే పని అని మండిపడ్డారు. కుటుంబాన్ని పెంచిపోషించడమే కేసీఆర్ సర్కార్ పని పని అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం స్కామ్‌ల్లో ఇరుక్కుందని , కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు వాటిని వెలికితీసే ప‌నిలో ప‌డ్డాయ‌ని అన్నారు.. వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించిన బిజెపి విజ‌య సంక‌ల్ప స‌భలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. భద్రకాళి అమ్మవారి మహాత్యానికి, సమ్మక్క-సారలమ్మ శౌర్యానికి, రాణి రుద్రమ పరాక్రమానికి నిదర్శనమైన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఒక బీజేపీ కార్యకర్తగా తాను వరంగల్‌కు వచ్చానని చెప్పారు. జనసంఘ్ కాలం నుంచి ఈ ప్రాంతం తమ భావజాలానికి బలమైన కోటగా ఉందని అన్నారు. ఇక త‌న ప్ర‌సంగంలో కెసిఆర్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు..కుటుంబ పాల‌న‌, అవినీతి ప్ర‌భుత్వం అంటూ ప‌దే ప‌దే వ‌క్కాణించారు. దేశంలోని కుటుంబ పార్టీలన్నింటికీ అవినీతి పునాది ఉందని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించిందని మండిపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం చేసింది 4 పనులు మాత్రమేనని.. ఉదయం, సాయంత్రం మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుర్భాషలాడటం.. ఒక కుటుంబాన్ని అధికార కేంద్రీకృతం చేసి తెలంగాణకు వారే యజమాని అని నిరూపించుకోవడం.. తెలంగాణ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడం.. తెలంగాణను అవినీతిలో ముంచడం అంటూ మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 9 సంవత్సరాలలో మొత్తం ప్రపంచంలో భారతదేశం గర్వం పెరిగిందని అన్నారు. అందరూ భారతదేశం వైపు చూస్తున్నారని.. దీని వల్ల తెలంగాణ కూడా లాభపడిందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని.. తెలంగాణ యువత దీని వల్ల లబ్ది పొందుతున్నారని, వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. ఎక్కడైనా అభివృద్ది కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని.. అవినీతి కోసం ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇందుకోసమేనా తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసిందని? ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని అన్నారు. కేసీఆర్ అవినీతి నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ స్కామ్‌తో యువత ఎంతో నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలకు రెండూ ప్రాణాంతకమే అని అన్నారు. ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడాలని కోరారు. తెలంగాణ వర్సిటీల్లో మూడువేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగ యువతకు రూ. 3 వేల భృతి ఇవ్వలేదని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై సర్పంచ్‌లు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. 9 ఏళ్లలో కేంద్రం గ్రామపంచాయితీలకు లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని చెప్పారు. ఆ నిధులను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. తాము రైతుల పంటకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చి.. చేసి చూపించామని అన్నారు.

తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఎస్సీలు, ఎస్టీలు, పేదలను మోసం చేసిందని విమర్శించారు. ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యం కల్పించడం లేదని మండిపడ్డారు. తాము ఆదివాసీ ప్రాంతాల్లో ఆరులైన్ల రహదారులు వేస్తున్నామని చెప్పారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే హైదరాబాద్‌లో కొందరికి నిద్రపట్టదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. గ‌తాన్ని ప్ర‌స్తావిస్తూ, బీజేపీ తొలుత సాధించిన రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి హన్మకొండ అని అన్నారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని అన్నారు. అందులో తెలంగాణ అతి ముఖ్యమైన భూమిక అని చెప్పారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ ట్రైలర్ చూపించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. “అబ్ కీ బార్ బిజెపి సర్కార్” అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు...