/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz హకీంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ Yadagiri Goud
హకీంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ :జూలై 08

హకీం పేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ ప్రధాని వెళ్లనున్నారు. వరంగల్ లోని మామునూరు ఎయిర్ స్ట్రిప్‌లో దిగనున్నారు.

వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. వ్యాగన్ తయారీ, పీవోహెచ్ సహా పలు అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం చుట్టనున్నారు.

హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు....

సిఐ స్వర్ణలత -దొంగ , పోలీసా ❓️

విశాఖపట్నం:జూలై 08

మూడేళ్ల కిందట విశాఖ జిల్లా ఎస్పీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకుడు అయ్యన్న పాత్రుడిపై ఇష్టారీతిన మాట్లాడిన ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ని చాలా మంది గుర్తు పెట్టుకునే ఉంటారు. ఆమె పోలీస్ ఆఫీసర్స్ సంఘానికి ఉపాధ్యక్షురాలు కూడా. ఆమె పేరు స్వర్ణలత. ఇప్పుడు ఆమె బండారం మొత్తం బయటపడింది. ఏకంగా ఓ దోపిడీ ముఠానే నడుపుతున్నట్లుగా బయటపడింది.

ఈ వ్యవహారం పోలీసు శాఖలో సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి అధికారులను కాపాడేందుకు ప్రభుత్వంలోని వైసీపీ పెద్దలు ఎప్పుడూ రెడీగా ఉంటారు కాబట్టి.. తెర వెనుక ప్రయత్నాలు జరుగతూనే ఉన్నాయి. విశాఖపట్నంలో రూ. 90 లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వం వహించారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ సీఐగా స్వర్ణలత పనిచేస్తున్నారు. రూ. 90 లక్షల్లో సీఐ స్వర్ణలత రూ. 20 లక్షలు నొక్కేశారు. సీఐ స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా స్వర్ణలత ఉన్నారు. రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపా లని డీసీపీ -1 విద్యాసాగర్ నాయుడు, క్రైమ్ డీసీపీ జి.నాగన్నలను ఆదేశించారు. విచారణలో ఆ ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో శుక్రవారం సీపీకి నివేదించారు. మరోవైపు రిటైర్డ్‌ నేవీ ఉద్యోగులను బెదిరించి లక్షలు కాజేసిన సిఐకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. నిందితులైపై చర్యలకు సిద్దమైన సమయంలో నగరానికి చెందిన ఒక వైసీపీ ప్రజాప్రతినిధి ఫోన్ చేసి. కేసు లేకుండా వదిలేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాధితులు నగదుతో వస్తున్నారనే సమాచారం లీక్ చేసి కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి దోపిడీలు చేసి ఉంటారని.. ఇప్పుడు బయటపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు స్వర్ణలతను అరెస్ట్ చేస్తారా లేకపోతే.. అలాంటి ఆఫీసర్లే తమ బలం అని వదిలేస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

నేడు సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్‌

వైఎస్సార్‌ జిల్లా: జూలై 08

నేటి నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు.శనివారం దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం 2.05 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకోనున్న సీఎం.. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం తిరిగి ఇడుపులపాయలో

తన నివాసానికి సీఎం చేరుకోనున్నారు.

9వ తేదీ పర్యటన

రెండో రోజు పర్యటనలో భాగంగా 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకోనున్న సీఎం జగన్‌.. గండిపేట వద్ద ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ ఆఫీసు భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.

అనంతరం పులివెందుల, రాణి తోపు చేరుకుని నగరవనం ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్‌ ఫ్రెంట్‌ చేరుకుని.. గరండాల కెనాల్‌ డెవలప్‌మెంట్‌ ఫేజ్‌ –1 పనులను సీఎం ప్రారంభించనున్నారు. తర్వాత పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్సార్‌ ఐఎస్‌టిఏ) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్‌ బయో సైన్సెస్‌ను సీఎం ప్రారంభించున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు.

10వ తేదీ పర్యటన

మూడో రోజూ వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్‌ మార్గ్, రాజీవ్‌ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తి బయలుదేరి వెళ్లనున్న సీఎం.. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్‌ యూనిట్‌ను ప్రారంభోత్సవం చేయడంతో పాటు పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు.........

గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా సాయిచంద్‌ సతీమణి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్‌డబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌గా వేద రజినిని ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్‌ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని సాయిచంద్‌ భార్య రజినికే ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ మేరకు సాయిచంద్‌ భార్య రజినిని చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దివంగతులైన బీఆర్‌ఎస్‌ నేతలు సాయిచంద్‌, కుసుమ జగదీశ్‌ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇరువురి కుటుంబాలకు రూ.కోటిన్నర చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. వారి పిల్లలు, తల్లిదండ్రుల పేరిటరూ.25 లక్షల చొప్పున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని ప్రకటించారు. సాయిచంద్‌ సతీమణికి గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చామని చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ మొదటి నుంచి ఉద్యమంలో తమతోపాటు కలిసి పనిచేశారని గుర్తుచేశారు. 2001 నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌కు అనుంగు సహచరుడిగా, యువజన విభాగం నాయకుడిగా పనిచేశారని చెప్పారు. చిన్న వయసులో కుసుమ జగదీశ్‌ మరణించడం బాధాకరమని, ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌, తమ్ముడు సాయిచంద్‌ చాలా చిన్న యవసులో అకాలమరణం చెందారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరి అకాల మరణం పట్ల పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తీవ్రంగా కలత చెందారని తెలిపారు. పార్టీకి దశాబ్దాలపాటు వారు చేసిన సేవలను గౌరవించి జగదీశ్‌ను జెడ్పీ చైర్మన్‌గా, సాయిచంద్‌ను గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారని చెప్పారు......

మత్స్యకారుల వలలో బంగారు తాబేలు!

శ్రీసత్యసాయిజిల్లా:జూలై 08

మడకశిర మండలంలోని కల్లుమర్రి చెరువులో శుక్రవారం సాయంత్రం మత్స్యకారులకు అరుదైన తాబేలు చిక్కింది.

గ్రామానికి చెందిన కొందరు యువకులు చెరువులో వల వేయగా చేపలతోపాటు తాబేలు పడింది. ఆ తాబేలు బంగారు రంగులో ఉంది. దానిని చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు.

ఆ తాబేలు పలువురు పూజలు చేశారు. ఏదైనా దేవస్థానానికి సంబంధించిన కోనేరులో ఆ తాబేలును వదలాలని మత్స్యకారులు నిర్ణయించుకున్నారు

నేడు వరంగల్ కు ప్రధాని రాక

6 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధికార బీఆర్‌ఎస్‌తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రధాని నరేంద్రమోదీ వరంగల్‌ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఈ సందర్భంగా బీజేపీ విజయసంకల్ప సభ నేపథ్యంలో ఈ సభలో మోదీ రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? ఇటీవలి పరిణామాలతో రాష్ట్రంలో అయోమయంలో పడిపోయిన బీజేపీ క్యాడర్‌కు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. సరిగ్గా మూడు నెలల క్రితం ఏప్రిల్‌ 8న రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ.. సికింద్రాబాద్‌ రైల్వేస్షేషన్‌ ఆధునికీకరణతోపాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా, పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ కుటుంబంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదని తేల్చిచెప్పారు. దీంతో, అప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించిన దృష్ట్యా.. ఆమెను అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా గడచిన మూడునెలల్లో సమీకరణాలు మారాయి. లిక్కర్‌ స్కాం కేసు దర్యాప్తు మందగించింది. రాష్ట్ర బీజేపీలో అసమ్మతి రాజుకుని క్యాడర్‌లో అయోమయం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ వరంగల్‌కు వస్తున్నారు.

భారీగా పోలీసు బందోబస్తు..

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటనలో భాగంగా బహిరంగ సభకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో వేదిక సిద్ధమైంది. మోదీ రాక సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించగా, కాంగ్రెస్‌, వామపక్షాలు సైతం మోదీ పర్యటనను నిరసిస్తున్నాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయా పార్టీల నాయకులను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. పలువురు ముఖ్యనేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ బృందం 24 గంటల ముందే స్వాధీనం చేసుకుంది. కాగా, ప్రధాన మోదీ శనివారం ఉదయం 10.15 గంటలకు నగరానికి చేరుకుంటారు. మామునూరు విమానాశ్రయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో దిగుతారు. భద్రకాళి దేవాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. ఇక్కడ రూ.6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో రూ.3,441 కోట్ల ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా వరంగల్‌మంచిర్యాల జాతీయ రహదారి విస్తరణ, రూ.2,147 కోట్లతో జగిత్యాలకరీంనగర్‌వరంగల్‌ మధ్య రహదారి పనులు, రూ.521 కోట్లతో చేపట్టనున్న రైల్వే గూడ్స్‌ వ్యాగన్ల తయారీ కేంద్రం ఉన్నాయి. వీటికి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించిన అనంతరం.. బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.

వర్షం వచ్చినా అంతరాయం కలగకుండా..

బహిరంగ సభకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో సభాప్రాంగణాన్నంతా జర్మన్‌ టెక్నాలజీ టెంట్లతో కప్పేశారు. సభలో ఎక్కడ కూర్చున్నా అందరికీ మోదీ స్పష్టంగా కనిపించేలా పలుచోట్ల డిజిటల్‌ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఒక ప్రధానమంత్రి వరంగల్‌కు రావడం దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ప్రధాని ఏమైనా వరాలు ప్రకటించవచ్చునని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీపై ద్వేషంతోనే సీఎం కేసీఆర్‌ వరంగల్‌లో అభివృద్ధి పనులకు దూరంగా ఉంటున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. బెంగాల్‌, తమిళనాడు, ఏపీతోపాటు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో కూడా సీఎంలు ప్రొటోకాల్‌ పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని కేసీఆర్‌కు హితవు పలికారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని ప్రపంచ దేశాలు హీరో అంటూ కీర్తిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు...

తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల :జూలై 08

వీకెండ్ కావడంతో నేడు (శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 69,483 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 32,459 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

ఏ మొహం పెట్టుకొని మోదీ వరంగల్ కు వస్తున్నాడు

ప్రధాని నరేంద్ర మోదీ పై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి అని ధ్వజమెత్తారు.

తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్న ప్రధాన మంత్రికి, తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గుజరాత్ లోని దహోడ్ లో 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారని, కానీ రాష్ట్ర పునర్ విభజన హామీలో భాగమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మాత్రము మొండి చేయి చూపించారని, కేవలం 520 కోట్ల రూపాయలతో కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాజీపేట లో పెట్టి గుజరాత్ కు కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయారని కేటీఆర్ మండిపడ్డారు.

ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు : తెలంగాణకు 520 కోట్ల రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ కి 20000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ తీసుకుపోయిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారన్నారు కేటీఆర్. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హామీని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని, తొమ్మిదేళ్ల పాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్....

సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టివేత

సంగారెడ్డి జిల్లా:జూలై 07

జహీరాబాద్ అంతరాష్ట్ర ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. చిరాగ్ పల్లి ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆబ్కారీ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ కారులో రెండు బాక్సుల్లో తరలిస్తున్న కేజీన్నర బంగారాన్ని పట్టుకున్నారు.

ముంబయి నుంచి హైదరాబాద్‌ కు వస్తున్న కారులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ కోటికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సరైన పత్రాలు లేకుండా బంగారం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది....

కడియం శ్రీహరి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ :;ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

హన్మకొండ:జూలై 07

ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

''కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త. ఆయన మంత్రిగా ఉన్నపుడు నా మాదిగ బిడ్డలను ఎంతోమందిని ఎన్‌కౌంటర్ చేయించాడు.

నేను త్యాగం చేసి పార్టీలోకి వస్తే.. కడియం శ్రీహరి స్వార్థం కోసం బీఆర్ఎస్‌లోకి వచ్చారు. కడియం శ్రీహరి ఆంధ్రా అల్లుడు.. వారసుడా...? కులం పేరు చెప్పుకునే దమ్ము ఆయనకుందా..?" అని ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్నించారు...