/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణకు విచ్చేస్తున్న ‘డీకే’.. Yadagiri Goud
తెలంగాణకు విచ్చేస్తున్న ‘డీకే’..

•ఈ పెను సవాళ్ల సంగతేంటి..

•ఈ 5 హామీలతో కేసీఆర్‌ను ఢీ కొంటారా..?

డీకే శివకుమార్..డీకే.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం వెనుక ఆయన వ్యూహాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుందని హైకమాండ్ గుర్తించింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డీకేకు.. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు ముగియగా.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందని గత రెండు మూడ్రోజులుగా పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల అబ్జర్వర్‌గా నియమించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. డీకే తెలంగాణకు వస్తారు సరే.. ఇక్కడ పార్టీలో పరిస్థితులను ఎలా చక్కబెడతారు..? ఆయన ముందున్న సవాళ్లు ఏంటి..? ఆయన కర్ణాటక ఫార్ములానే ఇక్కడ అమలు చేస్తారా..? లేకుంటే ఆయన టార్గెట్ వేరే ఉందా..? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

వస్తారు సరే.. ఇవన్నీ ఎలా..?

వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే.. నేతల్లో మాత్రం ఎవరిదారి వారిదే అన్నట్లుగా పరిస్థితులున్నాయ్. ఎందుకంటే.. పార్టీని వివాదాలు, విబేధాలు, అసంతృప్తి ఎప్పుడూ వెంటాడుతుంటాయ్. రాష్ట్ర నేతలు ఎప్పుడేం మాట్లాడతారో..? ఎలా యూటర్న్ తీసుకుంటారో..? ఎప్పుడు గుడ్ బై చెప్పేసి వేరే గూటికి చేరతారో..? ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు తలెత్తుతాయో..? ఎవరు అసమ్మతి గళం వినిపిస్తారో తెలియని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే మూడ్రోజులు మంచిగా ముచ్చటగా ఉంటే ఆ తర్వాత ఇక ఆ నేతల మధ్య ఏదో ఒక విషయంలో కచ్చితంగా గొడవ జరుగుతుంది. దీనికి తోడు ఎవరికివారే ప్రకటనలు చేసేస్తుంటారు.. పార్టీ లైన్ దాటేసి మరీ మాట్లాడేస్తుంటారు.. ఇదీ టీ. కాంగ్రెస్ పరిస్థితి. ఈ పరిణామాల మధ్య ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ తెలంగాణకు వస్తే ఏం చేస్తారు..? పరిస్థితులను ఎలా చక్కబెడతారు..? అనేవి ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లు. మరీ ముఖ్యంగా.. టికెట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన.. ఆ తర్వాత నెలకొనే పరిస్థితులు కూడా పెద్ద టాస్కే.! అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిజంగా ఈ సమస్యలను పరిష్కరించడంలో డీకే సక్సెస్ అయితే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో.

రంగంలోకి దిగిపోయారుగా..!

కాంగ్రెస్‌లో పరిస్థితులను చక్కబెట్టడానికి డీకే ఇప్పటికే రంగంలోకి దిగేశారు. పార్టీలో చేరికల నుంచి ట్రబుల్‌ షూటింగ్‌ వరకు అన్నీ ఇక ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయని ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన భేటీని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరికపై బెంగళూరుకు పిలిపించుకొని మరీ డీకే రహస్య సమావేశం నిర్వహించారు. ఈ భేటీ తర్వాతే ఆ ఇద్దరూ మనసు మార్చుకోవడం, ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం లాంటివి చేశారట. అంతేకాదు.. చేరికలపై నిత్యం తెలంగాణ ముఖ్యనేతలతో డీకే టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలో అధికారానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించాలంటే రాష్ట్ర, నియోజకవర్గ స్థాయుల్లో ప్రభావం చూపగల ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్పనిసరి అని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఆర్థికంగా, సంస్థాగతంగా బలంగా ఉన్న అధికార బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే.. చేరికల ద్వారా నియోజకవర్గ స్థాయిలో పార్టీని పటిష్ఠం చేయక తప్పదన్న నిశ్చితాభిప్రాయానికి అధిష్ఠానం వచ్చింది.

హామీలు.. వ్యూహాలు ఇలా..?

కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయానికి 5 కీలక హామీలే ప్రధానం. రైతు రుణమాఫీ, ఉచిత గృహ విద్యుత్, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవే కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ఈ పథకాలను తెలంగాణలోనూ ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు అప్పుడున్న పరిస్థితులను బట్టి.. ఉద్యోగాలు, ఉద్యమ నేతలకు పెన్షన్, పెన్షన్ పెంపు.. ఇలా అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా ఉండే పథకాలు మేనిఫెస్టోలో పెట్టాలని అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇవేకాదు ఏం చేసైనా సరే.. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలన్నదే లక్ష్యంగా డీకే వ్యూహాలు రచిస్తారట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మునుపటితో పోలిస్తే బీజేపీ బలహీనపడటం, బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం కూడా కాంగ్రెస్‌కు అన్నివిధాలుగా కలిసొచ్చే అంశాలని వ్యూహకర్త సునీల్ కనుగోలు భావిస్తున్నారట. అందుకే ఈ విషయాలన్నీ ‘పే సీఎం’ కర్ణాటకలో ఎలాగైతే జనాల్లోకి తీసుకెళ్లారో.. అలాగే ఇక్కడ కూడా పక్కాగా ప్లాన్ చేశారట. వీటికి తోడు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటన నెలలో రెండు, మూడుసార్లు ఉండేలా పక్కా ప్రణాళిక రచిస్తున్నారని తెలియవచ్చింది. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

... ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ అయ్యి పదిరోజులకోసారి రాష్ట్రంలో పర్యటించాలని కోరిన విషయం తెలిసిందే.

మొత్తానికి చూస్తే..

ఓ వైపు రేవంత్, ఇంకోవైపు వ్యూహకర్త పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్న ఈ పరిస్థితుల్లో డీకే కూడా వీరికి తోడైతే కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అంతేకాదు రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న ట్రబుల్స్‌ను పరిష్కరించడం ట్రబుల్ షూటర్ డీకేకు పెద్ద విషయమే కాదని నేతలు చెప్పుకుంటున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరున్న గులాబీ బాస్ కేసీఆర్‌ను తట్టుకుని.. డీకే, రేవంత్, సునీల్ ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే మరి..

Akhilesh Yadav: సార్వత్రికంలో NDA ఓటమికి అఖిలేశ్‌ ఫార్ములా..

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ఒకే తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి..

ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) ఎన్డీయేను ఓడించేందుకు కొత్త ఫార్ములాను సూచించారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు కలిస్తే ఎన్డీయేను సులువుగా ఓడించొచ్చని చెప్పారు. యూపీలోని 80 సీట్లలో ఓడిస్తే భాజపాను పరాజయం చేయవచ్చన్నారు. ఈ మేరకు లఖ్‌నవూలో ఎన్డీటీవీ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

''ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో భాజపాను ఓడించాలంటే ప్రముఖ జాతీయ పార్టీలు మాకు అండగా ఉండాలి. యూపీలో భాజపాను ఓడిస్తే ఆ పార్టీ పనైపోయినట్లే. అలాగే, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో చూసుకుని దానిబట్టి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం జరగాలి'' అని అఖిలేశ్‌ సూచించారు. ఈ సందర్భంగా విపక్షాల ఐక్యత గురించి ఆయనను ప్రశ్నించగా.. ''80 సీట్లలో ఓడించండి.. భాజపాను సాగనంపండి'' అని నినాదం ఇచ్చారు..

ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 లోక్‌సభ సీట్లు ఉండగా.. 2019 ఎన్నికల్లో ఎస్పీ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ ఐదింట్లో ఇటీవల రామ్‌పూర్‌, అజంఘడ్‌ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కోల్పోయింది. భాజపా ఆ రెండు సీట్లను దక్కించుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుపై అఖిలేశ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిత్రపక్షాల విషయంలో తామెప్పుడూ నిజాయతీగా వ్యవహరిస్తామని చెప్పారు. సీట్ల గురించి కలహించుకునే పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలోనూ, శాంతిభద్రతలను కాపాడడంలోనూ యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ విఫలమైందని ఈ సందర్భంగా విమర్శించారు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ చోరీ

10 లక్షల విలువైన వజ్రాలు, 10 తులాల బంగారు నగలు కొట్టేసిన దొంగ

రైలు ఎక్కుతుండగా మహిళ బ్యాగ్ లాక్కుని పరారీ

సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. రూ.10 లక్షల విలువైన వజ్రాలు, పది తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఆ మహిళ కేకలు వేయడంతో స్టేషన్ లోని ప్రయాణికులు, రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే, అప్పటికే దొంగ పరారయ్యాడు.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లికి చెందిన స్రవంతి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. శనివారం తిరుపతి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు స్రవంతి వచ్చారు. ఈ క్రమంలో రైలు ఎక్కుతుండగా స్రవంతి చేతిలోని బ్యాగ్ ను గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లాడు.

శనివారం ఉదయం రైల్వే స్టేషన్ కు చేరుకున్న స్రవంతి వందేభారత్ ట్రైన్ కోసం వేచి ఉంది. చాలా సేపటి నుంచి ఆ స్రవంతిని గమనిస్తున్న యువకుడు.. రైలు ఎక్కే సమయంలో తాను కూడా ఎక్కుతున్నట్లు నటించాడు. రైలు ఎక్కే క్రమంలో స్రవంతి చేతిలో ఉన్న బ్యాగును లాక్కుని పరుగు అందుకున్నాడు.

బ్యాగు పోవడంతో స్రవంతి నెత్తీనోరు బాదుకుంది. బ్యాగులో డైమండ్ నెక్లెస్ తో పాటు పది తులాల బంగారం, పది లక్షల విలువైన రెండు వజ్రాలు ఉన్నాయని చెబుతూ రోదించింది. స్రవంతి ఫిర్యాదుతో రైల్వే పోలీసులు స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు...

Tourists: ఆకస్మిక వరదలు.. చిక్కుకుపోయిన 2400 మంది పర్యాటకులు!

గాంగ్‌టక్‌: సిక్కిం (Sikkim)ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది..

ఆకస్మిక వరదల (Flash Floods) ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ కారణంగా ఉత్తర సిక్కిం (North Sikkim) జిల్లాలోని లాచెన్- లాచుంగ్ ప్రాంతంలో 2,400 మందికిపైగా పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. చుంగ్తాంగ్‌కు వెళ్లే రహదారి అనేక చోట్ల దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయినట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన జిల్లా విపత్తు నిర్వహణ సిబ్బంది, సిక్కిం పోలీసులు, బీఆర్‌వో, ఐటీబీపీ, ఆర్మీ బృందాలు కలిసి సహాయక చర్యలు మొదలుపెట్టాయి. పర్యాటకుల తరలింపునకు తాత్కాలిక వంతెనలను ఏర్పాటు చేశాయి.

మొత్తం 2,464 మందిని తరలించేందుకు 19 బస్సులు, 70 చిన్న వాహనాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి.. 123 మంది పర్యాటకులతో కూడిన మూడు బస్సులు, మరో రెండు వాహనాలు రాష్ట్ర రాజధాని గాంగ్‌టక్‌కు బయలుదేరాయని చెప్పారు..

అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు

_వేములవాడ : ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. వేములవాడ రాజన్న సన్నిధిలో శనివారం కోడెమొక్కులు చెల్లించుకుని ఆ నందీశ్వరుడి సాక్షిగా.. మనసున మనసై అని పాడుకుంటూ పెళ్లి కూడా చేసేసుకున్నారు. వారిలో ఒకరు హిజ్రా అయితే.. ఇంకొకరు ఓ యువకుడు._

_వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పింకీ అనే 22 ఏళ్ల హిజ్రాను.. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వేములవాడ రాజన్న సన్నిధిలో మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటైంది.

డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆటో నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా పింకీ, శీనుల వివాహ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి._

_​కాగా ఇటీవల ఇలాంటి వివాహమే మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరూ(30) కి రైలులో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు...!!_

KCR: హరగోపాల్‌ సహా ఇతరులపై ఉపా కేసు ఎత్తివేత: సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌: పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు..

వెంటనే కేసుల ఎత్తివేతకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను సీఎం ఆదేశించారు.

మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టం కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని..

వెంటనే వారిపై నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన కేసీఆర్.. హరగోపాల్ సహా ఇతరులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నారు..

ఈ నెల 22 న రాహుల్ గాంధీతో భేటీ : 30న కాంగ్రెస్ గూటిలోకి

ఖమ్మం జిల్లా :జూన్ 17

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఈ నెలాఖరున అంటే జూన్ 30న పొంగులేటి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈనెల 22న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి, కూచూకుళ్ళ దామోదర రెడ్డి, పిడమర్తి రవి తదితరులు భేటీ కానున్నారు.

భేటీ అనంతరం తెలంగాణలో వేరువేరు బహిరంగ సభల్లో పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 30న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.

ఖమ్మం సభలో పొంగులేటి అండ్ టీమ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనుంది. ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. పొంగులేటితో పాటు మ‌రికొంద‌రు నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.....

పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

కృష్ణాజిల్లా :జూన్ 27

పంటకాల్వలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో.. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

జిల్లాలోని వానపాముల దగ్గర కొద్దిసేపటి క్రితం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణీస్తున్న పలువురు గాయపడ్డారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 68మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.....

SB NEWS

తొలకరి పలకరింపేదీ?

‘నైరుతి’ కోసం రైతుల ఎదురుచూపు

వర్షాల ఆలస్యంతో ముందస్తు సాగుకు గ్రహణం

వానాకాలం సీజన్‌కు ఆదిలోనే హంసపాదు

ఏరువాక పౌర్ణమి వచ్చింది వెళ్లింది.. మృగశిర కార్తెలో సగం గడిచిపోయింది. ఇప్పటికీ నైరుతి రుతుపవనాల పలకరింపు లేదు. తొలకరి పలకరింపు కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఫలితంగా ఆదిలోనే హంసపాదు అన్నచందంగా వానాకాలం సాగుకు గ్రహణం పడుతోంది. కాలం దాటుతున్నా నైరుతి రుతుపవనాల జాడ లేకపోవడం.. ఆశించిన మేర వర్షాలు పడే అవకాశం లేదని రైతుల ఆందోళన చెందుతున్నారు. జూన నెల సగం అయిపోయినా ఎండలు మండుతుండటం.. వేడి గాలులు వీస్తుండటం అన్నదాతలను మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయి. 2015 నాటి కరువు పరిస్థితులు పునరావృతమవుతాయని చాలామంది అభిప్రాయపడుతున్నాయి.

పొడిదుక్కుల్లోనే విత్తనాలు..

రోహిణి కార్తెలో విత్తనం నాటితే ఈ సమయంలో మొక్క మొలుస్తుందని, ఆ మొక్కలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి చీడ పీడలను తట్టుకోవడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా వస్తాయని రైతులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో రోహిణి కార్తె ప్రారంభం కాగానే జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతుల పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు వేశారు. ఎప్పటి లాగే వర్షాలు పడితే మొలకలు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ రుతుపవనాల రాక ఆలస్యమై వానలు రాక.. ఆవిత్తనాలు మట్టిలోనే పొట్లిపోతుండటంతో రైతులు అందోళన చెందుతున్నారు. బోర్లు, బావుల నీటి ఆధారం ఉన్న రైతులు విత్తనం నాటిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే తడులు మళ్లించే ప్రయత్నం చేస్తున్నా.. ప్రస్తుతం ఎండ తీవ్రతకు ఆ ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. అక్కడక్కడ రైతులు భయంతోనే వరినారు కూడా పోస్తున్నారు. మొన్నటి వరకు అకాల వర్షాలు, వడగళ్ల వానలతో చేతికందిన దశలో పంటలు నష్టపోయిన రైతులు.. ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పంటలు చేతొకొచ్చే దశలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే వానాకాలం పంట సాగును నెల రోజుల ముందుకు తీసుకొచ్చి.. జూన మూడో వారం కల్లా వరినాట్లు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే జరిగితే మార్చి నెలాఖరుకు వరి కోతలు వచ్చి అకాల వర్షాలు, రాళ్ల వానల నుంచి కాపాడుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా పంట కాలాన్ని ముందుకు తేవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే రుతుపవనాలు కాపాడకపోవడంతో వానాకాలం పంటల సాగు మరింత వెనక్కు వెళ్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.

ముందస్తు సాగు కష్టమే..

వ్యవసాయ శాఖ నాలుగేళ్ల నివేదికల ప్రకారం వానాకాలం, యాసంగి సీజన్ల జాప్యం కారణంగా అన్నదాతలు వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, రైతులు పంటలు నష్టపోతున్నారని, ఆ పరిస్థితిని అధిగమించాలంటే ఈ వానాకాలాన్ని ముందస్తుగానే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభ్తుత్వం రైతులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో సహకార సంఘాల ద్వారా భూసారానికి అవసరమైన జీలుగులు, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చే శారు. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు ముందుగానే పచ్చిరొట్ల విత్తనాలు చల్లారు. ఉదాహరణకు కల్లూరు డివిజన పరిధిలోని కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు,పెనుబల్లి, తల్లాడ, మండలాల్లోని పలు గ్రామాల రైతులు పచ్చి రొట్ట విత్తనాలు చల్లడమే కాకుండా.. వెదజల్లే పద్ధతిలో వరి నార్లు కూడా పోశారు. ఇలా 1.20 లక్షల ఎకరాల్లో వరి, 80వేల నుంచి లక్ష ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ వానాకాలం సీజన్‌ ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పొడి దుక్కలకు అవసమైన కనీసం 8మీమీ వర్షపాతం కూడా నమోదు కాలేదు. వాస్తవానికి రుతుపవనాల ప్రభావంతో పడే వర్షాలతో పంటలు పండే పరిస్థితి నుంచి తుఫాన్‌ ప్రభావంతో పడుతున్న వర్షాలతోనే పంటలు సాగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఐదేళ్లుగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తరచూ అల్పపీడన ద్రోణులు ఏర్పడి మాత్రమే భారీ వర్షాలు పడుతున్నాయి.

6.16లక్షల ఎకరాల్లో సాగు అంచనా

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానాకాలం పంటల సాగు విస్తీర్ణం గతేడాది కంటే 66వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గత వానాకాలంలో 5.50లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ఈ వానాకాలంలో 6.16లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. దానిలో అత్యధికంగా వరి, పత్తి సాగుకు అన్నదాతలు మొగ్గు చూపుతుండగా తర్వాత స్థానాల్లో మిర్చి, ఆయిల్‌ పాం పంటలున్నాయి. వానాకాలం పంటలకు సంబంధించి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన పంట వరి 2,90,000 ఎకరాలు, మొక్కజొన్న 5,500 ఎకరాలు, పెసర 21వేల ఎకరాలు, పత్తి 2.15లక్షల ఎకరాలు, మిరప 80వేల ఎకరాలలో సాగు కావచ్చని అధికారులు అంచన వేశారు. అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల వివరాలను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.. కేపీ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డికి సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన ఆడిటర్లు వారి ఆర్థిక లావాదేవీలపై ఐటీ దృష్టి పెట్టింది.

సోదాల్లో కీలక మైనా సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఎమ్మెల్యేకు చెందిన కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, వారు చెల్లిస్తోన్న పన్నులకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. పైళ్ల శేఖర్‌ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్‌ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ శాఖ పరిశీలించినట్లు తెలుస్తోంది.

తీర్థా గ్రూప్‌కు డైరెక్టర్‌గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి హైదరాబాద్‌, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల క్రితం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డిలకు చెందిన నివాసాలు, వ్యాపారాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వరుసగా బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఒకేసారి ఐటీ శాఖ సోదాలు నిర్వహించడంతో బీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన్ మొదలైంది. వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతలే టార్గెట్‌ సోదాలు జరగినట్లు తెలుస్తోంది. సోదాల్లో బీఆర్‌ఎస్‌ నేతల నివాసాలు, వ్యాపారాల్లో పలు కీలక సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది..