/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణ వ్యాప్తంగా జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు Yadagiri Goud
నిజంనిప్పులాంటిది

May 16 2023, 11:48

తెలంగాణ వ్యాప్తంగా జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు

▪️తెలంగాణ జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.

▪️పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసిన పౌరసరఫరాల శాఖ.

▪️ఇందుకోసం రెండు కమిటీలను నియమించింది.

▪️కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు కొత్త పేర్లను చేర్చుకునేవారు దీనిని సద్వినియోగం చేసుకోనగలరు.

SB NEWS

SB NEWS

SB NEWS*

నిజంనిప్పులాంటిది

May 15 2023, 17:24

కౌన్ బనేగా కర్ణాటక సీఎం

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ జరిగేదే ఇప్పుడూ జరిగింది. ఆ పార్టీలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు వెనకడుగు వేస్తుంటారు. ప్రతీదీ హైకమాండ్ నిర్ణయించాల్సిందే. ఇప్పుడూ అంతే. కర్ణాటక సీఎం ఎవరన్నది ఎమ్మెల్యేలు తేల్చలేకపోయారు.

నిన్న బెంగళూరులో హడావుడిగా సమావేశమైన కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP).. సీఎం అభ్యర్థిని తేల్చలేకపోయింది. మీరే తేల్చాలని ఏకవాక్య తీర్మానం చేసి... బంతిని హైకమాండ్ కోర్టులోకి నెట్టేసి.. ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. హైకమాండ్ ఎవరిని సెలెక్ట్ చేస్తే వారికే తమ మద్దతు అనేశారు. దాంతో.. ఈ బాధ్యత హైకమాండ్ నెత్తిన పడింది.

కర్ణాటక నెక్ట్స్ సీఎం ఎవరన్న ప్రశ్నకు సింపుల్ సమాధానమే ఉంది. రేసులో ఉన్నది ఇద్దరే. ఒకరు ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య, మరొకరు అపరణ చాణక్యం ప్రదర్శించే KPCC చీఫ్ డీకే శివకుమార్. ఈ ఇద్దరిలో ఒకరిని సీఎం చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ రేసులో కూడా సిద్ధరామయ్యే ముందున్నారు. ఈసారికి ఆయన్ని సీఎం చేసి... శివకుమార్‌ని డిప్యూడీ సీఎం చేస్తారనీ లేదా ఆయనకు కీలక మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. దీనిపై తేల్చేందుకు ఇవాళ ఢిల్లీ రావాలని ఈ ఇద్దరికీ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది.

సీఎం సీటు పొందేందుకు అటు సిద్ధరామయ్య, ఇటు శివకుమార్ తమదైన ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఇద్దరి ఇళ్ల దగ్గరా కార్యకర్తలు గుమికూడి.. సీఎం అవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా... రెండు బలమైన వర్గాలుగా కార్యకర్తలు విడిపోతున్నట్లు స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం అంతా బాగుందని అంటున్నారు. పార్టీలో ఎలాంటి విబేధాలూ లేవని అంటున్నారు. సిద్ధరామయ్యను సీఎం చేస్తే... డీకేను ఎలా బుజ్జగిస్తారన్నది పెద్ద సమస్యగా ఉంది. ఈ విషయంపై హైకమాండ్... సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ... ఇతర జాతీయ సీనియర్ నేతల సలహాలు తీసుకుంటోంది.

నిజంనిప్పులాంటిది

May 15 2023, 17:05

తెలంగాణకు మరో అంతర్జాతీయ పరిశ్రమ

రాష్ట్రానికి మరో అంతర్జాతీయ పరిశ్రమ తరలివచ్చింది. ఎలక్ర్టానిక్స్‌, సెల్‌ఫోన్‌ తయారీ రంగంలో అతిపెద్ద సంస్థగా పేరొందిన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ (Foxconn) రాష్ట్రంలో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.

ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఫాక్స్‌కాన్‌ సంస్థ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఫాక్స్‌కాన్‌ సంస్థ ప్రతి నిధులతో కలిసి మంత్రి భూమిపూజ నిర్వహించారు. రూ.1,655 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌ గ్రామంలో ఫాక్స్‌కాన్‌ సంస్థ ఏర్పాటు కానుంది.

ఈ సంస్థ కోసం కొంగరకలాన్‌లో జిల్లా కలక్టరేట్‌ సమీపంలో సర్వే నెంబర్‌ 300లో రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమలో 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

పదేళ్లలో 15 లక్షల ఉద్యోగావకాశాలు: కేటీఆర్

భూమి పూజ అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రకటించారు. ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశామని చెప్పుకొచ్చారు.

మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు రానున్నాయన్నారు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌ లియా పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 15 2023, 15:11

వరంగల్ జిల్లా కమిషనరేట్ లో ఎస్ఐ సస్పెండ్

వరంగల్ జిల్లా:

వ్యవసాయ భూవివాదంలో నిందితుడికి సహకరించినందుకుగాను గతంలో రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఎన్ వీరేందర్ ను గతంలో పోలీస్ కమిషనరేట్ విఆర్ కు బదిలీ చేయడం జరిగింది.

భూ వివాదానికి సంబంధించి అధికారులు నిర్వహించిన విచారణకు ఎస్సై సహకరించకపోవడంతో పాటు ఈ వివాదంలో ఎస్సై నిందితుడికి సహకరించడంతో పాటు సంబంధించిన బాధితుల్ని ఇబ్బందులు గురి చేసినందునట్లు గా విచారణలో నిర్ధారణ కావడంతో ఎస్సై వీరేందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 15 2023, 15:09

100వ రోజుకు చేరిన నారా లోకేష్ పాదయాత్ర : పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు

శ్రీశైలం:

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన 'యువగళం పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది..

శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్‌ సైట్‌ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు.

ఈ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందుకు నడిచారు. మార్గంమధ్యలో తల్లి షూ లేస్‌ను లోకేశ్‌ కట్టారు. పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్‌ ఆవిష్కరించారు. బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో 'యువగళం' పాదయాత్ర జాతరను తలపిస్తోంది..

కుటుంబసభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్‌ శ్రీమాన్‌, సీహెచ్‌ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్‌ తదితరులు లోకేశ్‌తో కలిసి ముందుకు సాగారు. పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు తరలివచ్చారు..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 15 2023, 15:05

టిఎస్ పిఎస్పీ పరీక్షకు లక్ష మించితే ఓ ఎం ఆర్ పద్ధతే

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నిరుడు ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అక్టోబర్‌ 16న పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,85,916 మంది హాజరయ్యారు. మెయిన్స్‌కు 25,050 మందిని కమిషన్‌ ఎంపిక చేసింది.

ఈలోగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తోపాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది. మళ్లీ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీలో ప్రక్షాళనకు సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొలుత ప్రత్యేకంగా పరీక్ష విభాగాన్ని తీసుకొచ్చింది.

టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌గా బీఎం సంతోష్‌, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌ జగదీశ్వర్‌ రెడ్డిని నియమించింది. వీటితోపాటు కొత్తగా డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, సీనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, జూనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌ ప్రోగ్రామర్‌, జూనియర్‌ ప్రోగ్రామర్‌, లా ఆఫీసర్‌(జూనియర్‌ సివిల్‌ జడ్జి క్యాడర్‌) పోస్టులను మంజూరు చేసింది. దశలవారీగా భర్తీ ప్రక్రియ జరుగుతున్నది. గతంలో పనిచేసిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అందరినీ మార్చింది. మళ్లీ కొత్తగా ప్రశ్నపత్రాలను రూపొందించింది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని ఉద్యోగుల విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి విషయాన్ని డేగ కన్నుతో పరిశీలిస్తున్నది. జూన్‌ 11నే ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రణాళికలన్నీ సిద్ధం చేసింది. అభ్యర్థులు అనవసరపు ప్రచారాలు నమ్మకుండా, ప్రిపరేషన్‌ కొనసాగించాలని, షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష జరుగుతుందని టీఎస్‌పీఎస్సీలో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

లక్షకు మించితే ఓఎంఆర్‌ పద్ధతే!

రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేలలోపు అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఉన్నది. ఆ సంఖ్యను 50 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం 25 వేల నుంచి 50 వేలలోపు మంది అభ్యర్థులు ఉంటే కంప్యూటర్‌ బెస్డ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. రెండు సెషన్లలో పరీక్షను పూర్తిచేసి, మార్కులను నార్మలైజేషన్‌ పద్ధతిలో లెక్కిస్తున్నారు. లక్ష కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మాత్రం ఓఎంఆర్‌ పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను సైతం ఓఎంఆర్‌ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది.

అయోమయానికి తెర

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షపై అభ్యర్థుల్లో కాస్త అయోమయం నెలకొంది. సమయం దగ్గర పడుతున్నా కొద్దీ పరీక్ష వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ సైతం ఆన్‌లైన్‌లో జరుగుతుందనే ప్రచారం జరిగింది. అసలు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందా? ఒకవేళ షెడ్యూల్‌ ప్రకారమే జరిగితే.. ఆన్‌లైన్‌లో జరుగుతుందా? ఆఫ్‌లైన్‌లోనా? అనే సందేహంలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. పరీక్ష షెడ్యూల్‌ ప్రకారమే, నోటిఫికేషన్‌లో పొందుపరిచినట్టే ఓఎంఆర్‌ పద్ధతిలోనే జరుగుతుందని టీఎస్‌పీఎస్సీలోని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. దీంతో అయోమయానికి తెరిపడినట్టయింది.

ఊపందుకొన్న పోటీ పరీక్షలు

టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల నిర్వహణ మళ్లీ ఊపందుకున్నది. ఈ నెలలోనే ఏడు పరీక్షలు నిర్వహణకు సంస్థ తేదీలను ప్రకటించింది. ఇప్పటికే రెండు పరీక్షలు పూర్తవగా, మరో ఐదు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత కోసం ఈసారి ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నది. ఇప్పటివరకు నిర్వహించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ)తోపాటు ఇతర పరీక్షలను అన్‌లైన్‌లోనే నిర్వహించింది.

నిజంనిప్పులాంటిది

May 15 2023, 12:01

సీఎం సంతకాలు పెట్టినా? కదలని ఫైళ్లు

సెక్రటేరియెట్ ఓపెనింగ్ నాడు పాత ఫైళ్లపై సంతకాలు

సీఎం కేసీఆర్ సంతకాలు పెట్టినా ఫైల్స్ ముందుకు కదలడం లేదు. పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో సీఎం సంతకానికీ విలువ లేదా? అన్న చర్చ సెక్రటేరియెట్ వర్గాల్లో నడుస్తోంది. గత నెల 30న బీఆర్ అంబేద్కర్ కొత్త సెక్రటేరియెట్ ఓపెనింగ్ తర్వాత పలు ఫైళ్లపై సీఎం సంతకాలు పెట్టారు. ఆయనతో పాటు మంత్రులు కూడా వివిధ స్కీములకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేశారు.

ఈ సంతకాలు చేసి 15 రోజులు గడుస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది. పాత ఫైళ్లపై సంతకాలు పెట్టి, ఇప్పుడే ఇచ్చేస్తున్నాం అన్నట్లు హడావుడి చేసిన ప్రభుత్వం.. రోజులు గడుస్తున్నా వాటిని పట్టాలు ఎక్కించడం లేదు. ఒకటి, రెండింటిలో కదలిక వచ్చినా వాటినీ అసంపూర్తిగానే వదిలేశారు. దీంతో నామ్ కే వాస్తే అన్నట్లు సంతకం చేసి చేతులు దులుపుకున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై ఉన్నతాధికారులను అడిగితే.. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇంకా రాలేదనే సమాధానం వస్తోంది. లక్షల మంది పేదలతో ముడిపడిన దళిత బంధు, పోడు పట్టాలతో పాటు న్యూట్రిషన్ కిట్​అమలు కావడం లేదు.

ఏడాదిగా ఊరిస్తున్నరు

దళితబంధు, పోడు పట్టాల పంపిణీపై రాష్ట్ర సర్కారు ఎప్పటి నుంచో ఊరిస్తోంది. ఏడాది కాలంగా అదిగో.. ఇదిగో అంటూ ప్రకటనలు చేయడమే తప్ప అమలులో మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయింది. ఆ ఫైళ్లపై సీఎం సంతకం పెట్టిన తరువాత కూడా ముందుకు కదలడం లేదు. ఒక్కో నియోజకవర్గంలో1,100 మంది చొప్పున దళితబంధు ఇవ్వాల్సి ఉండగా, స్కీం అమలు ముంగటపడటంలేదు.. ఇప్పుడు సీఎం సంతకం పెట్టిన తరువాత కూడా గైడ్​లైన్స్ ఇవ్వడం లేదు. లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టడం లేదు. సీఎం సంతకంతో ఇక దళితబంధు వచ్చినట్లేనని ఆశపడిన దళితులు.. ఇపుడు ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే పోడు పట్టాలను గత మార్చిలోనే పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. అప్పుడు చేయకపోగా సెక్రటేరియెట్ ప్రారంభించిన రోజు పట్టాల పంపిణీ రేపో మాపో అన్నట్లు హడావుడి చేశారు. కానీ ఇంతవరకు ఒక్క పట్టా కూడా పంపిణీ చేయలేదు. పోడు పట్టాల కోసం 1.35 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అలాగే గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఉద్దేశించిన న్యూట్రిషన్ కిట్ కు సంబంధించిన ఫైలుపైనా సీఎం సంతకం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో ఈ స్కీమ్ అమలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి అవసరమైన కిట్ల పంపిణీ కొన్ని నెలలుగా వాయిదా పడుతూనే ఉంది. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్​చేయాల్సి ఉండగా ఇంకా 5 వేల మందికి ఉత్తర్వులు రాలేదు.

మంత్రుల ఫైల్స్ కూడా అట్లనే

మంత్రులు సంతకాలు చేసిన కొన్ని ఫైల్స్ కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. డిస్కంలకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.958 కోట్లు చెల్లించే ఫైల్ పై జగదీశ్‌‌ రెడ్డి, కొత్త మండలాలకు ఐకేపీ భవనాల అనుమతి ఫైలుపై ఎర్రబెల్లి ద‌‌యాక‌‌ర్ రావు, జీహెచ్ఎంసీ పరిధిలోని 4 జిల్లాల్లో 100 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేసే ఫైల్ పై ఇంద్రకరణ్ రెడ్డి సంతకం చేశారు. కానీ ఈ ఫైల్స్ అన్నీ సంతకాలకే పరిమితం అయ్యాయి. అంగన్​వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీతో పాటు రాంజీ గోండు మ్యూజియానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా సంతకం చేసినా పెండింగ్​లో పెట్టారు.

పైనుంచి ఆదేశాలు వస్తేనే ముందుకు

సీఎం, మంత్రులు సంతకాలు పెట్టినంత మాత్రాన పనులు ముందుకు కదలవని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిదీ నిధులతో కూడుకున్నదని, అందుకు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి డిపార్ట్​మెంట్ల ఖాతాల్లోకి వచ్చి చేరాలని వారు అంటున్నారు. దాంతో పాటు వాటిని డ్రా చేసుకునేందుకూ అవకాశం ఇస్తేనే స్కీ ములు ముందుకు కదులుతాయని చెబుతున్నారు. సంతకాలు చేసినప్పటికీ పై నుంచి మళ్లీ ఆదేశాలు రావాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. ఇక ఫండ్స్​తో సంబంధం లేకుండా పోడు పట్టాల పంపిణీ చేపట్టేందుకు అవకాశం ఉన్నా.. రాజకీయ లబ్ధి కోసమే ఆలస్యం చేస్తున్నారని తెలిసింది.

నిజంనిప్పులాంటిది

May 15 2023, 11:58

ఈ సమ్మర్ చాలా హాట్ గురూ

రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వచ్చే మూడు రోజులు సోమ మంగళ వారాలు ఎండల తీవ్రత మరింత పెరిగి 45 డిగ్రీల ఉష్ణోగతలు దాటే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది.

రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరీంనగర్‌, జనగా మ, నల్ల గొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

14 జిల్లాలు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రా ద్రి కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మం చిర్యాల జిల్లాలో ఈ వడగాల్పుల ప్రభావం అధికం గా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

కొన్ని రోజుల క్రితం వరకు పగటివేళ ఉష్ణోగత్రలు పెరిగినా, రాత్రి వేళ మాత్రం చలిగాలులు వీచాయి. కానీ, ఇప్పుడు పగటి పూట ఎండలు దంచి కొడుతుండగా.. రాత్రి వేళలో మధ్యాహ్నం వేళ ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది.

నిజంనిప్పులాంటిది

May 15 2023, 11:57

తిరుపతి ‘వందే భారత్‌’ ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై మొత్తం 16 బోగీలు

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ట్రైన్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ రైలులో ప్రస్తుతం 8 కోచ్‌లు ఉండగా, ప్రయాణికుల కోరిక మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి 16 కోచ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇక ఇందులో 14 ఏసీ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. అలాగే సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది.

అయితే ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో 52 సీట్లు, చైర్‌కార్‌లో 478 సీట్లతో మొత్తం 530 సీట్లు ఉన్నాయి. ఈ రైలు ఆక్యుపెన్సీ ఏప్రిల్‌లో 131 శాతంగా నమోదైంది, మే మొదటి పది రోజుల్లో ఆక్యుపెన్సీ 134 శాతంగా ఉందని సమాచారం. అలాగే తిరుపతి నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు ఏప్రిల్‌లో 136 శాతం, మే నెలలో 137 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. అంతకముందు ఏప్రిల్ 8న సికింద్రాబాద్ నుంచి ఈ వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే..

వందే భారత్ ట్రైన్ కొత్త టైమింగ్స్..

ఉదయం 6గంటలకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి బయల్దేరుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20701) రైలు మే 17 నుంచి ఉదయం 6.15 గంటలకు బయల్దేరేలా అధికారులు మార్పులు చేశారు.

అలాగే నల్గొండకు ఉదయం 7.29/7.30 గంటలకు; ఆ తర్వాత గుంటూరుకు 9.35/9.40; ఒంగోలు 11.09/11.10; నెల్లూరు మధ్యాహ్నం 12.29/12.30 గంటలకు వెళ్లి అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలయ్యే సరికి తిరుపతికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక, తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరే రైలు(20702) నిర్ణీత స్టేషన్లలో ఆగుతూ అదే రోజు రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. స్థానాలను చేరనుంది.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 15 2023, 11:55

మరో ఏడు నెలలు ఎన్నికల వేడే

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగి శాయి కానీ ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో వరస ఎన్నికలు జరగనుండడంతో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దాకా రాజకీయ వేడి అలాగే కొనసాగే అవకాశం ఉంది. కనీసం మూడు రాష్ట్రాలకు అ సెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటుగా జరిగే అవకాశం ఉంది.

వాస్తవానికి ఈ ఏడాది మూడు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలలో అసెంబ్లీ ఎన్నికలతో మొదలైంది. ఇక కర్నాటక తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఏడాది డిసెంబర్ ,వచ్చే ఏడాది జనవరి మధ్య కాలంలో ఈ రాష్ట్రాల శాసన సభల గడువు ముగియనుండడంతో ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.40 స్థానాలున్న మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17తో ముగియనుండగా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువువచ్చే ఏడాది జనవరి 3, 6 తేదీల్లో ముగియనుంది.

ఇక రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో, తెలంగాణ అసెంబ్లీ గడువు అదే నెల 16తో ముగియనుంది. ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను తోసిపుచ్చలేము. ఈ ఎన్నికలే కాకుండా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ, కశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేకపోలేదు.

2023లో శీతాకాల ప్రభావం తగ్గిన తర్వాత వేసవిలో ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశముందని అధికార వర్గాలు గతంలో చెప్పాయి. జులై 1నుంచి ఆగస్టు 31 దాకా 62 రోజుల అమరనాథ్ యాత్ర ముగిసిన తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌లో జమ్మూ, కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల చట్టసభల గడువు వచ్చే ఏడాది జూన్‌లో ముగియనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పార్లమెంటు ఎన్నికలతో పాటుగా నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉంది.