/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz AP High Court: రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు.. పిటిషన్లపై హైకోర్టు విచారణ.. Yadagiri Goud
AP High Court: రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు.. పిటిషన్లపై హైకోర్టు విచారణ..

అమరావతి: ఆర్‌-5 జోన్‌లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయించిపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది..

రాజధాని పరిధిలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్లు ప్రశ్నించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని పేర్కొంది.

రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5వేల టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల మంజూరుకు అనుసరించిన విధివిధానాలను పూర్తి వివరాలతో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది..

Chikoti Praveen: థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

థాయిలాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ అయ్యింది. థాయిలాండ్‌లోని పటాయలో 90 మంది భారతీయులను అరెస్ట్ చేశారు..

భారీగా నగదు, గేమింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు. 20.92 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్.. 1.60 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు.

చీకొటి ప్రవీణ్ నేతృత్వంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. చీకొటి ప్రవీణ్, మాధవరెడ్డిని అక్కడి పటాయా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు..

Divorce: ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదు.. ఆర్టికల్ 142 ప్రకారం వెంటనే విడాకులు: సుప్రీంకోర్టు

Divorce: ఆర్టికల్ 142 ప్రకారం తక్షణమే విడాకులు ఇవ్వవొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. విడాకుల కోసం ఆర్నెళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది..

అయిదుగురు సభ్యుల బెంచ్ ఓ కేసులో కీలక తీర్పును ఇచ్చింది..

న్యూఢిల్లీ: విడాకులపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. విడాకులు(Divorce) కోరుకునే జంట ఆర్నెళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నప్పుడు.. ఆర్టికల్ 142 ప్రకారం తన అధికారాలను ఉపయోగించుకుని.. దంపతులకు విడాకులు ఇవ్వవొచ్చు అని సుప్రీం కోర్టు చెప్పింది.

దంపతులు ఇద్దరూ విడాకులకు అంగీకరిస్తే, హిందూ వివాహ చట్టం ప్రకారం ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదని కోర్టు వెల్లడించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్‌, జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది..

నూతన సచివాలయంలో నేడు కేసీఆర్ సమీక్ష

డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో సిఎం సమావేశమందిరంలో సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ సమీక్షా సమావేశంలో... కరివేన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్ పూర్ ,కొడంగల్, వికారాబాద్ కు వెళ్లే తాగునీటి కాల్వల గురించి చర్చించనున్నారు.

ఈ సమీక్షలో... జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు, సిఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మరియు ఆర్థికశాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొననున్నారు.

SB NEWS

శ్రమ దోపిడీపై పెను గర్జన : మే డే

మేడే’ కార్మిక పోరాట దినం. 1886లో చికాగో కార్మికులు తమ విలువైన నెత్తురును పారించి 8గంటల పనిదినం హక్కును సాధించారు. 137 సంవత్సరాల క్రితం సాధించుకున్న ఈ 8 గంటల పనిదినం హక్కు నిత్యం ఉల్లంఘనలకు గురయ్యి నేడు పబ్లిక్, ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా అదనపు విలువను దోపిడీ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అన్ని సంస్థలు కార్మికుల శక్తిని విపరీతంగా దోచుకుంటున్నాయి.

ప్రస్తుతం కార్మికుడు దోపిడీ రూపాలను కార్మిక వర్గం గుర్తించకుండా ఎక్కువ పనిగంటలు తప్పనిసరి అని కార్మికుడే భావించేలా సామాజిక స్థితిని, ఉద్యోగ అభద్రతను కల్పిస్తున్నారు. కార్మికుడి శ్రమనే కాదు, ప్రాణాలు కూడా కోల్పోయేలా ఉద్యోగ పరిస్థితులను సృష్టిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం సాధించుకున్న హక్కును కోల్పోతున్నది.

19వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ఏర్పడి కార్మికుల అవసరం ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు కార్మికులతో రోజుకు 16 నుంచి 20 గంటలు పనిచేయించేవారు. పైగా పనిచేసే కర్మాగారాలలో సరైన సౌకర్యాలు కూడా కల్పించేవారు కాదు. దీంతో కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. శ్రమను మరవడానికి కాస్తా విశ్రాంతి తీసుకున్నా యాజమానులు కోపోద్రికులై ధిక్కార నేరం కింద జరిమానా విధించేవారు. ఈ దారుణ చర్యల నేపథ్యంలో కార్మికులలో తిరుగుబాటు మొదలై కార్మిక సంఘాల నిర్మాణం, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటు చేసుకొని పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది. ఈ పోరాటంలో ఎంతోమంది మరణించి తమ హక్కును సాధించుకున్నారు. వారి స్పూర్తికి గుర్తుగా జరుపుకోనేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే.

1923లో తొలిసారిగా భారత్‌లో ‘మేడే’ను పాటించారు.. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటంతో అప్పటి నుంచే కార్మికవర్గాల్లో చైతనం మొదలైంది. ప్రస్తుతం అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.

మేడే హక్కును అణిచివేస్తూ..

చికాగోలో కార్మికులు సాధించిన 8 గంటల పనిదినం ‘‘మేడే’’ హక్కు ప్రైవేటీకరణ, సరళీకరణ మూలంగా మొత్తంగా కార్మికవర్గానికి 8 గంటల పనిదినం దూరమయ్యే స్థితి ఏర్పడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలను అణచివేసిన సామ్రాజ్యవాద శక్తులు, ప్రజాస్వామ్యం అంటూ డాంబికాలు కొడుతున్న దళారి, బూర్జువా, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులుగా మారి ‘మేడే’ హక్కును అణచివేస్తున్నారు, రద్దు చేస్తున్నారు. ఎంతో త్యాగంతో పోరాడి 8 గంటల పనిదినం సాధిస్తే నేడు 12 గంటలుగా, 16 గంటలుగా పనిదినాలను పొడిగిస్తున్నారు. కార్మిక చట్టాలను బలహీనపర్చడానికి 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వం నుండి నేటి వరకు మన దేశ రాజకీయ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

నేడు అసంఘటిత రంగంలోని కార్మిక వర్గం పూర్తిగా బలైన స్థితి కొనసాగుతూ వస్తోంది. అసంఘటిత రంగంలో కార్మికుడు చనిపోతే, ఆ ప్రాణానికి వెలగట్టి మూడోకంటికి తెలియకుండా శవాన్ని బయటికి తరలించే మెకానిజాన్ని అన్ని ప్రైవేటురంగ పరిశ్రమలు కలిగి ఉన్నాయి. పరిశ్రమలోకి ఎవరూ లోపలికి అడుగుపెట్టనివ్వకపోవడంతో నిజాలు లోపలే బందీ అవుతున్నాయి. మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ బలవంతంగా యాజమాన్యం ఇస్తున్న నష్టపరిహారాన్ని బంధువులు తీసుకోవాలని భయపెట్టి వారు తీసుకునేలా చేసి, నిశ్శబ్ధంగా వలస కార్మికుల శవాలను రాష్ట్ర పరిధులు దాటించేస్తున్నారు.

1947 ప్రాంతంలో అప్పుడు రాజకీయాలు కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేవి. అవి నేడు పూర్తిగా రాజకీయంగా మారి, రాజకీయమే ‘వ్యాపార సరుకు’గా మారిపోయిన స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో సామాజిక విలువలు, సామాజిక బాధ్యత, ప్రజల జీవించే హక్కు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి. కార్మిక చట్టాల సవరణలతో 8 గంటల పనిదినం ఉనికిలో లేకుండా పోతున్నది. పెరిగిన పనిగంటలకు కార్మికులు సిద్ధపడితేనే వారికి జీవనోపాధి హక్కు దొరుకుతుంది లేకపోతే, ఉద్యోగాలుండి తొలగించే అధికారాన్ని కూడా ఈ సవరణ ద్వారా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు పొందగలుగుతున్నారు. ఇక సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, పారిశ్రామిక వివాదాల చట్టం యొక్క స్థితి రేపు రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. కార్మికుల శ్రమను విపరీతంగా దోచుకునే అవకాశం ఇప్పటికే ఉన్నప్పటికి, ఈ కార్మిక చట్టాల సవరణల ప్రక్రియ ద్వారా పనిగంటల పొడిగింపు వంటి నిరంకుశ విధానాలకు చట్టబద్ధత చేకూరుతున్నది.

Kishan Reddy : ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దిల్లీ..

బీజేపీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత కలిగింది. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో..

ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ హస్పిటల్లో చేర్పించారు..

కార్డియాక్ కేర్ యూనిట్ లో ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్నీ పర్యవేక్షించింది..

అయితే కడుపులో గ్యాస్ సమస్య వల్ల ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది.

అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

SB NEWS

తిరుమల వెంకన్న స్వామికి కొత్త బంగారు హారం

8 39 కోట్లతో తిరుపతి ఏడుకొండలను అలంకరించేందుకు 28.645 కిలోల బంగారు హారాన్ని కొత్తగా తయారు చేశారు.

SB NEWS

SB NEWS

SB NEWS

బాణసంచా వెలుగుల్లో కాంతులీనిన కొత్త సచివాలయం..

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది..

సచివాలయ ఆవరణలో బాణసంచా పేల్చి చేసిన సంబురాలు అబ్బురపరిచాయి..

రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతూలీనిన కొత్త సెక్రెటేరియేట్‌ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది..

*SB NEWS*

నారా లోకేష్ పాదయాత్రలో జనసేన

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చేరుకుంది..

ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పాదం కలిపారు. జనసేన, యువగళం జెండాలతో పాదయాత్రకు జనసేన నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసైనికులకు లోకేష్ అభివాదం చేశారు..

తాను ఎస్సీలను అవమానించినట్లు ఒక మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఎస్సీలను అవమానించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు..

నిరూపించలేకపోతే భారతీరెడ్డి తన పత్రిక, ఛానెల్ మూసేస్తారా? అని సవాల్ విసిరారు. తాను ఎస్సీలను అవమానించినట్లు చూపిన వీడియోలో చప్పట్లు కొడుతున్నారని, తాను అవమానిస్తే వారు చప్పట్లు కొడతారా? ఇంత చిన్న లాజిక్ ను భారతీరెడ్డి ఎలా మిస్ అయ్యారని లోకేష్ ప్రశ్నించారు..

Snakes Chameleon : మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు, ఊసరవెల్లి..

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు, ఒక ఊసరవెల్లి కలకలం రేపాయి. వీటిని చూసి కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు..

ఒక మహిళా మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఏకే 13 విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు..

మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆమె లగేజ్ ను తనిఖీ చేశారు. మహిళకు చెందిన బ్యాగుల్లో పలు జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి కనిపించాయి. వీటిని చూసిన కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు..

పాములు పట్టే వారిని రప్పించి పాములను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అరెస్టు చేసి ఆమెపై కస్టమ్స్ చట్టంతోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..