/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ముచ్చటగా మూడోసారి Yadagiri Goud
ముచ్చటగా మూడోసారి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం పవన్ కల్యాణే స్వయంగా హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికెళ్లి మరీ కలిశారు. పవన్‌ను సాదరంగా స్వాగతించిన చంద్రబాబు.. సుమారు అరగంటపాటు ఇద్దరూ పలు కీలక విషయాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా ఏపీలో తాజా పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఏ ఒక్కరికీ సమాచారం లేదేం..!?

చంద్రబాబు-పవన్ భేటీపై అటు టీడీపీలో కానీ.. ఇటు జనసేనలో కానీ ఏ ఒక్కరికీ సమాచారం లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ రెండుసార్లు జరిగిన ఈ ఇద్దరి భేటీ అధికారికంగానే జరిగింది. అయితే ముచ్చటగా మూడోసారి జరిగిన ఈ భేటీపై ఇరుపార్టీల కీలక నేతలకూ ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలేం జరుగుతోందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో రెండ్రోజుల పాటు పర్యటించిన పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. ఆ మధ్యే పవన్-బాబు భేటీ ఉంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. ఇప్పుడు సడన్‌గా సమావేశం కావడం, అది కూడా పవనే స్వయంగా బాబు ఇంటికెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.

పొత్తులపై చర్చించారా..?

ఈ అరగంటపాటు జరిగిన భేటీలో టీడీపీ-జనసేన పొత్తులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. టీడీపీ-జనసేన కలిసే పొత్తుతోనే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయని అధికార పార్టీ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తోంది. వాస్తవానికి బీజేపీతో (BJP) మిత్రబంధం కొనసాగిస్తున్న పవన్.. ఈ మధ్య ఎందుకో ఈ రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేపట్టిన సందర్భాల్లేవ్. పైగా బీజేపీ నేతలు బహిరంగంగానే పవన్‌తో మాకేంటి..? మేం ఒంటరిగానే పార్టీని బలోపేతం చేసుకుంటామని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీపై ఓ జాతీయ మీడియాలో చంద్రబాబు మాట్లాడుతూ ఆకాశానికెత్తేశారు. మోదీ అభివృద్ధి విధానాలతో తాను ఏకీభవిస్తున్నట్లు కూడా బాబు చెప్పారు.

ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారన్నారు. ప్రధాని తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని.. ఆయన విధానాలను మెరుగుపెడితే 2050 నాటికి భారత్‌దే అగ్రస్థానం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఎన్డీఏలో భాగస్వామి కావడమనేది మేటరాఫ్ టైమ్ అని కూడా బాబు చెప్పేశారు. అటు పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత.. ఇటు మోదీ గురించి చంద్రబాబు ఇలా మాట్లాడిన రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరి భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మొత్తానికి చూస్తే.. చంద్రబాబు-పవన్ మధ్య అరగంటపాటు జరిగిన భేటీలో ఏమేం చర్చించారో పూర్తిగా తెలియట్లేదు కానీ.. మీడియా, సోషల్ మీడియాలో చిత్రవిచిత్రాలుగా కథనాలు మాత్రం వచ్చేస్తున్నాయ్. అసలేం చర్చించారో.. ఈ భేటీకి వెనుక ఏం జరిగిందో తెలియాలంటే టీడీపీ, జనసేన నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే

ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ

హైదరాబాద్: టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో తాను చేరటం లేదని... బీజేపీలో కొనసాగాలనేది తన అభిమతమన్నారు. బీజేపీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేతపై ఆఖరి క్షణం వరకు ఎదురుచుస్తానని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రాజకీయాలకు దూరంగా జరిగి.. హిందూ ధర్మం కోసం పనిచేస్తానన్నారు.

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజాసింగ్ ప్రసంశల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధికి కారణం చంద్రబాబు అని.. కేసీఆర్‌తో ఏమీ కాలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మళ్ళీ గెలిచే అవకాశాలున్నాయని తెలిపారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని... రాజకీయంగా తనకు చంద్రబాబే లైఫ్ ఇచ్చారన్నారు. ‘‘గౌరవం ఉండటం వేరు.. రాజకీయాలు వేరు. ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. నా మెంటాలిటీకి బీజేపీ మాత్రమే సూట్ అవుతుంది’’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.

కాగా.. రాజాసింగ్‌ 2009లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచిన విషయం తెలిసిందే. అనంతరం బీజేపీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

2018లోనూ అదే స్థానం నుంచి రాజాసింగ్ గెలుపొందారు. అయితే ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యల కారణంగా రాజాసింగ్‌ జైలుకు వెళ్లగా.. బీజేపీ అధిష్ఠానం ఆయనను సస్పెండ్‌ చేసింది. ఇప్పటికీ సస్పెన్షన్‌ ఎత్తివేతపై పార్టీ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా తాను టీడీపీలో చేరడం లేదంటూ రాజాసింగ్ చెప్పడంతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పడినట్లైంది.

కమలం పువ్వు పై బురదజల్లితే అంత వికసిస్తుంది

నన్ను నిందించిన ప్రతిసారి, కాంగ్రెస్ పార్టీనే పతనమవుతోంది' అని ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్రమోదీ భగ్గుమన్నారు..

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ మాట అన్నారు. (Karnataka) ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్నారు.

కాంగ్రెస్ మళ్లీ నన్ను నిందించడం ప్రారంభించింది. నన్ను నిందించిన ప్రతిసారి.. అది పతనమవుతోంది. కాంగ్రెస్ ఇప్పటికీ 91సార్లు నన్ను నిందించింది. దుర్భాషలాడే పని కాంగ్రెస్‌ను చేసుకోనివ్వండి. నేను మాత్రం కర్ణాటక ప్రజల కోసం పనిచేస్తాను. వారు లింగాయత్ వర్గాన్ని నిందించారు.

అంబేడ్కర్, వీర్‌ సావర్కర్‌ను అవమానించారు. వారి నిందలకు ప్రజలు ఓట్లతో బదులిస్తారు. భాజపాపై ఎంత బురదచల్లితే.. కమలం అంతగా వికసిస్తుంది' అని కార్యకర్తలనుద్దేశించి మోదీ అన్నారు.

ఈ ఎన్నికలు రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాదు.. ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌వన్‌గా చేయడానికని పేర్కొన్నారు. అలాగే డబుల్‌ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే.. రాష్ట్రం డబుల్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు..

బై జూస్‌లో భారీ అక్రమాల గుర్తింపు సోదాలు నిర్వహిస్తున్న ఈడీ

బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు.

బైజూస్‌ సీఈవో రవీంద్ర ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు.

ఏకకాలంలో ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు.

ప్రముఖ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌‌కు చెందిన మూడు ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది.

విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ప్రకారం రవీంద్రన్, ఆయన కంపెనీ 'థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్'పై కేసుకు సంబంధించి ఈడీ బెంగళూరులోని రెండు వ్యాపార సముదాయలు, ఒక నివాస సముదాయంలో సోదా చేసింది.

ఈ సోదాల్లో పలు నేరారోపణ పత్రాలు, డేటా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

ఈడీ వర్గాల ప్రకారం.. కంపెనీ 2011, 2023 మధ్య రూ. 28,000 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో అదే కాలంలో వివిధ విదేశీ సంస్థలకు సుమారు రూ. 9,754 కోట్లను పంపింది. అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.

రవీంద్రన్ బైజూస్‌కు అనేక సమన్లు జారీ చేయగా.. ఆయన ఈడీ ముందు హాజరుకాలేదని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే సోదాలు జరిపినట్టుగా ఈడీ వెల్లడించింది.

2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ తన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయలేదని, ఖాతాలను ఆడిట్ చేయలేదని ఈడీ పేర్కొంది.

మౌనిక మృతిపై హైకోర్టుకు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కళాసిగూడలో మ్యాన్‌హోల్లో పడి చిన్నారి మౌనిక మృతి చెందింది. ఈ ఘటనపై హైకోర్టుకు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందిందని ఆయన ఫిర్యాదు చేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి మ్యాన్‌హోల్ వల్ల అనేకమంది చనిపోయారని లేఖలో పేర్కొన్నారు. మ్యాన్‌హోల్స్ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్నారులు చనిపోతున్నా జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. చిన్నారి మృతి కారణమైన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టీస్‌ కు చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు.

సికింద్రాబాద్‌ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో డ్రైనేజీలో పడి మౌనిక మృతి చెందింది. ఈరోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా... పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. మ్యాన్‌హోల్‌లో పడి పాప మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

జీహెచ్ఎంసీ మేయర్ హామీ

చిన్నారి మృతి చెందిన ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కాషన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అందరిముందు మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు జరుగుతున్న సందర్భంలో అధికారులు ఇచ్చే ఆదేశాలను ఎవరు అతిక్రమించవద్దని అన్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భారీ కేడింగ్ తొలగిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మృతి చెందిన మౌనిక కుటుంబాన్ని పరామర్శించారు. పాప కుటుంబాన్ని జీహెచ్ఎంసీ వైపు నుంచి ఆదుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు.

అధికారులపై చర్యలు

సికింద్రాబాద్ కళాసిగూడ చిన్నారి మృతి ఘటనపై బల్దియా చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులపై వేటు వేసింది. బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణలను సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఘటనపై పూర్తి విచారణ జరపాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇందిరాభాయ్‌కు బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పది రోజుల్లో ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు.

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్

తిరుమల : తిరుమల శ్రీవారిని శనివారం ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు ఇస్తి కఫల్ స్వాగతం పలికారు..

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.

అనంతరం ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.

అంతకుముందు గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సీవీఎస్వో నరసింహకిషోర్‌, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో బాలిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు..

చైనా షాకింగ్‌ నిర్ణయం..పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా..

ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనాలో వేగవంతంగా జనభా క్షీణించడంతో దాన్ని నియంత్రించేలా పలు చర్యలు ఇప్పటికే తీసుకుంది షాంఘై. ఇప్పుడు ఇంకాస్త ముందడుగు వేసి..

యావత్‌ ప్రపంచం విస్తుపోయేలా సంచలన నిర్ణయం తీసుకుంది. అవివాహితలు లేదా ఒంటరి మహిళలు ఐవీఎఫ్‌ ద్వారా పిల్లలను కనే వెసులుబాటుని ఇస్తోంది. పెళ్లైన జంటలకు మాత్రమే ఉండే పిల్లల సబ్సిడీలను అవివాహిత గర్భిణీలు కూడా పొందవచ్చునని చెబుతోంది. అవివాహిత స్త్రీల పిల్లల జనన నమోదును చట్టబద్ధం చేసింది..

వారు కూడా వేతనంతో కూడిన ప్రశూతి సెలవులు కూడా తీసుకోవచ్చు అంటూ ఆఫర్లు ఇస్తోంది. ఈ మేరకు చైనాలోని అవివాహిత స్త్రీలు ప్రైవేట్‌ లేదా పబ్లిక్‌ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్‌ చికిత్సను పొందవచ్చు. ఈ నేపథ్యంలోనే నైరుతి సిచువాన్‌ ప్రావిన్స్‌ రాజధాని చెంగ్డులో విడాకులు తీసుకున్న 33 ఏళ్ల మహిళ దీన్ని ఆశ్రయించే తల్లి కాబోతోంది. ప్రస్తుత ఆమె 10 వారాల గర్భవతి. చాలా మంది ఒంటరి మహిళలు దీన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం..

దేశ వ్యాప్తంగా ఐవీఎఫ్‌ని సరళీకృతం చేస్తే గనుక ఇదొక పెద్ద మార్కెట్‌గా విస్తరించే అవకాశం ఉందంటున్నారు నిపుణలు. సాధారణ సంతానోత్పత్తి సేవలపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఐవీఎఫ్‌ చికిత్సకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని ఆసియా పసిఫిక్ వ్యాపార అభివృద్ధి డైరెక్టర్ వైవ్ లిప్పెన్స్ హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రల్లో మహిళలందరికీ ఐవీఎఫ్‌ చికిత్స అందిస్తారనేది స్పష్టత లేదు.

Modi: కాంగ్రెస్ నన్ను 91 సార్లు నిందించింది: ఖర్గే వ్యాఖ్యలకు మోదీ బదులు..

బెంగళూరు: 'నన్ను నిందించిన ప్రతిసారి, కాంగ్రెస్ పార్టీనే పతనమవుతోంది' అని ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) భగ్గుమన్నారు..

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ మాట అన్నారు. ఎన్నికల(Karnataka Elections 2023 ) ప్రచారంలో భాగంగా ప్రధాని ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్నారు.

'కాంగ్రెస్ మళ్లీ నన్ను నిందించడం ప్రారంభించింది. నన్ను నిందించిన ప్రతిసారి.. అది పతనమవుతోంది. కాంగ్రెస్ ఇప్పటికీ 91సార్లు నన్ను నిందించింది. దుర్భాషలాడే పని కాంగ్రెస్‌ను చేసుకోనివ్వండి. నేను మాత్రం కర్ణాటక(Karnataka) ప్రజల కోసం పనిచేస్తాను. వారు లింగాయత్ వర్గాన్ని నిందించారు.

అంబేడ్కర్, వీర్‌ సావర్కర్‌ను అవమానించారు. వారి నిందలకు ప్రజలు ఓట్లతో బదులిస్తారు. భాజపాపై ఎంత బురదచల్లితే.. కమలం అంతగా వికసిస్తుంది' అని కార్యకర్తలనుద్దేశించి మోదీ(Modi) అన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాదు.. ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌వన్‌గా చేయడానికని పేర్కొన్నారు. అలాగే డబుల్‌ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే.. రాష్ట్రం డబుల్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు..

మీ పిల్లలకు కళ్లకలతలు వస్తున్నాయా..? జాగ్రత్త కొత్త వేరియంట్‌ లక్షణం..!

New variant: కరోనా కేసులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. వైరస్‌ పేర్లు మార్చుకోని రూపాంతరం చెందుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి..

తాజాగా వచ్చిన వేరియంట్ కొత్త లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ కొత్త వేరియంట్ XBB.1.18 వేగంగా విస్తరిస్తోంది. దీన్నే ఆర్క్టురస్ అని కూడా పిలుస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కేసులు ఘోరంగా పెరుగుతున్నాయి..

సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఆర్క్టురస్ అనేది అత్యంత వేగంగా వ్యాపిస్తున్న అంటువ్యాధి. ఒమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్ ఇది.

ప్రస్తుతం యూఎస్‌లో అత్యంత ప్రబలంగా ఉన్న వేరియంట్ ఇదే. మార్చి నెలలో ఇది అమెరికాలో 1.1 శాతం కేసులు నమోదు అయ్యాయి.. ఏప్రిల్‌ మూడో వారం నాటికి ఇది 19. 8 శాతానికి చేరుకుంది..

Viveka Murder : వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు..

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసి విచారిస్తోంది..

మరికొందరిని అరెస్టు చేయకుండా విచారిస్తోంది. ఈ క్రమంలో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్​రెడ్డి రిమాండ్‌ను పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఆ ఉత్తర్వుల్లో భాస్కర్​రెడ్డి రిమాండ్‌ను మే 10వ తేదీ వరకు పొడిగించింది..