/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే? Andrapradesh
ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

ఏపీ నుంచి బదిలీపై వెళ్తున్న గవర్నర్ హరిచందన్‌కు ప్రభుత్వం నిన్న ఘనంగా వీడ్కోలు పలికింది. రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ హాజరై గవర్నర్‌కు వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా ఉద్వేగ భరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అలాగే గవర్నర్, సీఎం జగన్ ఇద్దరూ ఉద్వేగానికి లోనయ్యారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 24వ తేదీన గవర్నర్ గా ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు రాజ్ భవన్ వర్గాల వారు. ఇవాళ ఏపీకి రానున్నారు అబ్ధుల్ నజీర్. సతీసమేతంగా సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

ఏపీకి మూడో గవర్నర్ గా సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకు చెందిన అబ్ధుల్ నజీర్.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ అయిన మూడో న్యాయమూర్తిగా నజీర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జనవరిలో పదవీ విరమణ చేసిన ఆయన ఫిబ్రవరి మాసాంతానికి ఒక రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తుండటం విశేషం.

ఇక సుప్రీం న్యాయమూర్తిగా నజీర్ ట్రాక్ రికార్డులు పరిశీలిస్తే.. ఆయన పలు కీలకమైన తీర్పులు వెలువరించారు. ట్రిపుల్ తలాక్, అయోధ్య- బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనార్టీ న్యాయమూర్తి.

వ్యభిచార గృహాన్ని నిర్వహించిన మహిళా ఎస్ఐ తల్లి – తమ్ముడు… ఎక్కడ?

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఓ మహిళా ఎస్‌ఐకు చెందిన తల్లి, తమ్ముడు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే, ఈ వ్యభిచార గృహ నిర్వహణం, తల్లి, సోదరుడుతో ఆ మహిళా ఎస్ఐకు సంబంధం లేదని పోలీసులు అంటున్నారు. ఆ మహిళా ఎస్ఐ వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరికి దూరంగా ఉంటున్నారు. 

స్థానిక పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా కేంద్రంలోని ముత్యాలరెడ్డి సమీపంలోని ధనలక్ష్మి నగర్‌లో ఓ ఇంటిలో వ్యభిచారం సాగుతున్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు ఆ ఇంటిపై ఆదివారం రాత్రి దాడి చేశారు. ఇందులో మహిళలతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐ తల్లి, తమ్ముడు ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. 

పోలీసులు అదుపులోకి తీసుకున్న యువతులను ప్రభుత్వం హోంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్నూలుకు చెందిన ఈ తల్లి కుమారుడు మూడు నెలల క్రితం ధనలక్ష్మి నగర్‌కు మకాం మార్చి ఈ వ్యభిచారి గృహాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది. నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు సీఐ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డికి శ్రీశైలం ఈవో పాదాభివందనంపై విమర్శలు

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్నారు. కృష్ణదేవరాయ గోపురం వద్దకు రాగానే ఈవో లవన్న మంత్రికి పూలమాల వేసి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. పూలమాలను మంత్రి సున్నితంగా తిరస్కరించారు. ఈ క్రమంలో ఈవో మంత్రి పాదాలకు నమస్కరించారు.

శివదీక్షలో ఉన్న ఈవో లవన్న మంత్రికి ఏ విధంగా పాదాభివందనం చేస్తారని భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది వివాదాస్పదం కావడంతో ఈ విషయమై సాయంత్రం ఈవో లవన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది, తనదీ ఒకే మండలం అని తెలిపారు. మంత్రి 75 సార్లు అయ్యప్ప, శివదీక్షలు చేపట్టారని పేర్కొన్నారు. తాను కూడా 17 సార్లు అయ్యప్ప మాల ధరించినట్లు ఈవో చెప్పారు. ఈ కారణంగానే మంత్రి పెద్దిరెడ్డిని గురుస్వామిగా భావించి పాదాభివందనం చేసినట్లు వెల్లడించారు. పాదాభివందనం చేసిన ప్రదేశం కూడా కృష్ణదేవరాయ గోపురం వెలుపల ఉందని తెలిపారు.

AP : రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్....

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది సర్కార్. ప్రజంట్ ఇస్తున్న రేషన్ బియ్యం బదులు రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజంట్ రాయలసీమ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనునట్లు అధికారులు తెలిపారు. అక్కడ సక్సెస్ అయితే.. దశల వారీగా రాష్ట్రమంతటా ఈ విధానం అమలు అవ్వనుంది. ప్రజంట్ రేషన్ కార్డు ఉన్న.. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అయితే కరోనా అనంతరం ప్రజల మైండ్ సెట్ మారింది. ఎక్కువ ప్రొటీన్ ఫుడ్, బలవర్ధక ఆహారం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రైస్ బదులు పోషక విలువలున్న ఇతర ధాన్యాలను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఐక్యరాజ్యసమితి కూడా 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి.. ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో.. గత నెల 18న సీఎం జగన్ సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. బియ్యం కంటే రాగులు, జొన్నలకు అయ్యే ఖర్చే తక్కువ.. అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే రేషన్‌ బియ్యం బదులు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని సూచించారు.

రాగులు, జొన్నలకు సంబంధించి ఇప్పుటికే ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసకున్నారు. మెజార్టీ ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు. పంపిణీకి అవసరమైన రాగులు, జొన్నలను సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ద్వారా రైతుల నుంచి మద్దతు ధరకు సేకరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రేషన్ షాపుల్లో గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తోంది పౌరసరఫరాల శాఖ. కేజీ గోధుమ పిండి ప్యాకెట్ రేటును రూ.16 గా ఫిక్స్ చేశారు. విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం మునిసిపాలిటీల పరిధిలో సబ్సిడీపై గోధుమ పిండి అందజేస్తున్నారు. ఒక్కో కార్డుపై 2 కేజీల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని అందజేస్తారు.

బయట గోధుమ పిండి ధర రూ.40గా ఉంది. కానీ గవర్నమెంట్ రూ.16కే అందజేస్తోంది. ఏపీలోని మిగతా అన్ని జిల్లాలో గల కార్డు దారులకు సబ్సిడీ పై గోధుమపిండి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

AP : అయోధ్య శ్రీరామచంద్రుడికి కోటి కోటి తలంబ్రాలను సమర్పించనున్న శ్రీకృష్ణ చైతన్య సంఘం

ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పండించిన వరితో తయారుచేసిన తలంబ్రాలను శ్రీకృష్ణ చైతన్య సంఘం అయోధ్య శ్రీరామచంద్రుడికి సమర్పించనుంది.

 కోటి కోటి తలంబ్రాలను మూడు వేల మంది భక్తులు ఒలిచి సిద్ధం చేస్తారు. ఈ తలంబ్రాలను అభిషేకం అనంతరం గత 12 ఏళ్లుగా భద్రాచలం శ్రీరామచంద్రులకు సమర్పించడం జరుగుతుంది. 

ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ లో శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో భక్తులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలకు 108 కడవలతో గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా గత 12 సంవత్సరాలుగా భద్రాచలం శ్రీ రామచంద్రులకు ఐదు రాష్ట్రాల్లో మూడువేల మంది కోటి తలంబ్రాలతో ఒలిపించి కోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించడం జరుగుతుంది.

ఈసారి అయోధ్యలో కూడా ఏర్పాటు చేయాలని భావనతో దేశమంతా రామ తత్వాన్ని తీసుకురావాలని, రామరాజ్యం కావాలని కోటి తలంబ్రాలను అయోధ్యకు తీసుకెళ్లాలని, ఈనెల 22న అయోధ్యకు బయలుదేరడం జరుగుతుందని చెప్పారు. 26న సరయు నది తీరంలో 108 మంది కలశాలతో అభిషేకం చేసి అయోధ్యకు తలంబ్రాలు సమర్పించడం జరుగుతుందని శ్రీకృష్ణ చైతన్య సంఘం కళ్యాణం అప్పారావు చెప్పారు.

ఈ నెల 22 నన్నయ యూనివర్సిటీ లో జరిగే యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును విజయ వంతం చేయండి - PDSU

అనంతపురం జిల్లా

కణేకల్ మండలం

అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కణేకల్ మండలం లో PDSU కర పత్రాలు విడుదల

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

 విశ్వవిద్యాలయాలు శాస్త్రీయ ఆలోచనలకూ, స్వతంత్ర బావ జలాలకు కేంద్రాలుగా ఉండాలి. విద్యార్థుల్ని నూతన ఆవిష్కరణల వైపు సృజనాత్మకంగా మళ్ళించగలిగే శక్తి విశ్వవిద్యాలయాలకి ఉన్నది. సామాజిక, విప్లవ, అస్తిత్వ ఉద్యమాలకు కూడా కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలే ఉన్నాయి. 

 ఇది చరిత్ర నిరూపిస్తున్న సత్యం. అసమానతలు, అంతరాలు, సామాజిక, రుగ్మతలతో నేడు కూనరిల్లుతున్నాయి. ప్రమాణాలు, నాణ్యత దిగజారిపోతున్నాయి. మరోవైపు హిందూ మతోన్మాదం విశ్వవిద్యాలయాల్లో విస్రాంకలంగా మారింది. కాషాయికరణ అజెండాతో బిజెపి లౌకిక భవానిల్ని సహించలేకపోతున్నది. 

 మన రాష్ట్రంలో సుమారు 30 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటి అభివృద్ధికి జగన్ సర్కారు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఒక్కో విశ్వవిద్యాలయానికి 200 కోట్లు కేటాయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1204 ఆశ్చర్య పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. విశ్వవిద్యాలయాల్లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. V.C ఆచార్యుల నియామకాలన్నీ రాజకీయ నాయకుల కన్ను సన్నల్లోనే జరుగుతున్నాయి.

      జాతీయ విద్యా, విధానం 2020 లో భాగంగా దేశంలోకి విదేశీ విశ్వవిద్యాలయాలు, విదేశీ ఉన్నత విద్యా సంస్థల ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి) చైర్మన్ జనవరి 5 నా ప్రకటించారు. విదేశీ, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చి పెట్టి, దేశంలో ప్రభుత్వ ఉన్నత విద్యను, దెబ్బతీసీ పేద, మధ్య తరగతివర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను, దూరం చేసే (యూజిసి ) ముసాయిదాను వ్యతిరేకించాలి.

రాష్ట్రoలో సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు లేవు, సొంత భవనం లేక ప్రొఫెసర్ పోస్టులు లేక విద్యార్థులు 'చదువు' కొనసాగిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలి, విభజన హామీల ప్రకారం 11 కేంద్రీయ, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి.

ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల పటిష్టకరణ, సంరక్షణలకై 2023 ఫిబ్రవరి 22 వ తేదీన రాజమండ్రిలో నన్నయ విశ్వవిద్యాలయంలో జరుగు యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.

ఈ కార్యక్రమం లో PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి మల్లెల ప్రసాద్. PDSU నాయకులు నాగరాజు, సుదీర్, నాగరాజు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పుష్పపల్లకిపై దర్శనమిచ్చిన శ్రీస్వామి వారు

శ్రీశైలంలో కన్నులపండువగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పుష్పపల్లకిపై దర్శనమిచ్చిన శ్రీస్వామి అమ్మవార్లు వేలాదిగా తరలివచ్చి దర్శించుకున్న భక్తులు

 శ్రీశైల మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ఆరోవరోజు పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు.

 విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి తరలుతుండగా ఉత్సవం ముందు కోలాటాలు డమరక నాధాలు పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులను కనువిందు చేశారు.

 గంగాధర మండపం వద్ద పుష్పపల్లకిలో ఉన్న శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులిచ్చి అనంతరం అంకాలమ్మ గుడి, నంది మండపం బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది.

 గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. పుష్పపల్లకిపై ఉన్న శ్రీస్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.

 శ్రీశైల క్షేత్రమంత శివనామస్మరణతో మారుమ్రోగింది. పుష్ప పల్లకిసేవలో ఆలయ ఈవో లవన్న దంపతులు, ఆలయ ట్రస్టు బోర్డ్ చైర్మన్, అధికారులు పాల్గొన్నారు.

కనేకల్ పట్టణం లో ప్రభుత్వం డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేయండి

అనంతపురం జిల్లా

కనేకల్  

M.R.O గారికీ వినతిపత్రం.

రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

 

 కనేకల్ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విద్యార్థులు చదువుని మధ్యలో ఆపేస్తున్నారు. 

కారణం డిగ్రీ కళాశాలకు వెళ్లాలంటే అటు రాయదుర్గం ఇటు కళ్యాణదుర్గం ఇటు ఉరవకొండ కు వెళ్లాలంటే దూరం అవ్వడం వల్ల చాల ఇబ్బందులు ఎదురుకోవాలి అనీ పేద మధ్య తరగతి విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు.

 బస్సులో వెళ్లాలంటే బస్ పాస్ చార్జీలు కట్టాలంటే కట్టలేని పరిస్థితి లో విద్యార్థులు తల్లీ, తండ్రులు లు ఉన్నారు ఇక్కడే డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేయాలనీ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

ఈ కార్యక్రమం లో రాయదుర్గం డివిజన్ PDSU కార్యదర్శి మల్లెల ప్రసాద్, గంగరాజు, ఆనంద్ రాజు, కిషోర్, యోగి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

              ఇట్లు

PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

 ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

8977939733

AP : ప్రత్యేక హోదాపై మోదీని నిలదీసిన భరత్

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ భరత్ రామ్ లోక్‌సభ ప్రత్యేక హోదాపై మోదీని నిలదీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఈ బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేవని భరత్ రామ్ చెప్పారు. చంద్రబాబు యూటర్న్ తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు తీసుకురావాలని చూస్తుంటే.. కేంద్రం మూడింటికి నిధులు ఇస్తామని చెప్పిందని భరత్ రామ్ తెలిపారు.

రైల్వే పరంగా విశాఖపట్నం విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి వుందని.. విశాఖపట్నం చెన్నై, చెన్నై బెంగళూరు , హైదరాబాద్ కారిడార్లకు నిధులు ఇస్తే 80 జిల్లాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ను హైదరాబాద్ కు ఇచ్చారని రాష్ట్రానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని భరత్ రామ్ వెల్లడించారు.

AP : కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర.. 17వ రోజు తిరుపతి జిల్లాలో...

 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నేడు 17వ రోజుకి చేరుకుంది. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలం కొత్తూరు నుంచి ఉదయం 11.30 గంటలకు పాదయాత్ర ప్రారంభంకానుంది. నేడు కూడా చిత్తూరుజిలాల్లో కొనసాగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈడిగపల్లెలో గౌడ సామాజిక వర్గం తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొత్తిరివేడు వద్ద స్థానికులతో సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు లంచ్ బ్రేక్ అనంతరం తీసుని.. మధ్యాహ్నం 3.05 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.

సాయంత్రం 4.40 గంటలకు గొల్లకండ్రిక వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. అనంతరం డీఎం. పురం గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు ద్వారకా నగర్ చేరుకుని లోకేష్ అక్కడే బస చేయనున్నారు.

నేటితో నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర పూర్తి చేసి.. తిరుపతి జలాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఇప్పటి వరకూ లోకేష్ పాద యాత్ర 201.2 కిలో మీటర్ల జరిగింది.