కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచనవిధానాలకు అనుగుణంగా ముదిరాజులకు వాట కల్పించాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధనసమితి అధ్యక్షులు
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆలోచన విధానాలకు అనుగుణంగా ముదిరాజులకు రాజకీయలలో వాట కల్పించాలి!
కృష్ణస్వామి ముదిరాజ్ జయాంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముదిరాజులు!
ముదిరాజులను తక్షణమే బి.సి "ఏ" చేర్చకుంటే ప్రభుత్వనికి గుణపాఠం తప్పదు!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు
హైదరాబాదు నగర రూపకల్పన వెనుక కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి శ్రమ ఎంతో ఉందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి జయంతిని పురస్కరించుకొని శనివారం నాడు చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ పెద్దమ్మ ఫంక్షన్ హాల్ లో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు మెడికల్ వెంకటేశం ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్ గార్లతో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు కలిసి కృష్ణ స్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ 1933 నుండి హైదరాబాద్ నగర కార్పొరేటర్ గా కార్పొరేషన్ చైర్మన్ గా పాత్రికేయునిగా కవిగా కార్టునిస్టుగ ముదిరాజ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై హైదరాబాద్ నగర దశ దిశలను అభివృద్ధి పరచడానికి అనేక ఆలోచనలతో నగరాన్ని రూపకల్పన చేసి ఈనాడు అభివృద్ధిలో పరుగులు తీయడమే కాకుండా ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా గుర్తింపు రావడానికి కొరివి కృష్ణస్వామి గారి రూపకల్పనేని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చినప్పటికీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి జయంతి వర్ధంతులను అధికారికంగా జరుపకపోవడం బాధాకరమని ప్రభుత్వం ఆయనను గుర్తించి ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ ముదిరాజు జాతిని బీసీఏలో చేర్చాలని కృష్ణ స్వామి పోరాటం చేశారని ఆయన ఆలోచనకు అనుగుణంగా ముదిరాజులను బిసి ఏలో చేరుస్తూ రాజకీయంలో వాటా కల్పించాలని జంగిటి డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్య, ఇట్టబోయిన శ్రీనివాస్, చెరుకు పెద్దలు, చికెన్ సత్తి ముదిరాజ్, కొత్త శంకర్, కోరబోయిన పెద్ద శ్రీనివాస్, తుమ్మల తిరుపతి, అంబటి కనకయ్య, దాసరి రాజశేఖర్, కోరబోయిన రవి, గుడిపల్లి వికాస్, కోరబోయిన యాదగిరి, శరత్ బాబు, చెరుకు సతయ్య, ఉప్పరబోయిన సంతు తదితరులు పాల్గొన్నారు,
Sep 03 2025, 21:06