మంత్రి వివేక్ బేషరతుగా సిద్ధిపేటకు క్షేమాపన చెప్పాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
![]()
మంత్రి వివేక్ బేషరతుగా సిద్ధిపేటకు క్షేమాపన చెప్పాలి!
సిద్ధిపేట అభివృద్ధిని కాంగ్రేస్ కావాలనే అడ్డుకుంటుందని మంత్రి వివేక్ మాటలతో తేటతెల్లమైంది!
తెలంగాణ ప్రజల బాగు కోసమే తెలంగాణలో కేసీఆర్, హరీష్ రావులు అనేక మెడికల్ కాలేజీలు నిర్మించారు!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
తేది: 24-07-2025 గురువారం
చిన్నకోడూర్ న్యూస్
మంత్రి వివేక్ అవివేకంతో మాట్లాడడం సరికాదని సిద్దిపేట జిల్లాను అవమానించే విధంగా మెడికల్ కాలేజీ గురించి చిన్నగా చేసి మాట్లాడడం సిద్దిపేట జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.
సిద్దిపేట జిల్లా అవసరరీత్యా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ముందు చూపుతో సిద్దిపేటలో మెడికల్ కాలేజీ తో పాటు 1000 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి నిర్మించారని చిన్నచిన్న పెండింగ్ పనులకు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారు నిధులు అడుగుతే సిద్దిపేటను చిన్న ప్రాంతంగా అభివృద్ధి ఇక్కడ ప్రజలను అవమానిస్తూ ఈ ఆసుపత్రి అవసరమా అని హేళన చేయడము మంత్రి వివేక్ సరికాదని మండిపడ్డారు గురువారం నాడు చిన్నకోడల్లో ప్రెస్ నోట్ విడుదల చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతు మంత్రి వివేక్ తక్షణమే సిద్దిపేట జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పకుంటే ఆయనను సిద్దిపేట జిల్లాకు రాకుంట అడ్డుకుంటామని సిద్దిపేటలో అవమానపరిచిన వారు మా ప్రాంతంలో తిరగవద్దని సిద్దిపేట అనుకొని ప్రధాన రహదారి ఒకటి ఉందని అదేవిధంగా వ్యాపారాలకు సిద్దిపేట ఒక కేంద్ర బిందువు అని వ్యాపార నిమిత్తం అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రజలు వస్తుంటారని అందుకనే ముందుచూపుతో ఇక్కడ మా నాయకుడు హరీష్ రావు గారు 1000 పడకల ఆసుపత్రిని నిర్మించారని నిర్మాణం పూర్తి అయిన ఆసుపత్రికి రిపేర్ల నిమిత్తం డబ్బులు కేటాయించనప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఎందుకని వారు మండిపడ్డారు
Aug 16 2025, 20:04