మంత్రి వివేక్ బేషరతుగా సిద్ధిపేటకు క్షేమాపన చెప్పాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

మంత్రి వివేక్ బేషరతుగా సిద్ధిపేటకు క్షేమాపన చెప్పాలి!

సిద్ధిపేట అభివృద్ధిని కాంగ్రేస్ కావాలనే అడ్డుకుంటుందని మంత్రి వివేక్ మాటలతో తేటతెల్లమైంది!

తెలంగాణ ప్రజల బాగు కోసమే తెలంగాణలో కేసీఆర్, హరీష్ రావులు అనేక మెడికల్ కాలేజీలు నిర్మించారు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

తేది: 24-07-2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

మంత్రి వివేక్ అవివేకంతో మాట్లాడడం సరికాదని సిద్దిపేట జిల్లాను అవమానించే విధంగా మెడికల్ కాలేజీ గురించి చిన్నగా చేసి మాట్లాడడం సిద్దిపేట జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

సిద్దిపేట జిల్లా అవసరరీత్యా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ముందు చూపుతో సిద్దిపేటలో మెడికల్ కాలేజీ తో పాటు 1000 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి నిర్మించారని చిన్నచిన్న పెండింగ్ పనులకు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారు నిధులు అడుగుతే సిద్దిపేటను చిన్న ప్రాంతంగా అభివృద్ధి ఇక్కడ ప్రజలను అవమానిస్తూ ఈ ఆసుపత్రి అవసరమా అని హేళన చేయడము మంత్రి వివేక్ సరికాదని మండిపడ్డారు గురువారం నాడు చిన్నకోడల్లో ప్రెస్ నోట్ విడుదల చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతు మంత్రి వివేక్ తక్షణమే సిద్దిపేట జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పకుంటే ఆయనను సిద్దిపేట జిల్లాకు రాకుంట అడ్డుకుంటామని సిద్దిపేటలో అవమానపరిచిన వారు మా ప్రాంతంలో తిరగవద్దని సిద్దిపేట అనుకొని ప్రధాన రహదారి ఒకటి ఉందని అదేవిధంగా వ్యాపారాలకు సిద్దిపేట ఒక కేంద్ర బిందువు అని వ్యాపార నిమిత్తం అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రజలు వస్తుంటారని అందుకనే ముందుచూపుతో ఇక్కడ మా నాయకుడు హరీష్ రావు గారు 1000 పడకల ఆసుపత్రిని నిర్మించారని నిర్మాణం పూర్తి అయిన ఆసుపత్రికి రిపేర్ల నిమిత్తం డబ్బులు కేటాయించనప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఎందుకని వారు మండిపడ్డారు

ముదిరాజ్ జాతి చరిత్ర మహోన్నతం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

అహో ఆంధ్రభోజ! 

శ్రీకృష్ణదేవరాయ ముదిరాజా!! 

ముదిరాజులు అంటే పేరుకే రాజులు కాదు

పోరాట విద్యలో రా రాజులు

వేటలో వాటమెరిగిన మహారాజులు

మకుటం లేని మహారాజులు ముదురాజులు!! 

తెగించి పోరాడగల వీర సైనికులు

ధైర్య సాహసాలకు పట్టుదలకు

మరో పేరు ముదిరాజులు! ! 

తెలుగు జాతి చరిత్రలో స్వర్ణ యుగం నెలకొల్పిన విజయనగర సామ్రాజ్య రథసారథులు ముదిరాజులు! 

సాహితీ సమరంగన సర్వ బౌ ము డీగా శ్రీకృష్ణదేవరాయలు మన ముదిరాజ్ కులానికి వజ్ర కిరీటం

ముదిరాజ్ అనేది కేవలం ఒక మాట కాదు ఒక పేరు కాదు భారతదేశమంతటి వ్యాపించి ఉన్న కోట్ల కొలది జన సముదాయం

మన ముదిరాజ్ ల పాలిట ఆశాజ్యోతి మన జాతి రత్నం

ముద్రాజ్ పితామహుడు

బహుముఖ ప్రజ్ఞాశాలి మంచి వ్యక్తిత్వానికి మరో పేరు కృష్ణ స్వామి ! ! 

కృషి చేద్దాం మన హక్కుల సాధన కోసం ఐకమత్యంతో పోరాటం

మన హక్కులను సాధించుకుందాం

జై ముదిరాజ్ జై పెద్దమ్మతల్లి

రచయిత

కొమురవెల్లి నరసింహులు

తెలుగు బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత

తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి

అపారభగిరదుడు స్వరాష్ట్ర సాధకుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

అపారభగిరదుడు స్వరాష్ట్ర సాధకుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు!

శతాధికంగా ఆరోగ్యాంగా ఉండాలని హరీష్ రావుకు పాలాభిషేకం చేసిన అభిమానులు

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

తేది: 03-06-2025 మంగళవారం

చిన్నకోడూర్ న్యూస్

తెలంగాణ స్వరాష్ట్రకులు తెలంగాణ కరువు నివారణ కర్త నీటి ప్రాజెక్టుల ప్రధాత హరీష్ రావు గారు అని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

53వ పుట్టినరోజు సందర్భంగా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం చౌరస్తాలో హరీష్ అన్న అభిమానులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ హరీష్ రావు గారు సిద్దిపేట ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండడము ఇక్కడి ప్రజల అదృష్టమని తెలంగాణలో సిద్దిపేటలో అగ్రగామిగా నిలిపి యావత్ భారతదేశం సిద్దిపేట ను చూసే విధంగా తీర్చిదిద్దారని సిద్దిపేట ప్రాంతం విద్యలో అభివృద్ధిలో ఆగ్రగామిగా ఉందని నిరంతరం ప్రజల కోసం పరితపించేవాడు హరీష్ రావు గారు అని ఆయన వెయ్యి వసంతాలు ఆయురారోగ్యాలతో ఉండాలని పాలాభిషేకం చేయడం జరిగిందని అదేవిధంగా కేక్ కట్ చేసి ప్రజలకు పంచడం జరిగిందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ పానుగంటి రమేష్ చెరుకు పెద్దలు ఇట్టబోయిన బాల పోశయ్య ఇట్టబోయిన చిన్న పోశయ్య సుంచు రమేష్ బోష్య ప్రభాకర్ ఇట్ట పోయిన శేఖర్ కోరబోయిన శరత్ బాబు జంగిటి ఆనందం రెడ్డబోయిన నగేష్ రెడ్డబోయిన స్వామి పూసల మహేష్ ఎయ్య రాజయ్య జంగిటి శ్రీశైలం కోరబోయిన రవి రాగిరి సాయికుమార్ జంగిటి శివ ముదిరాజ్ సంఘం సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

అష్టకష్టాలను తొలిగించే దైవం హనుమంతుడు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గురుస్వామి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

అష్టకష్టాలను తొలిగించే దైవం హనుమంతుడు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

గురుస్వామి బీఆర్ఎస్ రాష్ట్ర

తేది: 21-05-2025 బుధవారం

చిన్నకోడూర్ న్యూస్

ఆంజనేయస్వామిని హిందూ ధర్మంలో రక్షకుడు, విజయ ప్రదాత, అడ్డంకులను తొలగించే దేవుడిగా భావిస్తారు అని గురుస్వామి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

హనుమాన్ దీక్ష పురస్కరించుకుని మంగళవారం రాత్రి హనుమాన్ మలాధారణ స్వాములు చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఆంజనేయస్వామి శోభయాత్ర తీసిన సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతు హనుమంతుడు ఆయన విధేయత, శౌర్యం, బలానికి ప్రతీకగా నిలుస్తారు అని.

ఆంజనేయుడు తన భక్తులను మరియు శ్రీరాముని రక్షించేందుకు ప్రయత్నించాడు అని ఆయన భక్తులకు అపాయాలు రాకుండా రక్షిస్తాడు అని అన్నారు.

ఆంజనేయుడు తనని నమ్మిన వారికీ సమస్త విజయాలను ప్రసాదిస్తాడని ప్రజలు నమ్ముతారు.

ఆంజనేయుడు ప్రతి అడ్డంకిని తొలగించి, భక్తులకు సంతోషం, ప్రశాంతతను ప్రసాదిస్తాడు.

ఆంజనేయుడిని ఆరాధించేవారు, ఆయన యొక్క విధేయత, శౌర్యం, బలం, మరియు రక్షణ కోసం ఆయనను కొలుస్తారు అని అన్నారు.

హనుమాన్ శోభయాత్ర ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాముని ఉమేష్ చంద్ర, మాజీ ఎంపిటిసి పానుగంటి శారద రమేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెరుకు పెద్దలు, హనుమాన్ స్వాములు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, దయ్యాల పవన్, రాగిరి సాయి కుమార్, జంగిటి సాయి కిరణ్, మిట్టపల్లి సాయి తేజ, రాగిరి శివ, కోరమేన ప్రసాద్, జంగిటి రాజు, చెరుకు హరీష్, పిల్లి విజయ్, ఎయ్య రమేష్, ఇట్టమేన రవికుమార్, పిల్లి కుమార్, రజినీకాంత్, దయ్యాల నాగరాజు, వినయ్ గౌడ్, కొరిమి అరుణ్ కుమార్, రవితేజ, గొట్టిపర్తి శ్రీనివాస్, ఇట్టమేన గోపి, విష్ణు, పెదివిరి రాకేష్ రెడ్డి, గుండు అభినవ్, పూసల అవినాష్, పెసరి కౌశిక్ తదితరులు ఉన్నారు.

అబద్ధాల రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే అంచనాలకు మించ్చి వడ్లు ఎలా పండినాయి! హరీష్ రావు, కేసీఆర్ ల శ్రమ ఫలితమే తెలంగాణ రైతులకు సాగు

అబద్ధాల రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే అంచనాలకు మించ్చి వడ్లు ఎలా పండినాయి!

హరీష్ రావు, కేసీఆర్ ల శ్రమ ఫలితమే తెలంగాణ రైతులకు సాగు నీరు అందుతుంది!

కేసీఆర్ ముఖ్యమంత్రి ఐఏవరకు తెలంగాణలో కరువు వలసలు నెర్రెలు వారిని భూములు తప్ప ఏముండే?

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 15 మే 2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో కరువు వలసలు మిర్రలు బారిన భూములు రైతుల ఆత్మహత్యలు తప్ప మీరు చేసింది ఏమిటి రేవంత్ రెడ్డి అని బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

గురువారం నాడు ప్రెస్ నోట్ విడుదల చేసిన సందర్భంగా సీనియర్ నాయకులు పానుగంటి రమేష్ తో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మొక్కవోని దీక్షతో రైతు కుటుంబాలలో సంతోషాన్ని నింపాలే అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని సంకల్పించి కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి అప్పటి ఇరిగేషన్ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారికి ప్రాజెక్టు బాధ్యతలు అప్పజెప్పితే కంటిమీద కునుకు లేకుండా రెయిన్బోలు కష్టించి నూట ముప్పై ఐదు మీటర్ల ఎత్తు ప్రాజెక్టు నిర్మాణం చేసి వందల కిలోమీటర్లు కాలువలు తవ్వి కాలేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా మేడిగడ్డ సుందిళ్ల మధ్య మానేరు అన్నపూర్ణ ప్రాజెక్టు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ ఇలా అనేక ప్రాజెక్టులో నిర్మిస్తే ఈరోజు రైతులు భూమికి బరువయ్యే పంటలను తీస్తూ వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చుకుంటూ ఆ కుటుంబాలు సంతోషంగా ఉన్న విషయాన్ని మరిచిపోయి రేవతి రెడ్డి మతిభ్రమించినట్లుగా పదేపదే కాలేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పడము రేవంత్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని అన్నారు రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమిటో చెప్పాలని కెసిఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు ఇకనైనా విమర్శలు మాని తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తే బాగుంటుందని వారు అన్నారు.

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి! భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి!

భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 08-05-2025 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించద్దని ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పైన విజయం సాధించాలని భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని శేరిపల్లి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని గురుస్వామి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం రోజు హనుమాన్ స్వాములతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సేరిపెల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భారత ఆర్మీ కోసం భారత ప్రజల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయి భారత్ పైన దాడులకు పాల్పడుతూ భారత అమాయక ప్రజలను పొట్టని పెట్టుకుంటూ భారత ఆర్మీ పై దొంగ చాటున దాడులు చేస్తూ వస్తున్నారని మొన్నటికి మొన్న పైల్గంలో అమాయక ప్రజలైన 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని మరి దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టి ఆర్మీ విజయం సాధించిందని మునుముందు భారత ఆర్మీ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని విజయ సాధనలో భారత ఆర్మీకి ఎలాంటి హాని జరగకూడదని భారత ఆర్మీకి ఆంజనేయ స్వామితో పాటుగా దేవుని అందరూ అండగా ఉండి భారత ఆర్మీ ని భారత ప్రజలను రక్షించాలని అదేవిధంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన భారత ప్రజలు ఆర్మీ జవాన్లు మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆయన అన్నారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్న హనుమాన్ భక్తులుగా భారతదేశ పౌరులుగా స్వాగతిస్తూ మద్దతునిస్తామని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా హనుమాన్ భక్తులుగా యుద్ధంలో సైతం పాల్గొనడానికి సిద్ధమని అన్నారు జైశ్రీరామ్ ఇట్టి కార్యక్రమంలో దయ్యాల పవన్ కనుగుల శ్రీనివాస్ మోహన్ నాగరాజు రాకేష్ పంతులు చంద్రారెడ్డి మరియు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.

పెద్దమ్మ దేవాలయం చిన్నకోడూర్

పెద్దమ్మ దేవాలయం చిన్నకోడూర్

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా లోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం శ్రీ పెద్దమ్మ దేవస్థానం ఇక్కడ అమ్మవారు కొలిచిన భక్తులకు కొంగుబంగారమై తలిసేటి భక్తులకు తల మీద గొడుగై కోరిన వరాలు ఇచ్చే పెద్దమ్మ తల్లిగా విరాజిల్లుతుంది ఇక్కడ పెద్దమ్మకు ముదిరాజులు పూజలు నిర్వహిస్తా ఉంటారు ఈ దేవాలయం ఆదిమానవ కాలమునాటిదని ఈ యొక్క దేవాలయం సిద్ధిరవాస్తులో ఉంటే ముదిరాజ్ సంఘం వారు 2000 సంవత్సరంలో పునర్నిర్మాణం చేసి దేవాలయం నిర్మించారు గత ప్రాచీన కాలం నుండే పెద్దమ్మ అమ్మవారికి ముదిరాజులు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో చివరి శుక్రవారం రోజు ముదిరాజ్ ప్రతి ఇంటి నుండి ఆడపడుచులు మంగళహారతులు తీసుకువచ్చి పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి డిసెంబర్ నెలలో పెద్దమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తారు ఇట్టి జాతరకు తెలంగాణలోని హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ నిజాంబాద్ కామారెడ్డి సిరిసిల్ల వేములవాడ హుస్నాబాద్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ జాతరకు వస్తారు ఈ యొక్క పెద్దమ్మ దేవస్థానం పెద్దమనుషులు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటారు ఈ యొక్క సంఘానికి పెద్దమనుషులుగా జంగిటి సాయిలు ఇట్టబోయిన బుడాల మల్లయ్య చింతకింది మల్లయ్య పెద్ద మల్లయ్య చెరుకు చిన్న మల్లయ్య జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ చెరుకు పెద్దలు కోరబోయిన అంజయ్య కోరబోయిన బాలరాజ్ కోరబోయిన పెద్ద శ్రీనివాస్ జంగిటి శ్రీశైలం ఆనందం కోరబోయిన ప్రసాద్ పరకపెల్లి మల్లయ్య పరకపెల్లి కనకయ్య పరగపెల్లి వరదయ్య కొత్త పర్షియ్య చెరుకు శ్రీకాంత్ కొత్త బాలరాజ్ ఉప్పర బోయిన శంకర్ చింతకింది ప్రభాకర్ చెరుకు బిక్షపతి చింతకింది నరసింహారావు చెరుకు నరేష్ దొంతరబోయిన బాలమల్లు దొంతరబోయిన ఎల్లయ్య దొంతుర బోయిన రామస్వామి దొంతరబోయిన శ్రీనివాస్ దొంతరబోయిన చిన్న మల్లేశం కుందేళ్ళ చంద్రయ్య కుందేళ్ళ దశరథం దయ్యాల రామస్వామి పోయిల బాలరాజేశం పోయిల వెంకయ్య ఇట్టబోయిన బాలపోషయ ఇట్టబోయిన చిన్న పోచయ్య రాగిరి కనకయ్య అక్కెనపల్లి అంజయ్య పర్కపల్లి కనకయ్య పర్కపల్లి మల్లయ్య తదితరులు పెద్దమనుషులుగా ఉన్నారు

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ! రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

మహా కుంభ వేళలను తలపించిన కెసిఆర్ సభ!

రేవంత్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన తరలివచ్చిన ప్రజలు!

కెసిఆర్ సభ విజయవంతం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి వాయిదా వేసిన వేయవచ్చు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 28-04-2025 సోమవారం

చిన్నకోడూర్

కెసిఆర్ బయటకు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బిజెపి నాయకులకు అర్థమైందని దెబ్బకు జరుపుకున్నారని కెసిఆర్ అంటే పేరు కాదని ఒక బ్రాండ్ అని తెలువక నిన్నటి వరకు చౌకబారు విమర్శలు చేశారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు వరంగల్ సభ జరగకుండా అడ్డుకోవాలని రేవంత్ ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించి సభకు వచ్చే ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని అయినా కూడా జనాలు విరవకుండా భయపడకుండా వరంగల్ సభకు తరలివచ్చి మహాసముద్రాన్ని తలపించేలా మహా కుంభమేళను తలపించేలా దిక్కులు పీక్కటిల్లెల జనహూరు సాగిందని ఇది చూసిన రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిందని దీనితో స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయిన ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదని ఈ సభతో ప్రతిపక్షాలకు రేపటి రోజులు బిఆర్ఎస్వేనని అర్థమై ఉంటుందని ఆయన అన్నారు ఇకనైనా తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత కేసిఆర్ పై విమర్శలు మానుకొని ఉన్నన్ని రోజులు పాలనపై దృష్టి పెట్టాలని లేకుంటే ప్రజలు తగిన రీతిలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని జంగిటి అన్నారు.

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్న గ్రామస్థులపైన చర్య తీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టుకొని అమ్ముకుంటున్ను గ్రామస్తులపైన చర్య తీసుకోవాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

తేది: 10-04-2025 గురువారం

సిద్ధిపేట కలెక్టరేట్ న్యూస్

సిద్దిపేట జిల్లా బొంపల్లి అక్బర్పేట్ మండల్ ఖాజీపూర్ గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల పైన గ్రామస్తులు వీడిసి పేరుతో గత 30 సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులపైన అధికారులు చర్య తీసుకోవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

ఖాజీపూర్ కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణకు గురి చేస్తూ చేపలు పట్టుకోకుండా దౌర్జన్యం చేస్తూ 30 సంవత్సరాలుగా గ్రామస్తులు చేపల ఆదాయాన్ని గడిస్తున్నారని ముదిరాజులు మత్స్యకారులు తక్కువ సంఖ్యలో ఉన్నందున ఆ యొక్క గ్రామస్తులు ప్రభుత్వ చట్టాలను చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులవృత్తులను తుంగలో తొక్కి ఒక సామాజిక వర్గం పైనే ఒక కుల వృత్తి పైననే దౌర్జన్యంగా డబ్బులు గ్రామస్తులు దండుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని దీనిపైన ఉన్నదా అధికారులు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఖాజీపూర్ ముదిరాజులకు మత్స్య శాఖలో సొసైటీ ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇచ్చినప్పటికీ గ్రామస్తులు సుప్రీమ్ గా భావిస్తూ ఇంతటి దారుణానికి ఒడి కట్టడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు నిర్ణయాలు తీసుకొని చట్టాలను సైతం లెక్కచేయకుండా అక్కడి ముదిరాజ్ మచ్చకారులను గ్రామ బహిష్కరణకు గురిచేసి గ్రామంలో ఎవరు కూడా మాట్లాడకుండా చేయడము బెదిరింపులకు పాల్పడడం ప్రాణనాష్టం కల్పిస్తామని చెప్పడము స్వతంత్ర భారతదేశంలో ఇది కరెక్ట్ కాదని తక్షణమే కలెక్టర్ గారు ముదిరాజ్ మత్స్యకారులకు చేపలు పట్టుకొనుటకు అనుమతులు ఇస్తూ ముదిరాజ్ మత్స్యకారులకు రక్షణ ఇవ్వాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర కమిటీల ద్వారా కోరుతున్నామని అలా జరగనియెడల జిల్లాలో మొత్తం 370 సొసైటీలు 30 వేల మత్స్యకారులు ఉన్నారని అందరినీ ఏకం చేసి చలో కాజీపూర్ చేపట్టి అక్కడి చెరువుకుంటలో ఉన్న చేపలను పట్టి అక్కడి ముదిరాజ్ మత్స్యకారులకు ఇచ్చి అండగా నిలుస్తామని ఆయన అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా డైరెక్టర్ ఆకారం సతయ్య, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు అరిగే కృష్ణ, కొంతం శ్రవణ్, యాట రాజేష్, గుడిపల్లి వికాస్, కోరబోయిన సుధాకర్, దూలం ముత్యం, గణేష్, రమేష్, నరేశ్, రమేష్, స్వామి తదితర ముదిరాజులు ఉన్నారు.

ముదిరాజ్ జాతిపట్ల వివక్ష చూపుతున్న సి.యం రేవంత్ రెడ్డి! డి.ఎల్ పాండు ముదిరాజ్

ముదిరాజ్ జాతిపట్ల వివక్ష చూపుతున్న రేవంత్ రెడ్డి

మేనిఫెస్టో హామీని అటకెక్కించ్చిన రేవంత్ రెడ్డి

డిఎల్ పాండు ముదిరాజ్ సుప్రీంకోర్టు అడ్వకేట్

*చిన్నకోడూరు, ఏప్రిల్ 04, 2025

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముదిరాజులపైన వివక్ష కొనసాగుతుందని సుప్రీంకోర్టు అడ్వకేట్ డిఎల్ పాండు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ముస్తాబాద్ లో జరిగే ముదిరాజ్ సమావేశానికి వెళ్తున్న డిఎల్ పాండును సిద్దిపేట ముదిరాజులు కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, యూత్ అధ్యక్షులుపడిగె ప్రశాంత్, జిల్లా నాయకులు వెంకటేశం, పొన్నాల శ్రీనివాస్ లతో కలిసి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా ముదిరాజులకు ప్రత్యేక హామీ ఇస్తూ ముదిరాజులను బిసి'డి' నుండి బీసీ'ఏ' లోకి మారుస్తామని వారి యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచి తీరా బాధ్యతలు చేపట్టినాక ముదిరాజుల అంశం మరిచిపోయి ముదిరాజుల ఊసే ఎత్తడం లేదని, ఇవాళ ముదిరాజులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, గత ప్రభుత్వంలో కనీసం మత్స్యకారులను ఆదుకోవడానికి ఉచిత చేప పిల్లలు సబ్సిడీ ఇచ్చారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అది కూడా మర్చిపోయాడని, పేరుకే కార్పొరేషన్ ప్రకటించి నేటికి కూడా ఒక రూపాయి కేటాయించలేదని, మొన్న బడ్జెట్లో కూడా మత్స్యవృత్తికి ప్రాధాన్యత లేదని, అందుకనే ముదిరాజు మత్స్యకారులు న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇకనైనా ముదిరాజుల పట్ల ఆలోచన చేసి ముదిరాజులను బిసి'ఏ'లోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ పాండు ముదిరాజ్ తో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, మాజీ సర్పంచ్ లు మేడికాయల వెంకటేశం, పొన్నాల శ్రీనివాస్, బరిగెల సాయి తదితరులు ఉన్నారు.