అబద్ధాల రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే అంచనాలకు మించ్చి వడ్లు ఎలా పండినాయి! హరీష్ రావు, కేసీఆర్ ల శ్రమ ఫలితమే తెలంగాణ రైతులకు సాగు
![]()
అబద్ధాల రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే అంచనాలకు మించ్చి వడ్లు ఎలా పండినాయి!
హరీష్ రావు, కేసీఆర్ ల శ్రమ ఫలితమే తెలంగాణ రైతులకు సాగు నీరు అందుతుంది!
కేసీఆర్ ముఖ్యమంత్రి ఐఏవరకు తెలంగాణలో కరువు వలసలు నెర్రెలు వారిని భూములు తప్ప ఏముండే?
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
తేది: 15 మే 2025 గురువారం
చిన్నకోడూర్ న్యూస్
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో కరువు వలసలు మిర్రలు బారిన భూములు రైతుల ఆత్మహత్యలు తప్ప మీరు చేసింది ఏమిటి రేవంత్ రెడ్డి అని బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
గురువారం నాడు ప్రెస్ నోట్ విడుదల చేసిన సందర్భంగా సీనియర్ నాయకులు పానుగంటి రమేష్ తో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మొక్కవోని దీక్షతో రైతు కుటుంబాలలో సంతోషాన్ని నింపాలే అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని సంకల్పించి కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి అప్పటి ఇరిగేషన్ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారికి ప్రాజెక్టు బాధ్యతలు అప్పజెప్పితే కంటిమీద కునుకు లేకుండా రెయిన్బోలు కష్టించి నూట ముప్పై ఐదు మీటర్ల ఎత్తు ప్రాజెక్టు నిర్మాణం చేసి వందల కిలోమీటర్లు కాలువలు తవ్వి కాలేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా మేడిగడ్డ సుందిళ్ల మధ్య మానేరు అన్నపూర్ణ ప్రాజెక్టు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ ఇలా అనేక ప్రాజెక్టులో నిర్మిస్తే ఈరోజు రైతులు భూమికి బరువయ్యే పంటలను తీస్తూ వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చుకుంటూ ఆ కుటుంబాలు సంతోషంగా ఉన్న విషయాన్ని మరిచిపోయి రేవతి రెడ్డి మతిభ్రమించినట్లుగా పదేపదే కాలేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పడము రేవంత్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని అన్నారు రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమిటో చెప్పాలని కెసిఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు ఇకనైనా విమర్శలు మాని తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తే బాగుంటుందని వారు అన్నారు.
May 21 2025, 15:39