ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి! భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ప్రత్యర్థి పాక్ పై భారత ఆర్మీ విజయం సాదించాలలి!
భారత ఆర్మీ బాగుండాలని ప్రత్యేక పూజలు చేసిన హనుమాన్ స్వాములు!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
తేది: 08-05-2025 గురువారం
చిన్నకోడూర్ న్యూస్
భారత ఆర్మీకి ఎలాంటి ఆపద సంభవించద్దని ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ పైన విజయం సాధించాలని భారత ప్రజలు సుభిక్షంగా ఉండాలని శేరిపల్లి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని గురుస్వామి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం రోజు హనుమాన్ స్వాములతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సేరిపెల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భారత ఆర్మీ కోసం భారత ప్రజల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయి భారత్ పైన దాడులకు పాల్పడుతూ భారత అమాయక ప్రజలను పొట్టని పెట్టుకుంటూ భారత ఆర్మీ పై దొంగ చాటున దాడులు చేస్తూ వస్తున్నారని మొన్నటికి మొన్న పైల్గంలో అమాయక ప్రజలైన 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని మరి దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టి ఆర్మీ విజయం సాధించిందని మునుముందు భారత ఆర్మీ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని విజయ సాధనలో భారత ఆర్మీకి ఎలాంటి హాని జరగకూడదని భారత ఆర్మీకి ఆంజనేయ స్వామితో పాటుగా దేవుని అందరూ అండగా ఉండి భారత ఆర్మీ ని భారత ప్రజలను రక్షించాలని అదేవిధంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన భారత ప్రజలు ఆర్మీ జవాన్లు మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆయన అన్నారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్న హనుమాన్ భక్తులుగా భారతదేశ పౌరులుగా స్వాగతిస్తూ మద్దతునిస్తామని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా హనుమాన్ భక్తులుగా యుద్ధంలో సైతం పాల్గొనడానికి సిద్ధమని అన్నారు జైశ్రీరామ్ ఇట్టి కార్యక్రమంలో దయ్యాల పవన్ కనుగుల శ్రీనివాస్ మోహన్ నాగరాజు రాకేష్ పంతులు చంద్రారెడ్డి మరియు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.
May 15 2025, 18:32