గుర్రంపోడు గౌతమ్ స్కూల్లో దారుణం
ఫస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని చేతికి వాతలు వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయులు

నల్గొండ జిల్లా యాదవ మహాసభ జిల్లాలో తగుళ్ల యాదయ్యకు చోటు
నల్గొండ జిల్లా యాదవ మహాసభ జిల్లాలో తగుళ్ల యాదయ్యకు చోటు
అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ లో తగుల్ల యాదయ్య యాదవ్ కు చోటు వచ్చే
అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ లో తగుల్ల యాదయ్య యాదవ్ కు చోటు వచ్చే నెలలో ప్రకటించే అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీలో గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తగుల్ల యాదయ్యకు చోటు కల్పిస్తామని సోమవారం క్రాంతి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన అఖిలభారత యాదవ మహాసభలో జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా తగుల్ల యాదయ్య యాదవ్ మాట్లాడుతూ.తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని కేటాయించిన జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ కు,జిల్లా కార్యవర్గానికి,మండల యాదవ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని యాదవ కులస్తుల సమస్యలను పరిష్కరించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు.
ఆరు గ్యారంటీల అమలుతో ప్రతిపక్షాల బేజారు* తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొత్త నాగరాజు


*గుర్రంపోడు*:ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని, తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డిపై బిఆరెస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని యువజన కాంగ్రెస్ గుర్రంపోడు మండల అధ్యక్షులు కొత్త నాగరాజు అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే,ప్రతిపక్షంగా బిఆరెస్ పార్టీ నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడం దురదృష్టకరమని అన్నారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి  అహంకారంతో దళితుడైన స్పీకర్ ని అవమానిస్తూ మాట్లాడి, ఇప్పటివరకు క్షమాపణలు చెప్పకపోవడం దారుణమన్నారు. తప్పు చేసిన జగదీష్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు సస్పెండ్ చేస్తే కార్యకర్తలతో ధర్నాలు చేయించడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.