NLG: ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా
నల్లగొండ జిల్లా:
చిట్యాల: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ విజ్ఞప్తి చేశారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

కార్మికులకు రూ.10,000/- వేతనాన్ని ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NLG: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపిన శాసనమండలి చైర్మన్
నల్గొండ: జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

శనివారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన నివాసంలో, ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ మేరకు సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ కు శాశ్వత భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఆయన అభినందనలు తెలిపారు.

*జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సన్మానించారు*.

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు పై ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తుందని, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తగిన విధంగా న్యాయ సలహాలు తీసుకొని ముందుకు పోతుందని మండలి చైర్మన్ తెలిపారు. జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సూచించారు.

ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు దోసపాటి సత్యనారాయణ, ఎం.యాదగిరి, మదనాచారి, సయ్యద్, రామకృష్ణ, ఉపేందర్, మల్లేష్, కంది శ్రీనివాస్, భాస్కర్, రవీందర్ రెడ్డి, అశోక్, చాంద్, రాంప్రసాద్, భజరంగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఆసరాగా నిలుస్తున్న సీఎం సహాయనిధి పథకం: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ: వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 24 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరు అయిన రూ. 8,15,000/- విలువ గల చెక్కులను, శుక్రవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పట్టణంలోని వారి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి ( CMRF) పథకం నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.  ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు .

ఈ పథకాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రజిత రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగులవంచ వెంకటేశ్వర్ రావు, దుబ్బ అశోక్ సుందర్, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, శ్రీరామదాసు హరికృష్ణ, చిలకరాజు శ్రీనివాస్, రిటైర్డ్ వార్డెన్ పాదురి ఇంద్ర సేన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నారాయణపురం ప్రెస్ క్లబ్ ను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం:
సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో, జర్నలిస్టులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న  ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సందర్శించారు.

ఈ మేరకు మొదటిసారి ప్రెస్ క్లబ్ కు వచ్చిన  ఎమ్మెల్యేకు ప్రెస్ క్లబ్ సభ్యులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.

ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఎమ్మెల్యే ను ప్రెస్ క్లబ్ సభ్యులు ఆహ్వానించారు.
NLG: బాధిత కుటుంబానికి 2 లక్షల 50 వేలు ఎల్ఓసిని అందించిన ఎమ్మెల్యే
మునుగోడు నియోజకవర్గం, నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన నూకం జంగయ్య కుమారుడు  నూకం రాంచరణ్ (13) అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2.5 లక్షలు ఎల్ఓసి ని మంజూరు చేయించి శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
NLG: 'మాలల సింహ గర్జన - ఛలో హైదరాబాద్' వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన దళిత రత్న నూనె సురేష్
నల్లగొండ జిల్లా:
దేవరకొండ మండలం, తూర్పు పల్లి గ్రామంలో 'డిసెంబర్ 1 న మాలల సింహ గర్జన ఛలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలి' అని దళిత రత్న అవార్డు గ్రహీత అడ్వకేట్ నూనె సురేష్ అన్నారు.

గురువారం  గ్రామ కుల పెద్దలు మాల నాయకులు, మహిళలతో కలిసి ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను  ఆవిష్కరించారు.

దలితరత్న నూనె సురేష్ మాట్లాడుతూ.. మాలల ఆత్మ గౌరవం, అస్తిత్వం, ఐక్యత ను కాపాడాలని, మాలలు హక్కుల పరిరక్షణ కోసం ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో  తూర్పుపల్లి మాల మహానాడు గ్రామ అద్యక్షులు ఎన్నమల్ల రామస్వామి, గోపాల్ దాస్ రామకృష్ణ, నూనె లాలయ్య,ఎన్నిమల్ల ప్రవీణ్,ఎన్నిమల్ల చంటి, నూనె కళ్యాణ్,వల్లవోజు అంజయ్య,గాదరి ప్రభుదాస్,నర్మద,పద్మ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు మరువలేని: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో గురువారం, పట్టణంలోని డివిజన్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 134 వ వర్ధంతిని నిర్వహించారు. ఈ మేరకు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డివిజన్ కన్వీనర్ జిల్లా రాములు, ఆలిండియా సమతా సైనిక్ దళ్ సలహాదారులు నక్క వెంకటేశ్వర్లు, కొమ్ము రాజశేఖర్, జాజాల మురళి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే సామాజిక తత్వవేత్త, సంఘ సేవకుడు, పాఠశాలలు లేని రోజుల్లో తను సొంతంగా పాఠశాలలు స్థాపించి అంటరానితనం, వివక్షపై ఎన్నో ఉద్యమాలు చేశారని.. ఆయన సేవలు మరువలేనివి అని మహాత్మా పూలే సేవలను కొనియాడారు.
NLG: ఈనెల 29 న సాధారణ సమావేశం
నల్గొండ: పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో, ఈనెల 29 శుక్రవారం ఉదయం 10.30 గంటలకు, సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్ లు పాల్గొననున్నారు.

ఈ మేరకు పాలకవర్గం సభ్యులు సకాలంలో హాజరు కావాలని వారు కోరారు.
NLG: డిసెంబర్ 2 న బహిరంగ సభకు తరలిరండి: బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
చండూరు: సిపిఎం నల్గొండ జిల్లా 21వ మహాసభలు డిసెంబర్ 2 న, మిర్యాలగూడలో జరగనున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం తెలిపారు. ఈ మేరకు బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బుధవారం మండల కేంద్రంలో బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు.మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య,నాయకులు బొమ్మరగోని యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: గురుకుల పాఠశాల నూతన భవన సముదాయం ను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గం:
సంస్థాన్ నారాయణపూర్ మండలం,  సర్వేల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవన సముదాయం ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ ప్రారంభించారు. ఈ మేరకు గురుకుల పాఠశాల సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గురుకుల పాఠశాల స్థలదాత మద్ది నారాయణరెడ్డి విగ్రహంతో పాటు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం విగ్రహాల కు  పూలమాల లు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, 18.61 కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు, 1 కోటి రూపాయల వ్యయం తో ఫర్నిచర్ తో కూడిన నూతన పాఠశాల భవన సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు పాటించేలా తెలంగాణ ప్రభుత్వం  ప్రయత్నిస్తుందని, దేశంలోనే సర్వేలు పాఠశాలకు ఉన్నతమైన ఘన చరిత్ర ఉంది.మద్ది నారాయణరెడ్డి తన 44 ఎకరాల స్థలం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు. డబ్బు తో గౌరవం రాదు, విద్యతోనే వస్తుంది. చదువుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. రాజకీయ నాయకులు,కలెక్టర్లు,డాక్టర్లు,  శాస్త్రవేత్తలు కావచ్చని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం కృషి చేస్తుందని,
ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపనలో భాగంగా  మునుగోడు వద్ద 300 కోట్ల రూపాయల తో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో మండలానికి 5 పాఠశాలల చొప్పున 30 స్కూల్ లను నిర్మించేలా కృషి చేస్తానని అన్నారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం విషయంలో తేడా రావొద్దని పాఠశాల సిబ్బంది కి సూచించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, పలువురు నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.