మర్రిగూడ మండలంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మండలకేంద్రంలో అంబేద్కర్ వాది నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ మేరకు నాగిల్ల మారయ్య మాట్లాడుతూ.. భారతదేశాన్ని  సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా  నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక,ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన మరియు భావ ప్రకటన, విశ్వాసం, సమానత్వాన్ని చేకూర్చుకోవడానికి వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను సౌబ్రాతృత్వాన్ని పెంపొందించడానికి,1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్ లో ఎంపిక చేసుకొని శాసనం గా రూపొందించారని భారత రాజ్యాంగ పీఠిక ను గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో పందుల రాములు గౌడ్,కొడిచెర్ల శేఖర్, పగడాల రఘు, అభి సందేశ్, వంపు చరణ్,కోరే అజయ్ తదితరులు పాల్గొన్నారు.
NLG: అదనపు తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
నల్లగొండ జిల్లా:
నకిరేకల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలసి జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రారంభించారు.

ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్థానిక శాసనసభ్యులు విద్యా వాలంటీర్లతో పాటు, ప్రత్యేక టీచర్లను ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు.
NLG: రేపు మర్రిగూడ మండలానికి రానున్న ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈనెల 26 న మర్రిగూడ మండలానికి రానున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎమ్మెల్యే మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు శివన్నగూడ, కొట్టాల గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

శివన్నగూడ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి, కొట్టాల గ్రామంలో అంగన్వాడీ భవనానికి శంకుస్థాపనలు చేయనున్నారు.

ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ కోరారు.
ఎన్జీ కళాశాల ఎన్సిసి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
నల్లగొండ: ఎన్సిసి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగార్జున ప్రభుత్వ కళాశాల ఎన్సిసి క్యాడేట్లు మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ  మేరకు ఎన్సిసి బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ లక్షారెడ్డి మరియు నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం (Blood Donation) ఒక మహత్తరమైన కార్యం. ఇది జీవితాలను కాపాడే గొప్ప కార్యక్రమం,
రక్తదానం చేయడం ఒక విధమైన సామాజిక సేవ అని అన్నారు.

ఇది నిస్వార్థతకు ప్రతీక మరియు సమాజం పట్ల మన బాధ్యతను తెలియజేస్తుందనీ ప్రతి ఒక్కరు ఈ సేవలో పాల్గొనడం ద్వారా సమాజంలో మానవత్వాన్ని ప్రోత్సహించవచ్చని.. కేన్సర్, థాలసేమియా, హేమోఫిలియా వంటి వ్యాధులు ఉన్నవారికి రక్తం అత్యవసరం అని గుర్తుచేశారు.

అదే విధంగా కళాశాల ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్ మాట్లాడుతూ.. ఎన్సిసి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్లు రక్తదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నామని, రక్తదానం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గర్భిణీ స్త్రీల ప్రసవ సమయంలో కాపాడిన వాళ్ళవుతారని, రక్తదానం చేయడం ద్వారా కొత్త రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి, ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుందని వివరించారు.

కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మరియు ఎన్సిసి క్యాడేట్లు  కళాశాల సిబ్బంది పాల్గొన్నారు
నల్లగొండలో లాన్ టెన్నిస్ ఎస్ జి ఫ్ అండర్ 14, 17 ఉమ్మడి జిల్లా సెలక్షన్స్
నల్గొండ: ఉమ్మడి జిల్లా లాన్ టెన్నిస్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14, 17 బాలబాలికల సెలక్షన్స్ సోమవారం పట్టణంలోని విపస్య హైస్కూల్ లో నిర్వహించినట్లు, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి విమల తెలిపారు. ఈ సెలక్షన్లలో 20 మంది బాల బాలికలు పాల్గొన్నారని, త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి టీమ్స్ ని పంపిస్తున్నామని తెలిపారు.

జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కు సహకరిస్తున్న ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయులకు  కృతజ్ఞతలు తెలిపారు.
NLG: కోలాటం బృందానికి రూ. 25 వేలు ఆర్థిక ప్రోత్సాహకం అందించిన యువజన నాయకులు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, యరగండ్లపల్లి గ్రామంలో మహిళలు కోలాటం నేర్చుకుంటామని.. అందుకు సహాయ సహకారాలు అందించాలని, కోలాటం కళ కు సంబంధించిన కాలి గజ్జల అవసరం ఉందని.. యరగండ్లపల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పులిమామిడి నరసింహారెడ్డి, ఏడుదొడ్ల కృష్ణారెడ్డి లను కోరారు.

అడిగిన వెంటనే వారికి అయ్యే ఖర్చు తెలుసుకొని రూ.25, 000 వేలు ప్రోత్సాహకంగా అందించారు.

పులిమామిడి నరసింహారెడ్డి, ఏడుదోడ్ల కృష్ణ రెడ్డి లు మాట్లాడుతూ.. యరగండ్లపల్లి గ్రామంలో మహిళలు కోలాటం నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని, మహిళలు ఇంకా అనేక రంగాలలో రాణించాలని  అన్నారు.

యరగండ్లపల్లి గ్రామంలో మహిళలను వివిధ రంగాలలో రాణించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని, మహిళల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ మేరకు  కోలాటాల బృందం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి శాలువతో సత్కరించారు.
TG: జిల్లా కలెక్టర్లతో కుల గణన సర్వే పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం

సమగ్ర కుల గణన సర్వే పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం జార్ఖండ్ రాష్ట్రం, రాంచీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి మాట్లాడుతూ.. సర్వే సమయంలో అందుబాటులో లేని, వివిధ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లిన  వారి వివరాలు మరియు వలసదారుల వివరాలను సేకరించి నమోదు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఖచ్చితమైన డేటా నమోదు యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.

కుల గణన ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

NLG: ఎన్.జి కళాశాల ఎన్సిసి ఆధ్వర్యంలో అన్నదానం
నల్లగొండ: ఎన్సిసి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల ఎన్సిసి క్యాడేట్లు, ఆదివారం పట్టణంలోని హిమాలయ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కూడలిలలో నిరాశ్రయులైన పేదలకు భోజనం ప్యాకెట్లు పంచి పెట్టారు.

ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్ ఎన్సిసి క్యాడేట్లకు ఎన్సిసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. భారత పార్లమెంటులో NCC Act of 1948 ద్వారా చట్టబద్ధమైందని, దేశభక్తిని పెంపొందించడం, దేశ రక్షణకు మద్దతు ఇవ్వడం, సమాజ సేవ, జాతీయ ఐక్యత అనే ఉద్దేశాలతో ఎన్సిసిని స్థాపించడం జరిగిందని గుర్తు చేశారు.

ఎన్జీ కళాశాల ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్ మాట్లాడుతూ.. ఎన్సిసి విద్యార్థులకు సైనిక శిక్షణ ద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయడం,యువతను దేశ సేవకు ఆకర్షించడం, సమాజ సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మేలు చేయడం వంటి ముఖ్యమైన విధానాలతో ఏర్పాటు కావడం జరిగిందని తెలిపారు.

ఎన్సిసి ద్వారా యువతలో నైతిక విలువలు, శారీరక శక్తి మరియు సామాజిక బాధ్యత పెంపొందిస్తాయని, ఇది భారతదేశంలోని యువతకు రక్షణ రంగంతో పాటు, పౌర జీవితంలోనూ అనేక అవకాశాలను అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీ కళాశాల ఎన్సిసి క్యాడేట్లు పాల్గొన్నారు.
NLG: వికలాంగుల న్యాయమైన డిమాండ్ పెన్షన్ పెంచాలి: నాగం వర్షిత్ రెడ్డి, పిల్లి రామరాజు
నల్గొండ: కలెక్టర్ కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులకు పెన్షన్ పెంచాలని చేపట్టిన ఆరు రోజుల దీక్ష ఇవాళ ముగింపు దశకు చేరుకుంది.  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి పెరిక శ్రీనివాసులు చేపట్టిన ఈ దీక్షలో మునుగోడు నియోజకవర్గంలోని దివ్యాంగులు పాల్గొన్నారు.

ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, నల్గొండ పార్లమెంటరీ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ లు సంఘీభావం తెలుపుతూ దీక్షను విరమింపజేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా, ఇంతవరకు పెంచుతామన్న చేయూత ఆసర పెన్షన్ల మీద మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.

గత 6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వికలాంగుల సమస్యను.. ప్రభుత్వం పట్టించుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి వృద్ధులు,వితంతువులు, వికలాంగుల పైన ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.

నవంబర్ 26 న ఇందిరా పార్క్ వద్ద జరిగే పెన్షన్ దారుల ఆవేదన ధర్నా కార్యక్రమానికి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ ల పైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

భవిష్యత్తులో వికలాంగులు ఎలాంటి ఉద్యమాలు చేసినా.. భారతీయ జనతా పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని, ప్రత్యక్ష ఉద్యమంలో కూడా పాల్గొంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, బీసీ నాయకులు రమణ మూదిరాజ్, జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్, జిల్లా కో- కన్వీనర్ వీరబోయిన సైదులు యాదవ్, సీనియర్ నాయకులు చిలుముల జలంధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు చైతన్య రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు ఇందిరా చౌదరి, పాల్వాయి సుధాకర్, పెరమల్ల రవి, జిల్లా భాస్కర్, నరసింహ గౌడ్, దశరథ లక్ష్మయ్య, సత్యనారాయణ, మంగమ్మ, భాగ్యమ్మ, సైదమ్మ, భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు మచ్చ గిరి, ముత్తయ్య, అంజి, సందీప్, రవి, కుమార్, శ్రీకాంత్, లక్ష్మి, రామేశ్వరి, బొమ్మగంటి సైదులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: మాల- మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం సభకు బయలుదేరిన మర్రిగూడ మండల నాయకులు
మర్రిగూడ: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండలో శనివారం నిర్వహిస్తున్న  మాల- మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం  సభకు మండల కేంద్రం నుండి మాలలు భారీగా తరలి వెళ్లారు.

మునుగోడు నియోజకవర్గ కో కన్వీనర్ దళిత రత్న నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో సరంపేట ఘర్ష గడ్డ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా బయలుదేరారు.

కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల మాలలు పాల్గొన్నారు.