NLG: వికలాంగుల న్యాయమైన డిమాండ్ పెన్షన్ పెంచాలి: నాగం వర్షిత్ రెడ్డి, పిల్లి రామరాజు
నల్గొండ: కలెక్టర్ కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులకు పెన్షన్ పెంచాలని చేపట్టిన ఆరు రోజుల దీక్ష ఇవాళ ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి పెరిక శ్రీనివాసులు చేపట్టిన ఈ దీక్షలో మునుగోడు నియోజకవర్గంలోని దివ్యాంగులు పాల్గొన్నారు.
ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, నల్గొండ పార్లమెంటరీ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ లు సంఘీభావం తెలుపుతూ దీక్షను విరమింపజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా, ఇంతవరకు పెంచుతామన్న చేయూత ఆసర పెన్షన్ల మీద మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.
గత 6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వికలాంగుల సమస్యను.. ప్రభుత్వం పట్టించుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి వృద్ధులు,వితంతువులు, వికలాంగుల పైన ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
నవంబర్ 26 న ఇందిరా పార్క్ వద్ద జరిగే పెన్షన్ దారుల ఆవేదన ధర్నా కార్యక్రమానికి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ ల పైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో వికలాంగులు ఎలాంటి ఉద్యమాలు చేసినా.. భారతీయ జనతా పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని, ప్రత్యక్ష ఉద్యమంలో కూడా పాల్గొంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, బీసీ నాయకులు రమణ మూదిరాజ్, జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్, జిల్లా కో- కన్వీనర్ వీరబోయిన సైదులు యాదవ్, సీనియర్ నాయకులు చిలుముల జలంధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు చైతన్య రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు ఇందిరా చౌదరి, పాల్వాయి సుధాకర్, పెరమల్ల రవి, జిల్లా భాస్కర్, నరసింహ గౌడ్, దశరథ లక్ష్మయ్య, సత్యనారాయణ, మంగమ్మ, భాగ్యమ్మ, సైదమ్మ, భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు మచ్చ గిరి, ముత్తయ్య, అంజి, సందీప్, రవి, కుమార్, శ్రీకాంత్, లక్ష్మి, రామేశ్వరి, బొమ్మగంటి సైదులు, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ: కలెక్టర్ కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులకు పెన్షన్ పెంచాలని చేపట్టిన ఆరు రోజుల దీక్ష ఇవాళ ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి పెరిక శ్రీనివాసులు చేపట్టిన ఈ దీక్షలో మునుగోడు నియోజకవర్గంలోని దివ్యాంగులు పాల్గొన్నారు.

మర్రిగూడ: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండలో శనివారం నిర్వహిస్తున్న మాల- మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం సభకు మండల కేంద్రం నుండి మాలలు భారీగా తరలి వెళ్లారు.
నల్గొండ: పట్టణంలోని అరోర లీగల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్గొండ సహకారంతో కళాశాలలో శనివారం లీగల్ సర్వీసెస్ అథారిటి న్యాయ సదస్సు నిర్వహించారు.
నల్లగొండ: మీడియా సమాజానికి అద్దం లాంటిదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి చౌరస్తాలో జిల్లా ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లా:
ఈ సందర్భంగా సదర్ ఉత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కు గొల్ల కురుమ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.. యాదవ సోదరులతో కలిసి సంప్రదాయబద్ధంగా దున్నపోతును ఆడించి యాదవ సోదరులలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ మేరకు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. యాదవ సోదరులు నీతికి నిజాయితీకి మారుపేరని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలలో యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో గొల్ల కురుమ సంఘ భవనం కోసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి స్థలం కేటాయింపు జరిగేలా చూస్తానని, భవన నిర్మాణానికి తనవంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, రాజ్ గోపాల్ రెడ్డి అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 
నల్లగొండ జిల్లా:
నల్గొండ: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం మండలంలోని కొత్తపల్లి గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మునుగోడు నియోజకవర్గం,మర్రిగూడ మండలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం తో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, శుక్రవారం మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ పంపిణి చేశారు.
Nov 24 2024, 16:30
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.1k