NLG: సదర్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మునుగోడు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శుక్రవారం, మునుగోడు మండల గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సదర్ ఉత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కు గొల్ల కురుమ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.. యాదవ సోదరులతో కలిసి సంప్రదాయబద్ధంగా దున్నపోతును ఆడించి యాదవ సోదరులలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ మేరకు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. యాదవ సోదరులు నీతికి నిజాయితీకి మారుపేరని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలలో యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో గొల్ల కురుమ సంఘ భవనం కోసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి స్థలం కేటాయింపు జరిగేలా చూస్తానని, భవన నిర్మాణానికి తనవంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, రాజ్ గోపాల్ రెడ్డి అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

నల్గొండ: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం మండలంలోని కొత్తపల్లి గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మునుగోడు నియోజకవర్గం,మర్రిగూడ మండలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం తో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, శుక్రవారం మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ పంపిణి చేశారు.
నల్గొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల మరియు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో విద్యార్థులకు త్రాగునీరు కోసం, కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సౌజన్యంతో.. వాటర్ ప్లాంట్, వాటర్ కూలర్ లను ఏర్పాటు చేసి శుక్రవారం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా:
ఈ సందర్బంగా ఉపాధ్యాయులు శ్రీ చరణ్ ను ఘనంగా సన్మానించారు. శ్రీ చరణ్ మాట్లాడుతూ.. పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కస్తూరి ఫౌండేషన్ ద్వారా ఒక విద్యారంగాన్ని బాగుపర్చడమే కాకుండా వివిధ రంగాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ మేరకు ఉపాధ్యాయులు శ్రీ చరణ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
నల్గొండ జిల్లా:
నల్లగొండ: ఆర్టీసీ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్లు కీలకమని ఉమ్మడి జిల్లా రీజినల్ మేనేజర్ రాజశేఖర్ అన్నారు.
నల్లగొండ: పట్టణంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో, నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గంగపుత్ర భవన్ లో ఘనంగా నిర్వహించారు.
Nov 23 2024, 10:08
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.7k