NLG: మునాస ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచం మత్స్యకార దినోత్సవం

నల్లగొండ: పట్టణంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో, నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గంగపుత్ర భవన్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు పై చర్చించారు. అనంతరం మహిళా అధ్యక్షులను, సీనియర్ సభ్యులను శాలువాలు కప్పి సత్కరించి స్వీట్లు పంపిణి చేసుకున్నారు.

కార్యక్రమంలో పిల్లి సత్తయ్య, మునాస వెంకన్న, కొప్పు కృష్ణయ్య, మంగిలిపల్లి కిషన్, సింగం వెంకటయ్య గడిగ శ్రీను కౌన్సిలర్, గుండు వెంకటేశ్వర్లు, మునాస సత్యనారాయణ, మంగిలిపల్లి శంకర్, వడ్డెబోయిన వెంకటరామకృష్ణన్, మునాస వినయ్, అంబటి శివకుమార్, అంబటి అనురాధ, సింగం లక్ష్మి, అంబటి గంగ, తదితరులు పాల్గొన్నారు.

NLG: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచుకట్ల సంపత్
నల్గొండ జిల్లా, గట్టుప్పల్ మండల కేంద్రంలో గీత కార్మికుడు పెద్దగాని లచ్చయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచుకట్ల సంపత్ నామాపురం మాజీ సర్పంచ్, ఇవాళ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.  10,000/-  ఆర్థిక సహాయం అందించారు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నామని జగన్నాథం మాట్లాడుతూ.. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నానుడి దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయడం ఎంతో అభినందనీయమని  అన్నారు.

గట్టుప్పల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నామని బుచ్చయ్య, సామల యాదయ్య, పగిళ్ల శంకర్, గట్టుప్పల రైతు సమన్వయ వేదిక మండల నాయకులు చెరుపల్లి ఆంజనేయులు, పెదగాని రాఘవేంద్ర, గౌడ్ కంచుకట్ల సుభాష్ రాష్ట్ర కన్వీనర్ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి,  వార్డు మెంబర్ మాదగాని ఆంజనేయులు, నామాపురం మాజీ సర్పంచ్ భీమనపల్లి రాములు, గట్టుప్పల గౌడ సంఘం నాయకులు మాదగాని గోపాల్ గౌడ్, యాదయ్య గౌడ్, ఎండి రఫీ, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఆర్థిక సహాయం అందించిన సయ్యద్ గఫార్
నల్గొండ జిల్లా:
నాంపల్లి: మండలం నేరళ్ళపల్లి  గ్రామం లో  ఎం.డీ.సఖీన అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గఫార్, మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10000/- ఆర్థిక సహాయం అందజేశారు.

గ్రామంలో ఏ సమస్య వచ్చినా గఫార్ ముందుంటారని, గ్రామస్తులు గఫర్ సహాయ గుణాన్ని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చనబోయిన రమేష్, మాద రమేష్, గునేబోయిన యాదయ్య, మల్లయ్య, రాములు, బచ్చనబోయిన కొండల్ , సత్తయ్య, వెంకన్న, వంగూరి సైదులు, ఉడుత పర్వతాలు, ఎడ్ల వెంకన్న , శ్రీరాములు, మేకల రాజు, కర్నాటి అంజి, పల్లె క్షత్రయ్య, చాంద్ పాషా, సైదుసేన్, హస్సేన్, కొన్రెడ్డి రామస్వామి, బారి యాదయ్య, వడ్డపల్లి యాదయ్య, చాపల వెంకన్న,ఎడ్ల చంద్రయ్య, పొలగొని నాగరాజు, పెద్దులు ఆక నర్సింహ, ఆక లింగయ్య, ఆక ప్రభు, నరసమ్మ, తదితరులు ఉన్నారు.
NLG: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
మర్రిగూడెం మండలం, తిరుగండ్లపల్లి గ్రామం సమీపంలో బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మరణించిన ఘటన జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం  బైక్ పై ఇద్దరు యువకులు హైదరాబాద్  నుండి మర్రిగూడెం కు వస్తుండగా, తిరుగండ్లపల్లి వద్ద బైక్ అదుపుతప్పి బైక్ నడుపుతున్న వ్యక్తి మరణించారు.

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: రేపు ప్రజాపాలన విజయోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాలు
నల్గొండ: ఈ నెల 22 వ తేదీ సాయంత్రం 6 గంటలకు, పట్టణంలోని ఎన్.జి కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున ప్రజా పాలన విజయోత్సవాల జిల్లాస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

ప్రజా పాలన విజయోత్సవాల ఈవెంట్ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
NLG: సర్వే ప్రక్రియలో డేటా ఎంట్రీ కీలకం: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ: జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటా గోప్యతను కాపాడాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. సర్వే ప్రక్రియలో డేటా ఎంట్రీ వివరాలు కీలకం అని, సర్వే వివరాలను బహిర్గతం చేయడం లేదా దుర్వినియోగం చేసినా సీఆర్పిసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా డేటా ఎంట్రీ సైతం పూర్తి చేయాలని ఆపరేటర్లకు సూచించారు.
NLG: పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి: ధర్మసమాజ్ పార్టీ
నల్లగొండ జిల్లా:
గుర్రంపోడు: పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.

పేద, మధ్య తరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ మేరకు సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మామిడి జగన్ మహరాజ్ మాట్లాడుతూ.. పేదలందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ప్రభుత్వమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని చెప్పారు. మండల కన్వీనర్ మహేష్ మహరాజ్, తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి-లక్ష్మి దంపతులు

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం: మండలం బట్లపల్లి వెంకటేశ్వర కల్యాణ మండపంలో నాంపల్లి మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య ముదిరాజ్- పద్మ దంపతుల ఏకైక కుమార్తె సౌమ్య- భరత్ కుమార్ ల వివాహ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- లక్ష్మి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కాంగ్రెస్ పార్టీ మర్రిగూడ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్, నారాయణ పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరెంటోత్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి, పగడాల లింగయ్య, నెట్టు శ్రీకాంత్, మాజీ సర్పంచ్ మాస శేఖర్, ఐతపాక జంగయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ బాయికాడి కొండల్,మాజీ ఎంపీటీసీ వెంకంపేట బాలయ్య, ఎర్పుల శ్రీశైలం, మండల నాయకులు, ఆకారపు శ్రీను, సిలువేరు యాదయ్య, మాతంగి నవీన్, మేతరీ శంకర్, తదితరులు ఉన్నారు.

NLG: వ్యాసరచన పోటీల్లో ద్వితీయ స్థానం పొందిన బొట్టుగూడ హైస్కూల్ విద్యార్థిని
నల్లగొండ: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని కీర్తన ద్వితీయ స్థానం సాధించి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతి మరియు ప్రశంసాపత్రం పొందింది. 

ఈ సందర్భంగా పాఠశాలలో హెడ్మాస్టర్ తీగల శంకరయ్య అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కీర్తన ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. హైస్కూల్ దశ నుండే ప్రతి విద్యార్థి చదువుతో పాటు వివిధ రంగాలలో రాణించడానికి ఉపాధ్యాయుల సహాయ సహకారాలు తీసుకొని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.
NLG: గ్రంథాలయ నూతన భవనం ఏర్పాటుకు కృషి: అదనపు కలెక్టర్
నల్లగొండ: ప్రస్తుత అవసరాలకి అనుగుణంగా జిల్లా కేంద్ర గ్రంధాలయానికి నూతన భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు.

బుధవారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రతీక్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ జెల్ల మార్కండేయలు, గాదె వినోద్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. బాలమ్మ పాల్గొన్నారు.