NLG: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
మర్రిగూడెం మండలం, తిరుగండ్లపల్లి గ్రామం సమీపంలో బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మరణించిన ఘటన జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం  బైక్ పై ఇద్దరు యువకులు హైదరాబాద్  నుండి మర్రిగూడెం కు వస్తుండగా, తిరుగండ్లపల్లి వద్ద బైక్ అదుపుతప్పి బైక్ నడుపుతున్న వ్యక్తి మరణించారు.

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: రేపు ప్రజాపాలన విజయోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాలు
నల్గొండ: ఈ నెల 22 వ తేదీ సాయంత్రం 6 గంటలకు, పట్టణంలోని ఎన్.జి కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున ప్రజా పాలన విజయోత్సవాల జిల్లాస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

ప్రజా పాలన విజయోత్సవాల ఈవెంట్ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
NLG: సర్వే ప్రక్రియలో డేటా ఎంట్రీ కీలకం: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ: జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటా గోప్యతను కాపాడాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. సర్వే ప్రక్రియలో డేటా ఎంట్రీ వివరాలు కీలకం అని, సర్వే వివరాలను బహిర్గతం చేయడం లేదా దుర్వినియోగం చేసినా సీఆర్పిసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా డేటా ఎంట్రీ సైతం పూర్తి చేయాలని ఆపరేటర్లకు సూచించారు.
NLG: పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి: ధర్మసమాజ్ పార్టీ
నల్లగొండ జిల్లా:
గుర్రంపోడు: పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.

పేద, మధ్య తరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ మేరకు సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మామిడి జగన్ మహరాజ్ మాట్లాడుతూ.. పేదలందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ప్రభుత్వమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని చెప్పారు. మండల కన్వీనర్ మహేష్ మహరాజ్, తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి-లక్ష్మి దంపతులు

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం: మండలం బట్లపల్లి వెంకటేశ్వర కల్యాణ మండపంలో నాంపల్లి మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య ముదిరాజ్- పద్మ దంపతుల ఏకైక కుమార్తె సౌమ్య- భరత్ కుమార్ ల వివాహ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- లక్ష్మి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కాంగ్రెస్ పార్టీ మర్రిగూడ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్, నారాయణ పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరెంటోత్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి, పగడాల లింగయ్య, నెట్టు శ్రీకాంత్, మాజీ సర్పంచ్ మాస శేఖర్, ఐతపాక జంగయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ బాయికాడి కొండల్,మాజీ ఎంపీటీసీ వెంకంపేట బాలయ్య, ఎర్పుల శ్రీశైలం, మండల నాయకులు, ఆకారపు శ్రీను, సిలువేరు యాదయ్య, మాతంగి నవీన్, మేతరీ శంకర్, తదితరులు ఉన్నారు.

NLG: వ్యాసరచన పోటీల్లో ద్వితీయ స్థానం పొందిన బొట్టుగూడ హైస్కూల్ విద్యార్థిని
నల్లగొండ: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని కీర్తన ద్వితీయ స్థానం సాధించి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతి మరియు ప్రశంసాపత్రం పొందింది. 

ఈ సందర్భంగా పాఠశాలలో హెడ్మాస్టర్ తీగల శంకరయ్య అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కీర్తన ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. హైస్కూల్ దశ నుండే ప్రతి విద్యార్థి చదువుతో పాటు వివిధ రంగాలలో రాణించడానికి ఉపాధ్యాయుల సహాయ సహకారాలు తీసుకొని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.
NLG: గ్రంథాలయ నూతన భవనం ఏర్పాటుకు కృషి: అదనపు కలెక్టర్
నల్లగొండ: ప్రస్తుత అవసరాలకి అనుగుణంగా జిల్లా కేంద్ర గ్రంధాలయానికి నూతన భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు.

బుధవారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రతీక్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ జెల్ల మార్కండేయలు, గాదె వినోద్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. బాలమ్మ పాల్గొన్నారు.
NLG: ఈనెల 22న సదర్ సమ్మేళనం.. మునుగోడు ఎమ్మెల్యేకు ఆహ్వానం..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని.. సదర్ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరవ్వాలని, బుధవారం మునుగోడు మండల గొల్ల కురుమ సంఘం నేతలు హైదరాబాద్లో ఎమ్మెల్యే నివాసంలో కలిసి ఆహ్వానించారు.

ఈ మేరకు సంఘ నేతలు మాట్లాడుతూ.. మునుగోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో, ఈనెల 22 న సాయంత్రం 5 గంటలకు  సదర్ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
NLG: మాలల ఆత్మీయ సమ్మేళనం సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి: నాగిల్ల మారయ్య
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో, ఈనెల 23 న నల్లగొండ పట్టణంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే  మాలల ఆత్మీయ సమ్మేళనం సభకు, మండలం నుండి ప్రతి ఇంటి నుండి  పెద్ద ఎత్తున మాల బంధువులు తరలిరావాలని.. మునుగోడు నియోజకవర్గ కో కన్వీనర్ దళిత రత్న నాగిల్ల మారయ్య బుధవారం వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.

ఈ మేరకు మారయ్య మాట్లాడుతూ.. మాలల ఆత్మీయ సమ్మేళనం సభను విజయవంతం చేయాలని కోరారు. మాలల ఐక్యత వర్ధిల్లాలి అని అన్నారు. కార్యక్రమంలో ఈద రాములు, అంజయ్య, ఈద నాగరాజు, అభి సందేశ్, శివ కోరే అజయ్ శివ అలెక్స్, మహేశ్వరం లక్ష్మమ్మ, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఆసరాగా సీఎం సహాయ నిధి పథకం: గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ: వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 67 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరు అయిన  రూ.25,40,000 /- విలువ గల చెక్ లను, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంగళవారం నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి పథకం నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుంది. ఈ పథకాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.