TG:'మాలల సింహ గర్జన భారీ బహిరంగ సభ' కరపత్రాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్:
డిసెంబర్ 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహ గర్జన భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు అన్నారు.

ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ సభ్యులతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కరపత్రాలు మరియు వాల్ పోస్టర్స్ ను గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా వున్న మాలలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్ భవన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
నారాయణపూర్ మండలం, జనగాం గ్రామంలో అంబేద్కర్ భవన్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, శుక్రవారం మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా 6 లక్షల రూపాయలు  మంజూరు చేసిన ఎమ్మెల్యే.. కాలనీవాసులకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ డిజైన్ రూపొందించి ఎస్టిమేషన్ పంపివ్వాలని స్థానిక నాయకులను ఆదేశించారు.

కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అయ్యే నిధులను కూడా పూర్తిగా మంజూరు చేపిస్తానని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు హర్షం  వ్యక్తం చేశారు.
NLG: దేవాలయాల్లో భక్తజనం.. పరమేశ్వరునికి అభిషేకాలు
నల్లగొండ మండలం, కంచనపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చెన్నోజు నాగేంద్ర ఆచార్యులు  ఉదయం 4 గంటల నుండి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వొచ్చి పరమేశ్వరుని దర్శించుకొని అభిషేకాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించారు. దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.

ఈ మేరకు ఆలయ అర్చకులు భక్త జనులకు, ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
NLG: గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తా: కలెక్టర్ త్రిపాఠి
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంధాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. 

ఈనెల 14 నుండి 20 వరకు జరగనున్న జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ మేరకు వారు మాట్లాడుతూ.. లైబ్రరీ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ గా తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
NLG: బాల సదన్ లో బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ త్రిపాఠి

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని  గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలతో బాలలదినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పిల్లలకు చాక్లెట్లు, కేక్ ఇచ్చి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇంటికో మనిషి-ఊరుకో బండి.. చలో మిర్యాలగూడ కు తరలి రావాలి:సిపిఎం
నల్లగొండ జిల్లా:
డిసెంబర్ 2 న చలో మిర్యాలగూడ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. ఇంటికో మనిషి _ ఊరుకో బండి తో చలో మిర్యాలగూడ కు తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు.

గురువారం చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభ కరపత్రం ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం బోడంగపర్తి గ్రామ శాఖ కార్యదర్శి  గౌసియా బేగం, సిపిఎం నాయకులు ఈరటి వెంకన్న, గిరి, సైదులు, జాంగిర్ తదితరులు పాల్గొన్నారు.
NLG: మధ్యాహ్న భోజనానికి పథకానికి నిధులు పెంచాలి: ఎస్ఎఫ్ఐ వినతి
నల్లగొండ జిల్లా:
ఎస్.ఎఫ్.ఐ దేవరకొండ కమిటీ ఆధ్వర్యంలో కొండ మల్లేపల్లి మండల  విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ రావు కు, మధ్యాహ్నం భోజన పథకం నిధులు పెంచాలని గురువారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా SFI డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచారు. కానీ వసతిగృహాల విద్యార్థులే మధ్యాహ్నం భోజనం పాఠశాలలోనే చేస్తున్నారు. ఎస్.ఎఫ్.ఐ పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ లో చదివే విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచడం జరిగిందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ పెంచకుండా ప్రైమరీ విద్యార్థులకు రూ.4.97 లతో 6,7,8 తరగతుల విద్యార్థులకు రూ.7.45 లతో 9,10 తరగతుల విద్యార్థులకు రూ. 9.95లతో భోజనాన్ని అందిస్తున్నారన్నారు. ఖైదీలకు 87 రూపాయలతో భోజనం అందించే ప్రభుత్వాలు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకుంటూ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటాయని గొప్పగా సభలలో చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ఈ దేశ భవిష్యత్తు మార్చే విద్యార్థులకు పది రూపాయల లోపు మధ్యాహ్న భోజనం పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. 

తక్షణమే పేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపించకుండా మధ్యాహ్న భోజనం మెనూ ను పెంచాలని కోరారు. తక్షణమే విద్యాసంస్థలో ఉన్న సమస్యలను ప్రభుత్వ విద్యాధికారులు పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

మధ్యాహ్న భోజనం మెనూ పెంచకుంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్తీక్, వంశిక్రిష్ణ, రాజేష్, మనోహర్, మంజుల, స్వాతి, రేణుక పాల్గొన్నారు.
NLG: బొట్టుగూడ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
నల్గొండ: పట్టణంలోని బొట్టుగూడ  హైస్కూల్ లో ఈ రోజు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా.. వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.

అదేవిదంగా ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో కోన్స్, రింగ్స్ పరికరాలతో ఫిజికల్ ఫిట్నెస్ కార్యక్రమాలు మరియు విద్యార్థులతో యోగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య తెలిపారు.
NLG: గ్రూప్-3 పరీక్షలకు జిల్లాలో 88 పరీక్ష కేంద్రాలు
నల్లగొండ: ఈ నెల 17 ,18 తేదీలలో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలకు నల్గొండ జిల్లాలో 88 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు.

బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి హైదరాబాద్ నుండి వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రూప్ -3 పరీక్షల నిర్వహణపై సమీక్ష సందర్భంగా నల్గొండ జిల్లాలో గ్రూప్-3  ఏర్పాట్ల వివరాలను జిల్లా కలెక్టర్ ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శికి వివరిస్తూ నల్గొండ జిల్లాలో 28353 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, ప్రశ్నాపత్రాలు భద్రపరిచే స్టాంగ్ రూమ్ లను నోడల్ అధికారులు సందర్శించడం జరిగిందని, పరీక్షకు 15 రూట్లను గుర్తించడం జరిగిందని తెలిపారు.

పరీక్షలు నిర్వహించే 17, 18 తేదీలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను అదే విధంగా అవసరమైనన్ని ఆర్టిసి బస్సులు నడపాలని ఆర్ టి సి అధికారులను ఆదేశించడం జరిగిందని, ఈ నెల 14న పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు, పరీక్షలు సవ్యంగా నిర్వహించేందుకు  గురువారం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. పరీక్షకు 2 రోజుల ముందు మరో సారి స్ట్రాంగ్ రూమ్ లు సందర్శించాలని,రవాణా సౌకర్యం,తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు.

జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ లలో పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని.. అక్కడ తగిన బందోబస్తు  ఏర్పాటు చేస్తున్నామని, బయోమెట్రిక్ కోసం 9 మంది అధికారులను నియమించామని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సామాజిక, ఆర్థిక, విద్య,ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, ధాన్యం  సేకరణ, నర్సింగ్ పారామెడికల్ కళాశాలలో మరమ్మతులు, సంసిద్ధత తదితర అంశాలపై చీఫ్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్ర స్థాయి నుండి డిజిపి జితేందర్ రెడ్డి పాల్గొనగా, జిల్లా నుండి అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు హాజరయ్యారు.
NLG: నాంపల్లి గ్రామ సగర సంఘం అధ్యక్షుడుగా గొల్లూరి శ్రీను సాగర్
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండలం, నాంపల్లి గ్రామ పరిధిలోని ఉప్పరిగూడెం గ్రామంలో బుధవారం సగర ఉప్పర సంఘం ఎన్నికల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా నల్లగొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ సాగర్.. ప్రధాన కార్యదర్శి బల్గురి కరుణాకర్ సాగర్.. కోశాధికారి కొలుగురి ప్రవీణ్ సాగర్.. పెండెం వెంకటేష్ సాగర్ హాజరై, నూతన సగర సంఘం కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ మేరకు నాంపల్లి గ్రామ సగర సంఘం అధ్యక్షుడుగా గొల్లూరి శ్రీను సాగర్.. ప్రధాన కార్యదర్శిగా నేర్లకంటి పురుషోత్తం సాగర్.. కోశాధికారిగా ఉంగరాల అశోక్ సాగర్ లను, సగర సంఘం మహిళా అధ్యక్షురాలుగా నేర్లకంటి నీరజ సాగర్.. ప్రధాన కార్యదర్శిగా గంట వెంకటమ్మ సాగర్.. కోశాధికారిగా నేర్లకంటి లక్ష్మమ్మ సాగర్ లను నియమించారు.

యువజన సంఘం అధ్యక్షుడుగా కక్కునూరి శివాజీ సాగర్.. ప్రధాన కార్యదర్శి గా నేర్లకంటి వెంకటేష్ సాగర్.. కోశాధికారిగా గొల్లూరి వెంకటేష్ సాగర్ లను నియమించడం జరిగింది.

కార్యక్రమంలో నేర్లకంటి లక్ష్మయ్య సాగర్, సురేందర్ సాగర్, కేశవులు సాగర్..నారయ్య సాగర్, గొల్లూరి యాదయ్య సాగర్, పరమేష్ సాగర్, నేర్లకంటి అశోక్ సాగర్, గొల్లూరి వెంకటేష్ సాగర్,గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పాల్గొన్నారు.