వలిగొండ మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన డాక్టర్ జ్యోతి
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జ్యోతి వారి తండ్రి గారు దాసరి నందం జ్ఞాపకార్థంగా మండలంలోని 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సూపర్ వైజర్స్ కి , ఏ ఎన్ ఎం లకి , నర్సులకు , ఆశా కార్యకర్తలకి , ఆయామ్మలకి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ వలిగొండ , వర్కట్ పల్లి , వేముల కొండ , వెల్వర్తి గ్రామాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ హోదాలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మహిళలకు మా నాన్న గారు స్వర్గీయ దాసరి నందం గారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం నా వంతుగా ఈ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నానని అన్నారు . అందరికి బతుకమ్మ , దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .


తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాళ్లకు సోమవారం వలిగొండ మండల కేంద్రంలోని టీయూఎఫ్ కార్యాలయంలో తాజా మాజీ రాష్ట్ర కార్యదర్శి జానకి రెడ్డి ఉమ్మడి జిల్లా తాజా మాజీ అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాజా మాజీ రాష్ట్ర కార్యదర్శి జానకి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరు అధర్య పడవద్దని. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతున్నదని నమ్మకం ఉందన్నారు ఈ కార్యక్రమనికి. వలిగొండ మండల ఉద్యమకారుల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు మారగొని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించగా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జోగు అంజయ్య యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షులు రాలు గంధ మల్ల. మల్లమ్మ . మల్లం వెంకటేశం.చౌటుప్పల్ మండల అధ్యక్షులు గట్టు సుధాకర్ రామన్నపేట టీయూఎఫ్..నాయకులు. బొడ్డుపల్లి లింగయ్య. ఎండి ఖలీల్ చీమకండ్ల శ్రీనివాస్ .ఇమామ్ .బాబు. ఎక్కల దేవి .శ్రీనివాస్.. పబ్బు లక్ష్మయ్య. గంగ దారి సత్తయ్య. గంధ మల్ల. గోపాలు. ఏ స్వామి మంటి లింగయ్య. ఐటిపాముల పుష్ప. కదిరే ని స్వామి.. కీర్తి కలమ్మ. నాగేల్లి రాములు. ఎదురుగట్ల రాములు. తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాంకర్ వాయిస్: తెలంగాణ ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వాను పరిశీలించి మాట్లాడారు. గత 40 ఏళ్లుగా మూసీని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో మూసీ కాలుష్యంతో బాధపడుతున్న మూసీ పరివాహక ప్రాంతం ప్రజలకి విముక్తి కలిగేలా సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. ప్రకృతి బాగుంటేనే సర్వ మానవాళి బాగుంటుందని అందుకే హైడ్రా రావాల్సిందేనని ఆయన అన్నారు. రైతులకు పంటల సాగుకు సాగునీరు అందేలా చర్యలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూసి రివర్ కింద కబ్జాకు గురయినా ప్రాంతాలను తొలగించాల్సిందేనన్నారు.
Oct 02 2024, 07:01
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.8k