విద్యార్థి దశనుండే ఉద్యమాల బాట పట్టిన శ్రీనివాస్ గౌడ్

వలిగొండ మండల కేంద్రానికి చెందిన మారగోని శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థి ఉద్యమ జేఏసీలో కీలకపాత్ర పోషించి జైలు జీవితం గడిపిన చరిత్ర కలదు శ్రీనివాస్ గౌడ్ ఉద్యమకాల ఫోరంలో గత మూడు సంవత్సరాల నుండి మండల అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మండలంలో ఉద్యమకారులు ఏకం చేసిన చరిత్ర కలదు శనివారం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ .ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్.చేతుల మీదుగా. శనివారం ఘనంగా సన్మానించి అతనికి గుర్తింపుగా. ప్రశంస పత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తాను ఉద్యమకారుల సమస్యలపై ఫోరం ఏ బాధ్యత అప్పజెప్పిన నా వంతుగా పనిచేశానని ప్రశంస పత్రం సన్మానం చేయడం పట్ల ఆయన రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్.కు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమ నాయకునికి సన్మానం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను గుర్తించాలని చేసిన పోరాటంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆరు సంవత్సరాల నుండి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా సమర్థవంతంగా బాధ్యతను నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈరోజు శనివారం గుర్తింపు పత్రం సన్మాన ప్రశంస పత్రం అందుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఉద్యమ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు నేతలు, ప్రజా సంఘాల నేతలు అభినందనలు తెలియజేశారు.
చిత్తాపురం లో జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో అనారోగ్యంతో ,అకస్మాత్తుగా చిన్న వయసులోనే మరణించిన సర్వి కిరణ్ కుమార్ (చింటూ )వారి కుటుంబానికి జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు
TPTF జిల్లా శాఖ ఆధ్వర్యంలో వలిగొండ MEO సుంకోజు భాస్కర్ కి సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో టిపిటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వలిగొండ ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన సుంకోజు భాస్కర్ ని శుక్రవారం ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ కుమార్ మరియు బొక్క వెంకట్ రెడ్డి ,బి లింగయ్య, ఆర్ వీరస్వామి, ఎస్ రాము పాల్గొన్నారు. అనంతరం టి పి టి ఎఫ్ క్యాంపెనింగ్ లో భాగంగా వలిగొండ మండలంలోని వివిధ పాఠశాలను సందర్శించారు.

చిత్తాపురం లో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన సర్వి కిరణ్ కుమార్ చింటూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ. 5500 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీసరి వెంకటరెడ్డి, కార్యదర్శి చిన్నం స్వామి, కందాటి సోమిరెడ్డి ,ఆరూరి నరసింహ, ఆరూరి వెంకటయ్య ,ఎండి బాబులాల్ ,చీర్క ప్రతాపరెడ్డి ,పాపయ్య ,ఆరూరు శ్రీను, చేగూరి మహేష్ , చేగూరి కృష్ణ ,బడక సతీష్ మరియు ఎయిర్టెల్ రాములు, మంద మచ్చగిరి ,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
హైడ్రా తో పేదల బతుకులు రోడ్డున పడ్డాయి, ప్రభుత్వం వెంటనే హైడ్రాను ఆపాలి: కూచి మల్ల సుధాకర్ సోషల్ మీడియా అధ్యక్షులు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయంతో పేదల నివాస గృహాలు కూల్చివేతకు గురై, పేదల బతుకులు చిద్రమవుతున్నాయని హైడ్రాను వెంటనే ప్రభుత్వం నిలిపివేయాలని వలిగొండ మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు కూచిమల్ల సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఇండ్లు కోల్పోవడంతో ఎంతోమంది నిరుపేదలు ప్రజలు దిక్కుతోచని స్థితిలో నిరాశ్రయులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి నివసిస్తున్నారని, బంగారము అమ్మి, అప్పులు చేసి రూపాయి రూపాయి జమచేసి ఎంతో కష్టపడి ఇండ్లు కట్టుకున్నారని అన్నారు. అవసరం లేకపోయినా ఇండ్లు కూల్చేస్తున్నారని వాళ్లకు ఎలాంటి భరోసా కల్పించకుండా నిరుపేదలకు అన్యాయం జరుగుతుంది విమర్శించారు. నిరుపేదల ఇండ్లు కూల్చడం వలన అభివృద్ధి జరగదని నిరుపేదల ప్రజల జీవన విధానము అభివృద్ధి చెందే దిగా ప్రభుత్వం ఆదుకోవాలే తప్ప ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదని అన్నారు. ఆరు గ్యారెంటీలను మర్పించడం కోసమే ఈ హైడ్రా నాటకం ఆడుతున్నారని, ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరారు. ఇప్పటికైనా హైడ్రా చర్యలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పల్లివాడ ప్రాథమిక పాఠశాలలో బదిలీ, ప్రమోషన్ ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం

రామన్నపేట మండలం మునిపంపుల కాంప్లెక్స్ పరిధిలోని పల్లివాడ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం రోజున.. పాఠశాలలో విధులు నిర్వహించి ఇటీవల జరిగిన ప్రమోషన్, బదిలీ లలో ఇతర పాఠశాలలకు వెళ్ళిన ఉపాధ్యాయులకు, వీడ్కోలు మరియూ ఇతర పాఠశాలల నుండి పల్లివాడకు వచ్చిన ఉపాధ్యాయులకు ఆహ్వాన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు D. స్వామి గారు సందేశమిస్తూ బదిలీలు ప్రమోషన్ లు విధినిర్వహణలో భాగమేనని మనం ఏ పాఠశాలకు వెళ్ళినా ఆ పాఠశాల విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలని, విద్యార్థులందరినీ సమ దృష్టితో చూసి వారి ఎదుగుదలలో కీ రోల్ పాత్ర వహించే ఏ టీచరైనా విద్యార్థుల మదిలో చిరస్థాయిగా నిలుస్తారని తెలిపారు. ఈ సందర్భంగా టీచర్లందరినీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి, బదిలీపై వెళ్ళిన ఉపాథ్యాయినులు మంగమ్మ, లక్ష్మి, శిరీష, బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు ఘాసీరాం, నిర్మళాదేవి, పాల్వంచ హరికిషన్, పాఠశాల ఉపాధ్యాయులు రఘురాంరెడ్డి, కృష్ణయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి విద్యార్ఢులు పాల్గొన్నారు. --ప్రధానోపాధ్యాయులు UPS పల్లివాడ
ఉపాధ్యాయ సర్దుబాటు జీవో 25 ను విరమించుకోవాలి: బిఆర్ఎస్ విద్యార్థి నాయకులు జక్కి నగేష్

బీబీనగర్: ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిస్తే విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని *BRS పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కినగేష్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు* *గురువారం రోజున స్థానిక డిప్యూటీ తాహశీల్దార్ భగత్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది* *ఈ సందర్భంగా జక్కినగేష్ మాట్లాడుతూ* *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 25ను తీసుకొచ్చిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మొదలు పెట్టింది జీవో 25 ప్రకారం* 1-10 మంది పిల్లలు ఉంటే ఒక ఉపాధ్యాయుడు పనిచేయాలి.11-60 పిల్లలు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు మందికి ముగ్గురు ఉపాధ్యాయులు.91-120 మంది ఉంటే నలుగురు ఉపాధ్యాయులు.121-150 ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేయాలని ప్రభుత్వం జీవోనుతీసుకొస్తుంది. ఈ జీవో ప్రకారం ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తే ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడన్నారు అంతేకాకుండా 60 మంది పిల్లలకు ఉన్నా కూడా ఇద్దరు ఉపాధ్యాయులు బోధన చేయడం జరుగుతుంది.

త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను ప్రభుత్వ వెంటనే మార్చాలి: మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు

త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను ప్రభుత్వం వెంటనే మార్చాలని త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుకోసం జరుగుతున్న పోరాటంలో రైతులందరూ ఐక్యంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు పిలుపునిచ్చారు గురువారం రోజున మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ 18 వ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు చిన్న, సన్నకారు రైతులను పొట్టగొట్టే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను మారుస్తామని హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ రైతులను మోసం చేస్తున్నాయని ప్రభుత్వాలు వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడేందుకు రైతులందరూ రాజకీయాలకతీతంగా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు స్థానిక జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మరియు భువనగిరి ఎంపీ లు అలైన్మెంట్ మార్పు కోసం రైతులతో కలిసి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఉద్యమించాలన్నారు రైతులందరూ రాజకీయాల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే నష్టపోయేది రైతులేనని త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు కోసం జరుగుతున్న పోరాటంలో రైతులందరూ ఐక్యమై అలైన్మెంట్ మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఈ ఉద్యమంలో సిపిఎం మరియు రైతు సంఘం అగ్ర భాగాన నిలబడుతుందని తెలిపారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య మండల కార్యదర్శి సిర్పంగి స్వామిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల లోపు రుణమాఫీ కాని వారందరికీ వెంటనే రుణమాఫీని వర్తింపజేయాలని అర్హులైన పేదలందరికీ తక్షణమే ఐదు లక్షల రూపాయల ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వర్కట్పల్లి నేలపట్ల గ్రామాల మధ్యన అసంపూర్తిగా ఉన్న ఒక కిలోమీటర్ బిటి రోడ్డు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ మహాసభకు గూడూరు బుచ్చిరెడ్డి అధ్యక్షత వహించగా మహాసభలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు,సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ పాల్గొని మాట్లాడారు శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి నాయకులు చేగూరి నరసింహ,మాడుగుల వెంకటేశం,ఆకుల మరయ్య,రొండి మల్లేశం, గోగు కిష్టయ్య,కళ్లెం విజయలక్ష్మీ,చేగురి రాములు,మెట్టు లక్ష్మమ్మ,సిర్పంగి స్వప్న,మాడుగుల లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు
వర్కట్ పల్లి ప్రభుత్వ బడి ,ఆసుపత్రిని సందర్శించిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని  వర్కట్ పల్లి ప్రభుత్వ పాఠశాలని సందర్శించిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలలో ,ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయలను కల్పించి ప్రైవేట్ వైద్యశాలలను ప్రైవేట్ విద్యాలను కట్టడి చేయాలనీ తేదీ 26:09:2024 గురువారం రోజున ధర్మ సమాజ్ పార్టీ నాయకులు వర్కట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ ని ప్రభుత్వ పాఠశాలని సందర్శించడం జరిగింది *స్కూల్ టీచింగ్ స్టఫ్ 7తరగతులకు ముగ్గురే టీచర్స్ వున్నారని గమనించడం జరిగింది అదేవిధంగా మౌలిక వసతులు పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ హాస్పిటల్ లో చాలావరకు మెడిసిన్ అందుబాటులో లేవని వెంటనే పరిష్కరించాలని హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి ఇన్ టైంలో శాలరీలు ఇవ్వాలని ఈ సమస్యను గుర్తించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు త్వరలో ఈ సమస్యల పట్ల DEO. DM and HO, అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్ గారు అలాగే వలిగొండ మండల కన్వీనర్ రవికుమార్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో వలిగొండ మండల నాయకులు మీసాల ప్రవీణ్ గారు పోలేపల్లివెంకటేష్ గారు పల్లెర్ల నవీన్ గారు మస్కుఅరుణ్ గారు పాల్గొన్నారు.