వర్కట్ పల్లి ప్రభుత్వ బడి ,ఆసుపత్రిని సందర్శించిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని  వర్కట్ పల్లి ప్రభుత్వ పాఠశాలని సందర్శించిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలలో ,ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయలను కల్పించి ప్రైవేట్ వైద్యశాలలను ప్రైవేట్ విద్యాలను కట్టడి చేయాలనీ తేదీ 26:09:2024 గురువారం రోజున ధర్మ సమాజ్ పార్టీ నాయకులు వర్కట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ ని ప్రభుత్వ పాఠశాలని సందర్శించడం జరిగింది *స్కూల్ టీచింగ్ స్టఫ్ 7తరగతులకు ముగ్గురే టీచర్స్ వున్నారని గమనించడం జరిగింది అదేవిధంగా మౌలిక వసతులు పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ హాస్పిటల్ లో చాలావరకు మెడిసిన్ అందుబాటులో లేవని వెంటనే పరిష్కరించాలని హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి ఇన్ టైంలో శాలరీలు ఇవ్వాలని ఈ సమస్యను గుర్తించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు త్వరలో ఈ సమస్యల పట్ల DEO. DM and HO, అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్ గారు అలాగే వలిగొండ మండల కన్వీనర్ రవికుమార్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో వలిగొండ మండల నాయకులు మీసాల ప్రవీణ్ గారు పోలేపల్లివెంకటేష్ గారు పల్లెర్ల నవీన్ గారు మస్కుఅరుణ్ గారు పాల్గొన్నారు.

ఆత్మకూరు(M) మండల కేంద్రంలో CPI పార్టీ ,ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి

యాదాద్రి భువనగిరి జిల్లా కమ్యూనిస్టు ఐలమ్మ (చాకలి ఐలమ్మ) 129 వ జయంతి సందర్భంగా వీరనారి ఐలమ్మకు విప్లవ జోహార్లు* ఆత్మకూరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం *సిపిఐ మండల కార్యదర్శి మారుపాక వెంకటేష్, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి సంయుక్తంగా మాట్లాడుతూ* కామ్రేడ్ ఐలమ్మ తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ ,చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ వీర వనిత వీరు 1919లో జన్మించి 10, సెప్టెంబర్ 1985లో పరమ పదించారు 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలు నాలుగో సంతానముగా చాకలి ఐలమ్మ జన్మించింది పాలకుర్తి కి చెందిన చిట్యాల నర్సయ్య తో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది (అప్పటికి ఆమె వయస్సు 13 ఏడ్లు) వీరికి 5 గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కులవృత్తి వారికి జీవనాధారం 1940-1944 మధ్యకాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్ రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ అగ్రకులాల స్త్రీలు దొరసానులు కూడా దొర అని పిలవకపోతే ఉత్పత్తి కులాలతో పాటు అనేక పీడన రూపాలు విరుచుకు పడేవి తమను దోర అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీ మీద తమ భర్తలను ఉసి గొల్పి దగ్గరుండి అఘయిత్యం చేయించేవారు ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరేవ్వాడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించు కోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకొని దొరల గుండెల్లో బడ బగ్నీలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది అందులో నాలుగు ఎకరాలు సాగు చేశారు పాలకుర్తి పట్వారి వీరమనేని శేషగిరిరావు కు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది బట్టలు ఉతికే ఐలమ్మ కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటుంది అని విసునూరు దొర గుండాలతో ఐలమ్మ పై దాడి చేయించారనీ అన్నారు ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలుగా చేరిందని. కక్షగట్టిన పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టు ల్లో చేరిందని విసునూర్ దేశ్ ముఖ్ రామ్చంద్ర రెడ్డికి ఫిర్యాదు చేశాడు కేసులో అగ్ర నాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు అయినప్పటికీ కోర్టులో తీర్పు దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా వచ్చింది ఐలమ్మ కుటుంబాన్ని ధాన్యం తమదేనని పంటను కోసుకు రమ్మని వంద మందిని దేశ్ముఖ్ పంపాడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిని కోసి వరికట్టలు కట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి చకిలం యాదగిరి లు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు కొండ లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది రజాకారుల ఉపసేనాధిపతి అయినా దేశ్ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు ఐలమ్మ ఇంటిని కూడా తగలబెట్టారు ధనాన్ని ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు, ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారి ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కజొన్న పంటను పండించారు అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఐలమ్మ కుటుంబం ఎర్రజెండను వీడలేదు ఈ దొర గాడు ఇంతకంటే ఇంకా నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకున్నది నీ దొరోడు ఏం చేస్తాడు రా అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేత బూని గుండాలను తరిమికొట్టింది కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది ఐలమ్మ భూ పోరాటంలో విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంలో మొదలుకొని సాయుధ రైతాంగ పోరాటంలో చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు 10 లక్షల ఎకరాలు భూ పంపిణీ జరిగింది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు జల్ది రాములు, జక్క దయాకర్ రెడ్డి, సుల్తాన్ పురుషోత్తం,యాస బుచ్చిరెడ్డి,బొబ్బల్ లాల్ రెడ్డి, మారుపాక అంజయ్య, పంజాల చంద్రమౌళి,కసర బోయిన సత్తయ్య, పంజాల వెంకటేష్, మారుపాక మల్లేష్, శ్రీరామోజు యాదగిరి, అంబోజు చంద్రయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు మారుపాక లోకేష్, మేకల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: AISF

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో మోత్కూరు మండలానికి నూతన ఎంఈఓ గా నియమితులైన గోపాల్ రెడ్డి ని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కృషి చేయాలని అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలలో అధిక ఫీజుల వసూలు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐఎస్ఎఫ్ నాయకులు చందు ,వంశీ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని ప్రాధేయపడిన బొలుగులు నరసింహ కాంగ్రెస్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొలుగుల నరసింహ మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న మా కుటుంబము. మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా అప్పట్లో. వలిగొండ సర్పంచిగా పనిచేసిన కుంభం రమణారెడ్డి కి రైట్ హ్యాండ్ గా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి. మా కుటుంబము అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి అన్నివేళలా పనిచేస్తూ. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ. పార్టీ బలోపితం కోసం కృషి చేస్తున్న మా కుటుంబం. మా సేవలు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు గుర్తించి. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు మంత్రిగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆలోచన చేసి .పరిశీలించి . మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి .పార్టీ కోసం అహర్నిశాలు ఎవరు కష్టపడ్డారు గుర్తించాలని. నిన్న మొన్న వచ్చిన కొత్త వ్యక్తులకు .పార్టీకి పనిచేయని వ్యక్తులకు మండలంలో గుర్తుపట్టలేని వ్యక్తులకు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదని. అధిష్టానం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆయన ప్రతి మీటింగ్ లో ప్రతి సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నారు. ఈ విషయం అధిష్టానం గుర్తించాలని. మీడియా ద్వారా ఎమ్మెల్యే ని సమన్వయంగా ప్రాధేయపడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలని కోరుతూ బొలుగుల నరసింహ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం పరిచినారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: ఉద్యమకారుల ఫోరం వలిగొండ మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి వలిగొండ సెప్టెంబర్ 25 ప్రజా అక్షరం జిల్లా బ్యూరో. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు 25వేల రూపాయల పెన్షన్ 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అలానే తెలంగాణ సమరయోధులుగా గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు ఈనెల 27న సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్లో జరుగు ఉద్యమకారుల ఆత్మీయ గణ సన్మానం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
స్వామి రామానంద తీర్థ సంస్థలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు: డైరెక్టర్ పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి

యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి మరియు మీద చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ హాస్టల్ భోజనం తో పాటు ఉద్యోగం కల్పించబడునని సంస్థ డైరెక్టర్ శ్రీమతి పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి తెలిపారు. 1,ఎలక్ట్రిషన్ డొమెస్టిక్ సోలార్ సిస్టం ఇన్సల్టేషన్ మరియు సర్వీసెస్ ఆరు నెలలు. ఐటిఐ లేదా డిప్లమా పాస్ 2 . కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సెల్ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ మరియు సిసిటీవీ టెక్నీషియన్ ఆరు నెలలు . పదవ తరగతి పాస్ 3. టైలరింగ్ ,ఎంబ్రాయిడరీ, జర్దోజి ,కిల్డ్, 4. బ్యాగ్ మేకింగ్ ఆరు నెలలు 8వ తరగతి పాస్ వయసు 18 నుండి 20 సంవత్సరముల మధ్య ఉండాలి చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు అర్వత ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సెట్, పాస్ ఫోటోలు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ తేదీ 30- 9 - 2024 సోమవారం ఉదయం 10 గంటలకు సంస్థలు హాజరు కావాలని తెలిపారు.
ఆరూరు గ్రంధాలయ ఇన్చార్జి బుర్ర మల్లేశం కు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలోని గ్రంథాలయంలో ప్రతిరోజు గ్రంథాలయాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఇన్చార్జి బుర్ర మల్లేశం కు గ్రామ యువకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో శాశ్వత గ్రంథాలయం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఎర్ర శివ, మాటూరి సాయి, సారగండ్ల నవీన్, ఓరుగంటి మధు, కళ్లెం ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
దళిత ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వలిగొండ మండల కేంద్రంలో రాస్తారోకో

వలిగొండ మండల కేంద్రంలో దళిత, ప్రజా సంఘాల నాయకులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయకుండా పోచంపల్లి ఎస్సై కాలయాపన చేస్తున్నారని, ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా నిందితులను ఇంతవరకు పట్టుకోలేకపోతున్నారని వివిధ కుల సంఘాల నాయకులు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని చెప్పినా ఇంతవరకు దుండగులను పట్టుకోలేక నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని, లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ, బిఎస్పి జిల్లా నాయకులు గుండు కృష్ణ, మాల మహానాడు మండల అధ్యక్షులు కూచిమల్ల నాగేష్, బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పల్లెర్ల రామచందర్ మాదిగ, బీఎస్పీ మండల అధ్యక్షులు సుక్క శ్రీకాంత్, మాల మహానాడు జిల్లా నాయకులు రాపోలు పవన్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సందేల శ్రీను, జహంగీర్, అంజయ్య, లక్ష్మయ్య, లింగస్వామి, నరసింహ, ఎంఎస్ఎఫ్ నాయకులు బూడిద భాస్కర్, రాపోలు కృష్ణ, రాపోలు మల్లేష్, మాడుగుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే కాలుష్య పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రజా పోరాటం తప్పదు : సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

రామన్నపేట ప్రాంతంలో ఆదాని గ్రూప్ అంబుజా సిమెంట్ పరిశ్రమ నెలకొల్పాలనే ప్రయత్నం విరమించుకోవాలి* *సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి* *_______________________* రామన్నపేట-కొమ్మాయిగూడెం గ్రామ రెవిన్యూ పరిధిలో ఏర్పాటు చేయచూడతున్న ఆదాని గ్రూప్ అంబుజా సిమెంట్ పరిశ్రమ స్థలాన్ని పరిశీలన చేసిన *CPM రామన్నపేట మండల కమిటి*.... డ్రై పోర్ట్ పేరుతో రైతులను నమ్మించి మూడు వందల ఎకరాల భూమి కొనుగోలు చేసి ప్రజారోగ్యాన్ని దెబ్బ తీసే కాలుష్య కారక సిమెంట్ పరిశ్రమను నిర్మిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక. సీపీఎం జిల్లా కార్యదర్శి యం. డి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య,మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేష్,మండల నాయకత్వం,రామన్నపేట,కొమ్మాయిగూడెం గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కు మెమోరండం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల పోరం

వలిగొండ:  తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం వెంటనే కమిటీ వేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల పోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి కిష్టాఫర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి జితేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగు అంజయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు గంధమల్ల మల్లమ్మ, సీనియర్ నాయకులు శీలం స్వామి, గంధమల్ల బాలయ్య, కదిరేనీ స్వామి, పబ్బు లక్ష్మయ్య, కీర్తి కలమ్మ తదితరులు పాల్గొన్నారు.