ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: ఉద్యమకారుల ఫోరం వలిగొండ మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి వలిగొండ సెప్టెంబర్ 25 ప్రజా అక్షరం జిల్లా బ్యూరో. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు 25వేల రూపాయల పెన్షన్ 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అలానే తెలంగాణ సమరయోధులుగా గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు ఈనెల 27న సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్లో జరుగు ఉద్యమకారుల ఆత్మీయ గణ సన్మానం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
స్వామి రామానంద తీర్థ సంస్థలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు: డైరెక్టర్ పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి

యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి మరియు మీద చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ హాస్టల్ భోజనం తో పాటు ఉద్యోగం కల్పించబడునని సంస్థ డైరెక్టర్ శ్రీమతి పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి తెలిపారు. 1,ఎలక్ట్రిషన్ డొమెస్టిక్ సోలార్ సిస్టం ఇన్సల్టేషన్ మరియు సర్వీసెస్ ఆరు నెలలు. ఐటిఐ లేదా డిప్లమా పాస్ 2 . కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సెల్ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ మరియు సిసిటీవీ టెక్నీషియన్ ఆరు నెలలు . పదవ తరగతి పాస్ 3. టైలరింగ్ ,ఎంబ్రాయిడరీ, జర్దోజి ,కిల్డ్, 4. బ్యాగ్ మేకింగ్ ఆరు నెలలు 8వ తరగతి పాస్ వయసు 18 నుండి 20 సంవత్సరముల మధ్య ఉండాలి చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు అర్వత ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సెట్, పాస్ ఫోటోలు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ తేదీ 30- 9 - 2024 సోమవారం ఉదయం 10 గంటలకు సంస్థలు హాజరు కావాలని తెలిపారు.
ఆరూరు గ్రంధాలయ ఇన్చార్జి బుర్ర మల్లేశం కు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలోని గ్రంథాలయంలో ప్రతిరోజు గ్రంథాలయాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఇన్చార్జి బుర్ర మల్లేశం కు గ్రామ యువకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో శాశ్వత గ్రంథాలయం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఎర్ర శివ, మాటూరి సాయి, సారగండ్ల నవీన్, ఓరుగంటి మధు, కళ్లెం ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
దళిత ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వలిగొండ మండల కేంద్రంలో రాస్తారోకో

వలిగొండ మండల కేంద్రంలో దళిత, ప్రజా సంఘాల నాయకులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయకుండా పోచంపల్లి ఎస్సై కాలయాపన చేస్తున్నారని, ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా నిందితులను ఇంతవరకు పట్టుకోలేకపోతున్నారని వివిధ కుల సంఘాల నాయకులు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని చెప్పినా ఇంతవరకు దుండగులను పట్టుకోలేక నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని, లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ, బిఎస్పి జిల్లా నాయకులు గుండు కృష్ణ, మాల మహానాడు మండల అధ్యక్షులు కూచిమల్ల నాగేష్, బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పల్లెర్ల రామచందర్ మాదిగ, బీఎస్పీ మండల అధ్యక్షులు సుక్క శ్రీకాంత్, మాల మహానాడు జిల్లా నాయకులు రాపోలు పవన్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సందేల శ్రీను, జహంగీర్, అంజయ్య, లక్ష్మయ్య, లింగస్వామి, నరసింహ, ఎంఎస్ఎఫ్ నాయకులు బూడిద భాస్కర్, రాపోలు కృష్ణ, రాపోలు మల్లేష్, మాడుగుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే కాలుష్య పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రజా పోరాటం తప్పదు : సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

రామన్నపేట ప్రాంతంలో ఆదాని గ్రూప్ అంబుజా సిమెంట్ పరిశ్రమ నెలకొల్పాలనే ప్రయత్నం విరమించుకోవాలి* *సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి* *_______________________* రామన్నపేట-కొమ్మాయిగూడెం గ్రామ రెవిన్యూ పరిధిలో ఏర్పాటు చేయచూడతున్న ఆదాని గ్రూప్ అంబుజా సిమెంట్ పరిశ్రమ స్థలాన్ని పరిశీలన చేసిన *CPM రామన్నపేట మండల కమిటి*.... డ్రై పోర్ట్ పేరుతో రైతులను నమ్మించి మూడు వందల ఎకరాల భూమి కొనుగోలు చేసి ప్రజారోగ్యాన్ని దెబ్బ తీసే కాలుష్య కారక సిమెంట్ పరిశ్రమను నిర్మిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక. సీపీఎం జిల్లా కార్యదర్శి యం. డి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య,మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేష్,మండల నాయకత్వం,రామన్నపేట,కొమ్మాయిగూడెం గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవో కు మెమోరండం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల పోరం

వలిగొండ:  తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం వెంటనే కమిటీ వేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల పోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి కిష్టాఫర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి జితేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగు అంజయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు గంధమల్ల మల్లమ్మ, సీనియర్ నాయకులు శీలం స్వామి, గంధమల్ల బాలయ్య, కదిరేనీ స్వామి, పబ్బు లక్ష్మయ్య, కీర్తి కలమ్మ తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారికి ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా స్ర్తీ , శిశు సంక్షేమ శాఖ అధికారిగా పదవీ భాద్యతలు స్వీకరించిన నర్సింహారావు ను వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారి (డి. డబ్ల్యూ. ఓ.) నర్సింహారావు మాట్లాడుతూ జిల్లాలోని మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధులు సంక్షేమానికి అందరి సహకారం అవసరం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు , ప్రజా సంఘాల ప్రతినిధుల సహకారంతో సమస్యలను పరిష్కరం చేయుటకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ధరణికోట నర్సింహ్మా, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, వి.హెచ్.పి.ఎస్.నాయకులు సింగారం రమేష్, మచ్చ ఉపేందర్, లాలయ్య తదితరులు జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి

భువనగిరి మండలం హన్మాపురం గ్రామ సర్వేనెంబర్ 28 ప్రభుత్వ భూములు గత మూడు సంవత్సరాల నుండి నిరుపేద కుటుంబాలు ఇంటి నివేశన స్థలాల కోసం ఆందోళన నిర్వహిస్తున్నారు అట్టి భూమిని కూడా బాధితులు స్వాధీనపరుచుకున్నారు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరం ప్రజావాణిలో బాధితులు ఆందోళనకు దిగారు ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ నాయకత్వం వహించారు బాధితులు సుమారు 100 మంది ప్లేకార్డులు చేబూని ఇంటి నివేషణ స్థలాలతో పాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు ఈ విషయాన్ని గమనించి కలెక్టర్ గారు అక్కడికి చేరుకొని బాధితుల నుండి ఏశాల అశోక్ ద్వారా మెమోరాండం తీసుకున్నారు కలెక్టర్ గారు జిల్లా సర్వేయర్ ను పిలిపించి సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు బాధితులతో కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇంటి స్థలాలు ఇల్లు ఇప్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి ప్రజలు ఆందోళన చేస్తున్నప్పటికిని ఎలాంటి స్పందన లేకపోవడాన్ని తప్పుపట్టారు ఇట్టి భూమి ఖాళీగా ఉన్నది ప్రజలు ఇళ్ల స్థలాలు లేనటువంటి వారు హన్మాపురం తో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా గుడిసెలు వేసుకున్నారని అన్నారు ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి బడ్జెట్ కేటాయించి 300 మంది నిరుపేదలకు కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ఆందోళన కార్యక్రమంలో నాగపురి యాదగిరి అబ్బులు శ్యామల కృష్ణవేణి శ్రీలత బాలమణి రేష్మ రజియా బేగం వరలక్ష్మి కేతమ్మ తదితరులు పాల్గొన్నారు.
గురునాథ్ పల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో ఓటాగు దగ్గర సొంత నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టిన DCC ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గుర్నాథ్ పెళ్లి గ్రామానికి వెళ్లే ఓటాగు దగ్గర రోడ్డు డ్యామేజీ కావడం వలన అక్కడి గ్రామంలోని ప్రజలు రావడం పోవడం అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి సొంత నిధులతో జెసిబి ఏర్పాటు చేసి ట్రాక్టర్లతో మొరం పోయించి సదును చేయించినారు. గ్రామ ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తోట భాస్కర్ తోట రమేష్ నరాముల కొమురయ్య నరాముల మల్లయ్య తోట రామసుఖం తోట రఘుపతి తోట నవీన్ రఘు మరియు గురునాథ్ పెళ్లి గ్రామ యువకులు నాయకులు పాల్గొన్నారు.


కష్ట కాలంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన సహచర మిత్రబృందం

ఎప్పుడో చదువుకుని ఎవరి బతుకు వారు బ్రతుకుతూ సహచర మిత్రులను గుర్తుపెట్టుకోవడం ఈ రోజుల్లో గొప్ప విషయమే. ఇలాంటి సంఘటనలు బహు అరుదు. తన తోటి మిత్రుడు అనారోగ్యం తో తుది శ్వాసవిడిచారు. వారి ఆర్ధిక స్థితిని గమనించి సహాయాన్ని అందించేందుకు స్నేహితులు, ముందుకు వచ్చిన సంఘటన నార్కట్ పల్లి మండలం అవురవాణి గ్రామంలో జరిగింది. ఆలోచనతోనే తమ సహచర తరగతి మిత్రుడి కుటుంబానికి తమకు తోచిన సహాయాన్ని సోమవారం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం అనారోగ్యంతో తమ మిత్రుడు అకాల మరణం ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవడంతో వారికి మనోధైర్యం నింపేందుకు సహచర క్లాసుమేట్ 2001-02 ముక్కాముల్ల వెంకన్న కుటుంబాన్ని పరామర్శించి పూర్వ విద్యార్థులు వారికి తోచిన సహాయం 28000 రూపాయలు మృతుడు కుటంబానికి సహయం అందించారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు పూర్వ విద్యార్థి మిత్రులకు కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగోటి శేఖర్ రత్తిపల్లి గ్రామానికి చెందిన నర్సిరెడ్డి,లింగస్వామి మరియు ఆంజనేయులు ముక్కముల నాగరాజు బంధువులు గ్రామస్తులు పాల్గొన్నారు.