కుల మత ప్రాంతీయ భేదాల ప్రసక్తి లేని మహా ఉద్యమమే నాటి తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
కుల, మత, ప్రాంతీయ భేదాల ప్రసక్తి లేని మహా ఉద్యమమే నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట మని *సిపిఎం జిల్లా కార్యదర్శి యండి. జంహగీర్* తెలియజేశారు. మంగళవారం సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి గారి స్థూపానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమానికి సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ అధ్యక్షత వహించగా జహంగీర్ మాట్లాడుతూ ఆనాడు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం బక్క జిక్కిన పేదతో బంధూకులు పట్టించి దొరలకు, జాగిర్దారులకు, రజాకార్లకు వ్యతిరేకంగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కులాలకు, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటం సాగిందని ఆ పోరాటంలో అనేకమంది నేలకుఓరిగగారని అన్నారు.ఆ పోరాట ఫలితంగానే ప్రజలు వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందారని, దున్నేవాడికి భూమి సాధించి పెట్టారని అన్నారు. ఆరోజు అన్నదమ్ములు లెక్క అందరూ ఏకమై పోరాటం చేస్తే నేడు బిజెపి, ఆర్ఎస్ఎస్ ఆనాటి చరిత్రను మతం పేరుతో, కులం పేరుతో మరుగున పడేయాలని చూస్తున్నదని దీనిని ప్రజలందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో బిజెపి విధానాలు ప్రజల మధ్యన ఐక్యత దెబ్బతీస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పోరేట్ శక్తులకు అమ్ముతున్నారని, రాజ్యాంగాన్ని కాల రాయాలని చూస్తున్నదని ఇలాంటి మతోన్మాద బిజెపిని ఈ దేశం నుండి తరమవలసిన పరిస్థితి ఏర్పడ్డదని అందుకు ప్రజలందరూ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్ఫూర్తితో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని జహంగీర్ పిలుపునిచ్చారు. *సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ* మాట్లాడుతూ మట్టి మనుషులను తల ఎత్తి నిలబెట్టింది నాటి తెలంగాణ సాయిధ పోరాటమని అన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు మన తెలంగాణ మాగానాల్లో విరబూసిన ఎర్రటి మందారాలని అన్నారు. నాడు దున్నేవాడికి భూమి కావాలని పెద్ద ఎత్తున పోరాటం నడిపి భూమిలేని పేదలందరికీ భూమి పంపిణీ చేశారని అన్నారు. కానీ నేడు పాలకులు అనేక రకాలైన చట్టాలలో మార్పులు తెచ్చి సెజ్ ల పేరుతో, పరిశ్రమల పేరుతో మల్లి వందలాది ఎకరాల భూములను ఒక్కొక్కరు పోగు చేసుకుంటున్నారని ఆ భూములను మల్లి పేదలకు పంచడానికి నాటి తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్ఫూర్తితో మరోసారి భూ పోరాటాలకు సిద్ధం కావాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల కమిటి సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, కొండపురం యాదగిరి,సురుపంగ ప్రకాష్, మండల నాయకులు దేషపాక రవి, యండి.జహంగీర్, మహేందర్, ఎస్.కె. షరీఫ్, పి.జహంగీర్, వెంకటస్వామి, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, మామిడి లచ్చిరెడ్డి, భీమబోయిన ముత్యంప్రకాష్,గంగాదరీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Sep 17 2024, 17:50