యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

యాదాద్రి భువనగిరి ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవము జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్య్ర సమరయోధులు అందరికీ నా జోహార్లు ... సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ యూనియన్‌లో చేరి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు,  ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ, విద్యార్ధులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,మందుల సామేలు , జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే , డిసిపి రాజేష్ చంద్ర , అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాగోల్ లోని సహబావన టౌన్షిప్ బ్లాక్ సి03 గణేష్ నిమజ్జనుంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

హైదరాబాద్ నాగోల్ లోని సహబావన టౌన్షిప్ బ్లాక్ సి03 నాగోల్ బండ్లగూడలో సహవాన టౌన్షిప్ లో జరిగినటువంటి వినాయక నిమజ్జనములో లో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మరియు సహభావన టౌన్షిప్ సి 03 నుండి కల్లూరు ఉపేంద్ర చారి, రామకృష్ణ, రేవంత్ సోమిరెడ్డి వారి బృందం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అందరం ఘనంగా జరుపుకునే గణనాధునికి వీడ్కోలుతున్నటువంటి సందర్భంలో ఆహ్వానాన్ని మంచి నేనిక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మాల మహానాడు వలిగొండ మండల అధ్యక్షులుగా కూచి మల్ల నాగేష్ ఏకగ్రీవ ఎన్నిక

వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటుచేసిన మాలల ఐక్య సమావేశంలో వలిగొండ మండల వివిధ గ్రామాలకు చెందిన మాల మహానాడు నాయకులు, పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో మండల మాల మహానాడు నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల మాల మహానాడు నూతన అధ్యక్షులుగా వెల్వర్తి గ్రామానికి చెందిన కూచిమల్ల నాగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పుర్మ అంజయ్య, బుంగ శేఖర్, ప్రధాన కార్యదర్శిగా కాశమల్ల శేఖర్, కోశాధికారిగా చలిచీమల కృష్ణ, సహాయ కార్యదర్శులుగా కట్ట సురేష్, వలవల బిక్షపతి, సాంస్కృతిక కార్యదర్శిగా కూచిమల్ల కుమార్, క్రీడల కార్యదర్శిగా వీసం కృష్ణ, కట్ట యాదగిరి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కూచిమల్ల నాగేష్ మాట్లాడుతూ మాలల ఐక్యత కోసం మాలల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు పవన్ కుమార్, నీలం నరేందర్, కూచిమల్ల సుధాకర్, సలబద్రి మహేందర్, సంగిశెట్టి రమేష్, సంగిశెట్టి విజయ్ కుమార్, వలమల రత్నయ్య, సంగిశెట్టి సుందరయ్య, జక్క స్వామి, కూచిమల్ల రాము, జక్క శ్రావణ్, మాడుగుల నరసింహ, నీలం నరేష్, కట్ట దానయ్య, చలిచీమల నరసింహ, చలిచీమల లక్ష్మయ్య, కుల పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సుంకిశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఇంజమూరి జంగయ్య పవిత్ర కుటుంబ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో వినాయక మండపం దగ్గర గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంజమూరి జంగయ్య పవిత్ర వారి కుటుంబ సభ్యులు పాల్గొని. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విగ్రహ దాతలు మొగిలిపాక చిన్న ఎల్ల స్వామి హేమలత వారి కుటుంబ సభ్యులు విగ్నేశ్వర మహారాజుకి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. వచ్చిన భక్తులకు భగవంతుని ప్రసాదం అందజేసినారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి పైళ్ల సంధ్యారాణి ఉపేందర్ రెడ్డి. మాజీ సర్పంచ్ మొగిలిపాక నరసింహ. యూత్ సభ్యులు యువకులు గ్రామ పెద్దలు బాలకృష్ణ ఉప్పలయ్య జంగయ్య రామకృష్ణ స్వామి వెంకటరెడ్డి అశోక్ భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వలిగొండ మాల మహానాడు మండల అధ్యక్షులుగా కూచిమల్ల నాగేష్ ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటుచేసిన మాలల ఐక్య సమావేశంలో వలిగొండ మండల వివిధ గ్రామాలకు చెందిన మాల మహానాడు నాయకులు, పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో మండల మాల మహానాడు నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల మాల మహానాడు నూతన అధ్యక్షులుగా వెల్వర్తి గ్రామానికి చెందిన కూచిమల్ల నాగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పుర్మ అంజయ్య, బుంగ శేఖర్, ప్రధాన కార్యదర్శిగా కాశమల్ల శేఖర్, కోశాధికారిగా చలిచీమల కృష్ణ, సహాయ కార్యదర్శులుగా కట్ట సురేష్, వలవల బిక్షపతి, సాంస్కృతిక కార్యదర్శిగా కూచిమల్ల కుమార్, క్రీడల కార్యదర్శిగా వీసం కృష్ణ, కట్ట యాదగిరి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కూచిమల్ల నాగేష్ మాట్లాడుతూ మాలల ఐక్యత కోసం మాలల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు పవన్ కుమార్, నీలం నరేందర్, కూచిమల్ల సుధాకర్, సలబద్రి మహేందర్, సంగిశెట్టి రమేష్, సంగిశెట్టి విజయ్ కుమార్, వలమల రత్నయ్య, సంగిశెట్టి సుందరయ్య, జక్క స్వామి, కూచిమల్ల రాము, జక్క శ్రావణ్, మాడుగుల నరసింహ, నీలం నరేష్, కట్ట దానయ్య, చలిచీమల నరసింహ, చలిచీమల లక్ష్మయ్య, కుల పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అక్టోబర్ నెలలో జరిగే సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవ మరియు అవగాహన సదస్సు పోస్టర్లను శుక్రవారం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శశాంక మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రతి పౌరునికి భారత్ వంటి అనేక ప్రజాస్వామ్య దేశాలలో సమాచార హక్కు ప్రాథమిక హక్కులలో భాగంగా అత్యంత విలువైన మానవ హక్కుగా గుర్తించారన్నారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పథకాల గురించి అవగాహన పెంచుకోవడానికి కూడా సమాచార హక్కు ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని శక్తివంతమైన సాధనంగా ఉపయోగించాలని అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సక్రమంగా అమలవుతుందన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, విద్యా అధికారులు, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, మైనింగ్ అధికారులు,మెడికల్ సిబ్బంది, అంగన్వాడి ఉద్యోగులు మరియు అన్ని శాఖల అధికారుల సమక్షంలో విద్యార్థులకు, యువకులకు సమాజంలో సమాచార హక్కు చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏ ఏ కార్యక్రమాలు ప్రజలకు అవసరం పడతాయని అవగాహన సదస్సును ఏర్పాటు చేయుటకు జాతీయ మరియు రాష్ట్ర కమిటీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం,రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు,ఆర్టీఐ రంగారెడ్డి జిల్లా సభ్యులు రామగళ్ళ శ్రీనివాస్,దొడ్డి రాజు యాదవ్,కాకి శేఖర్,ఉడుగుల మధు, తదితరులు పాల్గొన్నారు.
పోషణ మాసంలో పాల్గొన్న భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ పంగ రెక్క స్వామి

పోషణ్‌ మాహసోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ పోతాంశెట్టి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొనిబలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలన్నారు. సెప్టెంబరు నెల మొత్తం జరిగే పోషణ మాసోత్సవ కార్యక్రమాలు షెడ్యుల్‌ ప్రకారం చేపట్టాలని, కార్యక్రమాలను విజయవంతం చేయాలని సంబందిత అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ పంగ రెక్కస్వామి హాజరయ్యారు. ఈ సందర్బంగా గర్బిణీలకు పండ్లు, పూలు అందజేసి ఆశీర్వదించారు. మాట్లాడుతూ మహిళలు, శిశువుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గర్బిణీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు c. P. D. O. నాగలష్మి సుజాత బలరాం కౌన్సిలర్. విజయ్ కౌన్సిలర్ . విజయ్ లక్ష్మి కౌన్సిలర్ జనగాం కవిత కౌన్సిలర్ ఇట్టబోయిన సబితా మరియు ఆర్పీలు, ఆయాలుగారి్భిణీస్త్రీలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ నూతన ఎస్సై యుగంధర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోపరాజుపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నూతన ఎస్సై యుగేందర్ గౌడ్ ను గోపరాజుపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో గోపరాజుపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సలిగంజి బిక్షపతి, కాంగ్రెస్ యువజన నాయకుడు కోమటిరెడ్డి మల్లారెడ్డి ,సలిగంజి నర్సింగరావు, యాదవ సంఘం అధ్యక్షుడు చిల్లర స్వామి ,గౌడ సంఘం అధ్యక్షుడు పాలకూర్ల మల్లేశం ,కాంగ్రెస్ నాయకులు పాలకూర్ల అంజయ్య, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ,పోలేబోయిన రాములు, పులగూర్ల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతి రత్నాలు యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో గణపతులు మండపాల్లో ఘనంగా పూజలు అందుకుంటున్నారు. నీర్నెముల గ్రామంలో జాతి రత్నాలు యూత్ వారికి విగ్రహ దాత ఆవుల ఆదిత్య యాదవ్, కుటుంబ సభ్యులు గణపయ్యను అందజేశారు.గణపయ్యకు మంగళహారతులు,పూలు కొబ్బరికాయలు,నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులచే గణపతికి పూజలు నిర్వహించారు.జాతి రత్నాలు యూత్ వినాయక మండపం వద్ద దాత ఏభూషి బిక్షం ఉప్పలమ్మ కుటుంబం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతిని దర్శించుకుని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.దాతలు పులిహార ఏభూషి యాదయ్య అరుణ, పూజ సామాగ్రి చిప్పలపల్లి యశ్వంత్ తేజ ప్రవస్తి, లడ్డు దాత నాగటి మచ్చగిరి సంజయ్, స్టేజి నేమ్ నన్ను అశోక్ వసంత, లైటింగ్ చిప్పలపల్లి అక్షయ, హర్షిని, సాయి విగ్నేష్, పుష్పాలంకరణ ముత్యాల పెద్ద సాయిలు రాములమ్మ, డెకరేషన్ గార్లపాటి శ్రీనివాస్ లిఖిత, శోభయాత్ర ఏభూషి యాదయ్య పార్వతమ్మ, నాగటి ఉపేందర్ మనోహర, బోయిన అనంద్ యాదవ్ గార్లకి జాతి రత్నాలు యూత్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగంలో ఘనంగా ఓరియంటేషన్ డే వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 11 యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం లో గల వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ డే ను యాజమాన్యం ఘనంగా నిర్వహించడం జరిగింది. వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్, కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ వాత్సల్య కళాశాలలో గత 24 సంవత్సరాలుగా చక్కని సాంకేతిక విద్యను అందించి ఎంతోమంది గొప్ప ఇంజనీర్లను అందించామని చాలామంది అధ్యాపకులు దశాబ్దాలుగా కళాశాల అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారని అన్నారు. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల ఉద్దేశించి కళాశాలలో చక్కటి సాంకేతిక సదుపాయాలు చాలా అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల సలహాలతో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ప్రాంగణ నియామకాలు పొందాలని, విదేశాలలో విద్యా అవకాశాలు పొందాలని సూచించారు. వాత్సల్య కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దరిపల్లి అనంత రాములు గారు 2001 వ సంవత్సరంలో స్థాపించిన ఈ విద్యాసంస్థ ఎన్నో వేలాదిమంది జీవితాలకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. ఇంజనీరింగ్ విద్యను నాలుగు సంవత్సరాలు సరైన మార్గంలో పయనిస్తూ సాంకేతిక విద్యను అభ్యసించాలని ఇందుకు అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని అన్నారు. క్రమశిక్షణ తోటి విద్యను అభ్యసిస్తే ఖచ్చితంగా పై స్థాయికి ఎదుగుతారని అన్నారు. ప్రాంగణ నియామకాలకు కావలసిన నైపుణ్యాల గురించి విద్యార్థులు వారి తండ్రులకు వివరించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపల్ చక్కటి సమాధానం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో అకాడమిక్ ఇంచార్జ్ గొల్లెపల్లి సురేష్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కక్కెర్ల రామకృష్ణ, గోగురి వెంకటేష్, సరుగు కరుణాకర్, బేతాళ నర్మద, గోధుమల ప్రతిభ, మధిర పరమేశ్వరి, రామాంజనేయులు, కొంక రేఖ, బత్తిని నర్మద, ముంజంపల్లి శృతి నాన్ టీచింగ్ స్టాఫ్ స్నాపిక, కావ్య కల్పన, గోపాలకృష్ణ, శంకర్, చంద్రశేఖర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.