VijayaKumar

Sep 09 2024, 17:02

16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా కు వినతి పత్రం అందజేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేష్

తెలంగాణ రాష్ట్ర జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో భారత ప్రభుత్వ 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ శ్రీ అరవింద్ పానగర్న్  సమక్షంలో 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశం సోమవారం  జరిగినది .ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పిటిసి డాక్టర్ కుడుదుల నగేష్  16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ యూని కలిసి 1). 13వ ఫైనాన్స్ తీర్మానం ప్రకారం గ్రామపంచాయతీలకు 50% మండల పరిషత్లకు 30% జిల్లా పరిషత్తులకు 20% నిధులు కేటాయించాలని.2) బి ఆర్ జి ఎస్ నిధులు కూడా కేటాయించాలని.3) మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కూడా రెన్యువల్ చేయాలని. 4) పంచాయతీరాజ్ శాఖ ద్వారా అభివృద్ధి పనులకు కేటాయించే నిధులకు 5 లక్షల వరకు కేటాయించే పనులకు జీఎస్టీని 18 శాతం నుండి జీరో శాతానికి చేయాలని.5) జిల్లా పరిషత్లకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే హెల్త్ గ్రాండ్ వర్క్ సెలక్షన్ హక్కు జిల్లా పరిషత్లకే కేటాయించాలని.6) కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్లకు మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనాగార్న్ గారికి వినతి పత్రాన్ని అందజేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుగల్ నగేష్ అందజేశారు.

VijayaKumar

Sep 09 2024, 16:41

మూసి ప్రక్షాళన - గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండల కన్వీనర్ గా ఏదునూరి మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక

మూసీ జల కాలుష్యాన్ని అరికట్టి, ప్రక్షాళన చేపట్టి గోదావరి, కృష్ణా జలాలను ప్రత్యామ్నాయంగా అందించాలని భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి సదస్సులో మూసీ ప్రక్షాళన - గోదావరి, కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండల కన్వీనర్ గా ఏదునూరి మల్లేశం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని జిల్లా కో- కన్వీనర్ దయ్యాల నర్సింహ తెలియజేసినారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామం తో పాటు పది గ్రామాలకు మూసీ జలాలు అందించాలని కోరుతూ ఆనాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భునాదిగాని కాల్వ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి కాలువను సాధించడం జరిగిందని వారు తెలియజేశారు. కానీ నేటికీ ఆ కాలువ పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని, ఇంకా రైతులకు నష్టపరిహారం మరియు అన్ని గ్రామాలకు సాగునీరు అందించే దాంట్లో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా నిర్వాసితులకు నష్టపరిహారం, కాలువను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని అన్ని గ్రామాలకు నీరు అందించాలని, మూసీ జల కాలుష్యాన్ని అరికట్టాలి ప్రత్యమ్నయంగా గోదావరి జలాలను వడపర్తి కతత్వ నుండి భువనగిరి, బీబీనగర్ చెరువులను నింపి అందించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. భునాదిగాని కాల్వ పూర్తి కోసం, ప్రత్యామ్నాయంగా గోదావరి జలాల కోసం 11 తేదీన ఎర్రంబెల్లి నుండి నమాత్ పల్లి, నందనం, అనాజిపురం మీదుగా బీబీనగర్ మండల కేంద్రంలో నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహిస్తున్న మోటార్ సైకిల్ యాత్రను అనంతరం జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్న మహాధర్నాను రైతులు, కూలీలు, వృత్తి దారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మల్లేశం పిలుపునిచ్చారు. ఇంకా కమిటీలో కో- కన్వీనర్లుగా గునుగుంట్ల శ్రీనివాస్, బొల్లెపల్లి కుమార్, జిట్టా అంజిరెడ్డి, కొండాపురం యాదగిరి, గుండెనబోయిన దానయ్య, కమిటీ సభ్యులుగా ఏదునూరి వెంకటేష్, కడారి కృష్ణ, గంగనబోయిన పాండు, బొల్లేపల్లి పరమేష్, తోటకూరి మల్లేష్, ముత్యం ప్రకాష్, ఎల్లంల ఐలయ్య, కొల్లూరు సిద్ధిరాజు, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, రాసాల శ్రీశైలం, హైతరాజు కృష్ణయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని మల్లేశం తెలియజేశారు. ఇట్లు ఏదునూరి మల్లేశం కన్వీనర్ మూసీ ప్రక్షాళన - గోదావరి, కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండలం

VijayaKumar

Sep 08 2024, 17:56

ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్ కే చాంద్ ఉద్యమకారుల ఫోరం మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్

రామన్నపేట:  తెలంగాణ ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి అకాల మరణాన్ని చింతిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు నోముల శంకర్ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్.కె చాంద్ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు డాక్టర్ నకిరెకంటి అశోక్ కుమార్ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య బోగారం మాజీ ఉపసర్పంచ్ ఎండి ఇమామ్ నక్క శంకర్ పాండురంగ చారి మోటే రమేష్ ఉద్యమ నాయకులు రెబ్బాస్ రాములు రేపాక లింగస్వామి రామన్నపేట మాజీ ఉపసర్పంచ్ సిపిఐ నాయకులు గంగాపురం యాదయ్య తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Sep 08 2024, 17:46

వలిగొండ: మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

వలిగొండ  మండలకేంద్రం ఆవాస గ్రామమైన మల్లేపల్లి కి చెందిన గ్రామపంచాయతీ సిబ్బంది పల్లెర్ల మారయ్య, పడిగం సత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.వారి ఇరువురి కుటుంబ సబ్యులకు వలిగొండ కు చెందిన వ్యాపార వేత్త కొండూరు భాస్కర్ సౌజన్యంతో ఇరువురి కుటుంబాలకు 5 వేల చొప్పున ఆదివారం ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసుల వెంకన్న, పల్లెర్ల సుధాకర్, కొండూరు సాయి, పల్లెర్ల రాం చెంద్రo, పల్లెర్ల లక్ష్మణ్, గొల్ల క్రాంతి కుమార్, పడిగం యాదయ్య, లక్ష్మయ్య, గొల్ల గణేష్, సహదేవ్, మధు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 08 2024, 16:03

OU నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన బొడిగే నరసింహ... అభినందించిన దాసిరెడ్డిగూడెం గ్రామస్తులు


వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొడిగె  నర్సింహ తండ్రి యాదయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. " ఫిజికల్ స్పెక్ట్టోస్కోపిక్ ( ఆప్టికల్ ఈ పి ఆర్ ,ఎఫ్ టి ఐ ఆర్ అండ్ రామన్ ) క్యారెక్టర్రైజేషన్ ఆఫ్ ఇండియావ్ డోఫుడ్ ఆల్కలైన్ ఎర్త్ ఆక్సైడ్ బారేటు గ్లాసెస్ "అనే అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి .రామదేవుడు గారి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు . వలిగొండ మండలంలో భౌతికశాస్త్రం విభాగంలో డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి . బోడిగె .నరసింహ డాక్టరేట్ సాధించిన విషయం తెలుసుకున్న దాసిరెడ్డిగూడెం గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు విద్యాభ్యాసం 1. పాఠశాల: ప్రగతి హై స్కూల్ 10 th వరకు 2. ఇంటర్మీడియట్: ప్రగతి జూనియర్ కళాశాల .వలిగొండ 3. డిగ్రీ : శ్రీ సాయి కృప డిగ్రీ కళాశాల భువనగిరి 4. P.G : డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ 5. P.H.D : డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుత హోదా:contract (ఒప్పంద) degree lecturer, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజేంద్రనగర్ ( శంషాబాద్ )

VijayaKumar

Sep 08 2024, 15:16

నీర్నెముల లో తొలి పూజలు అందుకున్న గల్లీ బాయ్స్ యూత్ గణనాథుడు

రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా, గ్రామంలోని ఎస్ సి కమ్యూనిటీ హాల్ దగ్గర గల్లీ బాయ్స్ యూత్ గణేష్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విగ్రహ ధాత ముత్యాల పెద్ద సాయిలు రాములమ్మ, చాడ వెంకటేష్ శోభ కుటుంబం తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.

VijayaKumar

Sep 07 2024, 23:23

తెలంగాణ ఉద్యమకారుడు బెల్లి కృష్ణతో పోస్టర్ ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా శనివారం తెలంగాణ ఉద్యమకారుడు బెల్లి కృష్ణుని కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి కిష్టఫర్ సూచన మేరకు తేదీ 27 సెప్టెంబర్ 2024న సికింద్రాబాద్ హరిహర కళా నిలయంలో జరిగే ఉద్యమకారుల సన్మాన మహోత్సవానికి సంబంధించి వలిగొండ మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు పబ్బు లక్ష్మయ్య గౌడ్, గంగదారి సత్తయ్య, గంధమల బాలయ్య గౌడ్లు, బత్తిని రవి గౌడ్, శీలం స్వామి, మంటి రమేష్, కదిరేని స్వామి, గంధమల మల్లమ్మ, నస్రిన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 07 2024, 17:16

నీర్నెముల గ్రామం లో తొలి పూజలు అందుకున్న గల్లీ యూత్ గణనాథుడు

యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా, గ్రామంలోని ఎస్ సి కమ్యూనిటీ హాల్ దగ్గర గల్లీ యూత్ గణేష్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విగ్రహ ధాత ముత్యాల పెద్ద సాయిలు రాములమ్మ, చాడ వెంకటేష్ శోభ కుటుంబం తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.

VijayaKumar

Sep 07 2024, 17:09

దాసిరెడ్డి గూడెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు మండల పరిధిలోని దాసిరెడ్డి గ్రామానికి చెందిన దంతూరి చిన్న సత్తయ్య కు 60,000 వేల రూపాయల చెక్కును శనివారం రోజున అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడానికి కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పాలోజు రాజయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోదా అచ్చయ్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కాటం గణేష్ గౌడ్, నారి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Sep 07 2024, 16:23

వలిగొండ నూతన ఎస్సై యుగంధర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోపరాజుపల్లి జై భీమ్ సేన

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నూతన ఎస్సై యుగంధర్ గౌడ్ ను గోపరాజుపల్లి గ్రామ జై భీమ్ సేన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోపరాజు పల్లి మాజీ సర్పంచ్ సంగిశెట్టి రాములు, జై భీమ్ సేన అధ్యక్షులు వల్లమల్ల రత్నయ్య, మాల మహానాడు మండల అధ్యక్షులు నీలం నరేందర్ కుమార్, రిపోర్టర్ సంగిశెట్టి విజయ్ కుమార్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంగిశెట్టి రమేష్, కల్చరల్ సెక్రటరీ ,సినీ డైరెక్టర్ నీలం నరేష్ పాల్గొన్నారు.