నీర్నెముల లో తొలి పూజలు అందుకున్న గల్లీ బాయ్స్ యూత్ గణనాథుడు

రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా, గ్రామంలోని ఎస్ సి కమ్యూనిటీ హాల్ దగ్గర గల్లీ బాయ్స్ యూత్ గణేష్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విగ్రహ ధాత ముత్యాల పెద్ద సాయిలు రాములమ్మ, చాడ వెంకటేష్ శోభ కుటుంబం తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమకారుడు బెల్లి కృష్ణతో పోస్టర్ ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా శనివారం తెలంగాణ ఉద్యమకారుడు బెల్లి కృష్ణుని కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి కిష్టఫర్ సూచన మేరకు తేదీ 27 సెప్టెంబర్ 2024న సికింద్రాబాద్ హరిహర కళా నిలయంలో జరిగే ఉద్యమకారుల సన్మాన మహోత్సవానికి సంబంధించి వలిగొండ మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు పబ్బు లక్ష్మయ్య గౌడ్, గంగదారి సత్తయ్య, గంధమల బాలయ్య గౌడ్లు, బత్తిని రవి గౌడ్, శీలం స్వామి, మంటి రమేష్, కదిరేని స్వామి, గంధమల మల్లమ్మ, నస్రిన్ తదితరులు పాల్గొన్నారు.
నీర్నెముల గ్రామం లో తొలి పూజలు అందుకున్న గల్లీ యూత్ గణనాథుడు

యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా, గ్రామంలోని ఎస్ సి కమ్యూనిటీ హాల్ దగ్గర గల్లీ యూత్ గణేష్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విగ్రహ ధాత ముత్యాల పెద్ద సాయిలు రాములమ్మ, చాడ వెంకటేష్ శోభ కుటుంబం తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.
దాసిరెడ్డి గూడెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు మండల పరిధిలోని దాసిరెడ్డి గ్రామానికి చెందిన దంతూరి చిన్న సత్తయ్య కు 60,000 వేల రూపాయల చెక్కును శనివారం రోజున అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి కృషి చేస్తారని తెలిపారు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడానికి కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పాలోజు రాజయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోదా అచ్చయ్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కాటం గణేష్ గౌడ్, నారి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు
వలిగొండ నూతన ఎస్సై యుగంధర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోపరాజుపల్లి జై భీమ్ సేన

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నూతన ఎస్సై యుగంధర్ గౌడ్ ను గోపరాజుపల్లి గ్రామ జై భీమ్ సేన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోపరాజు పల్లి మాజీ సర్పంచ్ సంగిశెట్టి రాములు, జై భీమ్ సేన అధ్యక్షులు వల్లమల్ల రత్నయ్య, మాల మహానాడు మండల అధ్యక్షులు నీలం నరేందర్ కుమార్, రిపోర్టర్ సంగిశెట్టి విజయ్ కుమార్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంగిశెట్టి రమేష్, కల్చరల్ సెక్రటరీ ,సినీ డైరెక్టర్ నీలం నరేష్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: కౌన్సిలర్ పంగరెక్క స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి, మట్టి వినాయక విగ్రహాలతో పూజించా లని కౌన్సిలర్ పంగ రెక్క స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం. 8వ వార్డు జంఖన్నగూడెంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనిపంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూవినాయక చవితి పర్వదినానికి హానికర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టి ప్రతిమలను పూజిస్తే జలవనరులకు మేలు చేసిన వారు అవుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబిత గోపాల్, ఇట్టబోయిన పావని, వార్డు ఇన్చార్జి శబయుద్దిన్,మొగ్గల క్ష్మి ఉడుత రమేష్ శ్రవణ్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు
వలిగొండలో మూసి ప్రక్షాళన గోదావరి జలాల సాధన సదస్సు

మూసీ ప్రక్షాళన-గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కన్వీనర్ మూసి ప్రక్షాళన బునాది గాని,భీమలింగం కాలువల ద్వారా గోదావరి జలాల సాధనకై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని, ఆ పోరాటాల్లో మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ భాగస్వాములు కావాలని మూసీ ప్రక్షాళన-గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కన్వీనర్ మాటూరు బాలరాజు పిలుపునిచ్చారు శుక్రవారం రోజున వలిగొండ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో మూసీ ప్రక్షాళన-గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కో-కన్వీనర్ సిర్పంగి స్వామి అధ్యతన జరిగిన ప్రాంతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన నీటిని అందించిన మూసి నేడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నుండి వెలువడిన మానవ వ్యర్ధాలు పారిశ్రామిక వ్యర్థ పదార్థాల వల్ల విష కాలుష్యంగా మారిందన్నారు ఈ మూసి ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు వివిధ అనారోగ్యాలకు గురై అనేక కొత్త జబ్బులు వస్తున్నాయి అన్నారు మూసి ప్రక్షాళన కోసం ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు పరిశ్రమల నుండి వెలబడుతున్న రసాయన పదార్థాలను నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యర్థ పదార్థాలను మూసిలో కలుపుతున్న పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మూసి పరివాహక ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలోని బునాది గాని భీమలింగం కాల్వల మరమ్మత్తులకై 260 కోట్లను వెంటనే విడుదల చేయాలని కాలేశ్వరం కాల్వకు సంబంధించిన కెనాల్ కు తూములను ఏర్పాటు చేసి పునాది గాని భీమ లింగం కాల్వల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు రైతులకు గోదావరి జలాలను అందించాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములై పాల్గొని గోదావరి జిల్లా సాధించాలని పిలుపునిచ్చారు జిల్లా గౌరవ సలహాదారు లు ఎండి జాంగిర్ బట్టు రామచంద్రయ్యలు మాట్లాడుతూ 20 దశాబ్దాలు గడుస్తున్న చిన్న నీటి వనరులైన బునాది గాని కాలువ పూర్తి చేయలేకపోయారని వెంటనే కాల్వ 34 కిలోమీటర్ల పెండింగ్ పనులను పూర్తి చేయాలని కాల్వ ద్వారా రైతాంగానికి వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు మూసి ప్రక్షాళన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని గోదావరి జలాల సాధన కోసం ఐక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కో-కన్వీనర్ లు కొండమడుగు నర్సింహ,కల్లూరి మల్లేషం, మేక అశోక్ రెడ్డి,రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి,జిల్లా నాయకులు మద్దెల రాజయ్య,దయ్యాల నర్సింహ,గడ్డం వెంకటేష్,గుండు వెంకట్నర్సు,గాడి శ్రీనివాస్,వేముల బిక్షం,తుర్కపల్లి సురేందర్,శ్రీశైలం రెడ్డి,గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకట్ రెడ్డి,కవిడే సురేష్,కల్కురి ముత్యాలు,తదితరులు పాల్గొన్నారు మూసీ ప్రక్షాళన-గోదావరి జలాల సాధన వేదిక వలిగొండ మండల కమిటీ ని 21 మందితో ఎన్నుకున్నారు మండల కన్వీనర్ గా మద్దెల రాజయ్య ఎన్నికయ్యారు.

అరూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మాజీ ఎంపీపీ చిట్టి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి ఆరూరు గ్రామానికి చెందిన రచ్చ సుజాతకు 60000 మహమ్మద్ సలీం గారికి 60000 ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి సింగిల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి మత్స్య కార్మిక సంఘం మండల అధ్యక్షులు బండి రవికుమార్ గీతా కార్మిక సంఘం అధ్యక్షులు కళ్లెం బాల శంకర్ గారు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.
గోపరాజుపల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం, అన్నప్రాసన

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సలిగంజి మణెమ్మ మాట్లాడుతూ పోషకాహారం ఆరోగ్యవంతమైన జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భంలోని శిశువు ఎదుగుదల నుంచి శిశువు జన్మించే వరకు ఆ తర్వాత పెరుగుతున్న పిల్లలకు తగినంత పోషకాహారం అందిస్తే ఎంతో మేలు అని అన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సంజీవ, గ్రామపంచాయతీ సెక్రటరీ నవనీత, ఆశ నీలం నీరజ ఆయా దేవేంద్ర ,తల్లులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అస్తమయం, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందుతూ మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు భువనగిరి ముద్దుబిడ్డ జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు .గత కొన్ని రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని ఐసిలు చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసి పడేలా చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ప్రజా సంక్షేమం కోసం నిత్యం తపించే నాయకుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఆయన అనుచరులు ,అభిమానులు కన్నీరు అవుతున్నారు .ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి అన్ని తానై వ్యవహరించిన జిట్టా స్వరాష్ట్ర కాంక్షలు రగిలించి ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లాడు. జిట్టా బాలకృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్ట బాల్ రెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు .వారు 1987లో బీబీనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు 1993లో ఎల్బీనగర్ లోని డివియం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పూర్తి చేశారు. ఆయన అంత్యక్రియలు భువనగిరి శివారులోని మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్ లో నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.